సిద్ధ యోగి పుంగవులు –16 అవధూత చక్ర వర్తి- కురుమద్దాలి పిచ్చమ్మ

  సిద్ధ యోగి  పుంగవులు –16

                                                       అవధూత చక్ర వర్తి- కురుమద్దాలి పిచ్చమ్మ

    మనిషి యే కులమో కాదు, మనసు యే కులమో చూడాలి .అప్పుడే మనం జ్ఞాన వంతులమవుతాం  .మాల కులం లో జన్మించి ,జన్మ ల  జన్మల సంస్కారాన్ని వెంట నిడుకొని ,రామ భక్తీ సామ్రాజ్యాన్ని యేలి మహాత్మా గాంధీని ,రమణ మహర్షిని ,మళయాళ స్వామి వంటి వారినే సంభ్రమాశ్చర్యాలలో ముంచి వేసిన కురు మద్దాలి పిచ్చమ్మ చరిత్ర సర్వ పాప హారం .ఆ అమ్మ ప్రత్యక్ష సచ్చిదానంద మూర్తి ,అవధూత చక్ర వర్తి .

           పిచ్చమ్మ మాల కులం లో బెజవాడ బందరు రోడ్డు లో పామర్రు కు దగ్గర గా ఉన్న కుగ్రామం కురుమద్దాలి లో వర్రే ముత్తయ్య ,వీరమ్మ దంపతులకు 1870  లో జన్మించింది .మంచి ఆజాను బాహువు శరీరం తో ముచ్చటగా ఉండేది .పిల్లగా ఉన్నప్పుడే మంత్రం వేసి నట్లు పడి  పోయేది .ఆడుతూ ,పాడుతూ పరవశించేది .ఏది చేసినా తాదాత్మ్యం చెంది చేయటం ఆమెకు అల వాటైనది .ఆమె కేదో రోగం అనుకొన్నారు తలి దండ్రులు .రామాలయం లో రామ చంద్రుని రూపం చూస్తూ పరవశించేది .ఎన్నో వైద్యాలు చేయించినా తీరు మార లేదు .’’పిచ్చి పిచ్చమ్మ ‘’అని పిలిచే వారు .తుమ్మల పల్లి గ్రామం లో నీలి శోభనాద్రి కిచ్చి వివాహం చేశారు కాపురానికి వెళ్ళినా ఏకాంత జీవితమే .గోసేవ చేసేది .నిర్జన ప్రదేశం దొరికితే ధ్యానం లో మునిగి స్పృహ తప్పి పడి  పోయేది .ఆమెకు రామ నామమే అండా,దండా .

      పిచ్చమ్మ గర్భ వతి అయింది .నాల్గవ నెలలో నే  భర్త చని పోయాడు .ఆడ పిల్ల ను కని భాగ్యమ్మ అని పేరు పెట్టింది .మళ్ళీ పెళ్లి చేసుకోమని తల్లి తండ్రి కోరితే తిరస్కరించింది .కూలి చేసి బిడ్డను సాకింది .కష్టపడి పని చేసి ముతా మేస్త్రి అయింది .ఆమె పని అంటే అందరికి ఇష్టం .ఒళ్ళు దాచుకోకుండా చేసేది ,చేయించేది .పిల్లను పోషిస్తూ మిగిలిన డబ్బు ను మంచి పనులకు ఖర్చు చేసేది .యుక్త వయసు రాగానే భాగ్యమ్మను ఒక అయ్య చేతి లో పెట్టి పెళ్లి చేసింది .అల్లుణ్ణి కన్న కొడుకు గా చూసుకోంది .కాని అత్తవారు ఆమె ను రాచి రంపాన పెట్టె వారు .తల్లికి వచ్చి చెప్పుకొని ఏడ్చేది .బతిమిలాడి పంపించేది .ఒక సారి అత్తారింటికి వెళ్లనని భీష్మిస్తే ‘’యే నూతి లో పడి చచ్చినా బాగుండును కూతురు -అను కొన్నది మనసులో .అనుకోన్నట్లే భాగ్యమ్మ నూతి లో దూకి చని పోయింది .పోలీసులకు తెలిసి వచ్చి విచారిస్తే అత్తమామల మీద నేరం చెప్ప కుండా తన కూతురికి మూర్చ రోగం అందుకే తెలీకుండా నూతిలో పడి  చని పోయిందని చెప్పిన ఉత్తమా ఇల్లాలు పిచ్చమ్మ .

