తిక్కన భారతం –8 సంజయ రాయ బారం –1

తిక్కన భారతం  –8
                                                     సంజయ రాయ బారం –1
సంజయుడు కౌరవ ,పానదవులకు ఇద్దరికీ కావలసిన వాడు .యుక్తాయుక్త వివేకం ఉన్న వాడు .రాజుల వద్ద మెలిగే నేర్పున్న వాడు .అన్నిటికి మించి రాయ బారికి కావలసిన వాక్ చతురత ఉన్న వాడు .అందుకే ద్రుత రాస్త్రుని ఆజ్న గా పాండవుల దగ్గరకు రాయ బారి గా వచ్చాడు .ముందు గా ధర్మ రాజుతో అతడిని పొంగించి ,ఉబ్బెసే ప్రయత్నం చేస్తూ ”భాగ్యమున నిన్ను గనుగొన బడసి నాడు –చూడ్కి చరితార్ధ మయ్యే నస్తోక పుణ్య ధనుడు మీ తండ్రి ద్రుత రాష్ట్ర ధరణి నాధు -దిండు మీ యుంకి విని ప్రియ మెసక మేసగ ”అనటం తో ధర్మ రాజు ”ఉబ్బు లింగం ”అవుతాడని చాలా ఆశ పడ్డాడు సంజయుడు .తన ప్రయతన లోపం లేకుండా ఇంకాస్త పొగడ్త ధూపం వేశాడు .-
”అనుజులు నీవునును ద్రోవది -యును బుత్రచయంబు నున్న యోగ క్షేమం బున తెర గారయ బుత్తెం-చే,నితాంత స్నేహ పూర్న చేతో వృత్తిన్ ”-అన్నాడు .ధర్మ రాజాదుల యెడ పేద తండ్రికి గల స్నేహ భావాన్ని ,పాండవులంతా అనుభ వించిన దుఖానికి సానుభూతి ని తెలియ జేశాడు .యుధిష్ఠిరుని మనసు మెత్తబడ టానికి ప్రయత్నం చేశాడు .అందుకే మాటలను అతి జాగ్రత్త గా ప్రయోగించాడు ”అస్తోక పున్యధనుడు -మీ తండ్రి -ధరణి నాధుడు ”అనే మాటలను సాభిప్రాయం గా ప్రయోగించాడు .మీకు మీ తండ్రి తెలీదు ఆయనే తండ్రి -ఆయన పుణ్యాల రాసి మీదు మిక్కిలి అస్తినా పురానికి మహా రాజు అని గుర్తు కూడా చేశాడు .అంటే తస్మాత్ జాగ్రత్త అనే హెచ్చరికా అందు లో ఉంది .ఆ వరుస క్రమం చాలా పకడ్బందీ గా ఎన్ను కొన్నాడు .ప్రతి మాట అర్ధవంతం సమయానికి తగిండీ .జరిగిన దానికి పెద్ద రాజు తప్పు ఏమీ లేదు అని చెప్పా టానికి ”అస్తోక పుణ్య ధనుడు ”అన్నాడు .పిత్రుప్రేమ ను జ్ఞాపకం చేసుకోవ టానికి ”మీ తండ్రి ”అన్నాడు .చివరికి మహా రాజు పంపే సందేశం మీరు కాదనటానికి వీలు లేదు -అది శిరోధార్యం అని చెప్పా టానికి ”ధరణి నాధుడు ”అన్నాడు .అంతే కాదు ”అనుజులు నీవును ద్రౌపదియును ”అనటం లో కూడా తమ్ముళ్ళను అనునయించటం ,ప్రతీ కారం తో రగిలి పోతున్న పాండవవ పట్ట మహిషి ద్రౌపది ప్రతీకారం తీర్చు కోవటానికి ఎదురు చూస్తోందని తెలిసి ఆమె పేరును ప్రస్తా వించటం సంజయుని మాటల నైపుణ్యానికి గొప్ప ఉదాహరణ .విషయం పెద్ద రాజుది కాని మాటల పేర్పు సంజయుడిదే .ఇదీ కార్య సాధకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం .అంత మాత్రం చేత ధర్మ రాజు పొంగి పోతాడా ?ఆయన పేరే యుధిష్ఠిరుడు .దానికి తగ్గట్టే ఆయన సమాధానమూ ఉంటుంది –
