తిక్కన భారతం –11
శ్రీకృష్ణ రాయ బారం –2
శ్రీ కృష్ణుడు సభలో చెప్పినవన్నీ ఊసర క్షేత్రం లో పడిన బీజాల్లా
నిష్ప్రయోజన మైనాయి .దురాశకు ,పుత్రా వాత్సల్యానికి లోనైన వృద్ధ రాజు
ధర్మాన్ని నిర్వర్తించలేక పోయాడు . నారదుడు మొదలైన మహర్షులు ,భీష్మ
ద్రోణాది గురు సమూహం ,చేసిన హిత బోధ నీరు కారి పోయింది .శ్రీ కృష్ణుడు
దుర్యోధనుడిని అనునయం తో బుజ్జా గించి ,నచ్చ చెప్పా టానికి చేసిన
ప్రయత్నం విఫల మైంది .చివరకు బెదిరించాడు .సంధి జరగక పోతే అనర్ధాన్ని వివ
రించాడు .దుర్యోధనుడు మొండిగా ”ఎవ్వరైనా సంగ్రామ మునన్ జయించు కొని
రాజ్యము సేయుట నిస్చ యించి తిన్ ”అని తెగేసి చెప్పాడు .
ఇప్పటి వరకు చాలా మెత్తగా ,మధురం గా మాట్లాడిన వాసు దేవుడు తీక్ష్ణత
జోడించి, పుల్ల విరుపు గా మాట్లాడిన దుర్యోధనుడిని ఉద్దేసించి ఉద్రేక పడ
కుండానే సమాధానం చెప్పాడు .గాంభీర్యాన్ని మాత్రం సడ లించలేదు .అపహాస్యం
గా ,చిరు నవ్వు నవ్వుతు చిలిపి కృష్ణుడి లా తన ధీరో దాత్త త ను
,ప్రౌధత్వాన్ని వ్యక్తం చేస్తూ హితవు చెప్పాడు .-”’అనిన విని,కింక బూనిన
యలతి నగావు -చెలువు మొగమున నొక క్రొత్త పోలు పొంద -బుండరీ కాషు డగు తెల్ల
బోయి యప్పు -డరుణ కమలాక్షు డగుచు మురాంత కుండు ” అన్నాడు తిక్కన
.మురాన్తకుడు అనటం లో రాక్షస నాశనమే చేసిన వాడు వీరో లెక్కా అనే భావం
.కళ్ళు యెర్ర బడ్డాయి అంటే లోక ప్రళయం తప్పదని సూచన .”మొన తల బడియెదు నీ
చే–ప్పిన యట్టులతడవు లేదు బిరుదు లరైనీ–వును ,వీరు,నిలువు డిదె భం
-డనమెల్లి వచ్చే నూరతలు గను డిన్కన్”అని యెర్ర బడ్డ కల టో కోపం తో
మురహన్తకుడు చెప్పాడు .లే నవ్వు వింత అందాన్ని చ్చింది మొగానికి
.లోకానికి ద్రోహం చేసే వాళ్ళ విషయం లో గాంభీర్యం గా ఉండటం మహాత్ముల
లక్షణం .”మీరు కోరు కొన్న యుద్ధం మీ ముందుకే వచ్చి కూర్చుంది ”అనటం లో
కౌరవ సర్వ సంహారం తప్పదు అన్న సూచన .చివరకు తెగించి కృష్ణుడిని బంధించే
ప్రయత్నం చేశాడు సుయోధనుడు .అప్పుడు చెప్పాడు చివరి సారిగా పెద్ద రాజు తో
-”’రోషము నా పయిం గలిగి క్రూరత కౌరవు లింత సేత ,సం –తోషమ, నీవు
ప్రాభవము తో దగ నాకు ననుజ్ఞఇమ్ము ని–ర్దోషత నేను నోపు గతి , దోర్బల
దుర్జయు లైన వారి ,వి –ద్వేషము జక్క బెట్టి ,జగతీశ్వర ,ఇంతక పోయి
వచ్చెదన్ ” అని వీడ్కోలు తీసుకోన్నట్లుగా అన్నాడు .ఏది ఏమైనా లోక శాంతి
కావాలి .తను దుర్యోధనాదులను చంప టానికి ఇంత వరకు కారణం కంపించ లేదు
.ఇప్పుడు వాళ్ళే ఆ అవకాశాన్ని కల్పించు కొన్నారు .వినాశ కాలే విప రీత
బుద్ధి .కారణం బలీయం గా ఉంది .అందుకే ఖండితం గా చెప్పే శాడు
.”దుష్టుల్ని చంపి ,రెండు పక్షాల వారికి రక్షణ కల్పిస్తాను -దీనికి
నువ్వు అనుమతించు ”అని చంపే అధికారాన్నీ ముసలాయనకే కట్ట బెట్టాడు మహా
మతి మంతుడు పరమాత్మ .ప్రతి మాట ను చాలా అర్ధ వంతం గా ,సమర్ధ వంతం గా
మురారి చేత పలికించాడు తిక్కన .బంధువుల అను మతి తో తాను తన స్వంత మెన మామ
కంశుడిని వధించిన సంగతిని కధ గా వర్ణించి గుర్తు చేశాడు .ధర్మ రక్షణకు
బంధుత్వం అడ్డు కాకూడదు అని సూచించాడు . ”సత్కులము బాలిమ్పగ వర్జిం పగ
రాదే దుష్టాత్మకు నీచు నొక్కరుని ”అని కడపటి కర్తవ్యమ్ ఎరిగించాడు .అంతా
వ్యర్ధమే అయింది .బూడిద లో పోసిన పన్నీరు .అయినా రాజ కీయం గా ఉదాత్త మైన
రాయబారం ఇది .దీని వల్ల రెండు వర్గాల లోని వారి చిట్టా వృత్తులు ,అభి
ప్రాయాలు వ్యక్త మైనాయి .
