సిద్ధ యోగి పుంగవులు –20(చివరి భాగం )
అపర పతంజలి యోగి- మాస్టర్ సి.వి.వి.
క్రీ.పూ.మూడవ శతాబ్ది లో పతంజలి మహర్షి రాసిన యోగసూత్రాలను ,ఆధునిక జగత్తుకు అను కూలం గా మార్చి ,మేడం బ్లావస్కీ సిద్ధాంతాలను జోడించి ‘’భ్రుక్త రహిత తారక రాజ యోగం ‘’పేరు తో తయారు చేసిన వారు మాస్టర్ సి.వి.వి.అని మంత్ర నామాన్ని పొందిన కంచు పాటి వెంకట వేంకా స్వామి రావు గారు .
విజయ నగర సామ్రాజ్య కాలం లో ఆంద్ర దేశంనుంచి అరవ దేశానికి ఎన్నో కుటుంబాలు వలస పోయాయి .అందులో కుంభకోణం దగ్గర అమ్మార్ సత్రం అనే ఊరిలో 19 శతాబ్దం లో వెళ్ళిన కామమ్మ ,కుప్పు స్వామి దంపతులు ఉన్నారు .ఆయనకు సుబ్బమ్మ ,ధర్మంబ అనే ఇద్దరు తోబుట్టువులు .సుబ్బమ్మకు కుంభ కోణం మునసబు ,భూస్వామి అయిన కంచు పాటి ధర్మా రావు కొడుకు వెంకట్రావు కు ,ధర్మంబ ను తన బావ మరది కి ఇచ్చి వివాహం చేశాడు .రంగా రావు భార్య అమ్మణమ్మ మహా పతి వ్రత .కోడలు సుబ్బమ్మ ను కన్న కూతురు లాగా చూసింది .సుబ్బమ్మ కు అన్నా ,వదినలంటే ప్రాణం .కామమ్మ కు కుంభకోణం లో4-8-1868 న మన మాస్టర్ జన్మించారు .వేంకా స్వామి అని పేరు పెట్టారు .రంగా రావు దేశాంతరం పోయి తిరిగి రాలేదు .సంసార బాధ్యత కొడుకు మీద పడింది.వేంకా స్వామి తలిదండ్రుల వద్ద పెరిగాడు .కుప్పు స్వామి వేంకా స్వామికి ఉపనయానం చేశాడు .వెంకట్రావు చని పోయాడు .సుబ్బమ్మ కు సంతానం లేదు .ఆమెకు ఈ పిల్లాణ్ణి దత్తత ఇచ్చారు కామమ్మ ,కుప్పు స్వామి దంపతులు ..కనుక అతను ఇప్పుడు కంచు పాటి దత్త తండ్రి వెంకట్రావు వేంకా స్వామి తాత పేరు రావు కలిసి కంచుపాటి వెంకట వేంకా స్వామి రావు అయాడు .ఆయనే సి.వి.వి .
సుబ్బమ్మ శ్రీ మంతురాలు .మగ దిక్కు లేనిది .కనుక దగ్గరుంటే మంచిదని కుప్పు స్వామి దంపతులు కుంభకోణం కాపురం మార్చి చెల్లెలి ఇంటికి దగ్గర ఇంట్లో ఉన్నాడు .వేంకా స్వామి వీధి బడిలో తెలుగు ,తమిళం ,సంస్కృతం ఇంట్లో సుబ్బమ్మ వద్ద సంస్కృతం నేర్చాడు .వెంకట్రావు చెల్లెలి కూతురు రుక్మినమ్మనిచ్చి వేంకా స్వామికి పెళ్లి చేశారు .ఆయన పద్నాలుగో ఏట మెట్రిక్ లో మొదటి వాడుగా పాస్ అయాడు .శ్రీ రంగం లో చేరాడు .శ్రీరంగం ,పుదుక్కోట జమీందార్ల పిల్లలు సహాధ్యాయు లైనారు .ఇంటర్ అయింది డిగ్రీకి మద్రాస పంపటం తల్లికి ఇష్టం లేనందున ఇంటి వద్దే ఆధ్యాత్మిక గ్రంధాలు చదివాడు .
