సిద్ధ యోగి పుంగవులు –15 భ్రుక్త రహిత రాజ యోగి– వేటూరి ప్రభాకర శాస్త్రి గారు


                               సిద్ధ యోగి పుంగవులు –15

                                                          భ్రుక్త రహిత రాజ యోగి– వేటూరి ప్రభాకర శాస్త్రి గారు

       వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అంటే సాహిత్య మేరు పర్వతం .ఆయన రాయని పీఠిక లేదు .తరచని సాహిత్య మూ లేదు తిరగేయని శాసనం  సేకరించని తాళ  పత్రంలేదు . .దేశభక్తి లో అనుపమాన మైన వారు .ఇవన్నీ మనకు అందరికి తెలిసిన విశేషాలే .కాని అందరికి తెలియని  మహా పార్శ్వం  వేటూరి వారిలో ఉంది .వారు మాస్టర్ సి.వి.వి.గారి శిష్యులై ఎంతో యోగ సాధన చేసి ఆధ్యాత్మిక తీరాలను చూసి  ,తన వంటి వారెందరినో శిష్యులను  తయారు చేసి దీనులను ఉద్ధరించారు .అదే మనం తెలుసు కొ బోతున్నాం .

        కృష్ణా జిల్లా లో దివి తాలూకా చల్ల పల్లికి సమీపం లో పెద కళ్ళే పల్లి లో ప్రభాకర శాస్త్రి గారు 7-2-1888న వేటూరి శేషమ్మ ,సుందర శాస్త్రీ దంపతులకు జన్మించారు .పదహారేళ్ళకే తెలుగు ,సంస్కృతం పుక్కిట పట్టారు .కవిత్వ మూ చక్కగా అలవడింది .శతావధాన ,అష్టావదానాలెన్నో చేశారు .మద్రాసు  లో తెలుగు పండితులుగా పని చేశారు .అప్పుడే వేపా రామేశం గారి వద్ద ఖగోళం ,చరిత్ర అధ్యయనం చేశారు .1910  లో పిసుపాటి మహాలక్ష్మమ్మ గారితో వివాహ మైంది .మద్రాస్ ప్రాచ్య లిఖిత భాండా గారం లో పండితుని గా చేరి ఇంగ్లీష ,కన్నడ,తమిలాలు నేర్చారు .చరిత్ర సంస్కృతి ,వాజ్మయం ,శాసనాలు తాళ  పత్రాలు ,కైఫీయతులు ,గ్రంధాలు సేకరించి ,పరిశీలించి పరిష్కరించి,ముద్రించారు .’’ఎన్నో బండ్లకు ఎత్త దగి నంత సాహిత్య వాజ్మయాన్ని శాస్త్రి గారు సంత రించారు ‘’అని ఆయన్ను గురించి అంటారు .

                                                         యోగ సాధన

           1912-16 మద్య కాలం లో శాస్త్రి గారు తీవ్ర బాధలకు గురైనారు .మానసిక స్వాస్త్యమూ కోల్పోయారు .మద్రాస లో రైలు ఎక్కి ఎక్కడో ఆత్మా హత్య చేసుకోవాలని భావించిరైలు ఎక్క టానికి స్టేషన్ కు పోతున్నారు . అబ్బూరి జగన్నాధ రావు అనే వారితో పరిచయమైంది .ఆయన తన బావ గారైన ప్రేసిదేన్సి కళా శాల ఫిలాసఫీ ప్రొఫెసర్ పోత రాజు నరసింహం గారిని పరిచయం చేశారు .ఈయన  మాస్టర్ సి.వి.వి.గారి శిష్యులు .పోత రాజు గారు ఇచ్చిన పరిచయ ఉత్తరాన్ని తీసుకొని వేటూరి వారు కుంభకోణం లో ఉన్న మాస్టర్ గారింటికి చేరి ఉత్తరం ఇచ్చారు .ఆయన చదివి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు ఆ మాట తోనే శాస్త్రి గారిలో ‘’ప్రజ్ఞ ‘’ప్రవేశించింది .అప్పటికి ఆయన చేతి గూడు జారి చా లా కాలం నుంచి చాలా బాధ పడుతున్నారు .ఇక్కడికి రాగానే తగ్గి పోయి గూడు మళ్ళీ యదా స్తానం చేరింది .ఒక చెయ్యి పైకి లేప గలిగే వారు కాదు .ఇప్పుడు హాయిగా చెయ్యి పని చేస్తోంది మాస్టర్ గారి అను మతి తో రాదా కృష్ణ పిల్లే ,మహాదేవ్య గార్లు శాస్త్రి గారిని పరీక్షించి పూర్వజన్మ వృత్తాంతం తెలుసు కొని మాస్టర్ గారికి నివేదించారు .అప్పటి నుంచి శాస్త్రి గారు మాస్టర్ గారి శిష్యులై పోయారు .

