అమెరికా డైరీ మైనేని వారి వారం –1

  అమెరికా డైరీ   మైనేని వారి వారం –1
ప్రయాణానికి నేపధ్యం 
 

కిందటి వారం అంటే  25-6-12 సోమ వారం నుండి 1-7-12 ఆది వారం వరకు జరిగిన విషయాలు అమిత ఆశ్చర్యాన్ని ,అమిత ఆనందాన్ని కల్గించాయి ..మంగళ వారం సాయంత్రం మా అమ్మాయి విజ్జి  పక్క ఇంటి రవి  గారు స్వంత పని మీద అలబామా లోని మాంట్ గోమారి కి కార్ లో వెళ్తున్నారని ,మైనేని వారుండే హన్త్స్ విల్ దానికి దగ్గర్లోనే ఉంటుందని ,ఆయన ఊర్లో ఉంటె ఆరోగ్యం గా ఉండి ఇబ్బంది లేక పోతే అక్కడికి వెళ్ళచ్చు అని చెప్పింది .వెంటనే గోపాల కృష్ణ గారికి ఫోన్ చేశాను .ఆయన ఇంట్లో లేరు .కాసేపటి తర్వాత ఆయనే ఫోన్ చేశారు .విషయమ్  చెప్పాను .అంత కంటే ఆనంద కారక  మైంది లేదని మాంట్ గోమారి కి వస్తే హన్త్స్ విల్ కు తీసుకొచ్చే బాధ్యత తనదే నని చెప్పారు .అప్పుడు రవి గారి తో చెప్పాను .అలానే వేల్దామన్నారు .గురువారం సా యంత్రం అయిదు గంటలకు బయల్దేరి ,రాత్రి పద కొండు గంటలకు మాంట్ గోమారి వెళ్తామని ,మర్నాడు ఉదయం మైనేని వారు నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళే ఏర్పాటు చేసి ,మళ్ళీ ఆదివారం ఉదయానికి లేక శని వారం రాత్రికి  నన్ను మాంట్ గోమారి కి చేరిస్తే చాలని ,ఆ మధ్యాహ్నం బయల్దేరి శార్లేట్ కు రాత్రికి రావచ్చు అని చెప్పారు .ఈ సంగతి గోపాల కృష్ణ గారికి ఫోన్ చేసి చెప్పాను .ఆయన వెంటనే బస్ డిపో  వారితో మాట్లాడి శుక్రవారం తెల్ల వారుజ్హామున అయిదింటి బస్ కు మాంట్  గోమారి నుంచి హన్త్స్ విల్ కు  ,శని వారం రాత్రి ఆరున్నరకు హన్త్స్ విల్ నుండి మాంట్ గోమారికి టికెట్స్ రిసేర్వ్ చేసి నట్లు ఫోన్ చేసి చెప్పారు .రెండే రెండు రోజుల లో నిర్ణయ మైన ప్రయాణం ఇది .ఎందుకో ఆయన్ను చూడాలని మనసు లో అని పించినా అంత దూ రం వెల్ల లేని విషయమే నాకు .ఆ కోరిక ఇలా తీరింది .ప్రభావతి ,మా అమ్మాయి  చాలా సంతోషించారు .ఇదీ ఈ ప్రయాణానికి నే పద్యం .ఇదంతా మా అమ్మాయి విజ్జి ఆలోచనే .ఫలించింది .

