ఆమె రికా డైరీ -మైనేని వారి వారం -02 సరస భారతికి నాటా సన్మానం

    ఆమె రికా డైరీ -మైనేని వారి వారం -02
                                             సరస భారతికి నాటా సన్మానం
            జూన్ ముప్ఫై  వ తేది శని వారం –ఉదయమే నిద్ర లేచి ,పనులు పూర్తి చేసుకొని కాఫీ త్రాగి ,కార్ లో నన్ను మైనేని గారు వారి అబ్బాయి కృష్ణ ఇంటికి తీసుకొని వెళ్ళారు .అప్పటికే అక్కడికి ద్రోణ వల్లి రామ మోహన రావు గారు వచ్చి ఉన్నారు .కాసేపు మాట్లాడు  కొన్న తర్వాత మైనేని గారు రామ  మోహన రావు గారితో నాకు శాలువా కప్పించి ,వారి తొ జ్ఞాపికను అంద జేశారు .వారు ప్రచురించిన ”దేశ భాష లందు తెలుగు లెస్స ”పుస్తకాన్ని ,వారి అమ్మాయి అనుపమ స్పాన్సర్ చేసి,,వెలువ రించిన సి.డి.లను అంద జేశారు .ఇది నేను ఉయ్యూరు లో చేస్తున్న సరస భారతి సేవలకు అభి నందన అని అన్నారు .నేను కృతజ్ఞతలు చెప్పి ఈ సత్కారం ”సరసభారతి ”కి అమెరికా లో జరిగిన విలువైన సన్మానం అన్నాను .వారి సంస్థ నార్త్ అలబామా తెలుగు అసోసియేషన్ (నాటా ) కు కృతజ్ఞత తెలియ జేశాను .ఎప్పుడో ఎనిమిది నెలల క్రితం ఫోన్ లో గోపాల కృష్ణ గారు మాట్లాడుతూ ”మీరు ఈ సారి అమెరికా వస్తే మీకు సన్మానం   చేయాలని మేమందరం అనుకుంటున్నాము ”అన్న మాట ఈ రోజూ అనుకోకుండా ఇలా  నెర వేరి నందుకు ఇక్కడి సభ్యు లందరికి కృతజ్నతలు అంద  జేశాను .ఇది నాకు తానా ,ఆటా ,నాటా లు చేసి నంత ఘన సన్మానం గా భావిస్తున్నానని ,సరస భారతి కి ఇంతటి ఆదరణ లభించటం ,అందులోను” అట్లాంటా లో నాటా సభలు” జరుగు తున్న సమయం లో ఈ సత్కారం అతి విలు వైనది గా భావిస్తున్నానని తెలియ జేశాను .ఊహించని రాక ,ఊహించని గౌరవం అని విన్న వించాను .కృష్ణ భార్య బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ చట్నీలు ,దోసె కాఫీ అందరికి అందించారు .కబుర్లు చెప్పు కుంటు అందరం హాయిగా లాగించే శాం .రామ మోహన రావు గారి అమ్మాయి ఇక్కడ  డాక్టర్ .ఆమే ఇక్కడి లైబ్రరి లో ‘తెలుగు విభాగం ”ఏర్పరచి పుస్తకాలను అందించి భాషా సేవ చేస్తున్నారు .ఇందరు తెలుగు భాషా ,సంస్కృతులకు చేస్తున్న సేవ ఎంతో ఆనందాన్ని కల్గించింది .
                                            తొలి ఏకాదశి న విష్ణు దర్శనం
        అక్కడి నుండి నన్ను గోపాల కృష్ణ గారు కార్ లో ఒక అరగంట ప్రయాణం చేసి ”శ్రీ విష్ణు దేవాలయం ”కు తీసుకొని వెళ్ళారు .అది ఒక దేవాలయ సమూహం .అందరు దేవుళ్ళు కొలువైన విలు వైన ఆలయం ..ఆ రోజూ తొలి ఏకాదశి కూడా .స్వామి దర్శనం దివ్య దర్శనం గా ఉంది .ఎక్కడో పుణ్యం మూట కట్టుకోన్నామేమో ,ఈ అదృష్టం దక్కింది .-కాదు దక్కించారు మిత్రులు గోపాల కృష్ణ గారు .గుడి లో ఉండ గానే ఆయనకు మా అబ్బాయి రమణ ఉయ్యూరు నుండి  ఫోన్ చేశాడు .