                                                      రామావదూత గా పరిణామం

         పిచ్చమ్మకు వైరాగ్య భావన పెరిగి పోయింది .మొలకు ఒక గోనే సంచి మాత్రం కట్టు కొని తిరిగేది .స్మశానం లో నివాసం .రామ నామం ,హనుమన్నాపం జపిస్తూ తిండీ తిప్పలు లేకుండా గడి పింది .కూతురు భాగ్యమ్మ కోసం యిప్పటి దాకా ఏడ్చిన పిచ్చమ్మ భగవద్భాగ్యం కోసం ఏడవటం ప్రారంభించింది .అలాంటి సమయం లో ఎక్కడి నుంచో ఒక గోసాయి వచ్చి ,ఓదార్చి ఏదో ఉపదేశించి వెళ్లాడు .ఆయన కోసం వెదికితే కంపించ లేదు .వచ్చిన వాడు సాక్షాత్తు శ్రీ రాముడే అని నమ్మింది .ఆ దుఖం లో నే జ్ఞాన సిద్ధి కలిగింది .త్యాగరాజు కృతులు రామదాసు భజనలు వేమన పద్యాలు ,బ్రహ్మం గారి తత్వాలు పాడుకొంటూ ఉండేది .ఆకులు అలములు స్మశానం లో ఒండ్రు మన్నే ఆహారం .పాములతో సహజీవనం .అవి ఆమెను ఏమీ చేసేవి కావు .ఆమె కు పిచ్చి బాగా ముదిరిందని పిల్లలు రాళ్ళతో కొట్టే వారు . అలానే సహించేది .ఒక సారి ఒక కుర్ర కున్క విపరీతం గా రాళ్ళు విసిరాడు ‘’ఒరి  కుర్ర కుంకా ! చేతులు బొబ్బలేక్కు తాయిరా ‘’అంది .నిజం గా వాడి చేతులకు ఎర్రగా బొబ్బలేక్కి పోయాయి .వాడి తల్లి దండ్రులు వచ్చి ఏడుస్తూ కాళ్ళ మీద పడ్డారు ‘’పోతాయిలే పోరా ‘’అన్నది .అంతే వాడిబొబ్బలు మాయం .పిచ్చమ్మ లో ఏదో శక్తి ఉందని అప్పుడు కురుమద్దాలి జనం గ్రహించారు .కుటీరం నిర్మించి అమ్మకు అఆశ్రయం కల్పించారు .వారి బలవంతాన అందులో చేరింది .ఒక సారి కాళ్ళు పడి  పోయిన ఒక వ్యక్తిని బండి లో ఆస్పత్రి కి తీసుకు వెళ్తుండగా బండిని ఆపించి ఆరోగిని కిందికి దింపి ,వీపు మీద చెయ్యి వేసి రాసింది ‘’ఇంటికి పోరా ‘’అంది .వాడు హాయిగా నడుచు కొంటు ఇంటికి వెళ్లాడు .ఇలా క్రమ క్రమంగా ఆమె మహత్తు జనాలకు తెలిసి గురి బాగా కుదిరింది .పిచ్చి పిచ్చమ్మ రామావదూత పిచ్చమ్మ గా పరిణామం చెందింది .

                                                             జ్ఞానయోగిని పిచ్చమ్మ

          పిచ్చమ్మ ను చూడ టానికి వచ్చే జనం పెరిగి పోతున్నారు .ఆమె క్రమంగా తత్వ రహస్యాలను ,ఉపనిషద్ రహస్యాలను పామర భాషలో తెలియ జెప్పెది .ఆమె ‘’పని అవుతుంది ‘’అంటే అయ్యేది ‘’కాదు ‘’అంటే పని జరిగేది కాదు .రాముడు ఏది పలికిస్తే అది పలుకుతున్నాను అనేది .తనను ‘’వీడు ‘’అను కొనేది .అమ్మ దేహం నుండి జ్ఞానాగ్ని ,యోగాగ్ని సెగలు ,పొగలు వచ్చేవి .అప్పుడు చన్నీళ్ళు ధారగా పోసి వెంకమ్మ ,వరలక్ష్మ తాపం చల్లార్చే వారు .ఆమె లో ‘’బ్రహ్మా నంద భావన ‘’క్రమంగా పెరిగింది .రాముడు ,కృష్ణుడు మొదలైన దశావతారాలు తనకు కన్పించినా మనశ్శాంతి ముఖ్యమని వారిని తిరస్కరించానని చెప్పేది .1925 పిన్నమ నేని రామయ్య వగైరాలు ఆశ్రమం నిర్మించారు .ఆమె తపస్సు కు అను కూలం గా ‘’భూగర్భ భువనేశ్వరం ‘’నిర్మించారు .రోజు విడిచి రోజు సమాధి లోకి ,మూడు రోజులకో సారి మౌనం లోకి వెళ్ళేది .

