సిద్ధ యోగి పుంగవులు –19 ఆంద్ర యోగినీ సామ్రాజ్ఞి –తరి గొండ వేంగ మాంబ

 సిద్ధ యోగి పుంగవులు –19

                                                  ఆంద్ర యోగినీ సామ్రాజ్ఞి –తరి గొండ వేంగ మాంబ

           బ్రహ్మా ను భావం పొందటం తో పాటు అనేక కృతులను రచించిన రచయిత్రి గా తరిగొండ వేంగ మాంబ యోగినుల్లో మహా యోగిని అయింది .

        చిత్తూరు జిల్లా వాయల్పాడు కు రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్న తరిగొండ –శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం .కర్నూలు జిల్లా కా నా ల నుండి ఈమె వంశీకులు ఇక్కడికి వచ్చి స్తిర పడ్డారు .కానాల క్రిష్నయ్య ,మంగమ్మ దంపతులకు 1750లో శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ వల్ల వేంగ మాంబ జన్మించింది .స్వామి పేరే పెట్టారు .కన్న వారితో పాటు పూజ లో పాల్గొనేది .ఈడు తో పాటు భక్తీ పెరిగింది .పరవశించి పాడుతూ నామ సంకీర్తన చేసేది .తగిన భర్త కోసం వెతుకు తుంటే లౌకిక వివాహం వద్దన్నా ఆమెను ఇంజేటి తిమ్మయ్య కొడుకు వెంకటా చల పతి తో వివాహం జరిపించారు .అయినా ఆమె భక్తీ సాధన మాన లేదు .శోభన గృహం లో భర్తకు తన శరీరం ,మనసు వెంకటేశునికే అంకితం కనుక శరీర సుఖం కోర వద్దని చెప్పింది .అతడు స్వగ్రామం వెళ్లి పోయాడు .మనో వేదన తో  చనిపో యాడు . ఆమె లో మార్పు లేదు .సంఘాన్ని ఎదిర్చి నిల బడింది .రూపావతారం సుబ్రహ్మణ్య శాస్త్రి ని బ్రహ్మోప దేశం చేయ మని కోరింది .

      ఆయన అంగీకరించి సోమేశ్వర స్వామి సన్నిధి లో వేదాంతం బోధించాడు .గురువును త్రిమూర్తి స్వరూపుడి గా కొలిచింది .మంట్రో పదేశం చేసి వేద శాస్త్ర రహస్యాలూ నేర్పాడు .తీవ్ర సాధన చేసి జ్ఞానాన్ని పరి పక్వం చేసుకొన్నది .తరిగొండకు వచ్చి ,నరసింహ దేవాలయం లో విగ్రహం చాటున యోగ సమాధి లో ఉండేది ..ఇది ఎవరికి తెలీదు .ఇంటికి వచ్చి భక్తీ కవితా రచనలు చేసేది .అందులో మొదటిది ‘’తరిగొండ లక్ష్మీ నృసింహ శతకం ‘’.అది ఆస్వా మికే అంకిత మిచ్చింది ..శివ విలాస యక్ష గానాన్ని రాయ చోటి వీర భాద్రస్వామికి అంకితం చేసింది .ఆమె ను అందరు ఎగతాలి చేసే వారు .యోగం తో పాటు కవిత్వమూ పరి పక్వ మైంది .’’రాజ యోగామృత సారం ‘’అనే తాత్విక ద్విపద కావ్యం రాసి ,నరసింహ స్వామికి ,బాల కృష్ణ నాటక మనే యక్ష గానాన్ని వాసుదేవ పరబ్రహ్మకు అంకిత మిచ్చింది .

      వేంగ మాంబ వైరాగ్యం బ్రాహ్మణులకు నచ్చ లేదు .ఆమెకు వైధవ్యం కల్పించాలని ,తల గోరగాలని ఆంక్ష పెట్టారు .మంగలి వచ్చి నిలబడితే పులిని చూసి నట్లు భయ పడి  పారి పోయాడు .మిగతా వారు పరుగు లంకిన్చుకొన్నారు ..పుష్పగిరి పీతాది పతి విద్యా నృసింహ స్వామి దేవాలయం లో విడిది చేసి వెంగమ్మను రమ్మని కబురు చేశారు .ఆమెను చూడరాదని తేర కట్టించారు .ఆమె ను తల గోరిగించు కొ మన్నారు .ఆమె పరపురుశుడైన మంగలిని తాను తాకటం ధర్మమా అనీ ,కేశాలు తీయిస్తే ,పాతి వ్రత్యం నిలుస్తుందని యే శాస్త్రం లో ఉందొ చెప్పమని సవాలు చేసింది .ఆమె సమాధానాలు స్వాములకు కోపం తెప్పించాయి .తమకు ఎందుకు నమస్కరించ లేదో చెప్ప మన్నారు .సింహాసనం దిగి పక్కకు వస్తే నమస్కరిస్తాను అంది .ఆమె చెప్పినదానిలో ఏదో రహస్యం ఉందని భావించి తేర తీయించి ,సింహాసనం దిగి పక్కన నిల బడ్డారు .ఆమె లక్ష్మీ నృసింహ స్వామిని ధ్యానిస్తూ రెండు చేతులు జోడించి నమస్కరించింది .వెంటనే సింహాసనం భగ్గున మండి  పోయింది .స్వాములు వెంగమ్మ ప్రహ్లాదుని అవతారం అని ప్రకటించి ,బ్రాహ్మణులను మందలించి వెళ్లి పోయారు .ఆమె మూలంగా తమ జీవితం అవమానాల పాలైందని ఇంటి నుండి తరిమేశారు .

