సిద్ధ యోగి పుంగవులు –14 అమృత యోగిని – పెను మత్స సీతమ్మ ఆవ ధూత

  సిద్ధ యోగి పుంగవులు –14

                                                 అమృత యోగిని – పెను మత్స   సీతమ్మ ఆవ ధూత

     సాధారణ గృహిణి పూర్వ జన్మ  వాసన ,సంకల్ప బలం ,వరిష్ఠ గురుత్వం లభించి ,మహా మహిమాన్విత యోగిని గా మారిన ఉదంతమే పెను మత్చ సీతమ్మ యోగిని వృత్తాంతం .

                 సీతమ్మ 26-8-1921 న కృష్ణా జిల్లా పెను మత్స అనే చిన్న పల్లె టూ రిలో చెరుకూరి బ్రహ్మయ్య ,శ్రీ రామమ్మ అనే కమ్మ దంపతులకు జన్మించింది .పుట్టింటి పై మమ కారం ,ఇరుగు పొరుగు పై ఆదరాభిమానాలు చిన్నప్ప టి నుంచే అలవడ్డాయి .ఎనిమిదవ ఏట ఉయ్యూరు కు అతి దగ్గర లో ఉన్న చిన్న కుగ్రామం గండి గుంట  లో ని నాదెళ్ళ క్రిష్నయ్య పెద్ద కొడుకు పదిహేనేళ్ళ సీతా రామయ్య తో వివాహం జరిగింది .ఈమె తలి దండ్రులు అయిదు రోజుల పెళ్లి రంగ రంగ వైభవం గా చేశారు .పదహారవ ఏట కాపురానికి వెళ్ళింది .భర్త కు కుడి చేతి మీద వ్రణం పుట్టి  ,ఎన్ని చికిత్స లకూ తగ్గక చని పోయాడు .ఆమె కాపురం రెండేళ్ళ ముచ్చట అయి పోయింది .

       పుట్టి నింటికి తిరిగి వచ్చి, ఎప్పుడు దిగులుగా ఏడుస్తూ గడిపేది ..బల వంతం చేస్తే రెండు ముద్దల అన్నం తినేది అంతే .ప్రక్క ఇంటి దండ మూడి పూర్ణయ్య గారు రోజు వచ్చి ఒదార్చె వారు .పాటించ వలసిన లోక రీతి ,ధర్మం ,కర్తవ్యం బోధించే వారు .కొంత వరకు తేరుకొని తనకు సంపూర్ణ జ్ఞానం కావాలని ఆయన్నే దారి చూపించ మని  కోరింది .శ్రీ రామ కోటి రాయమని ,శ్రీ రాముని చిత్రాన్ని ఇచ్చాడు .ఆమె రామ కోటి రాయటం ప్రారంభించి ,కథిన నియమాలను పాటిస్తూ తులసి పూజ చేస్తూ గడి పింది .1942 సూర్యోపాసన ప్రారంభించింది .ఉదయం ఆరు గంటల నుండి ,మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సూర్యునికి ఎదురు గా నిలబడి దీక్ష గా కోన సాగించింది .1945 కు రామ కోటి పూర్తీ అయింది .అన్న ,వదిన ళ తో భద్రాచలం వెళ్ళింది .రామ కోటి ని శ్రీ రాముని పాదాల వద్ద ఉంచి  దగ్గర లో ఉన్న ప్రదేశాలు చూసి హంసలదీవి వేనుగోపాలున్ని దర్శించి చల్ల పల్లి కోటకు వెళ్లి రాణి గారి చె సన్మానం పొంది .మళ్ళీ పెను మత్స  కు చేరింది