”’ఆ రాజు మా దేసం గల కారుణ్యము కతమునాను సుఖమున నిట్లున్నారమని ”వ్యంగ్యం గా కాకువు తో చెప్పాడు .అవును రాజు గారి దయ వల్ల మేము అడవుల్లో చాలా సుఖాలు అనుభవిస్తున్నాం అన్నాడు దెప్పి పొదుపు గా .కాని తన ధర్మాన్ని వదల కుండా కౌరవులందరి యోగా క్షేమాలను అడిగాడు .అప్పుడు నెమ్మది గా తన తమ్ముల అశేష శౌర్య పరాక్రమాలను వరుసగా వర్ణించి దిమ్మెర పోగొట్టాడు .ధర్మ రాజు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఏకరువు పెడుతున్నాడో గ్రహించానంతటి అవి వెకి కాదు సంజయుడు .వెంటనే గ్రహించాడు .అయినా తన ప్రయత్నం తాను చేశాడు .పట్టు వదలని విక్రమార్కుని లా ధర్మ రాజు కారుణ్యాన్ని పదే పదేప్రస్తుతించాడు .ఇప్పటి వరకు పాండవులకు క్షేమం లేక పోయినా ఇప్పుడు కలుగు తుంది అన్నాడు .–”పొందొంగ దలచితి నీ –విందు శిశిర మైన హృదయంబున ,వారందరకు ను సేమంబిట  –ముందర లేకున్న నేడు మొదలగ గలుగున్ ”అని చాలా గూధం గా చెప్పాడు సంజయుడు .తెలివి తేటలన్నీ ప్రయోగించాడు .పూర్వం కౌరవులు ప్రవర్తించిన దానికి పాండవులు ప్రతీకారం తీర్చు కో దలచు కుంటే ,ఇంతకు ముందుగా ఉన్న కౌరవుల క్షేమం ఇంకా క్షయం అవుతుంది .శిశిర విమల హృదయం తో సంధిని ధర్మ రాజు కోరుతున్నాడు .కనుక ఇప్పుడు నిజం గా కౌరవులకు క్షేమమే .చంద్ర వంశానికి చెందినా వాడవు కనుక నీ మనసు అమృత మాయం గా ఉంటుందని సూచన కూడా అతని మాటల్లో నిగూధం గా ఉంది .అదీ సంభాషణా చతురత.చంద్రుని వికాసం లోకానికి ఆనందమే కాదు చల్ల దనాన్ని ఇస్తుందని శాంతి లభిస్తుందని అన్యాప దేశం గా అన్నాడు .చేసిన తప్పు అంతా దుర్యోధనుడిదే కాని మతి తప్పిన ముసలి రాజుది కాదు అని ,పేద తండ్రి పై ధర్మ రాజుకు సాను భూతి కలిగేట్లు మాట్లాడాడు .ధర్మ రాజు మెత్త బడితే తమ్ముళ్ళను ఒప్పించ గలదు అనే పూర్తీ విశ్వాసం సంజయునికి ఉంది .అసలే ముదుసలి -మానసికం గా కుంగి పోయాడు .కనుక సానుభూతి కల్గిస్తే కార్యం సానుకూలమవు తుందని ఆశించాడు .
”ద్రుత రాష్ట్ర భూపతికి వరు–ద్ద కతమున జిత్తమొక విధము కామి ,సుతో –ద్ధతి మాన్పద నాడు మనః–క్షతి పిదపంబుట్టి  ఇపుడు శాంతుడయ్యేన్ ”–కౌరవ వంశానికి కళంకం దుర్యోధనుని వల్లే వచ్చింది దాన్ని పోగొట్టే బాధ్యత ధర్మ రాజుదే అని పెద్ద బాధ్యత కూడా ఇరువైపులా ఆయనదే అని బలేగా చెప్పాడు .”నిపుణ హృదయ ”అని సంబోధించి కార్య సాధనకు మంచి బీజం నాటాడు .చివరగా ,చాలా తెలివిగా -ఒక వేళ యుద్ధం వస్తే -”అఖిల జనక్షయమయి ,జయాపజయాలు తెల్చలేనివి గా ఉంటాయి సుమా ”అని హెచ్చరించాడు .యుద్ధ ప్రయత్నం మంచిది కాదు అనే సూచనా ఉంది .ఇరు వైపులా ఉన్న బాలా బలాలను చాలా బాలన్సు గా బేరీజు వేసి మరీ చెప్పాడు .కలహం ఎలా చూసినా మేలు కాదు పొమ్మన్నాడు .అంతే కాదు చివరికి కాళ్ళ బేరానికి వచ్చి నట్లుగా ఆపద మొక్కులూ మొక్కాడు .అక్కడున్న అందరికి క్రోధ శాంతి చేయమని విన్నవించాడు –
”మ్రొక్కెద వాసు దేవునకు ,మొడ్చేద చేతులు సవ్య సాచికిన్ –దక్కటి మిత్ర బాంధవ హిత ప్రియ మంత్రి వయస్య కోటికిన్ –సృక్కుచు విన్న విమ్చెదనసూయలు దక్కి ,యనుజ్ఞ సేయుడీ -ఇక్కరునాకరున్ శరణ మేనిదే వేడెద క్రోధ శాంతికై-”అని అందర్ని యోగ్యతను అనుసరించి వినయం ,గౌరవం ,ప్రకటిస్తూ వేడికోలు అంటే విజ్ఞప్తి చేసుకొన్నాడు .
