తిక్కన భారతం –13 యుద్ధ పంచకం లో విక సించిన మానవ ప్రకృతి-1

తిక్కన భారతం –13
యుద్ధ పంచకం లో విక సించిన మానవ ప్రకృతి
-1
భీష్మ ,ద్రోణ ,కర్ణ ,శల్య ,సౌప్తిక పర్వాలను యుద్ధ పంచకం అంటారు .యుద్ధ రంగం జన జీవనానికి దూరం గా ఉంటుంది .యుద్ధం లో వీర ధర్మం ఆకర్షణీయం గా ఉండదు .జుగుప్స భీభత్సా లతో నిండి ఉంటుంది .అందుకని సామాన్యులకు రుచించదు .అయినా ఇందు లో కూడా తిక్కన ,అసాధారణ ప్రజ్ఞను చూపి ,చదవరులకు ఆకర్షణ కలిగించాడు .ఆయన ప్రతిభ సర్వతో ముఖం గా వికసించింది .-”వేద వ్యాస మునీశ్వరు –పదంబులు దలచి మ్రొక్కి ,భక్తీ రసైకా -స్వాదన సుకరానందో –త్పాదన దివ్య మతి నగుచు దగ నేరిగింతున్ ”అని సంజయుడు ద్రుత రాష్ట్రునికి చెప్పిన మాట తిక్కనకూ వర్తిస్తుంది .18 అక్షౌహిణీ సైన్యం తో ,18రోజులు జరిగిన యుద్ధాన్ని రస వంత మైన కావ్యం గా వ్రాయటం అంత తేలికైన పనేమీ కాదు .అందుకే వ్యాసర్షి కి నమస్కరించాడు .భక్తీ రసం తో ఆనందం తేలిగ్గా లభిస్తుందని భావించి ,ఆ ఆనందం తో దివ్య మైన మనోబలం తో యుద్ధ పర్వాన్ని రచిస్తానని ప్రతిజ్ఞ చేశాడు తిక్క యజ్వ .-”ద్వాపరే ద్వాపరే విశ్నుహ్ వ్యాస రూపో జనార్దనః ‘అన్న దాని ననుస రించి ,ద్వైపాయన మహర్షి సాక్షాతూ శ్రీ కృష్ణుడే కనుక ,ఆతని యెడ భక్తీ తో ,దివ్య చక్షువు తో ,బుద్ధి వికాసం తో ,ఆర్ష ధర్మ మైన కవితా శక్తి తో రచన చేసి నట్లు మనం భావించాలి .విసుగు కల్గించే యుద్ధ వర్నలు లేకుండా ,వర్ణనా వైవిధ్యం తో ,సందర్భోచిత మైన శైలి తో ,రస పోషణ ,ఔచిత్యం ,ఉట్టి పడేట్లు చిత్రించాడు .చైతన్య విలసితం గా ,అర్ధ స్ఫూర్తి ,భావ గాంభీర్యం లతో ఉదాత్తత ను కల్పించటం తిక్కన శేముషికి నిదర్శనం .యుద్ధానికి మనోహరత్వాన్ని రూపు కట్టించిన మహా కవి తిక్కన.
భీష్ముడు యుద్ధం లో కూలి పోయాడు అర్జునుని వీర విహారం తో .ఆ బాధ తో ద్రుత రాష్ట్రుడు –”అంచిత తాల కేతు కిరనాలి మేరుమ్గులు గాగ ,మౌర్వి మ్రో–యించుట గర్జ చందనమున నేచి ,విరోధి దవానలంబు ,మా–యించు శితాస్త్ర వర్షమున నిట్టిది భీష్మ మహాభ్రం మెట్లడం- గిన్చేనో శిఖండి యను గ్రుత్రిమ వాయువు దాకి దైవమా !”–”పెరిగి పాండవామ్బుధివెల్లి  విరిసి నపుడు -నిలువ నిమ్మగు దీవిగా నిన్ను దలచి -యుండ నత్యంత తుచ్చ శిఖండి పల్వ -లాక్రమంబున మునిగి తె యకట తండ్రీ ”అని ముసలి రాజు ఏడ్చేశాడు .”దైవమా ”అని రెండు సార్లు అంతం తో ఇంకా తన చెయ్యి దాటి పోయిందని గ్రహించాడు .ఇదీ మానవ ప్రకృతి .విధి విలాసం ,వైపరీత్యం ఎదిరించ రానివి .పాండవులు అనే మహా సముద్రం ఉప్పొంగినా ,మునగని భీష్ముడు అనే ద్వీపం శిఖండి అనే చిన్న నీటి మడుగు పొంగ టం వల్ల  ఆక్రమింప బడింది మునిగి పోయింది . అంటే విధి బలీయం కదా .ఇప్పటి దాకా కౌరవులకు ఆశ్రయమైన దీవి మునిగి పోతే వారి ఉనికి కే మహా ప్రమాదం కదా .ఇంక వాళ్ళ కు ఆశ్రయం ఏదీ ,ఎక్కడ తల దాచు కొంటారు?పాండవ సముద్రం లో కౌరవులంతా మునిగి పోవాల్సిందే నని ధ్వని .ఆ మాట ముసలాయనే అనే శాడు .అర్జున పరాక్రమం వర్ణించ టా నికి ముసలి రాజు కు ఎన్నో మాటలున్నా పదాలున్నా ”శిఖండి ”అనే మాట నే ప్రయోగించాడు రెండు సార్లు .ద్రుపదుని కొలువు లో” పేడి వాడి ”లా గా తల దాచుకొన్న వాడా ఇంతటి పని చేసింది అని ఈస దింపు ,అసహ్యం కూడా .పక్షపాతం నర నరాన జీర్ణించి పోయింది ముసలి రాజుకు .అయినా కురు వంశాన్ని ఇప్పటి దాకా నిలబెట్టి కంటికి రెప్ప లా కాపాడిన పితామహుని పతనానికి గుండెల్లో ఎక్కడో మారు మూల కలుక్కు మంది.చదివిన మనకూ బాధ కల్గిస్తాడు తిక్కన .