యోగ ప్రవేశం
అప్పుడు మెడ్రాస్ లో దివ్య జ్ఞాన మహా సభలు జరిగాయి .మిత్రులతో కలిసి వెంకాస్వామి వెళ్లాడు .ఎందరెందరో మహాను భావులు వచ్చారు .మేడం బ్లావేస్కీ తో పరిచయం అయింది .ఆమె తో కలిసి యోగ సాధన చేశారు .నిష్ఠ కుదిరింది .స్వామి మునిసి పాలిటి అధ్యక్షు లైనారు .యోగం లో బ్లావ్స్కీ దర్శన మిచ్చే వారు .రైల్వే కాంట్రాక్టులు తీసుకొని నష్ట పోయి ఆస్తి అమ్మేయాల్సి వచ్చింది .భార్య మర నిం చింది .మద్దూరు వారమ్మా యి వెంకమ్మను ద్వితీయం చేసుకొన్నారు .పురోహితుని స్వామి నిజం గా నే అరుంధతీ నక్షత్రం చూపించారు .కొత్త భార్య ఆయన యోగ సిద్ధికి ,ఉన్నతికి బాగా సహకరించింది .బ్ల్లవస్కీ యే వెంకమ్మ గా జన్మించిందని భావిస్తారు .
స్తూల ,సూక్ష్మ శర్రీఅరాలపై వ్యూహాలపై ఆది పత్యం సాధించారు .ఆయ ప్రజ్ఞా భావం ముందు గా భార్య మీద పడింది .ఆమె ప్రజ్ఞను వదిలించి ఆమెతో వివిధ కోశాలలోని విజ్ఞాన విషయాలను పలికించి రాయించారు .1908లో వచ్చిన హేలీస్ తోక చుక్క ను తన శరీరం లోకి ఆవాహన చేసుకొన్నారు .దానితో శక్తి విపరీతం గా చేరింది .సృష్టి క్రమం తెలుసు కొన్నారు .జన్మించటానికిముందు మనుషులు అణు రూపం లో పురుషుని లో ప్రవేశించి .వ్యాపించి మూడు నెలల తర్వాతా స్త్రీ గర్భం లో ప్రవేశిస్తారు .స్వామి గారు తనలో జరుగు తున్న అన్దోత్పత్తిని స్తూల ప్రజ్ఞా చెదనీకుండా ,సూక్ష్మ రూపాన్ని వేరు చేసి నవగ్రహాల ప్రభావం తగల కుండా ఆ అండాన్ని వెంకమ్మ గారి గర్భం లో ప్రవేశ పెట్టారు .ప్రతి రోజు ప్రార్ధన సమయం లో ఆమె స్తూల శరీరంనుండి శూక్ష్మ శరీరాన్ని వేరు చేస్తూ ,ఆమె గర్భం లోని పిండానికి కుండలినీ ప్రభావం తో శక్తిని అందించే వారు .తొమ్మిది నెలల తర్వాతా 13-4-1909 న బ్రహ్మ స్వరూపు డైన కొడుకు పుట్టాడు .అతనికి ‘’చందు ‘’అని పేరు పెట్టారు .
చందు భిన్నం గా ప్రవర్తించాడు .ఒక నేలకే మాట లోచ్చాయి .ఇంటికి వచ్చే వారి భూత భవిష్యత్తు లను చెప్పే వాడు .నాస్తికుడై జందాలు తెమ్పుకొన్న తాత కుప్పు స్వామిని నాలుగు నెలల చందు జందెం వేసి సంధ్యా వందనం చేయించాడు .పదో నెలలో తండ్రికి M.T.A.అనే కొత్త మంత్రాని నేర్పి వారానికొక కొత్త మంత్రాన్ని నేర్పించాడు .లోకానికి కొత్త వెలుగు ప్రసాదించమని చెప్పి చని పోయాడు .అతన్ని స్వామి24 సార్లు బ్రతి కించారు .బంధువును ఒకావిడను మీడియం చేసి ప్రాణ ధార తెప్పించి బ్రతికించారు .కాని చందు తను భూమి మీద ఉంటె సృష్టి ఆగి పోతుందని తండ్రికి నచ్చ చెప్పి చని పోయాడు .
ఈ రకమైన సాధన ద్వారా తనను పిలిచినా వారికందరికీ అందు బాటు లో ఉండే సి.వి.వి.మంత్రం 29-5-1910 న నేర్పారు .ముందు కుటుంబ సభ్యుఅలకు నేర్పి పరీక్షించి తరువాత మిగిలిన వారికి అందించారు .అప్పటినుండే మాస్టర్ సి.వి.వి.గా ప్రసిద్దు లయ్యారు .
