తిక్కన భారతం -2

        తిక్కన   భారతం -2

భారతాన్ని పరబ్రహ్మ రూపం గా భావించాడు తిక్కన .తాను ,ఆ తత్వాన్ని లోక కళ్యాణం కోసం ప్రచారం చేయాలని

,ఆంధ్రీకరణ కు పూనుకొన్నాడు .అదొక యజ్ఞం గా భావించి చేస్తేనే సత్ఫలితం కలుగు టుంది .అందుకే ముందుగా

వైదిక యజ్న కర్మ దీక్షితుడు అయాడు.యజ్న రూపమైన ఈశ్వరుని నిష్టగా చిత్తాన్ని వశీకరణం చేసుకొని

,ప్రతిష్టించు కొన్నాడు .సోమయాజి అయ్యాడు కనుక ఈ వాజ్మయంయజ్నం సులభ మైంది .ఉత్కృష్ట సాధనమూ

అయింది .చిత్త శాంతి లభించింది .కవిత్వ దీక్ష తీసుకొన్నాడు .వాజ్మయ యజ్న రూప మైనయోగ దీక్ష ను

పొందాడు .భారత రచన ప్రారంభించారు .ఆతని ధ్యేయం ఆముష్మిక ఫలం ,జన్మ రాహిత్యం

తపమునకు,విద్యకు ను ,జానూ స్తానమైన -జనన రహితుని యజ్ఞాత్ము శౌరి ,వాజ్మి

యాధ్వరార్చితు జేసితి ణా జనార్ద–నుండు మద్భాజనమున బ్రీతుండు గాత”

అని భీష్ముని చేత అనిపించినా ,అవి తిక్కన గారి మాటలే .విద్యా ,తపస్సుల జన్మ స్టాన మైన వాడూ ,జ్చావు

పుట్టుకలు లేనివాడు,యజ్ఞమూర్తి ,అయిన పరబ్రహ్మం వాజ్మయ రూప యజ్ఞం తో తిక్కన పూజించాడు .దీనితో

భగవంతుడు ప్రీతి చెందుతాడని నమ్మకం .

శరణా గతుండ భక్తుడ -బరమ పదవి గోరేద ను శుభంబుగా నన్నున్ –బరికించి ఏది మేల -య్యిరవు

దొరకోనంగా దలపవే కమలాక్షా”అని విశిష్ట జ్ఞానం తో ప్రార్ధిస్తాడు .భగవంతుని ప్రీతికై భక్తీ శ్రద్ధలతో సత్కర్మలు చేసి

,ఫలా పేక్ష లేకుండా ,జీవితాన్ని ఈశ్వరార్పణం చేసినఆదర్శ కర్మ యోగి తిక్కన .”ఏది మేలో అది చేయించు

”అన్న ప్రార్ధన -సర్వ సమర్పణా భావమే .వ్యాసుడు రాసిన గీతా తత్వాన్నివాచ్యం చేయకుండా ,ఆచరణ రూపం గా

,ఇలా బహిరంగ పరచాడు .అందుకే తిక్కన ఆదర్శ ప్రాయుడైనాడు .తిక్కనకు యోగం ,తపస్సు,యజ్ఞం అభిమాన

విషయాలు .నిర్మల అంతఃకరణ సాధ్య మైన బ్రహ్మ జ్ఞానమే తిక్కన ధ్యేయం .

యోగులకు యోగ బలమున -రాగంబు మొహమ్బును జిరస్నేహము,గామమముగ్రోధము గుణా–యోగము

వరుస బెడ బాప నున్నతియొలయున్ ”అని యోగా వాసిష్టత ను చాటాడు .యోగం పొందిన వాడి ఆనందం

వర్ణనా తీతం .అంటూ –

యోగ నిరూదుండుడు సంగ -త్యాగా నందైక రతున్దతనికి ,జనన సంయోగము ,మృతి ,దైన్యమ్బును -భోగా భోగ

సుఖ దుఃఖములులేవధిఅని చెప్పిస్తాడు .చాలా చోట్ల తపో యజ్ఞాల విశిష్టతను పాత్రల చేత చెప్పిస్తాడు

.పరమేశ్వరుని ”యజ్ఞాత్మక రూప ,నిశ్చలా వ్యయరూపా ”అని సంబోదిస్తాడు .జనులందరికీ దానం ,తపం ,వృద్ధ

సేవ అహింస నియతమైన పనులు అంటాడు .”యమ నియమ వికాసీ,వ్యాస చేతో నివాసీ అనీ ,యమ నియమ

వికాసీ జ్ఞాన గేహ ప్రదీప ,దమ శమ కలితానంద ప్రకాశ స్వరూపా”అని పరమేశ్వరునిసంబోధించి ,తన

జితెన్ద్రియత్వాన్ని తెలియ జేస్తాడు తిక్కన .

