కంచి పరమాచార్య దర్శనం తో పులకింత

   కంచి పరమాచార్య దర్శనం తో పులకింత
భారత దేశమంతా పర్య టించి ,ఎందరో సాదు సంతులను దర్శించి ,తనకు మార్గ దర్శనం చేసే వారెవరో తెలుసుకొనే ప్రయత్నం లో అరుణాచలం లోని రమణ మహర్షిని సందర్శించి శిష్యుడై ,ఆ అనుభవాన్ని మనసులో పదిల పరచుకోవటమే కాక తన భారత యాత్ర ను పుస్తక రూపం గా ప్రచురించి పాశ్చాత్యులకు భారత దేశ యోగుల వైశిష్ట్యాన్ని తెలియ జెప్పిన వాడు డాక్టర్ paul brunton . .ఆయన రాసిన పుస్తకం a search in secret India -1934 లో  ప్రచురిత మైంది .ఆయన కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర స్వాములను కూడా దర్శించి పులకించాడు .అలాగే మౌనమే దీక్ష గా జీవించిన మెహర్ బాబాను ,బౌద్ధ మత గురువు దలై లామా ను సందర్శించి వారి ఆధ్యాత్మిక ఉన్నతి ని వర్ణించాడు  ఆయన రాసిన పుస్తకం అనేక ముద్రణ లను పొంది దేశ ,విదేశాల్లో భారత దేశ ఆధ్యాత్మిక వైభవాన్ని దర్శించే వీలు కలిగింది . ఆ పుస్తకానికి ఇప్పుడు 78 ఏళ్ళు .ఈ పుస్తకాన్ని ముప్ఫై మూడేళ్ళ వయసు లో రాశాడు .మారు పేరు తో రాసిన పుస్తకం అది
             paul brunton కుమారుడు  kenneth thurston hurst తండ్రి అడుగు జాడలో భారత దేశ పర్యటన చేశాడు .తండ్రి జ్ఞాపక గౌరవ ఉపన్యాసాలిచ్చాడు .ఆయన తన తండ్రికి ఇంకా ఇండియా లో ఎంత గౌరవం ఉందొ గ్రహించాడు .తన తండ్రి పాశ్చాత్యులకు యోగా ,ధ్యానం లను పరిచయం చేశాడని గుర్తుకు  తెచ్చుకొన్నాడు .అరుణాచలం వెళ్ళాడు .మహర్షి అప్పటికే పర లోకం చేరారు .ఆ  ఆశ్రమం లో విశాల మైన హాల్ లో కూర్చుని ధ్యానం చేస్తూ మహర్షిని మనసు లో నిలుపు కొన్నాడు .తన తండ్రి నివశించిన చిన్న బంగాళా చూసి ఆనందం పొందాడు .ఎదురు గా ఉన్న అరుణాచలం పర్వతాన్ని దాని గాంభీర్యాన్ని దానికి శ్రీ రమణులకు ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలిసి పరవశించాడు .ఆ పరిసరాల పవిత్రత ఆయన మనసు పై గాఢ ముద్ర వేసింది .తన జీవితం ధన్యమైంది అనుకొన్నాడు .జీవితానికి ఈ అనుభవం చాలు అనుకొన్నాడు .మనసంతా ఆ భావనలను నింపుకొన్నాడు .
                   అరుణాచలం నుండి కంచి చేరాడు .తన తండ్రి సందర్శించి వర్ణించిన కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల వారిని సందర్శించాలని మనసు లో భావించి చీటీని  పంపించాడు ..అప్పటికి పరమాచార్యుల వారికి 92 ఏళ్ళు .ఒంటరి గా నిత్య తపస్సు తో గడుపుతున్నారు .వీరిని గురించి తన తండ్రి అత్యద్భుత వర్ణన చేశాడు .అదంతా జ్ఞాపకం వచ్చింది .జనం తీర్ధ ప్రజా లాగా వారి సందర్శనం కోసం నిలబడి ఉన్నారు .తనకు దర్శనం లభించే అవకాశాల్లు లేవు అని నిర్ణయించుకొన్నాడు .