మహిమ ల ప్రదర్శన
ఒక సారి మాస్టర్ గారు ముక్కు లోని ఒక రంధ్రం ద్వారా ఆరు గంటలు నిర్వి రామంగా గాలి పీల్చి ,రెండో రంధ్రం ద్వారా ఆరు గంటల సేపు వదిలారు .మరో ఆరు గంటలు ఉచ్చ్వాస ,నిస్స్వాసాలు లేకుండా ఉన్నారు .వారి శరీరం దూది లాగా తేలికై గాలిలో తేలింది తన మనుమడు మట్టి బొమ్మ తిని చని పోతే సమాధి స్తితి లో ఉండి ప్రాణ సప్ప్లై చేసి బ్రతికించారు .ఆయన్ను దత్తత తీసుకొన్న సుబ్బమ్మ గారు ఏటి లో స్నానం చేసి ఒడ్డుకు వచ్చి కళ్ళు తిరిగి పడి పోతేమూడు రోజులు ఆమెను చూస్తూ ఉండమని ఊరికి వెళ్లి ,అక్కడినుంచే ఆమెను బ్రతికించారు
మనుష్యులను ట్రాన్స్ లోకి పంపి విషయాలను సేకరించే వారు .గ్రహ మండలాలలో ప్రవేశించి అనుభూతులను గ్రంధస్తం చేశారు .చంద్ర మండలం విస్తరించి పది మైళ్ళు వెనక్కి వేడు తుందని చెప్పారు .ఆరు నెలల తర్వాత సైంటిస్టులు నిజమే నని రుజువు చేశారు .భూమి వంకర గా ఉందని అందుకని సూర్యుని వెలుగు చంద్రుని పై సరిగ్గా పడటం లేదని అందుకే కృష్ణ పక్షం వస్తోందని ,వంకర పోతే ఎప్పుడూ పౌర్ణమి నాటి చంద్రుడే కని పిస్తాడని చెప్పారు .ఖగోళ శాస్త్ర వేత్తల పరిశోధన లో భూమి రెండు వందల మైళ్ళు వంకరగా ఉన్నట్లు తేలింది .అంతటి సూక్ష్మ పరిశీలన మాస్టారు గారిది .
భ్రుక్త రహిత తారక రాజ యోగం
మాస్టర్ గారు స్థాపించిన కొత్త యోగా పద్ధతిని భ్రుక్త రహిత తారక రాజ యోగం అంటారు భ్రుక్తం అంటే పూర్వకర్మ .రహితం అంటే లేకుండా చేయటం ..అంటే తమ దగ్గరకు వచ్చి శరణు కోరితే పూర్వకర్మలన్నీ పోయి తరిస్తారు .అని అర్ధం .ఆయన్ను తలిస్తే చాలు అన్నీ ఆయనే చూసుకొంటా రనే నమ్మకం .మాస్టారు గారి శిష్య పరం పరలో ఎక్కి రాజు కృష్ణ మాచార్యులు వేటూరి ప్రభాకర శాస్త్రి మొదలైనప్రముఖులు ఎందరో ఉన్నారు మాస్టారు గారు 12-5-1922న శరీరాన్ని వదిలేశారు .కొడుకు అంత్య క్రియలు నిర్వహించ గా అకాల వర్షాల వల్ల వారి చితా భస్మం అంతా కావేరి నది నీటి లో కొట్టుకు పోయి ఏమీ మిగల లేదు .22-5-1922 న అంటే పది రోజుల తర్వాతా మాస్టారు గారి సూక్ష్మ శరీరం భార్య వెంకమ్మ కు దర్శన మైంది .
సమాప్తం –
అంకితం ‘’–సిద్ధ యోగి పుంగవులు’’ అనే శీర్షికతో రాసిన ఈ ఇరవై వ్యాసాలూ నాకు అత్యంత ఆప్తులు ,ఆత్మీయులు ,స్నేహితులు ,సాహిత్యాభి లాషి ,భారతీయతను జీర్ణించుకొని ,మన సంప్రదాయం సంస్కృతి భాష లనుఅమితం గా ఆదరిస్తూ మన పురాణ గ్రంధాలను వేద వేదాంగాలను మధిస్తూ అమెరికా లో ఉన్నా భారతీయ విధానాన్ని అనుసరిస్తూ ,గౌరవిస్తున్న సంస్కారి మంచి పుస్తక ప్రియులు ,నిరంతర చదువరి , మా ఉయ్యూరు వాసి, ప్రస్తుతం అమెరికా లో అలబామా లోని హన్త్స్ విల్లీ నివాసి -శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి అత్యంత ఆత్మీయం గా అంకిత మిస్తున్నాను ..
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-6-12.-కాంప్ –అమెరికా
durga prasad garu yogipungavula gurinchi chakkati viseshaalu andinchaaru. ee vyaasaalanu grandhastham cheste baaguntundani naa abhi praayam
Sri Dugraprasad garu Master CVV gari gurinchi klupthamga chakkati vyasaanni andicharu. dhanyavadamulu