ప్రయాణం – గోప్లక్రిష్ణ గారితో -ఫొటోస్
 అలవోక గా అలబామా
నేను రాస్తున్న ”సిద్ధ యోగి పుంగవులు ”ఇరవై ఎపి సోడ్లతో పూర్తీ చేయాలని పించింది .అందుకే రోజుకు మూడు చొప్పున రాసి బుధ వారానికే ఇరవై పూర్తీ చేసి ఈ వ్యాస పరంపర ను మైనేని గోపాల కృష్ణగారికి”అన్కితమిచ్చాను .మూడు రోజులు ఊర్లో ఉండను కనుక అంతా పూర్తీ చేయాలనే సంకల్పం తో నిద్ర కూడా పట్ట లేదు .అయిన తర్వాత ”హమ్మయ్య ”ఆ కొన్నాను .గురు వారం సామాను సర్దుకొని రెడి గా ఉన్నాను .సాయంత్రం అయిదు కే భోజనం చేసి సిద్ధ మయ్యాను .దారిలో తిన టానికి టాగ టానికి విజ్జి బిస్కట్లు ,మంచి నీళ్ళు ,జ్యూసులు ఇచ్చింది .భక్తికి సంబంధించిన కొన్ని సి.డి.లు ,శ్రీ ఆంజనేయ స్వామి చిన్న ఫోటో తీసుకొన్నాను .ఐదున్నరకు రవి గారి కారు లో బయల్దేరాం .పటేల్ బ్రదర్స్ లో కూరలు కొన్నారు రవి .మళ్ళీ ఆరున్నరకు అక్కడి నుండి బయ లు దేరాం .చాలా ఎక్స్పర్ట్ డ్రైవర్ రవి .చాలా హాయిగా స్పీడ్ గా నడిపిస్తూ రెండు గంటల తర్వాతా సౌత్ కరోలినా లో ప్రవేశించాం .అక్కడ ఒక పెద్ద”సవాన్నా  నది” ఉంది .అక్కడ నాకు కాఫీ ని మాక్దోనాల్ద్ లో ఇప్పించారు .స్ప్రైట్ కూడా తాగించారు .రెస్ట్ రూమ్స్ కు వెళ్లి మళ్ళీ బయల్దేరాం .ఒక గంట తర్వాతా జార్జియా రాష్ట్ర ప్రవేశం చేశాం .దీని రాజ దాని అట్లాంటా .ఇక్కడ కొన్నేళ్ళ క్రితం ఒలిం పిక్స్  జరిగాయి .అప్పుడు నగరాన్ని సర్వాంగ సుందరం గా తయారు చేశారు .పదహారు లైన్ల ఎక్స్ప్రెస్ రోడ్ నిర్మించారు .జిమ్మీ కార్టర్ ఇక్కడి వాడే .అట్లాంటా నగరమే వంద మైళ్ళ పొడవుంటుంది అంటే 150కి.మీ.దాటటానికి గంటన్నర పడుతుంది .ఎక్స్ప్రెస్ లైన్ లో గంటకు వంద మైళ్ళ స్పీడ్ తో కారు నడపాలి అంటే నూట యాభై కిలో మీటర్ల వేగం .మిగతా చోట్ల ఎనభై మైళ్లకు అంటే నూట ఇరవై కి.మీ.తగ్గ కుండా ప్రయాణం చేయాలి .అలానే రవి కార్ నడి  పారు .అట్లాంటా లో విమానాల రన్వే రోడ్ల మీదకే ఉంటుంది .బ్రిడ్జిల కింద కార్లు ప్రయాణిస్తుంటే పైన రన్ వే మీద విమానాలు ఎగరటం దిగటం ఆశ్చర్యం గా ఉంటుంది .అంత వేదలపిన బ్రిడ్జిలు రెండున్నాయి .
అట్లాంటా దాటితే అలబామా రాష్ట్రం లో ప్రవేశిస్తాం .ఇక్కడ ఆబర్న్ యుని వేర్సిటి కి మంచి పేరు .ఇక్కడే కియా అనే మోటారు కార్లు తయారు చేసే సంస్థ ఉంది .హ్యుండై వారి కర్మాగారాము ఉంది .ఇంకో కార్ల ఫాకే టరి కూడా ఉంది .ఇవి చూసుకుంటూ ,రాత్రి పదకొండు గంటలు అంటే అలబామా కాల ప్రకారంమాంట్ గోమారి  చేరాం .శార్లేట్ కాలమానం ప్రకారం రాత్రి పన్నెండున్నర.ఇక్కడి కంటే అక్కడి టీం ఒక గంట వెనక .రవి స్నేహితుడు సత్య వాల్ల ఇంటి కి తీసుకొని వెళ్లాడు .అక్కడ రాత్రి బస .మంచి నీళ్ళు తాగి పడుకొన్నాను .