                                           హన్ట్స్ విల్ మహర్షి
           మైనేని వారి స్నేహితులెందరో ఉత్త ములున్నారు .అందులో ఒకరు జిం అబార్ క్రోమ్బి అనే అమెరికన్ .ఆయనకు సువిశాల వ్యవ సాయ క్షేత్రం ఉంది .ట్రాక్టర్ మెకానిక్ .స్టోర్స్ ఉంది .అక్కడికి తీసుకొని వెళ్లి నన్ను ఆయనకు పరి చాయం చేశారు .ఆయన ఎంతో ఆత్మీయం గా కౌగలించుకొని స్వాగతం చెప్పారు .ఆయనకు భారతీయ భావనలు ,ఆధ్యాత్మిక జీవనం చాలా అభి మానం అని చే ప్పా రు .యుద్ధం లో పని చేసి ఇప్పుడీ స్వంత కార్య క్రమం లో ఉన్నారు .ఎవరు ఏ సమయం లో ఫోన్ చేసినా ,అక్కడ వాళి ట్రాక్టర్ రిపేర్ చేసి వచ్చే సౌమ్యుడాయన .ఫోటోలు తీసు కొన్నాం .వారి కూరగాయల తోట చూ శాం .ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళందరూ ఒక కాలనీ ఏర్పాటు చేసుకొని ”ఇంగ్లీష్ విలేజ్ ”అని పేరు పెట్టు కొన్నారు .అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళారు గోపాల్ గారు .అక్కడి వీధుల పేర్లు కూడా ఇంగ్లాండ్ కు సంబంధించినవే .అందులో ఒక పేరు ఇంగ్లాండ్ రాజ్యాంగం హక్కుల చట్టం అన బడే ”మాగన కార్టా ”ఆయన్ని ఇక్కడ అందరు ”పాల్ అని గోపాల్ ”అని అంటారు ..అక్కడ ”లారీ”అనే ఆయన ను నాకు పరిచయం చేశారు .వ్యాపారి .స్కేటింగ్ దియేటర్ ఉంది .ఇంకా వ్యాపారాలు  చాలా ఉన్నాయి.ప్రేమ గా పలకరించి ఫోటోలు తెసుకొన్నారు .ఏదైనా ఫంక్షన్ లు వస్తే ఆయన కు ఫోన్ చేస్తే చాలట .నిమిషాలలో అన్నీ ఏర్పాటు చేస్తారట .కృష్ణ కు మంచి స్నేహితుడు కూడా లారీ ..వీరి”కౌన్సెలింగ్”సంఘానికి లారీ ముఖ్య బాధ్యత లో ఉన్నారు .
        

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

      గోపాల కృష్ణ గారు చాలా ఉదారులు ,సౌమ్యులు ,,స్నేహ శీలి ,ఆపద్బాన్ధవులు .వ్యసనాలకు బానిస లైన వారి నేన్దరికో కౌన్సెలింగ్ ఇచ్చి వాటిని మాన్పించే ప్రయత్నం చేస్తున్నారు .వారందరూ వాటిని వదిలి మళ్ళీ జన జీవన స్రవంతి లో కలిసి జీవితాలను బాగు చేసుకొని మళ్ళీ కుటుంబాలకు దగ్గరవు తున్నారు .వారంతా మైనేని వారిని ఒక ”మహర్షి ”గా భావించటం ఆయనకు లభించిన అరుదైన గౌరవం .ఆప్యాయత ,ఆడరనీయత ప్రేమ ,సమాజం మంచి గా ఉండాలనే తపన దానికి తాను చేయ వలసిన కృషిని నిత్య కృత్యం గా భావించి చేయటం ఆయనకు ఒక విధి విధానం ,వ్యక్తీ సంస్కరణ కోసం ఆరాట పడతారు .అలానే చేస్తున్నారు .ఆయన కు ఇలాంటి పని లోనే విశ్రాంతి .