”అమర నదీ సుతుండు వాడి నప్పుడు ,వీరల బుద్ధి సంధి కా –రయమునకు జొచ్చు నింక నని ,యాత్మ దలంచితి నమ్మహాత్ముడున్ –సముచిత వాక్య వృత్తిగురునాయకు దేర్పరగా జూచే ,చిత్త దో –ష మహిమ ,నద్దురాత్ముడు ,ప్రశాంతత నొందద ఎన్ని భంగులన్ ”అని శల్య వధ తర్వాతా అర్జునుడు దుర్యోధనునిమూర్ఖత్వాన్ని గురించి కృష్ణుని తో చెప్పాడు .-”గంగా తనయుడు దెగినను -సంగరమున నుత్స హింప జనునే తమకున్ –వెంగలులని ,యప్పుడు దేలి –యంగా నేరిగితి సుయోధనాదుల గృష్ణా ;;!అని కిరీటి కుంగి పోయాడు .ఇలా భీష్ముని యుద్ధౌన్నత్యాన్ని ,పెద్దరికాన్ని కురువంశ పాలకుడిని రెండు వైపులా వారూ ఎంత స్పష్టం గా అంచనా వేశారో తెలుస్తోంది .దీని వల్ల యుద్ధ పరిణామం కూడా నిశ్చయ మై పోయి నట్లే .ఈ పద్యాలలో ప్రతి పదం ధ్వని ప్రధానం .అర్ధ గౌరవంతో తొణికిస లాడాయి .ఇవి యుద్ధ పర్వం లో తిక్కన చేయ బోయే భావి శిల్పానికి మచ్చు తునకలు మాత్రమె .
ద్రోణ పర్వం లో కూడా కౌరవ సేన స్తితి ని వర్ణిస్తూ -”పతి రహితాత్ముడైన సతి భంగియు ,గోపక హీన మైన గో–ప్రతతి విధంబు ,సస్య విదూర స్తితి యైన ధరిత్రి చాడ్పును -ద్ధత హరి శూన్య మైన వసుధా ధర కందర భూమి చందమున్ — ,మతి మన సేన దోచే  బుధ మాన్యుడు భీష్ముడు లేక యుండుటన్ ”అని వర్ణిస్తాడు .భర్త లేని స్త్రీ ,కాచే వారు లేని ఆవులు ,రక్షణ లేక పోవటం వల్ల దుర్మార్గుల బారికి ,మృగాల నోటికి ఆహారం అవుతాయి .పంట లేని భూమిని చూస్తె ,ఈసడింపు ,సింహం లేని గుహ అంటే తెలికదనం లోక సహజం .అలాగే భీష్ముడు లేని కౌరవ  సైన్యం అనాధ ,దీన ,అని తప్పక పాండవుల చేతి లో చిక్కుతుంది అనే ధ్వని ప్రధాన పద్యాలివి .అంతేనా ఇంకా విజ్రుమ్భించి మానవీయ కోణాలను ఆవిష్కరిస్తాడు .”తన ప్రియుడు , ,రక్షకుడు అయిన బార్థ ను తన ఎదుటే మింగిన తోడేళ్ళ గుంపు తనను చుట్టూ ముట్టగా భయ కంపిత అయి ,దిక్కులు చూసే ఆడ జింకలా ఉందట కౌరవ సైన్యం .ఇది అత్యంత ప్రత్భాన్విత ధ్వని తో కూడిన పద్యం .”భీష్ము నాజిం గబళించిన పాండవుల విక్రమ లీల ”ను అత్యంత అద్భుతం గా వర్ణించాడు తిక్కన .పాండవుల అకలి తీర లేదని ,మిగిలిన వాళ్ళ ను కూడా మింగనిదే శాంతించదని ధ్వని .ఆకలి మహా ఎక్కువ గా ఉండే జంతువూ తోడేలు .అందుకే ఆ పదాన్ని సందర్భోచితం గా ప్రయోగించాడు .
