అమెరికా
ఊసులు –7–జేఫర్సనీయం
అమెరికా స్వాతంత్ర ప్రకటన అనే డిక్లరేషన్ ను తయారు చేసింది వర్జీ
నియా కు చెందిన ప్రముఖ న్యాయ వాది, ఆ తర్వాతా అమెరికా అధ్యక్షుడు అయిన
థామస్ జేఫెర్సన్ . ఆయన ఫ్రాన్స్ దేశానికి దేశానికి సంబంధించిన మినిస్టర్
గా పని చేశాడు .రాజకీయం లో నాలుగో వంతు వర్జీనియా లెజిస్లేచర్ లో సేవ
లందించాడు . .బానిసత్వం అమెరికా దేశ పరిణామాలకు భవిష్యత్తు కుకారణం
అవుతుంది అని భావించి ,ఊహించిన వాడు . బానిసలు అమెరికన్ల ఆస్తి అని కూడా
ఆ రోజుల్లో చెప్పిన వాడు . .
జెఫర్సన్ గొప్ప రాజకీయ వేత్త అంటే స్టేట్స్ మాన్.ఆయన కాలం లో
ఫ్రాన్స్ దేశం తో ”లూసియానా కొను బడి ఒప్పందం ”చారిత్రాత్మక మైంది .ఆ
కొనుబడి తో అమెరికా విస్తీర్ణం రెట్టింపు చేసిన దీర్ఘ దర్శి జెఫర్సన్
.అంతే కాదు లెవిస్ మరియు క్లెర్క్ ఎక్స్ప్లోరేషన్ ను ఆమోదించి అమెరికా
సరిహద్దుల్ని విస్తరింప జేసి సెటిల్మెంట్ లకు అవకాశం కల్గిచిన వాడు .
బార్బెరీస్తేట్లు . అమెరికన్లను కిడ్నాప్ చేసి లంచం అడిగి నందుకు తన
వారిని విడిపించు కోవ టానికి ట్రిపోలి యుద్ధం చేసిన వీరుడు .అమెరికా
నావికా బలాన్ని అనేక రెట్లు పెంచిన వాడు .దేశ రక్షణ వ్యవస్థ ను పటిష్ట
పరచిన యుద్ధ నిపుణుడు .
1826 లో జూన్ ఇరవై నాలుగునవాషింగ్టన్ లో జరిగే
అమెరికాయాభై వ స్వాతంత్ర దినోత్స వానికి రావలసినది గా ఆహ్వానం అందు
కొన్నాడు జెఫర్సన్ .తన అనారోగ్య కారణాల వల్ల రాలేక పోతున్నానని ఈ
స్వాతంత్రం కలకాలం నిల వాలని కోరుతూ జాబు రాశాడు . మరుసటి నెల అంటే జూలై
నాలుగున డిక్లరేషన్ చేసిన యాభై ఏళ్ళ శుభ సందర్భాన అకస్మాత్తు గా చని
పోయాడు .చని పోయే ముందు జెఫర్సన్ నోటి నుండి వెలువడిన మాటేమిటో
తెలుసా?”ఇవాళ జూలై నాలుగో తేదీయేనా?”అని .అదే రోజు జాన్ ఆడమ్స్ అనే ఆయన
విరోధి కూడామాసా చూసేత్సు లో చని పోయాడు ..ఇద్దరు అమెరికా ప్రెసిడెంట్లు
గా పని చేసిన వారే .అమెరికా ఫౌండింగ్ ఫాదర్స్.అయితే జాన్ ఆడమ్స్ చని పోతూ
అన్న మాటలేమిటో తెలుసా ” .థామస్ జెఫర్సన్ ఇంకా బతికే ఉన్నాడా ?-ఉన్నాడా
జెఫర్సన్ ”.అంతటి గాఢ అనుబంధం ,అంతటి వైరమూ ఉన్న వారిద్దరూ స్వాతంత్ర
దినోత్సవం రోజునే చని పోవటం ఒక యాదృచ్చిక సంఘటన . .