శుక్ర వారం ఉదయం నాలుగు గంటలకే సిద్ధం అయి రవి నన్ను బస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లి ”గ్రే హౌండ్స్ ”అనే బస్ సర్వీస్ నడిపే బస్ ఎక్కించారు పస పోర్ట్ ఉండాలి .అది అరగంట లేటు గా బయల్దేరి ,ఏడు గంటలకు బర్మింగ్ హాం చేరింది .అక్కడ సామాను తో దిగి మళ్ళీ బస్ ఎక్కాలి .అలానే ఎక్కి కూర్చున్నాను .గ్రే హౌండ్స్ అంటే సన్నగా ఉండే ”వేట కుక్క జాతి” .బాగా వేగం గా పరుగెడు తుంది .అందుకని ఆ పేరు .బస్ మీద దాని బొమ్మ కూడా ముద్రించి ఉంటుంది .దీన్ని ప్రభుత్వం దాదాపు డెబ్భై ఏళ్ళు గా నడుపు తోంది .మన ఆర్.టి.సి.లాంటిది సౌకర్యం గా ఉంటుంది .ఎనిమిడి న్నర  కు బస్ బయల్దేరింది .డౌన్ టౌన్ మీదు గా ప్రయాణం చేసి ఉదయం తొమ్మిదిన్నరకు హన్త్స్ విల్ చేరింది .దారిలో ”తెన్నిసి నది ”కనించింది .ప్రముఖ నాటక కర్త తెన్నిసి విలియమ్స్ గుర్తుకొచ్చాడు .ఇది చాలా సార వంత మైన రాష్ట్రం .జార్జియా ,అలబామా లు తెల్ల బంగారం అన బడే ”ప్రత్తి పంట ”కు కేంద్రం .మన బొంబాయిని బర్మింగ్ హాం ఆఫ్ డి ఈస్స్ట్ ”అనటం గుర్తుకొచ్చింది .మైనేని వారు నన్ను రిసీవ్ చేసుకొని కార్ లో ఇంటికి తీసుకొని వెళ్లారు .ఎంతో ఆప్యాయత చూపించారు దంపతులు గోపాల కృష్ణ ,స త్య వతి గార్లు .
మంచి కుటుంబం
గోపాల కృష్ణ గారు ఆరడుగుల అంద”గారు” .పచ్చని శరీరం .కోటేరు తీరిన ముక్కు .సంస్కారం శరీరం అంతా నిండిన  వారు .ఆప్యాయత కు ,ఆత్మీయత కు పెట్టు .స్నేహానికి అర్రులు చాచే స్వభావం .నిరంతర అధ్యయన శీలి .ప్రపంచ సాహిత్యాన్ని పుడిసిలి పట్టారు .భారతీయ సాహిత్యం అంటే యేన లేని మక్కువ .ఇక్కడి లైబ్రరి లో అత్యున్నత హోదా లో పని చేసి రిటైర్ అయారు .ఇంకా చాలా సంవత్స రాలు చేయచ్చు .కాని సంతృప్తి తో  విరమణ చేశారు .భార్య సత్య వతి గారు సాధ్వి .ఆయనకు నిజమైన అర్ధాంగి .అంతా తానే అయి ఇల్లు దిద్దు కొంటారు .ఆయన వ్యాసంగానికి అడ్డు పడరు చాలా సాధారణ చీర జాకెట్ తో సామాన్య గృహిణి లా ఉంటారు .న్యాయం గా అలా ఉండాల్సిన ఆవ సరం లేదు .కాని ఆవిడకు అదే ఇష్టం ”స్వయం సిద్ధ”అని పిస్తారు .వాళ్ళున్న ఇంటిని ”రాంచ్ హౌస్ ”అంటారు .వెనక విశాల మైన దొడ్డి వుంటుంది .దానిలో అన్ని రకాల కూర గాయల్ని స్వయం గా పెంచి పండిస్తారు .అందరికి ఉచితం గా అందిస్తారు .నాలు గెల్ల క్రితం మాకు డెట్రాయట్ కూడా పంపారు .