సిద్ధ యోగి పుంగవులు –18 త్రికాల జ్ఞాన యోగి –ప్రకాశానంద స్వామి

సిద్ధ యోగి పుంగవులు –18

                                                     త్రికాల జ్ఞాన యోగి –ప్రకాశానంద స్వామి

     ఈ లోకం లో భాగస్వామి గా ఉంటూ ,కోరికలు లేకుండా ముక్తులై బ్రహ్మాన్ని పొందే వారు చాలా అరుదుగా ఉంటారు అలాంటి అరుదైన త్రికాలవేదే అనంతయ్య అనే సామాన్య్డు డు బ్రహ్మ ప్రకాశాన్ని పొంది ప్రకాశానందులైనారు .

     విజయనగరం ప్రాంతం లో గౌరమ్మ ,అనంత రామయ్య ల కుమారుడే అనంతయ్య .1871లో జన్మించాడు .ఎనిమిదవ ఏట  ,తండ్రి ,పందొమ్మిదవ ఏట తల్లి చని పోయిన దురదృష్ట వంతుడు ..తాత గారి పెంపకం లో ఉపనయనం జరిగింది .పదిహేనవ ఏట బడి చదువులు వదిలి సంస్కృతం ,జ్యోతిషం నేర్చాడు .పెళ్లి చేద్దామని తాత ,మామ్మ ప్రయత్నాలు చేసి యోగ్యురాలిని చూసి తాంబూలాలు పుచ్చుకొన్నారు .కాని ఆ పిల్ల పెళ్ళికాక ముందే చని పోయింది .ఇంగ్లీష బోధించిన దత్తయ్య పంతులు మంచి వేదాంతి .తగిన గురువు వెతుక్కొంటూ వస్తాడని శిష్యుడికి చెప్పాడు అత్యంత  మిత్రుడొకడు సైన్యం లో సుబేదార్ .అతని భార్య అందాల సౌందర్య రాసి .ఆమె పిల్లను ప్రసవించి చని పోయింది ..స్నేహితునితో శ్మశానానికి వెళ్ళిన అనంతయ్య ఆ అందం భస్మం అవటం తో తీవ్ర వైరాగ్యం చెందాడు .

                                                         గురు అన్వేషణ

          1887 లో అంటే పదహారేళ్ళ వయసు లో ఇల్లు వదలి బెల్గాం చేరాడు .అక్కడ లల్లూభాయ్ గోవర్ధన దాస అనే ఉపదేశకుని తో పరిచయం కలిగింది ..ఆయన గుజరాతే వైశ్యుడు .ఈయన వద్ద యోగా వాశిష్టం మొద లైన వేదాంత గ్రంధాలు చది వారు .ఆయన అను మతి తో తీర్ధ యాత్రలు చేస్తూ  తిరుమల చేరి ,పుష్కరిణి లో స్నానం చేసి ,ప్రేష మంత్రం చెప్పుకొని ,శిఖా ,యజ్నోపవీతాలను తీసి వేశాడు .అక్కడే బుచ్చయ్య పంతులు దగ్గర ఉపనిషత్ భాష్యం అధ్యయనం చేశాడు .నాసిక్ వగైరాలు తిరిగి నాసిక్ చూసి హరిద్వారం వెళ్లి అమరేశా నందుల వద్ద సిద్ధాంత కౌముది ,వ్యాకరణ మహా భాష్యం నేర్చాడు .గురువు గారు అనంతయ్య లోని జ్ఞాన ప్రకాశాన్ని గుర్తించి ‘’ప్రకాశా నంద స్వామి ‘అనే   ఆశ్రమ నామం  పెట్టాడు .

                  ప్రకాశా నంద స్వామి ఋషీ కేశం వెళ్లి సుఖానంద స్వామి వద్ద హత యోగం నేర్చాడు .గుజరాత్ లోని నడియాద్ చేరి జానకి దాస వద్ద వ్రుత్తి ప్రభాకరం ,మొదలైన వాణ్ణి నేర్చారు .లల్లూభాయ్ ని తరచూ సేవిస్తూ పదిహేనేళ్ళు గడిపారు .అయన మరణం తరువాత మాధుకర వ్రుత్తి చేస్తూ దొరికిన దాన్ని తింటూ కాల క్షేపం చేశారు .ఎందరో శ్రీ మంతులు ఆశ్రమాలు నిర్మించి ఇస్తామన్నా ,ధనం కురి పిస్తామన్నా తిరస్కరించారు .స్మశానం .లేక పాడు బడ్డ దేవాలయమే ఆయన నివాసం .సర్వ సంగ పరిత్యాగి గా ఉంటూ వేలాది జనానికి జ్ఞాన భిక్ష పెట్టారు .ఒక చినిగిన బొంత ,ఒక మట్టి పిడత ,నల్లని దుస్తులు ఆయన ఆస్తులు .అందుకే జనం ఆయన్ను బొంత ముంత స్వామి (గోదాదియా స్వామి )అనే వారు .