                                                              మహిమాన్విత యోగిని  

     అమ్మ సమాధి నుండి లేచి నప్పుడు  దర్శించుకొన్న వారి బాధలు తీరేవి .’’అమ్మా నీకేమివ్వ మంటావు ‘’/అని ఎవరైనా అడిగితే ‘’వీదికేమి కావాల్రా –గోడకట్టు ‘’అని ఆశ్రమ సేవ చేయించేది. మనుష్యుల ముఖాలు చూసి వాళ్ల అర్హతలను చెప్పేది .ఎప్పుడు అర్ధ నగ్నం గా ఉండేది .దురుద్దేశం ఉన్న వాళ్ళు వస్తే ‘’వాడి కంట్లో దోషం ఉంది .నాకు దుప్పటి కప్పండి ‘’అనేది .అక్కలు ,బంధువులు ఇళ్లకు రమ్మని పిలిస్తే వెళ్ళేది కాదు .తాను మంచి మార్గం లో నడుస్తున్నానని , ,వాళ్ళనూ సన్మార్గం లో నడవ మని  బోధించేది .అమ్మ దగ్గర ఎప్పుడో అప్పు తెసుకొన్న వాడు చెల్లించ టానికి వస్తే ‘’వీడు ఎవ్వరికీ ఋణం లేడు .ఎవ్వరూ వీడికి ఋణం లేరు ఫో’’అన్నది .బ్రాహ్మణులు దర్శించ టానికి వస్తే వాళ్లకు ఆచారం ఎక్కువ ,మలినం పోలేదు అని దూరం గా ఉంది దండం పెట్ట మనేది .

            ‘’ వీడు అనేది రాముడే ‘’ అని అద్వైత భావన లో అనేది .డబ్బు బంగారం లాంటి వాటిని ముట్టు కొనేది కాదు .వాటిని ‘’రోత ‘’అనేది .వాటిని దాన ధర్మాలు చేసి బాగు పాడమని చెప్పేది .ఆమెకు తెలీకుండా వ్రే లికి ఉ బంగారు ఉంగరం ఒకడు తొడిగితే మురికి కాల్వ లోకి విసరేసింది .ఒకడు వెండి గ్లాసును కొంగుకు కట్టితే వాడి గొడ్ల సావిడి అంటూ కుంది .ఆమె ను పరీక్షించాలను కొన్న వారి ముఖాలు వేల వేల బోయాయి .ఆమె మాటల్లో ‘’అడవి ‘’అంటే అజ్ఞానం .ఒక సారి మళయాళ స్వాములతో ‘’ఒరేయ్ నీకు ఇంకో చొక్కా ఉన్దిరోయ్ ‘’అన్నది .అంటే ఇంకో జన్మ ఎత్తాల్సి ఉంది అని అర్ధం .ఆమె పాముల్ని దూడలు అనేది .ఒకసా  రి భక్తుడు ఒకడు పాము ను కర్రతో కొడితే అమ్మ కు దెబ్బలు తగిలి నంత బాధ పడింది .దాన్ని చేతి లోకి తీసుకొని ‘’నువ్వ్వు మనిషివౌతావు ‘’అన్నది .ఆ పాము ఆమె ఒడిలోనే కన్ను మూసింది .పదేళ్లు తనతో సహవాసం చేసిన కుక్క చని పోతుంటే ‘’మానవ లోకం వదిలి పోతున్నావా .పొ.మనిషిగా నే పుద్తావులే ‘’అంది .’’ఎద్దల్లె తిని మోద్దల్లె తిరిగితే దేవుడు కని పించడు  ‘’అనేది .ఆడ వాళ్ళను ‘’ఒసేయ్ ముడ ల్లారా ! మాయ మగన్ని  చూసి మిడిసి పోకండి .కమ్మని మగడు ఇక్కడ ఎలా రమిస్తున్నాడో చూడందే అ’’అని తన భ్రుకుటి మద్య లో వేలు పెట్టుకొని సమాధి లోకి పోయిన్దొక సారి .