ఆయన ఆశ్రమం వెనుక భాగాన చిన్న గది లో ఉన్నారు .”నడయాడే దైవం ”గా పరమాచార్యుల వారిని భావిస్తారు .కొద్ది నిరీక్షణ తరువాత స్వామి వారు పిలుస్తున్నారు  ఒంటరిగా దర్శనం ఇస్తారు అనే కబురు అందింది .వారి సాన్నిధ్యానికి చేరాడు .”బక్క పలుచని శరీరం -కాషాయ వస్త్ర ధారణ ,విభూతి తో ఫాలభాగం పరమశివుడు గా కని పించారు .తనను తాను పరిచయం చేసుకొని తాను paul Brunton కుమారుడి ని అని తెలియ జేసుకొన్నాడు .స్వామి వారు ”మా కు తెలుసు ” అని మాత్రమే అన్నారు .ఇంకో మాట లేదు .మళ్ళీ ఏదో మాట్లాడారు స్వామి .అక్కడ ఉన్న అనువాదకుడు ”మీ కోసమే స్వామీజీ ఎదురు చూస్తున్నారు ”అన్నాడు .కెన్నెత్ కు అమిత ఆశ్చర్యం వేసింది .తానెవరో ఆయనకు ఎలా తెలిసిందో అర్ధం కాలేదు .తాను వస్తానని ఎలా తెలిసిందో  తన గురించి ఎలా తెలిసిందో మరీ ఆశ్చర్య పరచింది .అప్పుడు ఆయన త్రికాల జ్ఞాని అని అర్ధమైంది .తాను భారత దేశం లో ఉన్నట్లు పరమాచార్యులకు ఎలా తెలిసిందో ,ఇంకా అంతు బట్ట లేదు .తాను తనతండ్రి  పుస్తకాన్ని పునర్ముద్రించిన కాపీ ని అందజేసి అందులో ఉన్న ముప్ప్జై ఎనిమిదేళ్ళ తండ్రి ఫోటో ను చూపించి అది తన తండ్రిది అని తెలియ జేశాడు .మళ్ళీ స్వామి వారి సమాధానం ”మాకు తెలుసు ”అనే ..తన తండ్రి సందర్శించి నపుడు ఉన్న ప్రపంచ పరిస్తితుల పై ఎన్నో ప్రశ్నలు వేసి స్వామి నుండి సమాధానాలు రాబట్టాలి అనుకొన్నాడు .కాని ఆశ్చర్యం –ఆ ప్రశ్నలన్నీఅకస్మాత్తు గా  నోటిలోనే కరిగి . పోయాయి .మనసంతా ప్రశాంతత ,ప్రేమ నిండి పోయింది .ఇంక ప్రశ్నలూ లేవు .సమాధానాలు లేవు .గుండె గొంతుక లో కొట్టుకు పోయింది అంతే తనువు ,మనసు  పులకించి పోయింది .అంతే అమాంతం స్వామి పాదాలకు దగ్గరగా సాష్టాంగ ప్రమాణం చేసి నిలబడ్డాడు .ఆచార్య స్వామి మనస్పూర్తిగా అతన్ని ఆశీర్వ దించారు . .స్వామి వారు నిండు మనసు తో గంధపు దండ ను కెన్నెత్ మేడలో వేసి గౌర వించారు .ఆ సువాసన ఇంకా తనకు తాజా గా నే ఉందని ,దాన్ని అప్పటి నుంచి భక్తీ తో మెడ లో ధరిస్తున్నానని కెన్నెత్ చెప్పాడు .అలా యాభైయేళ్ళ జీవిత చక్రం ఒక చుట్టు తిరిగింది అని పులకరింత తో ఈ అనుభవాన్ని వర్ణించాడు కెన్నెత్ .
                     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -07 -12 –.charlotte -north carolina —248-212-03-66.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

3 Responses to కంచి పరమాచార్య దర్శనం తో పులకింత

  1. Sureshkadiri అంటున్నారు:

    చదువుతున్న మనకే ఇంత పులకరింత కల్గుతుంటే అనుభవించిన తనకు ఎంత ఆనందం కల్గిఉండాలి?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.