ఆమెకు గోపాల కృష్ణ గారే సర్వస్వం .వీరి పెద్దబ్బాయి కృష్ణ ఇక్కడి స్పేస్ సెంటర్ లో ఫిసిక్స్ లో రిసెర్చ్ పెర్సన్ .ఎన్నో కొత్త విషయాలను కనీ పెట్టారు .ఒక సారి ఉయ్య్యురు వచ్చి నప్పుడు కంప్యుటర్ ను లైబ్రరి కి అందించిన ఉదారుడు .తండ్రికి తగ్గ కుమారుడు .ఇండియా వచ్చి నప్పుడు నేను చూశా .అతని భార్య రమ .ఫార్మసి లో ఉద్యోగం .వీరి కుటుంబం ఇక్కడే అయిదు మైళ్ళ దూరం లో ఉంటుంది .ఇతని ఆడపిల్లలు శ్రేయ ,సనారా.పెద్దబ్బాయి రవి .”బన్యన్ ట్రీ”అనే ఫైనాన్స్ సంస్థకు అది నేత .స్వయం కృషి తో వ్యాపా ర ,వాణిజ్య రంగాలలో ఎదిగిన వాడు .భార్య కవిత డాక్టర్ .వీరికి ఒక అబ్బాయి ,ఇద్దరమ్మాయిలు .పిల్లలకు తలి దండ్రుల ఆత్మీయత ను పంచటం లో ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు .తండ్రి మాట జవ దాటని కొడుకులు .వారి దారికి అడ్డం రాని తండ్రి .వారి అభి వృద్ధే ధ్యేయం గా జీవిస్తున్న సంతృప్తి ఉన్న కుటుంబం .అందుకే ”మంచి కుటుంబం ”అన్నాను .
నేను స్నానం చేసి న తర్వాతా ఇడ్లి ,దోసె చట్నీ సాంబారు లతో టిఫిన్ పెట్టారు .తిన్నాను గోపాల కృష్ణ గారితో .కాఫీ బాగా ఉంది .గోపాల కృష్ణ గారి కార్ లో బయల్దేరి ఊరంతా కొంత చూపించారు .
అమెరికా లో ఆకునూరు

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.


ఉక్కు కాకాని అని పిలువ బడే స్వర్గీయ కాకాని వెంకట రత్నం గారిది ఉయ్యురు రు దగ్గర ఆకునూరు గ్రామం .అక్కడికాకాని బ్రహ్మేశ్వర రావు గారి కుమారులు ప్రసాద్ ,బాబూ రావు లు దాదాపు ముప్ఫై ఏళ్ళ పై నుండి ఇక్కడ స్తిర పడ్డారు .బ్రహ్మేశ్వర రావు గారితో నాకు మంచి పరిచయం ఉంది .ఆయన ఆజాను బాహువు .తెల్లని ఖద్దరు అంచు పంచలు లాల్చీ తో ఉండే వారు .దబ్బ పండు మై ఛాయ .చాలా ఆప్యాయం గా పలక రించే వారు .ఒక సారి ప్రసాద్ గారు ఆకునూరు వచ్చి నప్పుడు అతన్ని నాకు పరిచయం చేశారు అప్పుడు భార్య ,ఇద్దరు పిల్లల్ని చూసిన  జ్ఞాపకం .ఆ తర్వాత ప్రసాద్ ఇండియా వచ్చి నప్పుడు నేను కానీ పిస్తే పలకరించే వారు .అడిజ్ఞాపకం .బ్రహ్మేశ్వర రావు గారు ఈ మధ్యనే 98 ఏళ్ళ వయసు లో పరమ పదించారు .వెంకట రత్నం గారికి కజిన్ అని గుర్తు . వప్రసాద్ తండ్రి కార్య క్ర  మాలకు ఇండియా వెళ్లి వచ్చారు .వాళ్ళిద్దర్నీ కలుద్దామని మైనేని వారి ఆరాటం .