నేను వారింటికి వచ్చిన శుక్ర వారం రాత్రి ఒక సమావేశం లో గోపాల కృష్ణ గారు వ్యసనాల నుండి బయట పడి ఇరవై ఏళ్ళ కు పైగా హాయిగా జీవిస్తున్న ”ప్రాడిగల్ సన్ ”లాంటి ఆయనకు సన్మానం చేసి ,మెడల్ బహూక రిన్చాఉ .నిజం గా ఆ కార్య క్రమం  గోపాల కృష్ణ గారి చేతుల మీదు గా జర గాలి .కాని నా కోసం దాన్ని ”లారీ ”గారికి ఆ బాధ్యత ను అప్పగించి మాతో కలిసి హెలెన్ కెల్లర్ జన్మ స్థలానికి వచ్చారు ..అదీ గోపాల్ గారి స్నేహం .అందుకే అందరు ఆయన కోసం అర్రులు చాస్తారు .చిన్న వాళ్ళల్లో చిన్న వారు గా ,పెద్దల్లో పెద్దగా సమాజ సేవలో ముందుగా ,వితరణ లో గుప్తం గా ,జ్ఞాన వృద్ధుల లో అగ్రేసరు లుగా ,సాహితీ ప్రియులకు మార్గ దర్శి గా ,ఆధ్యాత్మిక జీవులకు ఆదర్శం గా ఉంటారు .ఎన్ని గుప్త దానాలు చేస్తారో తెలియదు .ఎవరికి చెప్పారు .తన పేరు కోసం ప్రాకు లాడరు .మంచి జరగాలనే ఆరాటమే ఎప్పుడు .జీవితం లో దెబ్బ తిన్నా వారెందరికో వెన్నెముక  గా నిలిచి ధైర్యం చెప్పి ,హార్ధికం గా ,ఆర్ధికం గా సాయం చేసి వాళ్ల జీవితాలలో వెలుగులు నింపు తున్న పుణ్య పురుషులు మైనేని గోపాల కృష్ణ  గారు .లేక పోతే జన్మ భూమి మీద అభిమానం తో నలభై ఏళ్ళ క్రితం వది లేసిన స్వగ్రామం ఉయ్యూరు ను గుర్తు పెట్టు కోని అక్కడ లైబ్రరి కి భూరి విరాళాన్ని అంద జేసి దాన్నిదక్షిణ భారాత దేశం లోనే మొదటి  ఏ.సి.లైబ్రరి గా తీర్చి దిద్ది ,విలువైన పుస్త్సకాలను పంపించి ,,ఆవిష్కరణ రోజున అమెరికా నుండి వచ్చి దగ్గరుండి చూసుకొని ఆనందాన్ని అనుభవించారు .ఆ నిర్మాణం లో నన్నూ కన్వీనర్ ను చేసి బాధ్యత అప్పా గించారుఆనాటి జడ్పిటిసి ,ఈనాటి ఎంఎల్సి రాజేంద్ర ప్రసాద్ . .అప్పుడే అంటే ఎనిమిదేళ్ళ క్రితం వారిని ఉయ్యుర్లో మొదటి సారి చూడటం .అప్పటి నుండి కొద్దో గొప్పో ఫోన్ లో పలకరించు కొంటున్నా ,2008 లో మూడవ సారి అమెరికా కు వచ్చి నప్పుడు బందం బాగా పెరిగింది .ఫోన్లు మెయిల్ లో పలకరింపులే అయినా చాలా దగ్గరయారు మా కుటుంబానికి .మా ఇంట్లో అందరికి ఆయన తెలుసు .అంత ఫామిలీ ఫ్రెండ్ గా ఆదర్శం గా ఉన్నారు .ఇన్ని సుగునాలున్డటం వల్లే వారు నాకు ”హన్ట్స్ విల్ మహర్షి ”అని పించారు
                                             నాసా స్పేస్  సెంటర్