                  మళ్ళీ ఆలయం చేరి తపస్సు తీవ్రం చేసింది .ఆంజనేయ స్వామి సన్నిధిలో తీవ్ర మగ్న అయింది .ఒక సారి వెంకటేశ్వరస్వామి ప్రత్యక్ష మై తిరుమలకు రమ్మని కోరారు .తిరుమల చేరి భక్తీ తో ఆవేశం తో స్వామిని స్తుతించింది .ఆ నాటి మహానటు ఆమె కు తూర్పు మాడ వీధి లో ఒక పూరిల్లు నివాసానికి ఏర్పరచి పాక శాల నుండి వకుల మాలిక పేరు తో సంబారాలు పంపించే వాడు .ఆమె స్వయం పాకం చేసుకొని ,వెంకన్న కు నివేదించి తినేది .ఆమె భక్తిని గుర్తించి అన్నమాచార్యుల వారి వంశీయులు ఉత్తర మాడ వీధి లో తమ ఇంటి ప్రక్కమిద్దె  ఇల్లు ఇచ్చారు .అక్కడ తులసి వనం  పెంచి మాలలు కట్టి  స్వామికి కైంకర్యం చేసేది .’’రమా పరిణయం ‘’అనే ద్విపద కావ్యం పెళ్లి పాట గా రాసి నది .ఇలా చేయటం అక్కా రామయ్య దీక్షితులు అనే పోరుగాయనకు ఇష్టం లేదు .ఆమె ధ్యానం లో ఉండగా ఎంగిలి విస్తళ్ళు ఆమె పై విసిరేశాడు .’’నీ వంశం నిర్వీర్యమవుతుంది ‘’అని శపించింది .చాలా మంది పుట్టి చని పోయారు .బుద్ధి వచ్చి ఆమె కాళ్ళ మీద పడితే ఇక నుంచి నీ కుటుంబం లో ఒక్కడే ఒక్కడు పుడతాడని శాపాన్ని మరల్చింది .

            స్వామి మందిరానికి ఉత్తరాన తుంబురు కోన లో తపస్సుచేసింది   .బ్రహ్మ చర్యం ,ప్రాణాయామం తపస్సు చేసే వారే అక్కడ ఉండ గల రమణీయ ప్రదేశం అది .అ సమయం లోనే ‘’చెంచు నాటకం ‘’యక్షగానం రాసింది .ఈమెను వెదికి వేసారి ఇక్కడ చూసి మళ్ళీ ఇంటికి తీసుకు వెళ్లారు .పూల తోట వేసింది .బావి తవ్వ్వ్వితే నీళ్ళు పద లేదు .బావి లోకి దిగి గంగను కీర్తించింది .పుష్కలంగా నీరు పడింది .వెంకటేశ్వర స్వామికి రోజు ఏకాంత సేవలో ‘’కర్పూర హారతి ‘’ఆమె ఇవ్వటం అల వాటు .ఇది పూజారులకు నచ్చక ఈసడించుకొనే వారు .గుడికి వెళ్లి హారతి ఇవ్వ కుండా ఇంట్లోనే ఇచ్చేది .ఒక రధోత్సవం రోజు రధం వచ్చి వెంగమ్మ ఇంటి ముందు ఆగి పోయింది .ఎంత లాగినా కదలలేదు .అర్చకులు వెంగమ్మను క్షమా భిక్ష వేడారు .ఆమెను హారతి ఇవ్వమన్నారు .ఆమె హారతి ఇవ్వ గానే రధం కదిలింది  .అదే ఇప్పుడు ‘’తరి గొండ వారి ముత్యాల హారతి ‘’అయింది .

     ఆమెకు నరసింహస్వామికి వెంకన్నకు భేదం లేదు .నృసింహ ఉత్సవాలు ప్రతి ఏటా జరి పేది .అన్నదానం నిర్వ హించేది .అనేకులు భూరి విరాళాలు ఇచ్చే వారు .ఎనిమిది మంది వ్రాయస గాల్ల ను పెట్టు కొని ‘’ద్విపద భాగవతం ‘’రచింది .వేంకటాచల మహాత్మ్యాన్ని చంపూ కావ్యం గా రాసింది .18 వ శతాబ్ద ఉత్తర భాగం 19 వ శాతాబ్ద పూర్వ భాగం ఆమె దివ్య సారస్వతాది దేవత గా వెలుగొందింది .3-8-1817 న ఆ ఆధ్యాత్మ తేజో రాసి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదార విన్దాల్లో ఒక పూ రేకు అయి పోయింది .ఆమె రోజు ధ్యాన సమాధి లో కూర్చునే చోట సమాధి నిర్మించారు .దాని మద్య తులసి వనం ,మండపం కట్టారు .సమాధికి ఎదురుగా నేరేడు చెట్టు కింద గూటి లో ఆంజనేయ స్వామి ని ప్రతిష్టించారు .అన్నమయ్య ,హాదీరాం బాబా ,వెంగమాంబ తిరుమలేశుని తో అభేదం గా జీవించిన పుణ్య మూర్తులు .

                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-6-12.—కాంప్—అమెరికా .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.