కరగ్రహార యోగి –ఫరీద్ మస్తాన్ ఔలియ
ఒక హిందువు ముస్లిం మత పీఠం అధిష్టించిన ఆశ్చర్య కర విషయమే అప్పలస్వామి ఫరీద్ ఔలియా గా మారిన చరిత్ర .
విజయ నగరాన్ని పూస పాటి విజయ రామ రాజు పాలిస్తున్న కాలం అది .ఆయన సేనా ధి పతి నడి పల్లి అప్పల స్వామి .ఆయన భార్యయే పైడి తల్లి .అందాల సుగుణ రాశి .రాజు ఆమె పై మోజు పడ్డాడు .తనను చంపి సతీత్వాన్ని కాపాడ మని భర్తను కోరింది పైడి తల్లి .కత్తి తీసుకొని –ఓకే దెబ్బతో ఆమె శిరసుఖండించి ,ఆమె కోర్కె తీర్చి,ఊరు వదిలేసి,బడి పాలెం చేరి పైడి తల్లి ఆదేశం మేరకు మల్లీ పెళ్లి చేసుకొన్నాడు . పైడి తల్లి ‘’ఇక నుంచి రాజు వంశం లో సంతాన ఉండదని,నడి పల్లి వారి ఏడవ తరం లో ఓక సత్పురుషుడు పుట్టి విజయనగరం లో ప్రవేశించి నప్పుడు మాత్రమే విజయ నగరానికి వారసుడు జన్మిస్తాడు ‘’అని పైడి తల్లి శాపం పెట్టింది .+విజయ రామ రాజు పశ్చాత్త పడి .ప్రాయశ్చిత్తం కోసం పైడి తల్లికి గుడి కట్టించి ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించాడు .ఇప్పటికీ మహా వైభవం గా పైడి తల్లి ఉత్స వాలు జరుగు తున్నాయి
దిబ్బడి పాలెం లో అప్పల స్వామి వంశం లో నడి పల్లి పాపయ్య ,రాజమ్మ దంపతులకు19-8-1902 లో జన్మించిన మగ పిల్ల వాడే మన కధా నాయకుడు అప్పల స్వామి .లోక కళ్యాణం కోసం విష్ణు మూర్తి ఆమె గర్భం లో జన్మిస్తున్నట్లు తల్లి రాజమ్మ కు కలలో చెప్పాడు .అతనిమేన మామ కొడుకు ఇతని పై కుట్ర పన్ని మంత్ర ప్రయోగం చేయించాడు .అవి అప్పల స్వామిని ఏమీ చెయ్య లేక పోయాయి .చిన్న తనం లో కావడి లో కూర్చొని విజయ నగరం కోట కు వెళ్లాడు .పూర్వం పైడి తల్లి ఇచ్చిన శాపం తీరి పోయింది .రాజ వంశం లో మళ్ళీ సంతానం కలిగింది .
ఒకప్పుడు అప్పల స్వామి ని కాల పిశాచం పట్టు కొంటె ,బంధించిఇంటికి తెచ్చాడు .తొమ్మిదేళ్ళ కే నారద తుమ్బురులు దర్శన మిచ్చారు .దేవతలు బందరు సముద్ర తీరానికి తీసుకొని వెళ్లి భవిష్యత్తు లో అతడు ఉండాల్సిన ప్రదేశాన్ని చూపించారు .నెల్లి మర్ల జూట్ మిల్లు లో పని చేశాడు .అప్పుడు ఫాక్టరి కట్ట టానికి పునాదులు తవ్వు తుంటే వెంటనే పూడి పోయే వట అప్పల స్వామి అక్కడ నిల బడితే నిర్మాణం నిల బడి నిర్మాణం సాగిందట .తోళ్ళ కర్మా గారం లో పని చేసే వారితో మద్య పానం మాన్పించాడు .బుచ్చమ్మ తో వివాహమైంది .కంటోన్మెంట్ రోడ్డు లో టోల్ గెట్ ఉద్యోగం లో పని చేశాడు .అక్కడే దగ్గర్లో ‘’ఖాదర్శా ఔలియా’’ఉన్నారు .భార్య చని పోయింది .ఉద్యోగం ఊడి పోయింది .విజయనగరం లో పైడి తల్లి సంబరాలకు వెళ్లి నాటకం వేసి ఖాదర్ శా ఔలియా ను సందర్శించాడు .ముప్ఫై ఏళ్ల వయసులో ఉన్నాడు . ఆయన ను దర్శిస్తే మళ్ళీ రమ్మని వాయిదా వేశారాయన .ఇలా రెండు మూడు సార్లు అయింది .అయినా విసుగు లేకుండా వెళ్లి వస్తున్నాడు .ఒక సారి ఒక సాధువు కన్పించి వలీ గారిదగ్గర ఏమీ లేదని తాను తాయత్తు ఇస్తానని ఆశ పెట్టాడు .వెళ్ళ లేదు .అనుకొన్న సోమ వారం బాబా దగ్గరకు వెళ్లాడు ‘’మా దగ్గరకు వచ్చేవాడెవ్వరు మరొకరి దగ్గరకు పోడు .ఈ పాదాలు పట్టుకొన్న వాడెవ్వడు ఇంకోరి పాదాలు పట్టడు ‘’అని సాధువు సంగతి తెలిసి నట్లు అన్నారు ఆయన పెట్టె పరీక్షలో గెలిచి అభిమానం పొందాడు .బాబా దగ్గరికి ఎప్పు డైనానా వెళ్లి దర్శించే అనుమతి లభించింది