         హన్ట్స్ విల్ ను ”రాకెట్ నగరం ”అంటారు .ఇక్కడే మొదట అమెరికా రాకెట్లు తయారు చేశారు .దీనికి ముఖ్యుడు జర్మని కి చెందిన హిట్లర్ కు నమ్మిన బంటు అయిన” వాన్ బ్రూన్”  అనే శాస్త్ర వేత్త .అతన్ని అమెరికా కు పిలి పించి అన్ని సౌకర్యాలు కలిపించి రాకెట్ లను తయారు చేయించారు .ఎక్స్పోలరార్ వంటి ని ఇక్కడే తయారు చేశారు .ఎన్నోఅంత రిక్షా నౌకలకు రూప కల్పన జారి గింది ఇక్కడే .వాన్ మేధో జనితమే ఈకేంద్రం .అతను ”అమెరికా రాకెట్ పితామహుడు ”.స్నేహితులను చూసిన తరువాత  గోపాల కృష్ణ గారు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు .ఎక్సి బిషన్ చూశాం .గ్రావిటీ ఫోర్స్ మెషీన్ మీద పైకి వెళ్లి కిందికి దింపే దానిలో కూర్చుని అనుభవం పొందాం .అలాగే సెంట్రి ఫూగల్ మెషీన్ ఎక్కి బి.పీ..బరువు పెరిగే దాన్ని అనుభూతి పొందాం.అన్ని వివరం గా నాకు తెలియ జెప్పారు .అక్కడే పూర్వకాలం ఏనుగుల కు ముందు ”మామధ్ ”లనేభారీ శరీరం ఉన్న  ఏనుగుల వంటి వి ఉండేవి .వాటి మ్యుజియం చూశాం .అవి ఎప్పుడో అంత రించి పోయాయి .ఏదైనా చాలా బారీ గా ఉంటె ”మామధ్ సైజ్ ”అంటాం . అక్కడ స్టార్ బక్స్ లో” వన్ బై టు”కాఫీ త్రాగాం .మా మన వళ్ళు ముగ్గురికి ఆరోనాట్ బొమ్మ ఉన్న షర్ట్స్ టోపీ లు గిఫ్ట్ గా కొన్నారుగోపాల్ గారు ..ఇంటికి చేరే సరికి రెండు అయింది .భోజనం చేశాం .స్వీటు  బెండకాయ కూర ,పప్పు ,దోస చట్ని ,కాకర కూర సాంబారు ,అన్నం ,పెరుగు లతో మంచి భోజనం చేశాం .కాసేపు విశ్రాంతి తీసుకొన్నాం .
                    మధ్యాహ్నం మూడున్నరకు లేచి దంపతులతో వారి ఇంటి వెనక పెరటి తోట చూషాను ను .అన్ని రకాల కూరగ్యాలు ,ఆకు కూరలు కుండీలలో పెంచు తున్నారు .సార వంత మైన నేల కనుక బాగా కాస్తున్నాయి. సత్య వతి గారి పెంపకమే ఇది .ఎరువులు వెయ్యరు .అన్నీ నాచురల్ గా ఉండాలని  వారి ఆరాటం వాషింగ్ మెషీన్ ఉన్నా బట్టలు స్వయం గా ఉతికి దొడ్లో దణ్ణాల మీద ఆరేస్తారు .కుట్టు పని ,అల్లకం వచ్చు లాన్ ను స్వంతంగా మెషిన్ తో కట్ చేస్తారు .వర్షపు నీటిని వృధా పోకుండాపెద్ద కుండీలో నిల్వ చేసి  మొక్కలకు ఉపయోగిస్తారు ..తాను ఊరికి వెడితే గోపాల్ గారు కష్ట పడకుండా పదార్ధాలు చేసి ఫ్రీజ్ చేసి దాస్తారు ఫ్రిజ్ లో .ఆయన కష్టపడటం ఆవిడకు ఇష్టం ఉండదు .వారిద్దరూ” జీవికా జీవులు” గా ఉంటారు .అదీ వారి ప్రత్యే కత . .నాకు ఆయాన ఆరు విలువైన పుస్తకాలు బహూక రించారు .కరివేపాకు మొక్క ఇచ్చారు మా అమ్మాయికి .బూంది ఫలహారం చేసి కాఫీ తాగి ప్రయాణానికి సిద్ధమయాం .కృష్ణ కుటుంబం కూడా వచ్చింది .అందరం గ్రూప్ ఫోటో లు తీసుకొన్నాం .సాయంత్రం అయిదింటికి బయల్దేరి నన్ను బస్ స్టేషన్ లో దింపారు .బస్ ముప్పావు గంట లేటు .అప్పటి దాకా ఉండి ,వీడ్కోలు చెప్పి ఇంటికి వెళ్ళారు .