      ఇతరుల బాధలను చూసి శాస్త్రి గారు తట్టు కొ లేక పోయే వారు .తన ఆత్మ శక్తి తో బాధలు తీర్చే వారు .’’నిన్నటి వరకు నువ్వు ప్రజ్ఞా ప్రభాకరుడివి .ఈ రోజు నుండి నన్ను గురించి రాయ గల యోగ్యత నీకు కల్గింది ‘’అని గురువు గారు శాస్త్రి గారిని మెచ్చారు .1918 లో తంజావూర్ సరస్వతి గ్రంధాలయం లో పనిచేశారు .వారాంతపు శలవల్లో మాస్టర్ గారిని దర్శించి యోగ రహస్యాలు నేర్చే వారు శాస్త్రి గారు ‘’తమ లో సమస్త విశ్వాన్ని ,సమస్త విశ్వం లో తమను చదర్శించ గల యోగి పుంగవులు ‘’అయారు .భార్యను కూడా మాస్టార్ జీ  కి శిష్యురాలిని చేశారు .శాస్త్రి గారు ‘’గౌతమ బుద్ధుని అవతారం ‘’అని నాడీ  గ్రంధాలు తెలిపాయి ..అందుకే ఆయన లో కరుణ ,దయ ,ప్రేమ ,శాంత గంభీరత స్పష్టం గా కన్పిస్తాయి .ఆయన ముఖం చూస్తె నే చాలు మానసిక ప్రశాంతి లభిస్తుందని చాలా మంది చెప్పే వారు.

                                                             యోగ ప్రభాకరామ్రుతం

             ఒక రిక్షాలాగే వాడి కొడుకు నోట మాట రాక మూతి వంకరపోయి చేతులు ,కాళ్ళు స్వాధీనం లో లేక శాస్త్రి గారి దగ్గరకు వస్తే ,ధ్యానం చేసి వాడితో కాఫీ తాగించి  శరీరం అంతా నిమిరి ప్రేమ కురిపించారు .అంతే వాడు తనకే జబ్బు లేనట్లు లేచి కూర్చున్నాడు

         బందరు లోని వేమూరి దుర్గా నాగేశ్వర రావు కు రెండు కిద్నీలలో రాళ్ళు చేరి ఎన్ని మందులు తిన్నా తగ్గక వేటూరి వారి వద్దకు చేరాడు .డాక్టర్లు అది తగ్గే జబ్బు కాదని హేళన చేశారు .ఒక సారి తీవ్రం గా బాధ అనుభవిస్తూ శాస్త్రి గారికి కబురు చేస్తే ,తాను అక్కడి నుండే చికిత్స చేస్తున్నానని భయం లేదని చెప్పారు కాసేపటికి మూత్రం ద్వారా రాళ్ళు పడి  పోయి బాధ నివారణ జరిగింది .ఆలస్యం ఎందుకు జరిగింది అని ఆయన వేటూరి వారిని ప్రశ్నిస్తే ‘’నమ్మకం నీకు పూర్తీ గా లేనందువల్ల ‘’అని చెప్పారు .

