తిక్కన భారతం – 12
శ్రీ కృష్ణరాయ బారం -3
పాండవ వీర మాత కుంతీ దేవి ఎన్నెన్నో కష్టాలను అనుభ వించింది
.కృశించి వరుగు అయింది .పాలలో పడ్డ బల్లి లా ఉంది ఆమె స్తితి .ఆమె మాటలు
వజ్ర ధారా లా గా ఉన్నాయి .ఇన్నాళ్ళు తన మనోవేదనను అత్యంత శక్తి వంత మైన
మాటల ఈటెలతో గుచ్చి చెబుతోంది .”కొడుకు గాంచు రాచ కూతురేడ్డానికి -నత్తి
పనికి నుచిత మైన సమయ మొదవే -దడయ టింక నొప్పదు జనములు -నట్లు గాని
పురుషుల నరు మిమ్ము ” అని తన కొడుకు లకు కర్తవ్య బోధ చేయమని మేనల్లుడు
కృష్ణుని తో చెప్పింది . ఇదంతా సంధి ప్రసంగానికి ముందే చెప్పింది .”భుజ
బలమున జీవించుట -నిజ ధర్మమూ మెత్త బడుట నిన్ద్యము -మాద్రీ ప్రజలకు
జెప్పుము ద్రుపదాత్మజ -గార్య మడుగు మానుము తగ నందరి లోనే ” తన
కొడుకుల కంటే నకుల సహదేవులైతే ఈ పరాభవాన్ని బాగా చల్లారుస్తారు అని కుంతి
భావం .హస్తిన లో రాయబారం తర్వాతా కృష్ణుడు కలిసి జరిగింది ఆమె కు వివ
రించాడు .ఆమె -”వీరి గలయుట కష్టం బా వెరవు దప్పుతయు మేలై వచ్చే బొమ్ము
-విడువను మానంబున్ ”అంది .రోగీ ,వైద్యుడూ ఒకటే కోరుకొన్నారు .పాండవులు
తమ స్వభావానికి విరుద్ధ మైన ,లోక న్యాయానికి వ్యతి రేక మైన సంధి ప్రయత్న
ప్రతి పాదనను చాలా కఠినం గా ,నిర్దాక్షిణ్యం గ నిరసించింది .ఆమె క్షోభ
భూదేవి క్షోభాయే .భూభారం తగ్గాలి అనేది ఆమె ఆరాటం .దుర్జను లతో
పోట్టేమిటి పొ పొమ్మంది .–”రాజుల కెందు నారయ బరాక్రమ జీవన వ్రుత్తి
దక్క ,నొం-దోజ నిషిద్ధమండ్రు మునులుత్తమ సత్వులు ,వంశ ధర్మముల్ –పూజిత
భంగి జేయుదురు బుద్ధి విహీనులు దాని దక్కి ,-నిస్తేజ పు గూటికియ్య కొని
నత బొందుదు రంబు జోదరా ” అని ఆక్రోశించింది .
క్షత్రియ రాజులు నమ్ము కో వాల్సింది భుజబలాన్నే .శత్రువు ల
పై కక్ష తీర్చుకోవటం వారి సహజ ధర్మం .పరుల దయా దాక్షిణ్యా లపై జీవించటం
రాజు కు నిషిద్ధం,నీచం .అని రాజ ధర్మాన్ని తగిన సమయం లో గుర్తు చేసింది
.ఉత్తమ బాల శాలురు వంశ గౌరవానికి అనుగుణం గా ప్రవర్తించాలి .వంశానికి
కీర్తి తేవాలి .బుద్ధి హీనులు మాత్రమె పరాయి కూడు కు ఆశించి ,దైన్యాన్ని
పొందుతారు .పాండు రాజు కీర్తిని పాండవులు పాడు చేస్తున్నారు .సత్వ హీనం
గా ప్రవర్తిస్తున్నారని విమర్శించింది .సంధి ప్రయత్నం మానక పోతే వారంతా
బుద్ధి హీనులు ,క్రుపణులు ,క్షత్రియ తేజో రహితులు అని నిష్టుర మాడింది
.నిస్తేజ మైన జీవితం కంటే రాజుకు వీర మరణం మేలు అని ధ్వనించేట ట్లు
చెప్పింది .ఆభిజాత్యం చాలా అవసరం అని గుర్తు చేసింది .పరాక్రమాలను
ఆశ్రయించి మాత్రమె రాజు దేని నైనా సంపాదించాలి.అదే జీవనం .అది కాక
అడుక్కు తెచ్చు కొంటె అది ”కూడు ”అవుతుందని ఎద్దేవా చేసింది .చక్కని
శబ్ద ప్రయోగం చేశాడు తిక్కన .ఈ పద్యం లో ప్రతి శబ్దం శక్తి వంత మైనఅర్ధ
సంపద తో ప్రయోగించాడు .దీనినే ”విశిష్టార్ధ వ్యంజనం ”అన్నారు
ఆలంకారికులు .వీర పత్ని వీర మాత పలికే పలు కులు గా క్షాత్ర తేజో మయ
స్వరూపం గా ప్రత్యక్ష మవుతాయిఆమె మాటలు .