         నిన్నటి నుంచి మండు వేసవి లో 105 డిగ్రీల వేడి లో నన్ను వెంటేసుకనిక్క్షణం తీరిక లేకుండా తిప్పారు .నిన్న నేను బస్ దిగ గానే చూస్తె ”పచ్చగా డబ్బా పండు ఛాయా తో ముఖం వెలిగి పోయింది ”కాని ఇవాళ చూస్తె ”నల్ల బడి కమిలి పోయింది ‘.78 ఏళ్ళ ఈ వయసు లో స్నేహితులంటే అంత తాపత్రయం .నేను వారింట్లో నుంచి బయల్దేరే టప్పుడు వారి భార్య గారితో ”గోపాల కృష్ణ గారి ఆరోగ్యం నేను వెళ్ళిన తర్వాత దెబ్బ తింటే అది నా తప్పు .మెరుగ్గా ఉంటె అది ఆయన గొప్ప తనం ”అని అన్నాను .ఇద్దరు నవ్వారు .ఆయన లెక్క ప్రకారం నేను రావటం వల్ల ఆయన ఎనర్జీ లెవెల్ బాగా పెరి గిందని చెప్పారు .పెరక్క  పోయినా ఫర్లేదు కాని తరక్కుండా ఉంటె చాలు .బస్ బయల్దేరే ముందు నేను ఊహించని భారీ  కానుక ను నా చేతులో పెట్టి సరస భారతికి దాన్ని ఉప యోగించమని మంచి మనసు తో చెప్పిన త్యాగ మూర్తి గోపాల కృష్ణ గారు . సరస భారతి అంత ఒప్పగా ప్రాచుర్యం పొంది జన హృదయాలను కదిలిస్తున్నందుకు ఆనందం గా ఉందీ .
              ఇవన్నీ నేమరేసుకొంటు బస్ ఎక్కాను .అది రాత్రి తొమ్మిదింటికి బర్మింగ్హాం చేరింది .అక్కడ తొమ్మిదిన్నరకు బయల్దేరి రాత్రి పదకొండు కు మాంట్ గోమారి చేరింది .రవి గారు  వచ్చి నన్ను సత్యా వాళ్ల ఇంటికి తీసుకొని వెళ్ళారు .అక్కడ భోజనం ఏర్పాటు చేసారు .నేను ద్రాక్ష పళ్ళు తిని పడుకొన్నాను నిద్ర పట్ట లేదు .
                                               తిరుగు ప్రయాణం
    జూలై ఒకటి ఆదివారం -ఉదయాన్నే లేచాం .సత్యభార్య జయంతి దోసెలు చేసింది .తిని కాఫీ తాగాం వాళ్ల దొడ్లో అరటి మొక్కలున్నాయి .కూరలు మల్లెలు బాగా ఉన్నాయి  ఆమె ఉయ్యూరు లో కోట శ్రీ రామ గారింట్లో పుట్టిందట .అనుకోకుండా అలబామా లో ఉయ్యూరు వాళ్ళు ఇంకొరు  దొరికారు .వాళ్ల నాన్న ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ..కోట వారిన్త్లొఅద్దె కున్నారట .అసలు గుడి వాడ .పుట్టింటి వారి ఇంటి పేరు గూటాల .
రవి గారి కార్ లో పదిన్నరకు హాన్స్ విల్ లో ఉన్న ఆయన గ్యాస్ స్టేషన్ ,గ్రోసరీ షాప్ కు చేరాం .దీన్ని జీవన్ ,రమేష్ అనే ఇద్దరు చూస్తుంటారు . .ఇద్దరు కుర్రాళ్ళే .రమేష్ వంట చేశాడు బెండ కాయ కూర కాకర కాయ పులుసు మ్దొండ కాయ కూర .అన్నం లో పసుపు జాపత్రి వంటివి వేసి కిచిడి చేశాడు ,పెరుగు తో తిన్నాం .జీవన్ పదేళ్ళ నుంచి రవి దగ్గర పని చేస్తున్న నమ్మ కస్తుడు .ఇద్దరు షాప్ లోనే నివాసం .వంటా ,పడక అంతా అక్కడే .ఏడాదికో రెండేళ్ళకో ఇండియా వెళ్లి వస్తారు .జీతాలు బానే ఇస్తారు రవి .నిజామాబాద్ కు చెందిన రెడ్ల కుర్రాళ్ళు ..మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు కార్ లో బయల్దేరాం ఇంటికి .రెండు గంటల్లో అట్లాంటా టైం ప్రకారం సాయంత్రం అయిదుకు చేరాం .అక్కడ ”శరవణ భవన్ ”లో మషాలా దోష తిని కాఫీ త్రాగం .బానే ఉన్నాయి .అక్కడి నుండి బంగారు నగల షాప్  కు వెళ్లాం .రవి భార్య గాయత్రి కోసం బంగారు గొలుసు కొన్నారు .ఆరవ తేది ఆమె పుట్టిన రోజూ కానుక గా .ఆయన తో పాటు నాకూ గిఫ్ట్ గా వినాయకుని విగ్రహాన్ని ఇచ్చారు షాప్ వాళ్ళు .అక్కడినుంచి ”చెరియన్ ”అనే భారీ గ్రోసరీ లో కూరలు సరుకులు రవి  కొనుక్కొన్నారు .చెరుకు రసం త్రాగాం ఫ్లారిడా లో చెరుకు పండుతుంది కూరలు కూడా అక్కడి నుంచే వస్తాయి .చాలా చవక ..పెద్ద గ్లాసుల్లో ఇంటికి పిల్లలకు తీసుకొన్నాం .రాత్రి ఏడున్నరకు బయల్దేరి పదకొండు గంటలకు షార్లెట్ లో ఇంటికి చేరాం..దారిలో వర్షం పడింది .మజ్జిగ తాగి పడుకొన్నాను .