                                                                           మలుపు

          1946వ సంవత్సరంలో  ఆమె జీఎవితం ఒక మలుపు తిరిగింది . ఏలూరు నుండి కమ్ముల అప్పన్న అనే యోగా వ్యాయామ విద్యా ప్రవీణుడు పని మీద పెను మత్చ కు దగ్గర లోని నరసన్న పాలెం వచ్చాడు .సీతమ్మ విషయం ఆయనకు తెలిసింది .పెను మత్స కు వచ్చి ,ఆసనాలు ,యోగం నేర్పి వాటి వల్ల మనస్సు కుదుట బడు తుందని చెప్పాడు .ఆమె సాధన ప్రారంభించింది .అప్పుడప్పుడు అప్పన్న గారు వచ్చి చూసి పోతుందే వాడు .వారానికో సారి అన్నం తినటం , ఆ తర్వాతా నిమ్మ కాయ నీళ్ళుమాత్రమే  తాగి ఉండటం తో సాధన తీవ్రం చేసింది .ఆమె సాధన అప్పన్న గారికే ఆశ్చర్యం వేసింది .తాను సాధించిన యోగ విద్య తన పెరటి లో అందరికి చూపి ఆబ్బురమ్ లో ముంచే సింది .ప్రాణాయామం ,అందులోని తేడాలు ,ఫలితాలు అప్పన్న  తెలియ జెప్పాడు .వాటినీ సాధించింది .కుండలనీ యోగ సాధన చేసి ‘’అమృత పానాన్ని ‘’అలవాటు చేసుకొన్నది .ఇది సాధారణ యోగులకు అసాధ్యం .

                                                                        మహిమల వ్యాప్తి

         1948 లో అప్పన్న గారు తాను కట్టిన ఇంటి గృహ ప్రవేశ వార్షి కోట్స వాలకు సీతమ్మ కుటుంబాన్ని రమ్మని ఆహ్వా నించాడు .అప్పన్న శిష్యులు ,బంధువులు ,అనేక మంది పెద్దలు ,ప్రభుత్వోద్యోగులు అందరు వచ్చారు .అప్పన్న గారి కోరిక మీద ‘’భక్తీ యోగం ‘’గురించి అద్భుత ప్రసంగం చేసి అందర్నీ ఆకర్షించింది .జిల్లా కలెక్టరు, భార్య కూడా హాజ రైన ఆ సమా వేశం  లో సీతమ్మ ‘’కుండలినీ యోగం ప్రదర్శించి ,సహస్రారం నుండి అమృతం తీసింది ‘’హాలు అంతా సువాసన లతో గుబాలించి పోయింది .అప్పుడే ఆమె కీర్తి అన్ని జిల్లా లకు వ్యాపించింది .అమృత పానంచేయటం ఎంతో యోగ సిద్ధి ఉన్న మహాత్ములకే సాధ్యం ..ఎంద రెందరో భక్తులు పెను మత్స వచ్చి దర్శించి వెళ్ళే వారు .ఇంట్లోనే ఒక తడికల గది  లో ఎనిమిదేళ్ళు యోగ సాధన చేసింది .అప్పటికే పేరు ,ప్రఖ్యాతి పొందిన కురుమద్దాలి లోని మాల పిచ్చమ్మ అనే రామావ ధూత ను సందర్శించింది   .సీతమ్మ ను పిచ్చమ్మ ఆప్యాయం గా ఆదరించి ‘’బిడ్డా ! కొద్ది రోజుల్లో ణీ కోరిక తీరు తుంది ‘’అని ఆశీర్వ దించింది .

                         ఇంటికి తిరిగి వచ్చి తడికల గదిలోనే ఉంది. ధృఢ మైన వైరాగ్యం తో ఒకే ఆసనం లో 4నెలలు ‘’సవి కల్ప సమాధి ‘’ లో ఉంది .పిరుదులు చిల్లి పడి రక్తం కారటం ప్రారంభ మైంది .ఇంట్లో వాళ్ళు కంగారు పడి అప్పన్న గారిని పిలి పించారు .ఆయన వచ్చి కంగారేమీ లేదని ,ఆమె యోగానికి భంగం కలిగించవద్దని ,ఆమె ‘’బ్రహ్మానంద మ జ్ఞ ‘’గా ఉందని తనత తానే లేస్తుందని ధైర్యం చెప్పాడు .యోగం పూర్తీ అవగానే ఆమె మామూలు రూపం లోకి వచ్చింది కుటీరం లోనే ఉంది1951 అంతా గడి పిండి .అనేక దివ్య దర్శనాలను పొందింది .శ్రీ లక్ష్మీ నారాయణుల వరం లభించింది .