        ఒక సారి శాస్త్రి గారు అయాచితుల హనుమత్చాస్త్రి ,అప్పల సోమేశ్వర శర్మ లతో ‘’భ్రుక్త రహిత రాజ యోగం ‘’గురించి ,మాస్టర్ గారి గురించి మాట్లాడు కొంటున్నారు .వారిద్దరూ ఈ యోగా మహాత్యనికి ఏదైనా నిదర్శనం చూపమని అడిగారు .’’మీకు యే పువ్వు ఇష్టమో చెప్పండి ‘’అన్నారు శాస్త్రి గారు ‘’సంపంగి ‘’అన్నారు వారిద్దరూ .వేటూరి వారు ధ్యానం లో మునిగి పోయారు .వెంటనే వాళ్ళున్న ప్రదేశమంతా సంపంగి పూల వాసనలు  గుబాలించాయి .కాలం కాని కాలం లో సంపంగి పూల వాసన రావటం అందర్ని ఆశ్చర్యం లోకి నెట్టేసింది ఇదే ఆ యోగానికి నిదర్శనం .

        కల్లూరి వీర భద్ర శాస్త్రి వేటూరి వారిని దర్శించ టానికి మద్రాస వెళ్లారు .అక్కడ ‘’కూం నది ‘’మురికి కంపు భరించ లేకుండా ఉంది .వీరభద్రం గారు ‘’శాస్త్రీ ! ఈ కంపు పోగోతట్టవా’’అని మనసులో అనుకొన్నారు  .అంతే శాస్త్రి గారు కళ్ళు మూసుకొని ధ్యానిస్తే సుగంధ పరిమళాలు అంతటా వ్యాపించాయి

      ఇంకో సారి ‘’అనాస పండు ‘’తినాలని పించింది .కాసేపటి లో ఆయన దర్శనం కోసం రాజ మాండ్రి నుంచి వప్పుడే వచ్చిన పద్మ నాభ స్వామి అనే సాధకుడు అనాస పండ్ల గంప తో వచ్చి ఇచ్చాడు .

     ప్రఖ్యాత శాస్త్ర వేత్త విస్సా అప్పా రావు వేటూరి వారికి వియ్యంకులు .అప్పా రావు గారు శాస్త్రి గారి యోగాద్భుతాలు31 ని గ్రంధస్తం చేశారు .అందులో ఒకటి కుష్టు రోగం తో  బాధ పడుతున్న వకీలు గుమాస్తాకు తన ఇంటి వద్దనుంచే నయం చేశారు .తిరుపతి లో ఉండే నరసింహా చారికి ,ఒక రెడ్ల కుర్రాడికి మద్రాస నుండే కుష్టు రోగం కు చికిత్స చేసి పోగొట్టారు .దీన్నే’’ డి స్తంట్ హీలింగ్ ‘’అంటారు .తిరుపతి లోని పార్ధ సారధి అయ్యంగార్ భార్యకు గర్భకోశ కేన్సర్ .డాక్టర్లు ఆమె పని రోజుల్లోనే ఉందన్నారు .శాస్త్రి గారు ఆయన కోరితే వాళ్ళింటికి వెళ్లి ప్రార్ధన చేశారు నలుపు ,ఎరుపు ద్రవం బయటికి పోయి  పదిహేను రోజుల్లో ఆమె మామూలు మనిషి అయింది .

           1939-40ప్రాంతం లో ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారికి నిద్ర  రా క పోవటం గుండె దడ ,వీధిలో నడవటానికి భయం ఉండేవి .శాస్త్రి గారిని సంప్రదించారు .అదేదో ఆయన సూక్ష్మ శరీరం లోని బాధ అని తెలుసు కొన్నారు .అది అవధాని గారి మొదటి భార్యదే .ఎంత గా ట్రీట్ చేసినా తగ్గలేదు అవధాని గారికి .ఒక సారి ‘’నువ్వు నా మాట వినక పోతే వినేట్లు చేస్తాను ‘’అని గట్టిగా మందలించారు .వారి ఆదేశం ప్రకారం అవధాని గారి రెండో భార్యకు మొదటి భార్య మొదటి సంతానం గా పుట్టి ఋణం తీర్చుకోంది .అప్పటి నుండి అవధాని గారికి యే బాధలు లేవు  

      అలాగే కుప్పు స్వామి శాస్త్రి గారి మొదటి భార్య చని పోయి ఆయన్ను చాలా బాధ పెడితే వేటూరి వారు ఆమెను న ఆయన కొడుకు శేషగిరి కి కూతురు గా పుట్ట మని  చెప్పి  అల్లానే జరిగితే ఆయన కు ఆనందం  కలి గింది .

