తిక్కన భారతం –10
శ్రీ కృష్ణ రాయ బారం -1
సంజయుని ద్వారా ద్రుత రాష్ట్రునిని అంతరంగం ను పాండవులు పూర్తిగా
గ్రహించారు .ఇంకా ముసలి రాజు దురాశ లోనే జీవిస్తున్నాడని అర్ధమైంది .కనుక
తానే స్వయం గా రాయ బారానికి బయల్దేరాడు శ్రీ కృష్ణ పరమాత్మ .ఆయనకు తప్పని
పరిస్తితి .సంజయుడు హితుడైనా ,వాక్ చతురుడైనా ,అక్కడ సభ లో సముచిత స్థానం
లేని వాడు .కనుక అతని ఉప దేశం చెవిటి వాని చెవి లో శంఖమే అయింది
.నిరర్ధకమై అతి పరిచయం వల్లా ,ఎప్పుడూ చెప్పుతూన్డటం వల్ల ,ఫలితం కలుగ
లేదు .ఇక సామ దాన ప్రక్రియలు అయి పోయాయి .దండో పాయమే శరణ్యం .అయినా చివరి
ప్రయత్నం చేయాలని శౌరి భావించాడు .దానికి తానే పూనుకొన్నాడు .అక్కడికి
వెళ్లి క్రమంగా సామ దాన ,భేదాలను ప్రయోగించి చూద్దాం అను కొన్నాడు
.దివ్యాంశసంభూతుడు ,లోక పూజ్యుడు ,వీరాధి వీరుడు ,మంచి
డిప్లోమాట్,ఉపాయాలన్ని వివరం గా తెలిసిన వాడు ,శత్రు భంజన క్రీడా సక్తుడు
,అందరికి ”లోక బావ ”అయిన తానే సంధి కార్యానికి నడుం కట్టాడు .అందుకే
ధర్మ రాజు ”నీకు మేమేం చెప్పాలి .నీవు ఏది చేస్తే అది మాకు శిరో దార్యం
”అని భారాన్ని అంతటిని బావ నెత్తిన పెట్టె శాడు .
”మమ్మేరుగు డెదిరి నేరుగుదు -నెమ్మి ఎరుగుదు దర్ద సిద్ధి నెరి ఎరుగుదు
-వాక్యమ్ముల పద్ధతి నేరుగుదు -పోమ్మేవ్వాడ నేను నీకు బుద్ధులు సేప్పన్
”అన్నాడు .ఇదీ కృష్ణ రాయబారానికి నేపధ్యం .దీని ప్రకారమే కౌరవ సభలో కద
నడిపాడు కృష్ణుడు .ముందుగా పెద్ద రాజు తో ”జన నాధ !”అని మొదలు పెట్టాడు
సకల జనానికి రాజువు నువ్వే అని అర్ధం తో ప్రయోగించిన సాభి ప్రాయ మైన మాట
.రాజు గా నీ కర్తవ్యమ్ ఏమిటో ఆలోచించు అనే హెచ్చరిక నిగూధం గా ఉంది
.”నువ్వు ఎరుగని పనులున్నాయా ?అయినా పరమ హితం కనుక, తన వారికి చెప్పటం
ధర్మం కనుక ,భారతాన్వయం మీద ప్రేమ ఉంది కనుక నేనే స్వయం గా రాయ బారి గా
వచ్చాను” .అనటం లో తనకు అందరు సమానమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు
.”నీవు ఎరుంగని పను లున్నవే ?”అనటం లో నీకు తెలీకుండా ఈ సభలో ఏదీ జరగ
