తిక్కన భారతం -5
ఉత్తర గోగ్రహణం
ఉత్తర గోగ్రహణం వీర రస ప్రధానం .భావి భారత యుద్ధానికి ప్రాతిపదిక .తాను చేయబోయే విశిష్ట రచనకు ఉపక్రమణిక .అర్జునుని కోదండం నుంచి సూర్య కిరణాలు యెడ తెరిపి లేకుండా వెలువడుతున్నాయి .అన్ని వైపులా నుంచి వచ్చి కౌరవ సైన్యాన్ని ముంచి వేస్తున్నాయి .అవధి లేని బాణ ప్రయోగం -విక్రమంతో తేజో మూర్తి అయిన అర్జున మూర్తి అచ్చ తేజో మాయ మైన మార్తాన్దుని ళా ఉన్నాడట .సమగ్రమైన అర్ధ స్పోరక మైన ఉపమానాలు తిక్కన గారి ప్రత్యేకత .
”ఒక మాత్రన్ ,వితత ప్రసార నిబిదాదిటయు గ్రాస్త్ర సంతా నముల్ -సకలానీఎకము లందు బర్వ ,నరు భాస్వన్మూర్తిదీ-ప్తికలాపంబులు ,లోక మంతతను ,విస్తీర్ణంబులై,యోగ ప-ద్యక్రుత వ్యాప్తి వెలుంగునొప్పెసగు మార్తాండు న్విడంబించుచున్ ”—అంతే కాదు -అల్లెత్రాడు ,పిడికిలి ,ధనుస్సు ,హస్తం ,వీటన్నిటి లో ,ఒకే విదం గా ,బాణాలు తమంత తాము భయంకరం గా వెలువడి ,శత్రువులను తీవ్రం గా గాయ పరుస్తున్నాయత .తేనే తుట్టె నుంచి ఒక్క సారిగా పైకి ఎగిరే తేనే టీ గల్లాగా వస్తున్నాయి బాణాలు . అంత సహజ సుందర వర్ణన చేయటం తిక్క యజ్వ ప్రత్యేకత .
కర్ణుని ప్రయత్నాలను కూడా అంతే సహజం గా వర్ణిస్తాడు .మనస్సు లోని రోషమే రూపం దాల్చి నట్లు బాణాలు కురిపిస్తునాడు కర్ణుడు .అవి జ్వాలా పరంపర చేత విజ్రుమ్భించే భయంకరాగ్ని ళా ఉందట .వీటిని అర్జుండు అనే మేఘం ,వర్ష ధారా లానే బాణాలతో చల్లార్చాడు .”అర్క తనూభవా గ్ని కి లోపల ఉన్న రోషమే భీకర స్వరూపం -కాంతి వంత మైన కేతువే శిఖా జ్వాల ,ప్రకాష వంత మైన షరా పరంపరాలే కీలలు .అలాగే అర్జునాంబు దానికి ఉజ్వల పతాక మెరుపు తీగ ,రాధానేమి ధ్వని గర్జం ,బాణ పరంపరలు వర్ష దారాలు ,వర్ష వ్యాపారం తో అగ్ని అణగి నట్లు కర్ణుని విజ్రుమ్భన అర్జునుని పరాక్రమం తో అణగారింది .సైనికుల ముఖం అనే పద్మాలు కాంతి హీన మైనాయి .అందుకని కౌరవ సేన అనే సరోవరం దీనమై పోయింది .ఇక్కడ విశేషాలు తెలుసు కొందాం -కర్ణుడు పద్మ బాంధవుడు అంటే సూర్యుని వంశ సంభూతుడు .అర్జున మేఘా వరణం తో నిస్తేజుడు అవటం వల్ల సైనిక ముఖ పద్మాలు కాంతి తప్పాయి .చక్కని ఉపమానాలు తో యుద్ధ స్తితి ని వర్ణించాడు .సూర్యుడు ,అగ్ని అభిన్నులు .అర్క అంటే సూర్యుడు అగ్ని అనే రెండు అర్ధాలు ఉన్నాయి .అర్క తనూభావుడైన కర్ణుని ,అగ్ని తో పోల్చటం చాలా ఉచితం గా ఉంది .తనూభవ శబ్దం విశిష్టమైన ప్రయోగం .అగ్ని జ్వాలలు తాప హేతువులు .అలాగే కర్ణుని బాణాలు సంతాప కారణాలు .అర్జునుడు ఇంద్రుని కుమారుడు .మేఘం తో అభేదం .అర్జున శబ్దానికి ఇంద్ర ,అర్జున అనే అర్ధాలున్నాయి .అర్జున పతాకం దివ్యమైనది .అందుకే మేఘం లోని విద్యుత్ తో పోల్చాడు .కర్ణుని బాణాలు లోకానికి అనర్ధాలు .అర్జునుడు ధర్మ యుద్ధ తత్పరుడు .కనుక బాణాలు లోక హితాన్ని చేకూర్చే తాపాన్ని అణగించేవి .ఇంత ఉదాత్తం గా చిత్రించటం తిక్కనే సాధ్యం అని పించు కొన్నాడు .–
”రోషంబు భీషణ రూపమై చేలువొంద ,నతుల కేతువు శిఖయై వెలుంగ -శరజాలములు పటు జ్వాలలై నిగుడ ,నరక తనూభవాగ్ని ప్రజ్వరిల్లు -నుద్ధతి సైపక యుజ్వల దివ్య పతాక ,మేరుంగుగా ,దళిత ధోరణి -రాధానేమి రావము ,గర్జనము గ ,శర పరంపరలు ధారలుగాగ బరగి యడరె అర్జునామ్బుడంబు అనన్య సామాన్య సముదయమ మున,ముఖ పయోరుహముల -కాంతి దరాగి యపుడు కౌరవ సేనా సరోవరంబు దీన భావ మొంద ” ఇదీ తిక్కన గారి రస పట్టు .సహృదయ ఉల్లాసం .నమోస్తు తిక్కన కవీశ్వరా !
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-7-12.–కాంప్-అమెరికా