        ప్రఖ్యాత దేశ భక్తులు ,మహా వక్త చెరుకు వాడ నరసింహం పంతులు గారికి క్షయ వ్యాధి చాలా తీవ్రం గా వచ్చింది .దాన్ని ట్రీట్ చేసి నయం చేశారు శాస్త్రి గారు .అలానే ప్రముఖ సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావు భార్యకు పార్శ్వపు నొప్పి ,తిరుపతి ప్రాచ్య శోధన సంస్థ సంచాలకుడు రామానుజ స్వామి భార్యకు జలోదరం తగ్గించారు .

          ‘’నా చుట్టూ ఆనందాన్ని ,అమృతాన్ని పంచి పెట్టాలనే సంకల్పం ఉన్న వాణ్ని నేను .అందర్ని ఆపదల నుంచి రక్షించటం ,అందర్లో ఆనందాన్ని నేల కొల్పటం అనే రెండు భావాలే నాకు ఉచ్చ్వాస నిస్స్వాశాలు .అవి రెండు ఆడటం లోనే నా ఊపిరి ‘’అన్న మహా ను భావులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు .నిజం గానే ఆయన ప్రభాకరుడు అంటే సూర్యుడు లానే ఆరోగ్యాన్ని చ్చేవారు .ఆరోగ్యం భాస్కర్ర్ దిచ్చేత్ కాదు ఆరోగ్యం ప్రభాకరదిత్యేత్ ‘’అయింది ఆయన పట్ల .సార్ధక జీవులు వారు .

       ఒక సారి వారు తళ పత్రాల కోసం ఊళ్లు తిరుగుతూ ఒక వూరిలో ఉండగా నిద్ర పట్టక బయట తిరుగుతూ ,దీపం వెలుగుతున్న ఇంటికి పోయి మంచి నీళ్ళు అడిగారు .గృహిణి మంచినీళ్ళ చెంబు అందించి ,తన భర్త ప్రాణాపాయ స్తితి లో ఉన్నారని దీనం గా విల పించింది .అంతే కరుణార్ద్ర హృదయులు శాస్త్రి గారు మంచి నీళ్ళు థా గ కుండా తన బసకు చేరి కాళ్ళు కడుక్కొని నిద్ర పోకుండా  ప్రార్ధన చేశారు .తెల్లారి వెళ్లి ఆమెను పలకరించారు ‘’మీరు పలక రించి వెళ్ళిన తర్వాత మా వారికి ఆరోగ్యం కుదుట బడింది ‘’అని కృతజ్ఞత చెప్పింది ఆ ఇల్లాలు .ప్రార్ధనకు ,ఈశ్వర అనుగ్రహానికి ఉన్న మహత్తర శక్తి ఇక్కడ మనకు కన్పిస్తుంది .ఆయన అనుకంప అలాంటిది .అందుకే ఆయన బుద్ధుని అపర అవతారం అన్నారు .యోగ ప్రభాకరులు 29-8-1950న తమ హంసను సవిత్రు మండల నారాయణ మూర్తి లోనికి చేర్చి ధన్యులయారు .వారికి దేశం అన్ని విధాలా ఎంతో రుణ పడి ఉంది .

                                                        యోగ ప్రభాకర కిరణాలు

           ప్రభాకర శాస్త్రి గారి యోగ శిష్యులలో కొత్త వెంకటేశ్వర రావు ,కొత్త రామ కోటయ్య ,అర్చకం ఉదయ గిరి శ్రీని వాసాచార్యులు ,ఏం.ఎల్.నారాయణ రావు ,వెన్నెల కంటి ముని క్రిష్నయ్య ,గాలి బాల సుందర రావు ,తిమ్మా వజ్ఝాల కోదండ రామయ్య ,సింగరాజు సచ్చిదానందం ,పోచిరాజు శేషగిరి రావు ,శ్రీమతి కల్ప వల్లి ,శ్రీ మతి చంద్ర కాంతమ్మ మొదలైన వారెందరో ఉన్నారు .

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-6-12.కాంప్—అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.