ఆత్మ గౌరవం గల స్త్రీ గా ,కోడలికి జరిగిన అన్యాయాన్ని దిగ
మింగు కొన్న అత్త గారిలా ఆమె క్షోభ వర్ణనా తీతం .ద్రౌపది హృదయ బాధ ను
అర్ధం చేసుకొన్న అత్త గారామే .ఉత్తమ కుల కాంత ,తమ ఇంటి వధువు ,తన కుమారుల
సహా ధర్మ చారిణి అయిన అయోనిజ కు మాటలతో వర్ణించ రాని పరాభవాన్ని మర్చి
పోలేక పోతోంది కుంతి .తగిన ప్రతిక్రియ జర్గితే తప్ప ,ఆ తల్లి ఆవేదన
తీరదు,చల్లారదు .కేవలం రాజ్య లాభం నిష్ప్రయోజనం .అలాంటి జీవితం వ్యర్ధం
.ఆ విషయాలన్నీ బాహాటం గా నే చెప్పింది .”మరచిరే కొలువున ద్రౌపది -బరచిన
బన్నంబు ధర్మ పదము దోరంగన్.-వేరచుట కప్పటి కది తగు -జేరచిన చొ ,వెదక వలదే
చిరతర కీర్తిన్ ”అని భార్యకు జరిగిన పరాభవానికి ప్రతీ కారం చెయ్యటమే తన
కొడుకుల కర్తవ్యమ్ అని గుర్తు చేశానని కొడుకు లతో చెప్పమని మేనల్లుడికి
చెప్పింది .ఆమె పాలకులకు భీష్మ ద్రోణాదులు కూడా ఆశ్చర్య పోయారు .. కార్య
వాదం గా మాట్లాడే కృష్ణుడు ,కుంతి కూడా ఇలా బరి తెగించి చెప్పటం తో
”ధర్మజ మహా సముద్రానికి చెలియలి కట్ట లేదని” గ్రహించారు .ఏమి చెయ్యాలో
తోచని వింత స్తితి సందిగ్ధం లో పడి పోయారు .ఇలా ప్రతి సన్నీ వేశం
హృదయాలకు హత్తు కుంటుంది .
తిక్కన మహా కవి ప్రతి పాత్ర వెనుక దాగి ఉండి ,సూత్ర దారి యై సంభాషణలు
చెప్పించి నట్లు కనీ పిస్తుంది .ప్రతి పాత్రనుస్పష్టం గా మలిచాడు .
స్పష్టత ఉంది .సంభాషణ లన్ని శక్తి మంతాలు ..శిష్ట వ్యావ హారిక భాష నె ఉప
యోగించాడు .ప్రతి పదం లోను తెలుగు నుడికారం జీవం పోసుకోన్నది .గీత ,కంద
పద్యాలతో అంటే చిన్న పద్యాలతో విశిష్ట మైన భావాలను తెలియ జేశాడు .దీనితో
”దేశీయత ”కు పెద్ద పీట వేసి నట్లయింది . తెలుగు పలుకు బడులు
,లోకోక్తులు ,చక్కగా ప్రయోగించ టానికి మంచి వేదిక దొరికింది తిక్కనకు
.ఇతి వృత్తం అంతా మానవ జీవితానికి సన్నిహితం .మూడు రాయబారాల్లోను మంచి
వైవిధ్యం ఉంది .తిక్కన లోకజ్ఞత ,రాజ్యాంగ పరిజ్ఞానం బాగా వెల్లడయింది
.శ్రీ కృష్ణ రాయబారం లో కృష్ణుని జీవిత తత్త్వం కూడా బాగా ఆవిష్కారమయింది
.మానసిక స్తితులను వెలికి తీయటం తో రచన చైతన్య విలసిత మైంది .మనుమ సిద్ధి
రాజు గారి మంత్రిగా ,రాజ్యాంగాని నడి పాడు కనుక ,ఆ అనుభవ సారం ఇక్కడ
పిండి పడేశాడు .స్వానుభవానికి మించింది లేదు కదా. ఉద్యొగ పర్వం అంతా”
నానా రస చిద్విలాసం ”. రాజ నీతి వైదుష్య ప్రదర్శనం .ఆంద్ర మహాజనులు ఈ
పర్వం లోని ప్రతి కణాన్ని ఆస్వాదించి ఆనందించే టంత మధురం గా వ్రాశాడు
తిక్కన .అందుకే ఈ పర్వానికి అంతటి ఆకర్షణ శక్తి .
సశేషం –మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ — 21-7-12
–కాంప్–అమెరికా
—