”పాండవులు శాంత శూరులు అని ముందే కృష్ణుడు చెప్పటం తో తాను
వచ్చే ముందు ,ద్రౌపది ,భీముడు చెప్పిన మాటలు చెవిలో రింగు మంటూనే ఉన్నాయి
.భీమార్జునుల మాటల్లో శౌర్యం తో బాటు ,శాంతి కూడా ప్రచ్చన్నం గా
ధ్వనించింది .”ప్రశాంత గాభీరతా లక్షణం ”అనటం లో పాండవులకు అది బాగా
అన్వ యించింది . అన్ని పాత్రలు తమ భావాలను బాగా వ్యక్తం చేశాయి కనుక ఈ
రాయ బారాన్ని ”ఏకాంకిక ”అన్నారు .ఒక సారి ఫ్లాష్ బాక్ లోకి వెళ్తే,
,ఉద్రేకం గా,భీషణం గా మాట్లాడే భీముడు శాంతి వచనాలు పలికాడు కృష్ణుని తో
.చిరు నవ్వు తో కృష్ణుడు అతన్ని రెచ్చ గొట్టి మేల మాడాడు . అయినా
వృకోదరుడు ఉద్రేక పడ లేదు .సరసం గానే సమాధానం చెప్పాడు –”ఏమీ ,పార్ధుడు
నీవు ,దండి మగలై ఈ వచ్చు కౌరవ్య సం -గ్రామ క్షోభము బాహు దర్పమున దీర్పం
బెద్ద మిర్రెక్కి మి -మ్మేమెల్లన్ వెర గండి జూచేదము గా ,కీ సారేకుం
,బోయిరా –భీముందిత్తేరి రిత్త మాటలకు కోపిం పడుసూ ,పెంపరన్”అని చాలా
సరదా గా అన్నాడు .”ఓహో నువ్వు అర్జునుడు యుద్ధ ప్రవీను లై కౌరవ యుద్ధం
చేస్తుంటే ,ఎట్టు గా ఉన్న కొండెక్కి మేమంతా ఆశ్చర్యం తో చూస్తూ ఉంటాం
కానీ బావా -ఇప్పుడోద్దులే -నువ్వ్వెల్లి రావయ్యా ,ఉద్రేక పరిస్తే రెచ్చి
పోయే వాడేమీ కాదు ఈ భీముడు ”అని శాంతి మాత్రమె తమకు కావాలన్నాడు .
ద్రౌపది మాత్రం రోశాగ్ని జ్వాలలు కురి పించింది .ఆమె
క్రోధాగ్ని కౌరవులన్దర్నీ ఆహుతి చేస్తే తప్ప చల్లారదు అని తెలియ జేసింది
.చాలా గంభీరం గా మాట్లాడింది .విశిష్ట లోక జ్ఞానాన్ని ,వివేకాన్ని
ప్రదర్శించి మాట్లాడింది .పాండవ ధర్మ పత్ని అని పించు కొండి .”ఓట యొకింత
యేనియు సుయోధను చిత్తము నందు లేదు ”పొమ్మంది .”నీ మాటల వల్ల వాడి దురభి
మానం పోతుందా ?పైగా పెరుగు తుంది ”అని వాడిని కాచి వడ బోసి నట్లు వాడి
మనో భావాన్ని వివ రించింది .కోడలు అన్న భావం ఎ మాత్రం లేకుండా జూదం రోజున
దాసిగా చేసి ,మహా పురుషుని ,తన భర్తలు ఆ కొలువు లో మళ్ళీ చేరితే ,తనకు
లభించేది దాస్యమే నని ఖచ్చితం గా చెప్పింది .కోడరికం కాదు అన్నది .భర్తలు
తన గౌరవాభి మానాలను లెక్క చెయ్యటం లేదని ,నిస్పృహ వ్యక్తం చేసింది
.స్త్రీ నిస్సహాయత ను స్పష్టం చేసింది .ఆమె మాట లన్ని ఉత్తమ క్షత్రియ
స్త్రీ మాటలే .వీర వంశం లో జన్మించిన స్త్రీ పలుకులే .సామాన్య స్త్రీ
ప్రవర్తనా విధానమే .చూడండి ఆమె ఎంత చక్క గా చెప్పిందో అన్న కన్నయ్యకు –
”అరయమి జేసి కోడలనకప్పుడు ,దాసిగా జేసే ,నమ్మహా –పురుషుని పాలికిం
బతులు వోవగ,వీరలతోనఏను జే–చ్చెర జానీ కోటరంబు దగ జేయుదునో ,యటు గాక
,పాడిమై –వరవుడ మోపి జే యుదునో వారిక మాధవ నిశ్చయింపుమా ?”అని ప్రతి
మాటను సార్ధకం గా ప్రయోగించాడు తిక్కన .స్త్రీ స్వభావాన్ని అద్దంలో
చూపించాడు .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –20-7-12-శ్రావణ శుక్ల పాడ్యమి
– శుక్ర వారం –కాంప్–అమెరికా
—