కాకాని బాబూ రావు గారు బిజినెస్ మాగ్నెట్ .ఎంతో సంపాదించారు .ఎన్నో సంస్థలకు అది నేత .”ఇండియా హౌస్ ”అనే విశాల మైన స్థలం లో బిల్డింగ్ కట్టి ఎన్నో చెట్లుపెంచి  కూరలు పండిస్తున్నారు పెద్ద ఆశ్రమం లా ఉంది ..దాన్ని చూశాం.అక్కడి నుండి బాబూ రావు గారి ఇంటికి వెళ్ళాం .ఆయన చాలా ఆప్యాయం గా మాట్లాడారు .ఆయన భార్య కృష్ణ కుమారి గారు గొప్ప డాక్టర్ .ఇక్కడ ఎంతో మందికి పురుళ్ళు పోసిన పుణ్య మూర్తి గా గోపాల కృష్ణ గారు చెప్పారు .ఎన్నో సంఘాలకు ఆమె ప్రతినిధి ,వైద్యం లో మంచి పేరు ఆమెకు .మేము వెళ్లి నప్పుడు ఇంట్లో లేరు
   సామాజిక సేవ లో ధన్య మైన వనిత
కాకాని ప్రసాద్ పేరు మోసిన వైద్యులు .చాలా కాలం వైద్య రంగం లో ఉంది ఇంకా డబ్బు చాలు అని అని పించి స్వచ్చందం గా విశ్రాంతి తీసుకొంటున్నారు .భార్య శ్రీ మతి భావాని గారు ప్రసాద్ గారు మమ్మల్ని ఆదరం గా ఆహ్వా నించారు .ఆమె గొప్ప సాంఘిక సేవా కర్త .ఎన్నో మంచి పనులు చేస్తూ హన్త్స్ విల్ కు గుండె కాయగా నిలిచి మన్నన పొందు తున్నారు .మన సరసభారతి అన్న దమ్ములిద్దరికి మైనేని వారి వల్ల బాగా తెలుసు .ఉయ్యూరు ఊసులు చదివి ఆనందించారు .తమ చిన్న  తనం అంతా జ్ఞాపకం వచ్చిందన్నారు .నా రాక వారికి ఆనందం కల్గిందని చెప్పారు .భవాని గారు చాలా ఆప్యాయం గా పలకరించారు .భారతీయ ధర్మ మైన సేవ ను ఆచరించి చూపిస్తున్నారు .ఒక రకం గా కాకాని వెంకట రత్నం సేవా నిరతి ఇక్కడ ప్రతి ఫలించిందని పించింది .అందుకే” అమెరికా లో ఆకునూరు” అన్నాను .
హెలెన్ కెల్లర్ జన్మ స్థల సందర్శనం
ఇంటికి వచ్చే సరికి రెండు అయింది .భోజనం లో పప్పు చిక్కుడు కాయ కూర ,వంకాయ కూర స్క్వాష్ పచ్చడి ఆవకాయ ,సాంబారు జిలేబి పులిహోర పాయసం తో సత్య వతి గారు భోజనం వడ్డించారు ,కూరలన్నీ దొడ్లో పండినవే .చాలా రుచి కరం గా చేశారు .కాసేపు విశ్రమించన తర్వాతా ద్రోణ వల్లి రామ మోహన రావు గారు వచ్చారు .ఆయన ఇక్కడి ”నార్త్ అలబామా తెలుగు అసోసియేషన్ ”అధ్యక్షులు .చాలా బోళా గా నిర్మోహ మాటం గా  మాట్లాడు తారు .అన్నీ తెలిసిన వారు .రాజకీయాలను కాచి వడ బోశారు .”దేశ భాష లందు తెలుగు లెస్స ”అనే పుస్తకాన్ని సంకలీకరించారు .తెలుగు ను గురించి ఎవరు ఏయే భావాలు పద్యాల్లో వచన కవిత ల్లో చెప్పారో అవన్నీ క్రోడీకరించి పుస్తకం గా తయారు చేశారు .కాసేపు మాట్లాడి వెళ్లారు .ఆయన సమక్షం లో బాల మురళి పాడిన ”శివా నంద లహరి ”మొదలైన సి.డి .లు అందజేశాను గోపాల కృష్ణ దంపతులకు .