                                                                      భక్తులకు దర్శనం

          1952  లో అప్పన్న గారు వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వ వలసిందిగా సీతమ్మ గారికి సూచించారు .ఇది తెలిసి తండోప తండాలుగా జనం వచ్చే వారు .గ్రామం లోని దేవాలయం వద్ద ఎత్తైన వేదిక నిర్మించారు .దిగంబరం గా వెళ్లి వేదిక మీద పద్మాసనం లో కూర్చొని అయిదు రోజులు దర్శనం ఇచ్చింది .1952లో తన తడికల గది లోనే ఉంది ,హత యోగం ,రాజ యోగం ,ఆత్మా రామాయణం రాసిన కాగితాలను బయటకు విసిరింది .వాటిని చూసిన పెద్దలు ఆమె సమాధి నుంచి లేచి నపుడు తీరిక వేలల్లో ఈ రచనలు చేసి ఉంటుందని భావించారు .1954 వ సంవత్సరం లో కూడా ఆగస్ట్ ఎనిమిదో తేది నుండి ,సెప్టెంబర్ ఇరవై ఆరవ తేది వరకు దివ్య దర్శనం ఇచ్చింది .అప్పుడు ఆమె తల వెంత్రు కలన్ని పాము మెలికలు తిరిగి ఉన్నట్లు కని పించేవి .ఆ గ్రామ కరణం కట్టమూరి పుండరీ కాక్షుడు ఆమె తల వెంట్రుక లను భక్తీ తో  తాకి కళ్ళకు అద్దు కొన్నాడు .అప్పుడు అమ్మ ఆయన తో ‘’నేను వెళ్లి పోయిన తర్వాత వాటిని తెసుకొని జాగ్రత్త చేసుకోండి ‘’అని చెప్పింది .1955  సెప్టెంబర్ లో ‘’పిండోత్పత్తి ‘’గురించి రాసి కాగితాలను గడి బయటకు విసిరేసింది .చాలా మంది దర్శనానికి రోజు వచ్చినా ,బయటకు రాకుండా తనగది లోనే ఉండి పోయేది .1956 లోమార్చి ముప్ఫై నుంచి పది రోజులు దర్శనం ఇచ్చింది .ఆమె కోసం తండ్రి గారి పొలం లోనే ఒక సమాధి మందిరం నిర్మించారు . 9-2-1957న అశేష భక్త జనం వెంట రాగా ఇంటి నుండి ఊరే గింపు గా వెళ్లి మందిరం చేరింది .రెండు రోజులు మాత్రమే దర్శన మిచ్చింది .ఈ రెండు రోజులు చల్ల పల్లి రాణి వెంకట దుర్గాంబ గారు వచ్చిన వేలాది జనాలకు అన్న సంతర్పణ చేసింది .జనం ఎక్కు వై పదార్ధాలు అయి పోతే అక్క నాగరత్నమ్మ వచ్చి సీతమ్మ కు చెప్పేది .’’నువ్వు వెళ్లి అఖండం వెలిగించి .అన్న రాశులను ముట్టుకో ‘’అనేది అంతే పదార్దాలాన్ని అందరికి సరి పోయేవి .అంటే అక్షయం గా సమారాధన జరిగి పోయే దన్న మాట .

                తన మందిరం లోనే సీతమ్మ యోగిని ఎప్పుడుయోగ  సమాధి లోనే ఉండేది .భక్తులు ప్రతి సోమ వారం వచ్చి సమాధిని పూజించి వెళ్ళే వారు .మాస శివ రాత్రికి అన్నదానం జరిగేది .ప్రతి గురువారం రాత్రి భజనలు ,హరి కధలు ,జంగం కదా కాలక్షేపం ఉండేవి .సమాధి మందిరం దగ్గరే భక్తులు నిద్ర పోయి తమ కోరికలను విన్న విన్చె వారు .ఆమె అనుగ్రహం తో వారి మనో భీష్టాలన్ని నేర వేరేవి .