                                                 +త్రికాలజ్నుని మహిమలు

      ఒక సారి భావ నగర కాలేజి సంస్కృత ప్రొఫెసర్ సందర్శించి నపుడు ‘’మీ ఇంటి నుంచి ఉత్తరం ఏదైనా వచ్చిందా /’’అని అడిగారు .రాలేదని చెప్పాడాయన ..అంతా కులాసానేనా / అని స్వామి అడిగితే అంతా క్షేమమే నని ఆయన చెప్పాడు .తాను రెండు రోజుల్లో ప్రొఫెసర్ గారి ఊరు నడియాద్ వెళ్తున్నానని ,వాల్లింటికీ వెళ్లి వస్తానని చెప్పారు .స్వామి అక్కడికి వెళ్ళే సరికి ప్రొఫెసర్ గారి ఆరు నెలల పసివాడు మసూచికం తో బాధ పడుతున్నాడు .’’శరీరం అశాశ్వతం .మొహం వద్దు ‘’అని ఆ పిల్లాడి తల్లికి చెప్పి రెండు రోజుల తర్వాతా వస్తానని చెప్పి స్వామి వెళ్లి పోయారు .మళ్ళీ వచ్చి చూస్తె పిల్లాడు చని పోయాడు .ఆస్వామి త్రికాల వేడి అని అందరు గుర్తించారు .ప్రొఫెసర్ గారికి ఒక శివ రాత్రి రోజున స్వామి తపస్సు లో ఉండగా నొసట త్రిశూలం కనిపించింది .ద్వారక లో విశ్వనాధ నందీశ్వారుల మందిరం దగ్గర గదిలో ఓంకారాన్ని స్వామి జపిస్తుంటే ఫాల భాగాన ఓంకారం దర్శన మిచ్చేది .

               స్వామి సర్వ మత సమభావం గా ఉండే వారు .స్వార్ధం వదిలి సమాజ సేవ చేయమని ధన వంతులకు నచ్చ జెప్పే వారు .ఒక సారి ‘’మొరబీ మహా రాజు ‘’కు ప్రాణా పాయ మైన జబ్బు చేసింది .స్వామి వచ్చి ఆశీర్వా దించారు .ఆరు మాసాలు మొరాబీ లో ఉంది రాజు జబ్బు తగ్గినా తర్వాతా వెళ్ళ బోతుంటే రాజు లక్ష రూపాయలు ఇచ్చి ధర్మ కార్యాలకు ఉపయోగించమని కోరాడు .దాన్ని తృణ ప్రాయం గా భావించి పంటలు నష్ట పోయి ప్రజలు బాధ పడుతున్నారని పన్నులు తీసేయ్య మని  కోరారు .వెంటనే 20 లక్షల ఆదాయం వచ్చే ఆ ఏడాది పన్నులను రైతులు ఇవ్వక్కర లేదని శాసనం చేశాడు రాజు .పిల్లలంటే మహా ఇష్టం తాతా (దాదా )అని ఆయన్ను పిలిచే వారు .గుజరాతు ,సౌరాష్ట్ర లలో అనేక మంది సాదు శాంతులను దర్శించి ,వేదాంత గోష్టి జరిపారు .అహ్మదా బాద్ సరయు దాస ,కచ్చ నివాసి నారాయణ దాస ,చరోతార్ వాసి జానకీ దాస ,పీతియా నివాసి నిత్యానంద స్వాములు మహా త్యాగ పురుషులు గా పేరు పొందారు .ఆ నలుగురి తో పాటు మన స్వామికీ ఎక్కడా ఆశ్రమాలు లేవు .

                   నిత్యా నదులు 24లక్షల గాయత్రి మంత్రం చేసిన ధన్యులు రాజ కోట దగ్గర బాణ గంగా నదీ తీరం లో నివాసం ఉంటున్నారు .ప్రకాశా నందులు వీరిని దర్శించి వేదాంత గోష్టి జరిపారు .ప్రకాశా నందుల సమక్షం లో నిత్యా నందులు 1934  లో శివైక్యం చెందారు .బ్రహ్మ విద్యా రహస్యాన్ని తెలియ జేసే ‘’వార్తా లాపం ‘’ను స్వామి గొప్ప గ్రంధం గా రాశారు . 1032 పేజీల బృహత్ గ్రంధం .1965 నాటికే ఎనిమిది ముద్రణలు పొంది విశేషం గా ఖ్యాతి పొందింది .వీరి శిష్యు రాలు ‘’శిరోహి రాజ మాత ‘’ఆంధ్రులకు కూడా స్వామి వారి అమృత వాణి చేరాలని