                                                          తీర్ధ యాత్రలు –మహాత్ముల దర్శనం

       భద్రాచలం తిరుపతి ,శ్రీ శైలం కాశీ ,ప్రయాగ వంటి పుణ్య క్షేత్రాలన్నీ వల్లబనేని అన్న పూర్ణ ,పిన్నమ నేని నాగయ్య ల మొదలైన భక్త బృందం తో సందర్శించింది .దక్షినేశ్వరం లో’’ శ్రీ రామ కృష్ణ పరమ హంస దేవిలో ఇమిడి పోయాడు .దేవి పరమ హంస లో ఇమిడి పోయింది .పరమ హంస కు చావు పుట్టుకలు లేవు ‘’అని అద్భుత భాష్యం చెప్పింది .శ్రీ రమణాశ్రమానికి వెళ్లి సరాసరి రమణ మహర్షి కూర్చునే ఆసనం పై కూర్చుంటే రమణులు ఆమె ప్రక్కన ఆసీను లయారు .అమాంతం గా మహర్షి పై వాలి పోయింది .లేచి ‘’ఎప్పుడూ అంత దూరం ఏమి చూస్తున్తావు ?అనిఆయన్ను అడిగింది .ఆయన భావ గర్భితం గా ‘’నువ్వు చూస్తున్నదే నేనూ చూస్తున్నాను ;;అన్నారు .

                 తిరుమలకు వెళ్లి అర్చకులు చూస్తుండగానే గర్భ గుడి లోకి వెళ్లి ‘’ఏరా వెంకన్నా !ఇక్కడున్నావా ?’’ అని పసి పిల్లాణ్ణి పలక రించి నట్లు పలక రించింది .1936 శ్రీ మళయాళ స్వాములు కురుమద్దాలి ఆశ్రమానికి అమ్మ ను దర్శించ టానికి వస్తే ఆయనకు ఎదురు వెళ్లి కౌగలించు కొన్నది .1924 లో గాంధి మహాత్ముడు బందరు వస్తే స్వామి సీతా రాం అమ్మను వెంట బెట్టు కొని గాంధి గారికి దర్శనం కల్గించారు ..మహాత్మున్ని ఆలింగనం చేసుకొని అరటి పండు బోసి నవ్వుల తాత నోటి కందించి ‘’ఒరేయ్ ! లోక సేవ బాగా చేస్తున్నావు .ఇంకా బాగా చెయ్యి ‘’అంది .పెను మత్చ యోగిని ,లలితా నంద సరస్వతి ప్రనవానంద స్వామి వంటి వాళ్ళు వచ్చి అమ్మ తో తత్వ గోష్టి  చేసే వారు .గడిపాటి వెంకట చలం ,ఆయన కూతురు పదమూడేళ్ళ సౌరీస్ తో వచ్చి చాలా సార్లు  అమ్మ దర్శనం చేసుకొన్నారు .ఆ అనుభవాలను చలం చింతా దీక్షితులు గారికి రాశారు ఆంద్ర ప్రదేశ్ మొదటి ఆస్థాన కవి శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి ,ఉన్నావ లక్ష్మీ నారాయణ ,కాటూరి వెంకటేశ్వర రావు ,త్రిపుర నేని గోపి చాంద్ ,వేలూరి శివ రామ శాస్త్రి వంటి కవి పండితు లెందరో అమ్మ దర్శనం తో పులకించి పోయారు .

    .1938 లో వేలూరి శివ రామ శాస్త్రి గారు ఆంద్ర పత్రిక లో అమ్మను గురించి అనేక వ్యాసాలూ రాశారు .మహా భక్త విజయం గ్రంధ కర్త పంగులూరి వీర రాఘవుడు అమ్మ సమాధి నుండి లేచే సమయానికి వెడితే లేచి వచ్చి కౌగలించుకొని ‘’నీకు ఆకలవుతోంది ‘’అని లడ్డు చేతి లో పెడితే ‘’నువ్వు మాల దానివి .నేను బ్రాహ్మన్ని .’’అంటే ఆమె ‘’ఒర్! బత్తికి కులం ఉందన్త్రా /అన్నది .ఆయన మహా సంతోషం గా కళ్ళ కద్దు కొని తిన్నాడు .ఆమె ఇచ్చిన మంచి నీళ్ళు అమృతం గా తాగాడు .

