తిక్కన భారతం –9 సంజయ రాయ బారం — 2

తిక్కన భారతం –9
సంజయ రాయ బారం — 2
ధర్మ రాజు సంజయుడి తో ”ముందు మమ్మల్ని పోగిడావు .యుద్ధం లో కౌరవులను
మేము జయించా లేము అన్నావు .ఆ తర్వాతా సంధి అని సంధి ప్రేలాపన లా
మాట్లాడావు .అంత పక్ష పాతం గా మాట్లాడతా వేమిటయ్యా !”అని నిలదీశాడు
.–”ఎదిరిం దమ యట్టుల కా -మది దలచిన బోసగు గాక మాకుం గుడు మిన్దేడిదే
మీరు ప్రక్క గోనుడని -చదుర బడచిన మనసు పొందు చక్క బడునే ?” అని ద్రుత
రాష్ట్రుని పక్ష పాత బుద్ధి ని ఎండ గట్టాడు .”సంపద దక్కి యుండగా
నాశక్తులనం జను మమ్ము బిల్చి పూజింప నంత బేలె ,పతి ”అని పెద్ద రాజు మనసు
లోని దురాశను ,దుష్ట బుద్ధి సంకల్పాన్ని ,తెలియ జేశాడు .”మాతో ఎంత
తియ్యగా మాట్లాదావో ,ఆ రాజుతో కూడా మేము చెప్పిన విషయా లన్ని అంత తియ్యగా
నూ తెలియజేయి ”అని చెప్పాడు .–” ఆ రాజు సేయు నెయ్యము -గారామును జెప్పే
దీవు గడు దీపులుగా -వీరు తమ పాలు వడయక -నేరిమి మాటలన దేర నేర్తురే చెపుమా
?అని ఝాదించాడు .ఇదంతా వింటున్న శ్రీ కృష్ణునికి కారం రాచినట్లుంది .ధర్మ
రాజు మెత్త గా మాట్లాడుతున్నాడని పించిందేమో ఒక సారి ఫ్లాష్ బాక్ లోకి
తీసుకొని వెళ్లాడు –
”దుస్స సేను డదయాక్రుతి ముందల వట్టి ఈద్వగా నెట్టు సహించే
మామ ”అని తీవ్రం గా ప్రశ్నించాడు .”సతి ఏడ్పు టేలున్గున కెట్టు
లోర్చే-ణీ పట్టున సెమ మారయగ-బంచుట కెట్టు లు నేర్చే గ్రమ్మరన్ ” అని
నిండు సభలో యాజన సేని అయిన ద్రౌపదికి జరిగిన పరాభవాన్ని చూస్తూ ఊరుకొని
ఇప్పుడీ రాయబారం సందీ అంటే అర్ధమేమిటి అని ఈసదించాడు .ధర్మ రాజు పెద్ద
రాజును పేద తండ్రి అని ఒక మారు కూడా సంబోధించ లేదు .”ఆ రాజు ”అని చాల
తేలిక భావం తో అలాంటి నిస్చేతనుడైన రాజు అనే అర్ధం లోనే వాడాడు .కృష్ణుడు
లౌక్యం గా ”మామ ‘అన్నాడు .ఈ విధం గా సంజయుది మిధ్యా వాదాని ఖండించాడు
బావ .ధర్మ రాజు సంజయుడిని బాగా ఎస్టిమేట్ చేశాడు .అతని మాటల్ని
”దుర్నయము ,బెట్టిదం ,బెండు ”మాటలుగా ఉన్నాయని చెప్పాడు .అంతే కాక ఇంత
వినయం ,నేర్పు ఇంకెవరి దగ్గరైనా ఉన్నాయా /అని మెచ్చి కోలు గా అన్నాడు
.అంటే రాయ బారి సంభాషణా చాతుర్యానికి కితాబు ఇచ్చాడు .సంజయ రాయబార
విధానానికే ఈ మాటలు చక్కని వ్యాఖ్యానాలు .