లేదు అని ఘంటా పధం గా చెప్పి నట్లే .అన్నిటికి నువ్వు ప్రత్యక్ష సా
క్షివే అని ముసలాయన్ను ఎద్దేవా చేయటమే ”.అందరికీ కావాల్సిన వాడిని” అని
చెప్పటం లో కౌరవులకు కూడా కృష్ణుడు ఏం చెబుతాడో అనే కుతూహలం కల్గించింది
.అదీ సంభాషణా చాతుర్యం .”తాను నూటికి నూరు శాతం మధ్య వర్తి ని” అని
గట్టిగా చెప్పే శాడు .”క్షీరోదక గతి పాండవ కౌరవులోడ గూడి మనికి కార్యం
”అన్నాడు .పాండవులు క్షీరం అయితే కౌరవులు నీళ్ళు కనుక ఏది శ్రేష్టమో
చెప్ప కుండా నే ఉపమానం తో చెప్పించాడు తిక్కన .పాలలో కలిస్తేనే నీటికి
పాల స్వభావం వస్తుంది .నీరు కలవక పోయినా పాల ఉనికికి ప్రమాదం ఏమీ లేదు
.కనుక దీనిని పాటించటం రాజుగా నీ కనీస ధర్మం అన్నాడు .కార్యభారం అంతా
ముసలి రాజు మీదే ఉంచాడు .నిజానికి ఆయనే రాజు, కాని చక్రం తిప్పేది కొడుకు
దుర్యోధనుడు .కర్తవ్యమ్ చెప్పి ,దాన్ని ఎలా నిర్వ హించాలో ,దాని
అవసరమేమిటో ,కారణాల తో సహా వివ రమ్ గా చెప్పాడు .”పొందు లోక హితం ”అని
గుర్తు చేశాడు ”.ఇదేదో దాయాదుల మనో వర్తి తగాదా కాదు .పాండవులు అంతా
ధర్మ ,న్యాయ వర్తనులు ,వీరాధి వీరులు ,కనుక అలాంటి గొప్ప వారిని నీలో
చేర్చు కుంటేనే నీకు లాభం” .అని చెప్పాడు ”.దీని వల్ల నీ ఔన్నత్యం
పెరుగుతుంది” అని ఆశ పెట్టాడు ”.అంతే కాదు సమస్త భూ మండలం నీపాదా
క్రాన్తమవుతుంది” అని వివరించాడు .”పుత్ర వాత్చల్యం తో ప్రజలను కూడా
చూస్తె ,విరోధం వది లేస్తే ,ఏంతో లోక హితం కలుగుతుందని ”చిలక్కి చెప్పి
నట్లు చెప్పాడు .–”జగతి గల జనపతులు నీచరణ పద -మరది గొలువ సముద్ర
వేలావ్రుతోర్వి -ఎల్ల నే లుట యొప్పదే తల్లి ప్రజల -యెడ విరోధంబు వాటించు
టెంతమేలు?”అని పెద్ద కాన్వాస్ లో సమస్త భూ మండలానికి నువ్వే రాజువు
అవుతావు .పాండవులు నిన్ను కొలుస్తూ నీ పాద సేవ చేస్తూ నీకు హాయిని
కూరుస్తారు .ప్రజలంతా హాయిగా శాంతి సౌఖ్యాలతో జీవిస్తూ నిన్నే తలచు కొంటూ
నీకు బరాబరులు చేస్తారు అని 70mm.,స్టీరియో స్కోప్ లో చూపించాడు .అయినా
ముసలాడు ఉలకలేదు పలుక లేదు .