     శ్రీ లలిత నంద సరస్వతి స్వామి ఆహ్వానిస్తే ఆయన నిర్వహించిన రుద్ర యాగానికి వెళ్లి సన్మానం పొందింది .గాలి లాగా తేలికై కొండెక్కి నాగ సర్ప రూపం లో సుబ్రహ్మనఎశ్వరున్ని   సందర్శించి వచ్చింది పిన్నమ నేని వీరయ్య చౌదరికి రైస్ మిల్లు కట్టు కోవటానికి ప్రభుత్వం అనుమతిని ఇవ్వక పోతే ,వాళ్లకు నచ్చ చెప్పి ఇప్పించింది .

          1951 జనవరి లో భక్తులతో ‘’ఈ మతం తగల బడి పోతోంది ఒరేయ్ వంట వాడు పైకి ఎక్కు తున్నాడు .ఇక వంట తయారు కాదు ‘’అని నర్మ గర్భం గా పలికింది .15-1-1951 ఖర నామ సంవత్సర పుష్య శుద్ధ శ్టమి నాడు రాత్రి ఒంటి గంటకు తనువు చాలిస్తున్నట్లు తెలియ జేశింది .ఎవరేమి పెట్టినా తిన్నది .రామ నామం చేస్తూ ,చేయిస్తూ సరిగ్గా రాత్రి ఒంటి గంటకు అమ్మ భ్రూ మాధ్యమ నుండి గొప్ప వెలుగు వెలువడి ఆశ్రమం అంతా ప్రకాశింప జేసింది .అమ్మ పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మ లోకం చేరింది .శాస్త్రోక్తం గా ఆమె దేహాన్ని నిక్షేపం చేశారు .ఆమె ఆజ్న ప్రకారం దేవీ రూపం లో ఉన్న నల్ల రాతి విగ్రహాన్ని అమ్మ సమాధి పై ప్రతిష్టించారు .తరువాత ఇంకో తెల్ల రాతి విగ్రహ ప్రతిష్ట చేశారు రోజు ఈ విగ్రహాలకు అర్చన జరుగు తుంది .ఖమ్మం జిల్లా బూర్గం పహాడ్ లో కూడా పిచ్చమ్మ అవధూత ఆశ్రమం ఉంది

 ఈ విధం గా కృష్ణా జిల్లాలో దగ్గర దగ్గర లోనే పిచ్చమ్మ ,పెన్మత్స యోగిని వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు .

   మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –26-6-12.—కాంప్—అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

3 Responses to సిద్ధ యోగి పుంగవులు –16 అవధూత చక్ర వర్తి- కురుమద్దాలి పిచ్చమ్మ

 1. Subrahmanyam says:

  సిద్ధ యోగిపుంగవుల జీవిత విశేషాలను చక్కటి వ్యాసములుగా అందజేసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా బాగున్నవి. అవధూత పిచ్చమ్మగారి జీవిత చరిత్ర పుస్తకము ఒకవేళ ఏదైన ముద్రింపబడియుంటే దయచేసి వాటి వివరములు తెలుపని నా ప్రార్ధన.

  ధన్యవాదములతో,
  సుబ్రహ్మణ్యం.

  • Dr K Ramadutha says:

   శ్రీ రామ అవధూత పిచ్చమ్మ తల్లి జీవిత చరిత్ర పుస్తకం ను మొట్టమొదటిగా అమ్మ ల ప్రియ శిష్యులు అయిన మా గురువూ గారు శ్రీ కొసరాజు
   హరినాథ్ విఠల్ గారు ముద్రించారు,ఆ పత్రికలు మా శ్రీరామ అవధూత ఆశ్రమము బూర్గంపాడు–భద్రాది-కొత్తగూడం జిల్లా. సంప్రదించాల్సిన నంబర్:::::9866055062.

 2. ravindrababu says:

  పెద్దలకు నమస్కారము అవధూత పిచ్చమ్మ అమ్మ గురుంచి బ్లాగ్ లో చూసాను. ధన్యవాదాలు.. పేరు విన్నాను కానీ చరిత్ర తెలియలేదు .చాల వివరంగా విషయ సేకరణ చేసి మా లాంటి వారికీ తెలుచుకొనే ప్రయత్నం చేసే వారికి చాలా ప్రయోజనం .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.