ఆ తర్వాత గోపాల కృష్ణ గారి పెద్దబ్బాయి కృష్ణ పిల్లల తో వచ్చారు .గోపాల కృష్ణ గారు నేను అతని కార్ లో బయల్దేరి గంటన్నర ప్రయాణం చేసి మస్కామ్బియా అనే ప్రదేశం చేరాం .అదే హెలెన్ కెల్లర్ పుట్టి న ఊరు .ఆమె జన్మించిన భవనాన్ని ప్రభుత్వం స్మృతి చిహ్నం గా చేసింది .ఆమె పెరిగిన వాతా వరణం అంతా చూశాము .దీనికి టికెట్ ఉంది .ఆ తర్వాతా హెలెన్ జీవిత చరిత్ర ను ”గిబ్బన్ ”రాసిన నాటకం ఆధారం గా ఒక నాటకాన్ని ప్రదర్శించారు .చాలా బాగా అందరు చేశారు .ఆరు బయట గాలరీ ముందు ప్రదర్శన .నూట ఆరు డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రత .చెమటలు కక్కుతూ విసురు కొంటూ జనం చూశారు .నిండి పోయారు .ఆమె పై అంతటి అభి మానం .మేము ముందుగా పులిహోర ,ద్రాక్ష పళ్ళు డ్రింక్స్ లాన్ లో కూర్చొని తిన్నాం ఎనిమిది నుంచి పది గంటల దాకా నాటకం .మధ్య లో పావు గంట విరామం .హెలెన్ జీవితం పై ”పాకెట్ ఎడిషన్ ”కొని నాకు ఇచ్చారు గోపాల కృష్ణ గారు .ఒక గొప్ప ప్రదేశాన్ని గొప్ప ఆవిడ చరిత్రను కను లారా చూసే మహా భాగ్యం కలిగింది అని మహా సంతృప్తి చెందాం .బయల్దేరి ఇంటికి వచ్చే సరికి రాత్రి పదకొండున్నర .మేము వచ్చే సరికి సత్య వతి గారు మజ్జిగ చేసి అందులో కరివే పాకు అల్లం కలిపి రెడి చేశారు .చెరో రెండు గ్లాసులు తాగి పడుకోన్నాం.ఆ రోజు రాత్రి మంచి నిద్ర పట్టి బడలిక పోయింది .ఇంత ప్రయాణం లో నిద్ర లేమి లోను నేను చాలా ఫ్రెష్ గా కనీ పిస్తున్నానని మైనేని వారు చాలా సార్లు అనడం వారి విశాల దృక్పధానికి తార్కాణ ,
షార్లేట్  నుంచి  హంట్స్ విల్ కు  600 మైళ్ళు .అంటే 900 కి.మీ.మాంట్గోమారి నుండి హన్త్స్ విల్ కు రాను ,పోను బస్ చార్జి  250 డాలర్లు .మాంట్ గోమారి లోనే బానిసల తిరుగు బాటు ఉద్యమం ఊపందుకొంది .ఇతర చోట్లకు పాకింది .అక్క డె మార్టిన్ లూధర్ కింగ్ ఎక్స్ప్రెస్ వే ”ఉంది .ప్రత్తి పంట,గోధుమ జొన్నపంటలకు అలబామా ప్రసిద్ధి .పరిశ్రమలు కూడా .హన్త్స్ విల్ రాకెట్ కేంద్రం .రాకెట్లను స్పేష్ షిప్ లను ఇక్కడే తయారు చేసి ఫ్లారిడా లోని మియామి అనే అట్లాంటిక్ సముద్ర తీరం నుండి ప్రయోగిస్తారు .మిగిలిన విషయాలు మళ్ళీ తెలియ జేస్తాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-7-12.–కాంప్—అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

3 Responses to అమెరికా డైరీ మైనేని వారి వారం –1

  1. kvsv అంటున్నారు:

    ..కొన్ని ఫొటోలను ఉంచాల్సిందండీ….రెగ్యులర్గా మీ బ్లాగ్ చూస్తాను నేను… ఏమీ మిస్ కాకుండా చదువుతా….మంచి విషయాలు…బావున్నాయి…

  2. kvsv అంటున్నారు:

    దుర్గా ప్రసాద్ గారూ…మనం ఎంజాయ్ చేసిన క్షణాలు ఇతరులతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది….మీరు చెప్పే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయ్…థాంక్సండీ….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.