ధర్మాధర్మ విదూర నీతి పర ,విద్వచ్చిత్త,యోగీ””అపగత కామ రోష హృదయాంతర ఖేలన కల్య ” వంటివి

రాయటం వల్ల ఈద్వంద్వాలను దాటితే తప్ప ,మానసిక శాంతి లభించదని ,దాని వల్ల మాత్రమె పరబ్రహ్మ స్వరూప

సిద్ధి కల్గుతుందని తెలియ జేస్తున్నాడు.”సకల నిగమ వేద్యా ,”,”వివృత నిగమ శాఖావిశ్రుతాగ్రైక వేద్యా

”,”ఉపనిషదగమ్యా,యోగ భావ్యైక రమ్యా ”అని రాయటం వల్ల వేద,ఉపనిషత్తు లలోని వేదాంత భావన ల మీద

గల పరమ పూజనీయ భావం వ్యక్తం అవుతుంది .ఈ జ్ఞానం వల్లనే భగవత్ స్వరూపం బోధపడుతుందని

సూచించాడు .పూర్వ మీమాంస లో ప్రతి పాడించిన వైదిక కర్మ కాండ చేత ఆకర్షింప బడిన తిక్కన మనస్తత్వం

,శాంతిరచనా కాలం నాటికి ఎంతో ఉత్కృష్ట మైన మార్పు చెందుతుంది .

భగవత్ సంబోధన తో ఈ మార్పు స్పష్టం గా కన్పిస్తుంది .”ప్రకృతి పురుష యోగీ ”,వికృతి రహిత మూర్తీ ”–

”సుస్థిరానంద వర్త్మ్యా”,కేవల భావా నంద మయా ””భాస్వరానంద మార్గా ”వంటి సంబోధన లతో తిక్కన –

పరబ్రహ్మ తత్వాన్ని ,బ్రహ్మా నందం తో ఆత్మాసాక్షాత్కారం గా అభేదం గా ,చూపించాడు .మొహం నశించి ,వివేకం

పొంది ,ఆత్మా దర్శనం పొందాలి అన్న భావాన్ని స్పష్టం చేశాడు.ఆత్మా సాక్షాత్కారమూ పొందాడు .దానికి —

దేహాభిమాన సంభ్రుత -మోహ తమో నిరసనాభి ముఖ భూరి వివేకా హీన మహా తత్వ స-మాహిత చిన్మాత్ర

రూప మధురిమ సుభగా”అన్న పద్యమే సాక్షం .అసాధ్ ,సత విచారణ జ్ఞానం చేత మొహం పోయి ,చిట్టా వికాసం

పొందటమే పరమాత్మ స్వరూప సంధానం .ఇదిలభించిన తర్వాతా భావ బంధ మోక్షమే తరువాయి .తిక్కన

కూడా కవిత్వ దీక్ష తో ,శబ్ద బ్రహ్మనుసంధానం పొంది ,జ్ఞాన జ్యోతి స్వరూపమైన పరమాత్మ సాక్షాత్కారం పొంది

భవ బంధ విమోచనం పొందాడు .అందుకే అన్నాడు –

కరుణ ఫల పరిత్యాగ వరతో దాత్త చేతః-పరిణత సుఖ పీత భ్రాజ మానా నతాంహో –

నిరసన చరనాబ్జో న్నిద్ర త రాజ మానా –నిరవధి పరినాహా నిర్భరానంద దేహా ”

అనపేక్షిత ఫలతా శోభన మహనీయ క్రియా విపాకాత్మక రూపా -”అనే ఆయన చేసిన సంబోధనలు కర్మ

యోగిత్వాన్ని సూచిస్తాయి.భారత రచన తో బాటు ,తిక్కన హృదయమూ పరిణామం చెందుతూ వచ్చిందని

మనకు తెలుస్తూనే ఉంది కదా .ఆధ్యాత్మిక పర్వాలువ్రాసిన తిక్కన వేరు ,ఇంద్రియాలను అరి కత్తి ,అంతర్ముఖుడై

,ప్రాణాయం తో ఆత్మా సాక్షాత్కారం పొంది నట్లు స్పష్టం గా కన్పిస్తుంది .-ఈమార్పు -శాంతి ,అనుశాసన

పర్వాలలో స్పష్టం గా కానీ పిస్తుంది .ఆయన రచన విషయాన్ని బట్టి మారుతుంది .విరాట పర్వం నుండియుద్ధం

వరకు లౌకిక రచనకు ఉత్తమ ఆదర్శం గా తిక్కన రచన ఉదాహరణ గా నిలుస్తుంది .ఉదాత్త కావ్యలక్షణాలకు

నిలయమైంది.శాంతి పర్వం నుండి స్వర్గారోహణం వరకు కవిత్వ రచన పరాకాష్ట చెంది ,అలౌకిక వేద వాజ్మయ

స్వరూపం పొంది ,తేజోమయమై ,జ్ఞానజ్యోతి గా భాసించింది .

త్రియుగ కమల వీధీ దీప్త సంచార లీలా –నియమిత పవనాత్మాగ్ని ప్రభా స్నిగ్ధ సంగా

సమయ వికచ మహాబ్జ స్వైర మాధ్వీక దారో –దయ మయ మధురాత్మా ,దర్శితానంద వర్త్మా”.

సశేషం –మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –13-7-12.–కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
గ్యాలరీ | This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.