మెత్తగా చెబితే వినే స్తితి దాటి పోయిందని కృష్ణుడు
తెలుసు కొన్నాడు .తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు గా పూర్వం జరిగిన
దానికి అంతా కురు సభ ప్రత్యక్ష సాక్షి అని సాక్షుల జాబితాను పెంచాడు
.”ధర్మో రక్షతి రక్షితః ”అన్నాడు .ధర్మాన్ని ఉపేక్షించిన సమర్ధులకు
చేటు మూడుతునది అని మందలించాడు .ఈ మాటల్ని ఎంతో భావ గర్భితం గా ,గంభీరం
గా కృష్ణుడి చేత మహా కవి తిక్కన చెప్పించాడు .”పాండవుల పక్షాన సత్య
,ధర్మాలున్నాయి .అవే వారిని రక్షిస్తాయి .కాని మీరంతా సర్వ సమర్దులైనా
,సత్య ధర్మాలను కాల రాస్తున్తెఉపెక్శిన్చి ”కిమిన్నాస్తి ”గా
ప్రవర్తించారు .కనుక అధర్మ ప్రవర్తకులతో పాటు ,ధర్మ నాశనాన్ని చూస్తూ
చేతులు ముడుచుకు కూర్చున్న మీకూ వినాశనం తప్పదు ”అని భీష్మ పితామహుడు
ద్రోణా చార్యుడు మొదలైన వారిని హెచ్చరించాడు .వారందరికి ”సర్వ ధర్మ
స్మృతి ”కల్గిన్చాతానికి ప్రయత్నించాడు .”ద్రోణ ,భీష్ము లే
దిక్కుసుమ్ము ?” .అని నిలదీశాడు .దుర్యోధనుడు భీష్మ ద్రోణుల మీద ఆధార
పడ్డాడు కనుక వాళ్ళిద్దర్నీ అధర్మ ప్రయత్నం లో విముఖత చూపెట్లు చేస్తే
-కోరలు తీసిన త్రాచులు లాగా కౌరవులు సంధికి అంగీకా రిస్తా రెమో నని
భావించాడు .ధర్మ నాశనం జరుగుతుంటే ఔదాసీన్యం చూపటం కూడా అధర్మమే నని
తీర్పు చెప్పాడు .ఈ విధం గా ”ధర్మంబును ,నీతియు మున్నిడికొని ,మనో
వాక్ప్రకారంబు లేక రూపంబైన సత్యమ్బకా ”అని ధర్మ సత్యాలను ముందుంచు కొని
వాటికి చేటు వాటిల్లు తుంటే నోరు మూసుకొని చేష్ట లుడిగి కూర్చోవటం కూడా
అధర్మమే నన్నాడు .చివరికిఅంతా నీదే భారం అని ముసలయ్య తో తెగేసి చెప్పే
శాడు
”వారలు శాంత శూరులు ,భవచ్చరణంబు గొల్వ బూని యు-న్నారటు గాక ,మీకది
మనంబున ప్రియ మేని నింతకుం –బోరికి వచ్చు చుండుదురు భూవర, రెండు తెరంగు
లందు ,నీ –కారయ బధ్యమే యగు నవ్విధ మేర్పడ నిశ్చ యింపుమా ”అని హితోప
దేశం చేశాడు ”.భావి సౌభాగ్య విదాతావు నువ్వే .నువ్వే నిర్ణయం తీసుకోవాలి
.మార్గం నిర్దేశిన్చాల్సింది నువ్వే నువ్వే ”అని పదే పదే గుర్తు చేశాడు
.దుర్యోధనుడిని ఎక్కడా సీన్ లోకి రానివ్వ లేదు మాటల సందర్భం లో .అదీ
కన్నయ్య నేర్పు .ఈ విధానం అంతా ఉత్తమ గురువు చేసే మహోత్తమ ఉపదేశం లాగా
ఉంది .ఈ ధర్మోప న్యాసం తో సభ్యుల్లో కలకలం చేల రేగింది .అందరు ఆలోచన లో
పడ్డారు .లోక హితం కోసం కృష్ణుడు చెప్పిన ధర్మ వాక్యాలకు బదులు సమాధానం
ఉండదు .అంత నిర్దుష్టం గా చెప్పాడు .అది శాసనమే .అందరికి శిరో దార్యమే
.సదస్యులు అందరు ”ప్రియం పొందారు ”అన్నాడు తిక్కన .దాని ప్రభావం అంత
గొప్పది .”నెమ్మనంబునన్ బురుషోత్తముడింత యొప్ప బల్కునే -మరు మాట లాడ ,నయ
కోవిదు డెవ్వడు ,ధీరు దేవ్వడు ,తను వరి యెవ్వడు అంచు నచలాక్రుతు లై
ఊరుకోన్నారట . అంతటి ప్రభావం కలిగించే విశిష్ట వచనాలను కృష్ణుడు పలికి
అందర్నీ అలరించాడు .అతను చెప్పిందే ధర్మమని అందరు అంగీక రించారు .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –19-7-12.-కాంప్-అమెరికా
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com