రాజ  మాండ్రిడ్రి  నుండి హిందీ ,తెలుగు ,సంస్కృతం తెలిసిన ఆంద్ర పండితుణ్ణి గుజ రాత్ కు రప్పించి నాలుగు నెలలు సకల సౌకర్యాలు కలుగ జేసి అనువాదం చేయించి ఆ బృహద్ గ్రంధాన్ని ప్రచురింప జేశారు .జిజ్ఞాసులకు ,ముక్షులకు ఉచితం గా ఆ గ్రంధాన్ని అంద జేశారు .స్వామి-అనంత గురు పరిచయం ,అపనో ధర్మ ,ధర్మ జ్యోతి ,సప్త శ్లోక గీత గుజరాతీ లో రాశారు ఆయన అముద్రిత సాహిత్యం చాలా ఉంది .స్వామి తెలుగు లిపి లోనే తెలుగు ,గుజరాతీ భాషలు రాసే వారట .అదీ వారి ప్రత్యేకత .వార్తాలాపం లో ఎన్నో వేదాంత విషయాలు సులభ బోధకం గా రాశారు .

        ప్రకాశానంద స్వామి నిత్యా నంద స్వామిని ‘’బుద్ధ భాగ వానుని ‘’తో పోల్చే వారు .నిత్యా నదులే ఒక సారి స్వహస్తాలతో ప్రకాశానాడ స్వామి కి పాద్యం ఇచ్చారు .అంతటి అన్యోన్యం వారిద్దరిది .ఇంత మంది శిష్యులుండగా మీకెందుకు ఈ శ్రమ అని అడిగితే ‘’శ్రీ కృష్ణుడికి రుక్మినే సపర్యలు చేసిందని ,దాసీలు కాదని చెప్పారు .ఒక సరి చేతి లో డబ్బు లు లేక గురు దర్శనానికి వెళ్ళ లేక గురువు గారినే వచ్చి కటాక్షించ మణి కోరి జాబు రాస్తే నిత్యా నందులు వైద్యుని తో సహా వెళ్లి ఆయనకు ఆరోగ్యం కలిగించారు . 
                                                     మహా ప్రస్తానం

    ఒక సారి స్వామి నారాయణ పరమ హంస ను చూడ టానికి వెళ్లారు ఆయనకు పంచ శిఖలున్డటం చేత గుర్తు పట్టలేదు ..మౌనం లో ఉన్న పరమ హంస గుర్తు పట్టి ‘’రెండు కర్ర లెందుకు ‘’/అని మౌనం గానే స్వామిని ప్రశ్నించారు .’’నాకు ఇంకా అద్వైత సిద్ధి కలగ లేదు ‘’అన్నారు .పరమ హంస ఆయన దగ్గరున్న రెండు కర్రల్లో ఒక దాన్ని తాను తీసేసు కొన్నారు .’’ఇప్పుడు అద్వైతం కుదిరిందా ?’’అని ప్రశ్నించారు .ఆ రోజు నుండి స్వామి ఒకే కర్ర తో ఉంటున్నారు .    ప్రకాశా నందులు ద్వారకలో దేహ త్యాగం చేయ నిర్ణయించి అక్కడికి చేరారు .అప్పటికి వారి వయస్సు 92.తనకు ఆతిధ్య మిచ్చిన గృహస్తు కొడుకుకు నామ కారణం చేయమని కోరితే తన పేరే పెట్టి ఆనంద్ ప్రకాష్ అని పిలుచు కొ మన్నారు .22-2-1962న జబ్బు చేసింది .అందరికి  వార్త వెళ్ళింది . కాషాయ వస్త్రాలు తెప్పించి కట్టుకొన్నారు .బాగై నట్లని పించి చాలా మంది వెళ్లి పోయారు .మధ్యాహ్నం స్వామి అందర్ని చూసి నవ్వా రు ..అందరు నవ్వారు .స్వామి చిటి క వేసి ‘’చలో ‘’అన్నారు .అప్పుడు సమయం మధ్యాహ్నం 12-20  ద్వారకా దీశుడైన కృష్ణ దేవాలయం లో కోటి రూపాయలకు పైన విలువ చేసే శ్రీ కృష్ణుని కిరీట ,కుండలాలు   హథా ట్టు గా జారి పడి  పోయాయి .అంతా ఏదో విప రీతం జరుగుతుంది అను కొన్నారు .  స్వామి ‘’చలో ‘’మన్నప్పుడే ఇది జరిగిందని తెలుసు కొన్నారు .అదే సమయం లో స్వామి అనంత వాయువుల్లో తమ శ్వాశ ను కలిపారు .వారు భౌతికం గా లేక పోయినా వారి సమాధి భక్త జనానికి జ్ఞాన ప్రకాశాన్ని నిరంతరం అందిస్తూనే ఉంది .

     ఎక్కడో పుట్టి ,ఎక్కడో పెరిగి ,ఎక్కడో ఆధ్యాత్మిక గురువులై ,ద్వారకలో సిద్ధి పొందిన స్వామి ఆశ్రమం లేకుండానే లక్షలాది మందికి జ్ఞాన బోధ చేసి అతి సాధారణం గా జీవించి మిగిలిన వారిలో తానూ ఒక్కరిగా మిగిలి పోయారు .

    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-6-12.—కాంప్—అమెరికా .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.