                                                                   లక్షల మందికి దివ్య  దర్శనం

            5-3-1958 నాడు ఒక్క రోజే దర్శనం లభిస్తుందని తెలిసి ఆంద్ర దేశం లోని అన్ని జిల్లాల నుండి రాష్ట్రేతరాల నుండి లక్షలాది మంది ముందు రోజు రాత్రికే పెను మత్చ చేరారు  .సమాధికి ముందు కట్టిన ఎత్తైన వేదిక మీద అమ్మ దర్శనమిచ్చి అందరిని సంత్రుప్తుల్ని చేసింది .ప్రేమ ,కరుణ ,వాత్సల్యం కురిపించి ఆశీర్వ దించింది .దర్శనం ఇచ్చే ముందు తన వారితో ‘’ఈ దర్శన మండపం ఎందుకు ?ఇంకో ఎడాదేగా ?’’అన్నది అమ్మ జీవ సమాధి ఆవ టానికి నిశ్చయించు కొన్నది అన్న వార్త విప రీతం గా వ్యాపించింది .కృష్ణా జిల్లా కలెక్టర్ అమ్మను దర్శించటా నికి వచ్చాడు .ఆమ్మ శీర్షాసనం లో ఉంది .ఆమె తల వద్ద  వింత వెలుగుకని పించి ఆశ్చర్య పోయి వెళ్లి పోయాడు .ఒక సారి అక్క నాగ రత్నమ్మ ‘’నీ  మహాత్మ్యం ఏదైనా చూపించమ్మా?’’అని అడిగింది .దానికి నవ్వి ‘ నాకు ’భగవంతుని మెప్పించే విద్య వచ్చు  వచ్చు కాని మనుష్యులను మెప్పించే విద్య రాదు ‘’అని అన్నది . మళ్ళీ ఫాల్గుణ పౌర్ణమి నాడు24-3-1959  దర్శన మిస్తానని ప్రకటించింది .ఆ నాటి ఉదయానికే లక్షలాది భక్తులు చేరు కొన్నారు .అందరికి కనుల పండువు గా దివ్య దర్శనం అనుగ్ర హించి  తరింప జేసింది . మళ్ళీ మంది రం లోకి వెళ్లి పోయింది .మందిరం బయట తాళం వేసి తాళం చెవి తల్లి శ్రీ రామమ్మ తన దగ్గర దాచుకోవటం అలవాటు .

                                                                   బ్రహ్మైక్యం  

             ఎనిమిదేళ్ళు నిరాహారం గా తపస్సు చేస్తున్న అమ్మ లో హతాట్టు గా ఒక పరిణామం కలిగింది . ఎనిమిది రోజుల తర్వాతా అమ్మ మందిరం లో ఉండగానే ,అక్క నాగరత్నమ్మ   గంట కొడుతూ మందిరానికి  ప్రదక్షిణాలు చేస్తోంది .సమాధి నుంచి అమ్మ తలుపు తీయమని మూడు సార్లు పిలి చింది .అక్క ,అమ్మని పిలుచుకు వచ్చి ,తాళం తీఇంచి తలుపు తెరిచింది .’’నేను వెళ్లి పోతున్నాను .నా నెత్తిన బిందెడు నీళ్ళు పోయండి ‘’అంది అమ్మ .వాళ్ళు భయ పది నీళ్ళు పోయకుండా కరణం గారిని పిలుచుకు రావ టానికి  మనిషిని పంపారు .ఆయన వచ్చే లోపే అమ్మ ‘’కపాలం భేదించు కొని ‘’బ్రహ్మైక్యం చెందింది .ఆ రోజు 2-4-1959 ఫాల్గుణ బహుళ అష్టమి సాయంత్రం అయిదు గంటలు మర్నాడు చల్ల పల్లి రాణి గారు వచ్చారు .లెక్కకు మించిన  జనాల తో అమ్మ ను ఊరేగించి ఆమె శిరోజాలను ఖండించి ,ముందే ఏర్పాటు చేసిన సమాధిలో అమ్మపార్ధివ శరీరాన్ని నిక్షిప్తం చేశారు .తరువాత అమ్మ సమాధి నుండి దివ్య పరి మళాలు వ్యాపించి అందరిని సంభ్రమాశ్చర్యాలలో ముంచింది .ప్రతి ఏడు ఫల్గున పౌర్ణమి నుండి బహుళ అష్టమి వరకు తొమ్మిది రోజులు అమ్మ ఆరాధన ఉత్స వాలు అత్యంత వైభవం గా నిర్వ హిస్తారు ..

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25-6-12.—కాంప్—అమెరికా

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.