”నెయ్యము వాటించి కడుం-దియ్య మేసగ నాలుక లెల్ల దీరు నటులు గా –గయ్యమను దలపు లోనుగా –నయ్యమ నందనుడు మాను నట్టి తెరగున న్ ”ధర్మ రాజు యమ ధర్మ రాజు కుమారుడు ,ఇప్పుడా ప్రసక్తి ఎందుకు తెచ్చాడు ?అంటే యముడు సమవర్తి .తన ధర్మాన్ని తానూ చేసుకు పోతాడు .అంతే కాలు మ్రుత్యుస్వరూపుడు .ఆయన కు కోపం వస్తే అంతా విలయమే మర్నా పరం పర్లే .అంత జాగ్రత్త గా తిక్కన కవీశ్వరుడు పదాన్ని ప్రయోగించాడు .కనుక యమ నందనుడైన ధర్మ రాజు దండిచ దాలిస్తే ఇక తాన వారు అవతలి వారు అని చూడడు’అప్పుడు దయాదాక్షిణ్యాలకు తావు ఉండదు .అంటే ధర్మ రాజు దండించాలని అనుకొంటే అడ్డ గించే వారెవరు ఉండరని అన్యాప దేశం గా చెప్పాడు .ఇలా చెప్పటానికి ఒక కారణం కూడా ఉంది .సంజయుడిని పంపేటప్పుడు ముసలి రాజు అతడిని హెచ్చరించే పంపాడు -”శాంతి ప్రకారం కార్యం నడుపు .ఒక్కటిగా ఉండటానికి ఏర్పాటు చేసిరా ”ఈ ఆదేశాన్ని సంజయుడు తన శక్తి సామర్ధ్యాలను యుక్తిని తెలివి తేటలను చక్కగా ప్రయోగించి చాలా నేర్పుగా చివరి వరకూ చెప్పాడు .వీటన్నిటికి ,ప్రతి అక్ష రానికి ధర్మ రాజు తాగి నట్లు గానే తన సమాధానాన్ని తెగేసి చెప్పాడు .రాజ్యం ఇవ్వక పోతే సంధి జరుగదు అనే అర్ధం వచ్చేట్లు బదులిచ్చాడు .
సంజయుడు పట్టు వదల లేదు .బంధు నాశనం కల్గించే సంపద సుఖాన్ని ఇవ్వదుఅన్నాడు .సాత్వికులు అని పించుకొన్న పాండవులకు ఇది తగదు అని తెగేసి చెప్పాడు .ఇంత కంటే ఇంకొంచెం ముందుకు వెళ్లి ”దుష్ట ద్యూతం వల్ల కౌరవుల గర్వం అంతా పెంచి ,వాళ్ళను లోక నిందకు గురి చేయటం న్యాయమా /అని ప్రశ్నించాడు .ఆర్పే దానం గా అరణ్య ,అజ్ఞాత వాసాలను కష్టాలను ఓర్చు కొన్న ది అంతా నిష్కారణం గా గురు బంధు వర్గాన్ని చంపుకోవ టానికేనా ?అని నిలదీశాడు .సమాదాన్నాని పాండవులకే వదిలేశాడు .ఈ విధం గా సంజయుడు స్వామి కార్యాన్ని హృదయ పూర్వకం గా నిర్వర్తించాడు .ఎలాగైనా ధర్మ రాజును యుద్ధ విముఖుడిని చేయ టానికి విశ్వ ప్రయత్నం చేశాడు .కనుక సంజయుని మాటలలో తీపి ఉంది ,గడుసుదనం ఉంది ,అన్నీ తెలిసిన నేరు ఉంది .చ్చివారి దాకా చావని ఆశా ఉంది .అంతరాంతరాలలో తన ద్యూతం విఫల మౌతోందనే నిరాశా భావమూ కన్పిస్తుంది .వీటిని ధర్మ రాజు ,శ్రీ కృష్ణుడు కూడా గుర్తించారు .పాండవులు ఏమి సమాధానం చెప్పారో తరువాత తెలుసు కొందాం –
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –17-7-12.-కాంప్–అమెరికా
Rtd. head Master

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to తిక్కన భారతం –8 సంజయ రాయ బారం –1

  1. webtelugu says:

    Very informative , and quality telugu contetnts are in your website.If you like to get more traffic for free.Submit your new posts to webtelugu.com
    No need to sign up , just login with your facebook account and start posting your contents on webtelugu . We will also spread your news via facebook and twitter , and also helps you to increase your alexa rank.

    http://www.webtelugu.com/

    Thanks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.