పాండవ సందేశాన్ని తీసుకొని సంజయుడు హస్తిన చేరి పెద్ద
రాజుకు పూస గుచ్చి నట్లు వివ రించి చెప్పాడు .ధర్మ రాజు సందినే
కోరుతున్నాడని ద్రుపద పురోహితుని ద్వారా పంపిన రాయ బారమే చెప్తోందని
గ్రహించాడు .అయితే ధర్మ రాజు ను యుద్ధ విముఖుడిని చేయ టానికే సంజయుడిని
పంపాడు .అతనూ తీవ్రం గా నే ప్రయత్నించాడు .వంశ ,బంధు ,రక్షణ అంతా
యుదిస్తిరు ని పైనే ఉందని గుర్తు చేయించాడు .శాంతుడు అయితే ధర్మ రాజు
రాజ్య భాగాన్ని కూడా కోరడు అని భావించాడు రాజు .కొంత వరకు ఈ రాయబారం
ఫలించి నట్లే .బంధు నాశనం ఇష్టపడని ధర్మజుడు ”అయిదు ఊళ్లు ”ఇమ్మన్నాడు
.ధర్మ రాజు ఎంత ఔదార్యం చూపించినా ,తన కొడుకు దుర్యోధనుడు దానికీ ఒప్పు
కోడు అని గుడ్డి రాజు కు బాగా తెలుసు .కళ్ళు గుడ్డివే కాని మనసుల్ని చదవ
గలదు .తన కొడుకు మూర్ఖత్వమూ చెల్లాలి ,ధర్మ రాజూ శాంతించాలి .ఒకే దెబ్బకు
రెండు పిట్టలు పదాలని దురాశ .ఈ రెంటినీ నేర వేర్చ తానికే సంజయ రాయ బార
వ్యూహం పన్నాడు .మళ్ళీ సంజయుడు యుక్తి గా ఒక ఎత్తు ఎత్తాడు .-
”ఎట్టి తప్పులం బోవగ దోచి ,తాలిమి పూనుదు గావున నన్ని మాట
లిట్లీవు వినంగ నాడియు ,నే ,దని వోవక విన్న విన్చేదన్ ”అని కోన సాగిస్తూ
-అంటే” అవతలి వారు ఎన్ని తప్పులు చేసినా సహించే ఔదార్యం ఉన్న వాడివి
నువ్వు .సహనం నీకు ఎక్కువ .అది నీకు సహజ ఆభరణం .అయినా నాకు మనసు సంతృప్తి
పొందక ఒక మాట చెబుతున్నాను వినవయ్యా ”అన్నాడు .”ణీ విభావంబహిం సయు
,ననిన్ద్య చరిత్ర కాక యన్యమే”అని అహింసా మూర్తిగా నోట్లో వేలు పెడితే
కోరకలేని వాడిని గా పరిశుద్దాన్తరంగునిగా ఎట్టి నిండా లేని సచ్చరిత్రుని
గా భుజ కీర్తులు పెట్టి కార్యాన్ని గట్టేక్కించు కోవాలని చూశాడు సంజయుడు
.ఈ పొగడ్తను పరా కాష్టకు చేరుస్తూ ”అల్పులకు అలవి కాని హాలాహలం లాంటి
కోపాన్ని దిగ మింగు కోవా టానికి నువ్వు సాక్షాత్తు ఆ నీల గళుడుఅయిన
శివుడివే ”అన్నాడు .”నీకు నీవే సాటి ”అని ములగ కొమ్మ ఎక్కించాడు
.బోళాశంకరుడు పొగడ్తలకు ఉబ్బి పోయి నట్లు ధర్మ రాజు ఉబ్బు లింగం అవుతాడని
మంచి ఉపమానాలను ఎన్నుకొని మాటల పొగడ దండలు మెడ నిండా వేశే శాడు .చేసేది
లేక ఏమీ పాలు పోక ఆఖరి అస్త్రాలుగా వీటిని ప్రయోగించాడు .ఈ యుక్తి యుక్త
మైన మాటలకు చాలా తీవ్రం గా నే బావా ,మరడులు సమాధానం చెప్పి నోరు మూయించి
నంత పని చేయించారు .ఇప్పటి దాకా చాలా ప్రశాంత చిత్తం తో ఓర్పు గా ఉన్న
ధర్మ రాజు విపరీత మైన కోప స్వరం తో తన తమ్ముళ్ళ అవక్ర పరాక్రమ శౌర్యాలను
ఏకరువు పెట్టాడు .అవన్ని ఒక్క సారి ప్రదర్శింప జేశాడా అన్నట్లు తిక్కన
ఆయన తో అని పించాడు .