            ప్రయాణం లో పద నిసలు –బర్మింగ్హాం అలబామా రాష్ట్రం లో పెద్ద నగరం .ఇనుము ,ఉక్కు పరిశ్రమకు పెద్ద పేరు .బొగ్గు విస్తారం గా లభించే ప్రాంతం .వాణిజ్య కేంద్రం .అలబామా రాష్ట్ర రాజ  దాని మాంట్  గోమారి .సముద్రం దగ్గరే .నాలుగైదు బీచెస్ ఉన్నాయి .మార్టిన్ లూధర్ కింగ్ ఇక్కడ చర్చి బోధకుడు గాఉండే వాడు .  .అతను జన్మించింది జార్జియా రాష్ట్రం లోని అట్లాన్తానే ..అలబామా కు ”కాటన్ స్టేట్ ”అని పేరు .పత్తి బాగా పండే రాష్ట్రం .దాని కోసమే బానిసలను తెచ్చి తెల్ల వాళ్ళు వాళ్ల తో వ్యవ సాయం చేయించే వారు .బానిసల తిరుగు బాటు కూడా ఇక్కడే ప్రారంభ మైంది .దక్షిణ రాష్ట్రం అలబామా .సివిల్ వార్ కూ కేంద్రమే .ఈ రాష్ట్ర పక్షి ”ఎల్లో hammer బర్డ్ ;;ఆ పేరు తోను రాష్ట్రాన్ని పిలుస్తారు సౌత్ ఈస్ట్ లో అంటే అమెరికా ఆగ్నేయ భాగాన అలబామా ఉంది .నార్త్ ఈస్ట్ లో అంటే ఈశాన్య భాగం లో ఫ్లారిడా ఉంది .ఈ రెండిటిని చూశాను .ఫ్లారిడా ను మొదటి సారి అమెరికా కు టెక్సాస్ లోని హూస్టన్ కు వచ్చి నప్పుడు అంటే పదేళ్ళ క్రితం అల్లుడు అవధాని గ్రాడ్యుయేషన్ కు నోవా యూనివెర్సిటి లో జరిగి నప్పుడు   అందరం వెళ్లి మయామి బీచ్ వగైరాలు చూశాం..ఇలా మొదలై అలబామా పర్యటన రవిగారు , మైనేని గార్ల సౌజన్యం తో అనుకోకుండా అలవోకగా ఆనందం గా జరిగింది .నిరుడు జూన్ లో మా బావ మరిది ఆనంద్ కుటుంబం తో కాశీ రామేశ్వరాలు  చూస్తె ఈ జూన్ లో ”అలబెమా ”చూశాను ఇక్కడ అలానే పిలుస్తారు ..ఇదో ప్రపంచం .ఎక్కువ ఆఫ్రికన్ ఇండియన్స్ ఉన్న దక్షిణ రాష్ట్రాలివి .భాష లో యాస ఎక్కువ .ప్రభుత్వం వీరికోసం చాలా సహాయం చేస్తోంది .ఇప్పుడే నాగరక జీవితం సాగిస్తూ అబ్యుదయం చెందుతూ అన్నిపదవులను నిర్వహిస్తూ వారి జాతికి గర్వ కారణం గా నిలు  స్తున్నారు .
                   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ —3 -07 -12 —కాంప్ –అమెరికా

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.