అయిదేళ్ళ తర్వాతా బాబా అప్పల స్వామికి ‘’ఫరీద్ మస్తాన్ ఔలియా ‘’అనే పేరు పెట్టారు .మచిలీ పట్నం ,తెనాలి ,రేపల్లె లలో ఎక్కడో ఒక చోట ఆశ్రమాన్ని స్తాపించి సేవ చేయమని ఆదేశించాడు .అన్నీ చూసి మచిలీ పట్నం దగ్గర కరగ్రహారం సరైన స్థలం అని భావించి అక్కడ ఉండి పోవాలను కొన్నాడు .క్రమంగా శిష్య బృందం ఏర్పడింది .ఎందరో హిందువులు ,ముస్లిములు ఆయన శిష్యులైనారు .ప్రత్యర్ధులను శాంత పరచి సయోధ్య కూర్చే వారు .’’మేము అవసరమైతే గడ్డి పరకతో కూడా పని చేయించు కోగలం ‘’అని ఒక సారి .మరో సారి ‘’మేం నిమిత్త మాత్రులం .అంతా పై వాడి దయ ‘’అని ఔలియా అంటుండే వారు .అందర్ని గౌరవం గా ‘’మీరు, ఏమండీ ,వారు ‘’అంటూ మర్యాద గ సంబోధించటం ఆయన సంస్కార విధానం ..తమ గురువులను సందర్శించ టానికి విజయ నగరం వెడితే వంద గజాల దూరం లో చెప్పులు వదిలేసి ఖాదర్ వలీశా గారిని సమీ పించి పాదాల దగ్గర అతి భక్తీ తో కూర్చొనే వారు .ఆయన అందరి శిష్యుల్లో ఈయనదే అగ్ర స్థానం .అంత ప్రత్యేకత పొందారు మస్తాన్ ఔలియా .అన్ని మతాల వారు ,అన్ని కులాల వారు ఆయనకు భక్తు లయ్యారు .తాడిత ,పీడిత జనానికి ఔలియా గారు ఆత్మీయులైనారు .వారి బాధలన్నీ పోగొట్టే వారు .వ్యాపార ,ఉద్యోగ వర్గాల వారు ఆయన సలహాలను తప్పక పాటించే వారు .
ఫరీద్ మస్తాన్ గారు చేపల వ్రుత్తి లో ఉన్న వారికి సముద్ర మరణ గండాలను చాలా సార్లు తప్పించారు .వారిలో నైతిక ప్రవ్రుత్తి కలిగించారు .వారి పాలిటి దేవుడైనాడు .బాబా గారికి తెలిసి నన్ని చేపల్లో రకాలు అక్కడి జాలర్లకు కూడా తెలియవని జాలర్లె ఒప్పు కొన్నారు .పాగోలు లక్ష్మీ కాంతమ్మ గారి కేన్సర్ వ్యాధి ని పోగొట్టారు .ఆదూరి ఉమా మహేశ్వర రావు కు ఉబ్బసం తగ్గించారు .ఉద్యోగాలు ఇప్పించటం అడిగిన వారికి పేర్లు పెట్టటం చేసే వారు ..ఇరవై ఏళ్ళ తర్వాతా గురువు ను దర్శించి వచ్చారు .మస్తాన్ బాబా సమాధి చెండ టానికి పది రోజుల ముందు అక్క పైడి తల్లి మరి కొందరు బంధువులు విజయ నగరం నుండి వచ్చారు .6-12-1968న ఫరీద్ మస్తాన్ ఔలియా గారు సమాధి చెందారు .ప్రతి ఏడు రంజాన్ పండగల్లో ఔలియా ఉరుసు ఉత్స వాలు జరుగుతాయి .అందరు హాజరౌతారు .
కరగ్రహారం నిత్యం భక్తుల సందర్శన తో అలారారు తుంది .బాబాకు అత్యంత భక్తులు ఆంద్ర రాష్ట్ర పూర్వ ముఖ్య మంత్రి మర్రి చెన్నా రెడ్డి ,మాజీ ప్రధాని పి.వి.నర సింహా రావు మొదలైన వారున్నారు .ముఖ్యం గా చెన్నా రెడ్డి విజయ వాడ వైపు వస్తే కరగ్రహారం వెళ్ళ కుండా ఉండే వారు కాదు .ఇక పి.వి.గారు బాబా సంస్థాన కార్య వర్గానికి అధ్యక్షులే .షిర్డీ సాయి బాబా ,నాగాపురం తాజుద్దీన్ బాబా ,విజయ నగరం ఖాదర్ బాబా ల లాగానే మచిలీ పట్నం ఫరీద్ మస్తాన్ ఔలియా ఎన్నో అద్భుతాలు చేసి ప్రజల మనస్సుల్లో శాశ్వ తం గా నిలిచి పోయారు .ఇప్పటికి ఆయన సమాధి నుండే భక్తుల అభీష్టాలను నేర వేరుస్తారని ప్రగాఢ విశాసం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-6-12-.-కాంప్—అమెరికా
మీరు ఈ పోస్ట్ యందు విజయనగరం పైడితల్లి ఆలయం గురించి ప్రస్తావన చేశారు చారిత్రక ఆధారాలు ఉన్నాయా ? ఎందుకంటే ఇంతవరకు పైడితల్లి అమ్మవారి గురించి అందరికీ తెలిసిన కధనం ఉంది కావున మీరు వ్రాసినందున ఉత్తరాంధ్ర వాసుల మనోభావాలు కించపరిచే విధంగా ఉంది.
మీరు ఈ పోస్ట్ యందు విజయనగరం పైడితల్లి ఆలయం గురించి వివరించారు కానీ ఇప్పటికే విజయనగరం కల్పవల్లిగా భావించే ఉత్తరాంధ్ర వాసుల మనోభావాలు కించపరిచే విధంగా ఉంది. మీ దగ్గర చారిత్రాత్మక నిరూపణలు ఉన్నాయా తెలియచేయండి.