అసలు యుద్ధానికి బయల్దేరు తున్న పాండవ కుమారా వర్గానికి ”కన్నె కయ్యం ”అవటం తో ఉత్సాహానికి అంటూ లేకుండా పోయింది .ఎప్పుదేప్పుదని ముందుకు దూకు తున్నారు పాండవులు .నవ యవ్వనం లో ఉండటం తో నడక -మదించిన ఏనుగు లాగా ఉందట .భూమి కంపిస్తోందట .ఉత్సాహ ,వికాసాలతో వాళ్ళ ముఖాలు భుజ గర్వం తో పొంగి పోతున్నాయట..”కన్నె కయ్యం -మాద్యద్దంతి యూధం ”అన్నాడు .మనోహర మైన అర్ధ స్ఫూర్తి .ప్రళయ కాలం లో తానడవ లీల లో ప్రచండ మూర్తి అయిన పరమ శివుని లా విజ్రుమ్భిస్తున్నాదట భీష్ముడు .ఎదిరించే మొన గాడు లేక పాండవ సైన్యం కకా విక లైంది .అప్పుడు వచ్చాడు యువ కిశోరం అభి మన్యుడు .కృత వర్మ ,కృపు లను అడ్డగించి ,ముత్తాత భీష్ముని పైకి లంఘించాడు .-ఆ వైభవం చూడండి –”ఆ సౌభద్రుమ్ డుగ్రపు-వేసవి దావాగ్ని శుష్క విపినంముల నిరా–యాసంబుగ–‘  దరి కొను గతి -భాసిత శర శిఖలు వారి పై బర గిన్చేన్ ”–”రంగ త్ప్రద నస్త్నస్త్యుత్యాటు -రంగాముడై ,తాన్దవాభి రాతుడగు హరు లీ–లం గడగివీర నృత్యము -సంగర రంగమున జేసే శత్రులు మెచ్చన్ ”—-పనికి రాణి ,నీరస మైన అడవిలా ఉన్న కురు సేనకు తీవ్ర వేసవి దావాగ్ని అభి మన్యుని క్రోధం .ఊరికే దాహించేస్తుంది .దీనితో సర్వ కురు సైన్య విన్నషణం ధ్వనిస్తోంది .అడవికి నిప్పు అంటూ కుంటే అంతా కాలిస్తేనే కాని చల్లారదు ఆర్పే వారుండరు .అలానే ఉంది కౌరవ సైన్య స్తితి .అభి మన్యుని శౌర్యం ప్రళయ కాల రుద్రుని తో పోల్చటం వల్ల ఉదాత్తత కలిగింది .బిందువు తో ఉన్న ”డకారం ”,పాదాన్తాలలో విరుపు వల్ల శబ్దార్దాల తో మంచి భావం ,ధ్వని లో లయకాల తాండవం స్పష్టం గా కళ్ళకు కన్పిస్తాయి .భీష్ముడు అష్ట మూర్తి అయిన హరుడు .అభి మన్యుడు తాండవ హరుడు .ఈ పోలిక లో అష్ట మూర్తి ఆధిక్యత ధ్వనిస్తుంది .ఇద్దరు హరుల పరాక్రమం విలాసం .అంతే కాదు -ఇంకో చోట అభి మన్యుడు అనే కార్చిచ్చు కౌరవ సేన అనే దూది పై పది నట్లుంది అన్నాడు .ఇది ఇలా ఉంటె –దుర్యోధనుడు ఎడురైనాడు .ఎలా ఉన్నాడు అంటే -”ఆకలి లో ఉన్న సింహం దగ్గరకు చేరే ఏనుగు లా గా ఉన్నాడట .ఇక్కడ ఏనుగు దుర్యోధనుడు .సింహం అభి .ఇక్కడా కౌరవ పరాభవం ధ్వనించింది .ఇంతలో క్రుపఅశ్వథామ స్వతామ ,కర్నూలు వచ్చి అభి మాన్యుని బారి నుండి ,కురురాజు ను కాపాడు కొన్నారు .అభి మాన్యుని నుండి అభి మాన్యుని రక్షించటం క్రూర వ్యాఘ్రం తిన బోయే మాంసాన్ని హరించటం వంటిది అట .క్రోధాగ్ని తో వీరందరి పై బాణాగ్ని కూరి పించాడు యువ కిశోరం .గర్జన తో పారి పోయిన లెల్ల గుంపు లాగా పారి పోయారట .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ — -22 -7-12 క్యాంపు -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.