జెఫర్సన్ ఫ్రాన్సు అధ్యక్షుడు నియంత అయిన నెపోలియన్
బోన పార్టే తో లూసియానా కొనుబడి ఒప్పందాన్ని కుదిర్చాడు .దీనితో మిసిసిపి
నది -రాకీ పర్వతాల మధ్య ఉన్న భ్హాగ మంతా అమెరికా స్వాధీనం లోకి వచ్చి
ఉత్తర సరిహద్దు హెచ్చింది .ఇది చాలా రహస్యం గా జరిగిన ఒప్పందం .అమెరికా
కాంగ్రెస్ కు ,రాజ్యాంగానికి దూరం గా చేసుకో బడిన చారిత్రాత్మక ఒప్పందం-
కాదు- కొనుగోలు .దీని తో అమెరికా విస్తీర్ణం రెట్టింపు అయింది .కొన్న
రేటు ఎంతో తెలిస్తే ఇప్పుడు అందరికీ మరీ ఆశ్చర్యం కలుగు తుంది .ఎకరం
అక్షరాల నాలుగు సెంట్లు .ఇది జరిగిన నాలుగు రోజుల్లో డబ్బు చెల్లింపుపు
పూర్తీ చేశాడుప్రెసిడెంట్ జెఫర్సన్ .అది1803 జూలై నాలుగున జరగటం
చారిత్రాత్మకం కూడా .అందుకే జెఫర్సన్ ను inventing america అని
imagining america అని విశేషణాలతో పొగుడు తారు .కాని ఆయన ను designed
america అని లేకauthored america అని సంబోధించాలని ఇటీవలి విశ్లేషకులు
భావిస్తున్నారు .
జెఫర్సన్ జ్ఞాపకార్ధం అయిదు సెంట్ల నికెల్ అమెరికా
నాణాన్ని ముద్రించి గౌరవించారు .ఆయన చాలా ఎత్తుగా ఆరడుగుల రెండు
అంగుళాలుఉండే వాడు . దీన్ని ఆయన సాటి వారిలో చాలా ఉన్నత ఆలోచనా పరుడు గా
చెప్పు కోవటానికి ఉపయోగ పడింది . .ఆయన ముఖం అంత కార్షణ గాకాని మరీ
ముభావం గాకాని ఉండదు .యెర్ర జుట్టు .చికిలించే కళ్ళు .పొడవైన కాళ్ళూ
చేతులు పలుచని పెదవులు ,మంచి ముక్కు .చిరుగడ్డం ..ఇవన్ని చూసి ఆయనను ఏ
జంతువూ తో పోలిస్తే బాగుంటుంది అని బుర్రలు పగల కొట్టు కొని, చివరికి”
పొడవైన ప్రావీన్యమైన తెలివిగల నక్క ”అన్నారు సమకాలికులు(large and
rather resourceful fox ).ఎంతటి గొప్ప వారైనా ”కలం వీరులకు ”తేలికే .
ఆయన్ను ఎలా ఆరాదిన్చారంటే if america is right jefersan
was right and if jefersan was wrong americaa is wrong ”అనే వారు .ఇది
చూస్తె నాకు మన దేశం లో india is indiraa and indiraa is indiaఅని
ఫక్రుద్దీన్ అలీ అన్న మాట జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది . రెండు సార్లు
ప్రెసిడెంట్ గా చేశాడు .మొదటి సారి ఉన్న వేగం రెండో సారి లో కనీ పించలేదు
.అమెరికా రాజ్యాంగం కుముందు మాట–ఉపోద్ఘాతం అంటే pre amble రాసింది
జేఫర్సనే .ఏమైనా అమెరికా రిపబ్లిక్ ను శాశ్వతం చేసిన వారిలో జెఫర్సన్
ఒకడు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-7-12.–కాంప్–అమెరికా —
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com