”గాండీవ జయా రవంబుతకట మయి పెలుచం గ్రమ్మిన న్ ,భీము బాహా –దండంబే
పారి ,శుంభద్గద  జడియుచు దోచినన్ -రౌద్రంబు గా దోచినన్ ,వే–దండ
ద్వంద్వము మాడ్కి న్దరిమికవలు మాద్యద్గతిం దాకినన్ జా కుండం బోకుండ
గౌరవ్యులకు వశమే బిట్టుల్కి మూర్చిల్ల కుండన్ ”అని రాబోయే కౌరవ పాండవ
యుద్ధం లో జరగ బోఎదేమిటో కళ్ళకు ప్రత్యక్షం చేశాడు .తన సోదరుల ముండేవారు
నిలిచి పోరాడలేరని తేల్చి చెప్పాడు .ఆ చెప్పేది చాలా విష్పస్తం గా ,ఉధృతం
గా తీవ్రమైన గొంతు తో చెప్పే శాడు .సంజయుడు ఇంగితం కల వాడు .పాండవుల మనో
భావాన్ని ,తీవ్రత ను అర్ధం చేసుకొన్నాడు.బందుత్వాన్ని కూడా పాటించ కుండా
”కౌరవ్యులు ”అని ధర్మ రాజు అన్నందుకు ఆ అహింసా మూర్తి లో రోషం ఎంత
జీర్ణించుకు పోయి ఇప్పటి దాకా బయట పడ కుండా ఉందొ గ్రహించాడు . ఇటు వైపు
అయి పోయింది -ఇక అటు వైపు నుంచి రావాలి అనుకొన్నాడు .
ద్రుత రాష్ట్రుని కొలువు కూటం చేరాడు .ముందుగానే
”సైరణ వేరపుగా భావించుట తప్పు ”అని ముసలాయనకు హితోప దేశం చేశాడు .అంటే
పాండవులు  సహించి ఉండటం భయం తో కాదు అని అర్ధం .”సాదు రేగే నేని విను
,తల పొలమున గాని నిలువదు సుమ్మీ ”అని హెచ్చరించాడు .అంటే ధర్మ రాజు ఎంత
శాంత చిట్టుడో ,అవసరం వస్తే అంత తీక్ష్ణ స్వరూపుడు .సాధువు చేల రేగితే
భూమి మీద మిగిలేది బూడిదే అని భావం .సంజయుడు ఉభయుల హితం కోరే వాడు .కనుక
మొహమాటం లేకుండా చెప్పే శాడు .ఇప్పటికే చాలా ఆలస్యం జరిగి పోయింది .ద్రుత
రాష్ట్రుని ప్రవర్తన ను కటువు గా నే నిందించాడు .-”ఆలు బిడ్డ లేని యట్టి
త్రిమ్మరి యగు -కొయ్య గాక కుదుట గూడు వెట్టి -కుడుచు వారలిట్టి
క్రోవ్విదంబుల సేయ -జొచ్చు టి చ్చ గించి చూతురయ్య ”అని మందలించాడు .తోట
కూర నాదే వంగ దీయాల్సిన కొడుకుని ఉపేక్షించి ఇప్పుదేదిస్తే ఏమి లాభం
అన్నాడు .”నీ ఉపేక్ష కొంప ముంచింది .ధర్మ రాజు చాలా తెలివైన వాడు లోకం
అంతా తప్పు అంతా నీ మీదే పెట్టె దాకా వదలడు .ధర్మ రాజు అంటే ”మెత్తని
పులి ”అని ఆతని ఆంతర్యాన్ని విస్పష్టం చేశాడు .
”అనయము వుట్టె జూదమున యప్పుడ ఎంతయు జిచ్చువెట్టి కా –ల్చిన యది ,నీ
యుపెక్షయ ,వశీక్రుత చిత్తుడు ధర్మ సూతి ,మే–త్తని పులి ఎల్ల వారలు
,నధర్మము నీ పయి బెట్టు నంత కు –న్వినడు గనదుం ,బిదప నీకును నాకు మరల్చ
వచ్చునే ”–ఉపేక్ష ఎంతటి వినాశనాన్ని సృష్టించిందో ఎరుక పరిచాడు .చివరగా
‘అయ్యజాత శత్రుదలుగుట నీళ్ళు ల నగ్ని పుట్టి నట్టిదయ్యెమీకు నార్ప వెరవు
లేదు ”అని కవి తిక్కన మహా నేర్పు గా సంజయుని తో చెప్పించాడు బధిర
శంఖారావం గా ఉంటున్న పెద్ద రాజుకు .అగ్నిని ఆర్ప టానికి నీళ్ళు కావాలి .ఆ
నీళ్ళ లోనే అగ్ని పుడితే ? ఆర్పటం సంభావమా ?అది ప్రళయాగ్ని .దానికి సర్వ
సంహారం చేయటం తప్ప ఇంకోతేమీ తెలియదు .తస్మాత్ జాగ్రత .అని విలువైన సందేశం
ఇచ్చాడు .అయినా ముసలి రాజుకు ఆశ చావా లేదు .విదుర ,భీష్మాదులు చెప్పినా
విన లేదు .పాండవులను జయింప వచ్చును అనే దురాశ ఇంకా లోపల్లోపల మినుకు
మినుకు మంటోంది .కనుక చివరగా సంజయుడిని బాలా బలాల సంగతి అడిగి తెలుసు
కొన్నాడు .ఇక్కడ సంజయుడు చెప్పే సమాధానం చాలా లోకోత్తరం గా ఉంది పాండవుల
అవక్ర పరాక్రమాన్ని వైభవో పేతం గా ,దిమ్మ తిరిగే ట ట్లు వర్ణించి
చెప్పాడు .”అట మిన్నందిన యట్టి వాని పొడవెంతన్నట్లు ,ఫాలాక్షు నె
–క్కటి కయ్యంబున గొన్న ఫల్గును భుజా గర్వంబు లేక్కిన్చుటం–తటి వానిం
గొని ధర్మ సూతి సమరోత్సాహంబుమై నెత్తి వ–చ్చుట కుం గొంకు నె వీపు సక్క
నయి నిల్చుం గాక మీ సైన్యముల్ ”అని హేళన చేశాడు .రుద్రుని తో జగ జెట్టి
అయిన అర్జునుని పరాక్రమ విక్రమాన్ని ప్రదర్శన గా చూపించాడు .వీళ్ళు అందరు
ఒక ఎత్తు.అసలు సకల చరాచర సృష్టి స్తితి ,లయ కారకుడయిన శ్రీ కృష్ణ పరమాత్మ
సహాయ సంపత్తులుఒక ఎత్తు . ఇన్ని పుష్కలం గా ఉంటె ,ధర్మ రాజు యుద్ధం చెయ్య
కుండా ఆగుతాడా ? అని కుండా బద్దలు కొట్టాడు .యుద్ధం అని వార్యం అని తన
మనసు లోని మాట గా చెప్పేశాడు .ఇది హెచ్చరికే .భయపెట్టటమూ ఉంది ఈ మాటల్లో
.సంజయుడు జ్ఞాని కనుక జరుగ బోఏది ఏమిటో తెలుసు కనుక  లోక నాశనం కాకుండా
విశ్వ ప్రయత్నం చేశాడు .తన మనసు బుద్ధి ,వాక్కు ,లను త్రికరణ శుద్ధి గా
ప్రయోగించాడు .చాతుర్యమూ చూపాడు .అంతటి ఉక్తి ,చమత్కారం సంజయుని మాటల్లో
తిక్కన చెప్పించాడు .ఇలా రెండవ రాయ బారమూ విఫల మైంది .పాండవుల యుద్ధ
సన్నద్ధత తప్పదు అని తేలింది చివరకు .-
— సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-7-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.