అమెరికా డైరీ శత దినోత్సవ వారం

 అమెరికా డైరీ 
                                                                                          శత దినోత్సవ వారం
జులై  పదిహేను సోమవారం  నుండి ఇరవై రెండు ఆది వారం వరకు విశేషాలు – వాన ప( పు )లకరింపు -దక్షిణాయనం -శ్రావణ మాసం విశేషాలు
కిందటి వారం అంతా టన్చన్ గా రోజు సాయంత్రం అయిదు గంటల నుంచి ఆరు గంటల వరకు వర్షం పలకరించి ,పులకరించి పోతోంది .ఉష్ణోగ్రత 96fపైనే ఉండటం ఈ జల్లులు వర్షం తో హర్షాన్ని కలిగించాయి .సమయ పాలన ను వాన దేవుడు బానే పాటించాడు .సోమవారం ,ఆదివారం మైనేని గోపాల కృష్ణ గారు ఫోన్ చేసి మాట్లాడారు .పదహారో తేది రాత్రి సూర్యుడు మకర రాశి నుండి కర్కాటక రాశి లోకి ప్రవేశించాడు .ఉత్తరాయన పుణ్య కాలం వెళ్లి దక్షిణాయనం వచ్చింది .ఈ శుక్ర వారం నుండి శ్రావణ మాసం ప్రవేశించింది .

ఫొటోస్
  శ్రావణ శుక్ర వారాల హడా విడి
ఈ శుక్ర వారం  నుండి వరుసగా వచ్చే అయిదు శుక్ర వారాలు మా అమ్మాయి విజ్జి వాళ్ళింట్లో రాత్రి పూట  ,అమ్మ వారి స్తోత్రాలు  భజన కార్య క్రమాన్ని ఏర్పాటు చేసింది .మొదటి శుక్ర వారం రాత్రి ఎనిమిది గంటలకు భజన మొద లైంది సుమారు ముప్ఫై మంది వచ్చారు గంట సేపు అమ్మ వారి స్తోత్రాలతో భజన బాగా జరిగింది .విజ్జి ,శ్రీ కెత్ ల తో పాటు మిగిలిన వారందరూ భజన గీతాలు పాడారు .ఆ తర్వాతా అందరికి విందు –అన్నం ,బెండ కాయ  కూర ,దోసావ కాయ ,గోంగూర పచ్చడి ,చపాతీ ,చోలీ కూర ,సాంబారు ,సేమ్యా పాయసం  ,పులిహోర ,అప్పడాలు ,పెరుగు తో రుచి ,శుచి కర మైన భోజనం .అందరు తృప్తి గా తిని అభి నందించారు .మిగిలిన నాలుగు వారాలు ఇలానే రావాలని అందరికి చెప్పటమే కాదు -అందరికి మెయి ల్ రాసింది ఇది వరకే .అంతా ఆయె సరికి రాత్రి పదిన్నర అయింది .వచ్చే శుక్ర వారం వర  లక్ష్మీ వ్రతం .ఉదయం ఎవరింట్లో వారు పూజ చేసుకొని రాత్రికి ఇక్కడికి వస్తారు .వాయనాలు ఇక్కడే ఇచ్చు  కొంటారు .చాలా మంది  మహిళలు వస్తారు కనుక అదొక వీలు .
ఈ ఆది వారం సాయి సెంటర్ లో ఉదయం పదింటి నుండి జరిగే కార్య క్రమానికి చాలా రోజుల తర్వాతా వెళ్లాను .మధ్యాహ్నం పన్నెండున్నర దాకా ఉండి ఇంటికి వచ్చాము .ఇక్కడి సాయి సెంటర్ గురించి కొన్ని విషయాలు తెలియ జేస్తాను .వీరి లో ఎక్కువ మంది మద్రాస్ ,హైదరాబాద్ ,వగైరా సత్య సాయి సెంటర్లు అ యిన ”సత్యం ,శివం ,సుందరం ”లలో ప్రత్యక్షం గా సంబంధం ఉన్న వాళ్ళు .వారందరూ మంచి క్రమ శిక్ష ణతో ,సాయి సేవా కార్య క్రమాలను ,భజనలను అత్యంత శ్రద్ధా ,ఆసక్తులతో నిర్వ హిస్తారు .డబ్బులు వసూలు చేయరు .అంతా వాలంటరీ సేవే .ఇందులో తెలుగు తమిళం మలయాళం ,హిందీ గుజరాతి ,రాజస్తానీ ,మొదలైన వారందరూ ఉన్నారు .భాషలు వేరైనా భావాలు ఒక్కటే .సేవ ప్రేమ . అంకిత భావం తో పని చేస్తారు .పిల్లలకు ప్రత్యెక క్లాసులు నిర్వ హించి వారి ని ఆదర్శ మార్గం వైపు కు మళ్లిస్తారు .పిల్లలందరూ చక్కగా కలిసి మెలసి ఉంటారు .ఎవరో ఒకరింటి వద్ద సాయంకాలా లలో భజన ఏర్పాటు చేసు కొంటారు .మిగిలిన వారు హాజరై కార్యక్రమాన్ని నిండుగా నిర్వ హిస్తారు .వీలైతే రాత్రి ఏదో టిఫిన్ ,లేక భోజనం ఏర్పాటు చేస్తారు గృహస్తులు .చెయ్యాలి అనే నియమం  లేదు .వారి ఉత్సాహం .డోలక్, హార్మని, తబలా వాయించే కళా కారులు మంచి గాత్రం తో శ్రావ్యం గా పాడే వారు  వీరి లో ఉన్నారు .వీరందరూ ఆడా మగా దాదాపు ఐ.టి.ఉద్యోగులే .తీరిక సమయాలలోనే ఈ సేవ .మధ్య మధ్య మెడికల్ కాంప్ లను నిర్వ హిస్తారు .మందులు ఉచితం గా ఇప్పిస్తారు .పూర్ ఫీడింగ్ ను చర్చి వారి సహకారం తో నిర్వ హిస్తారు .
ముఖ్య మైన విషయం సాయి సెంటర్ లోని వారంతా ఎ ప్రాంతం వారైనా ”శాకా  హారమే ”భుజిస్తారు .మద్యం సిగరెట్ల జోలికి వెళ్లరు .ఇవి నా లాంటి వాళ్ళందరికీ ఆనంద దాయకం గా ఉంది .మంచి కుటుంబం లా కలిసి మెలిసి ఉంటారు .ఇంత కంటే అమెరికా లో మంచి సమాజం ఉండదని పిస్తారు .మా ఇద్దర్ని ”అంకుల్ అని ఆంటీ ”అని ఆప్యాయం గా పలక రిస్తారు .అన్నిటి కంటే ఒకరి నొకరు కలిసి నప్పుడు ,విడి పోయే టప్పుడు ”సాయి రాం ”అని పలకరించు కొంటారు .భజన ముందు ,తర్వాతా ”సర్వే  జనా స్సుఖినో భవంతు .సమస్త లోకాస్సుఖినో భవంతు ”అని ప్రపంచ ,విశ్వ శాంతి మంత్రం చదువు తారు .ఇన్ని వేల గొంతులు ప్రపంచ వ్యాప్తం గా ఈ మంత్రాన్ని చదువుతుంటే సామూహిక వాక్కు ఫలితం ఉంటుందని మనకు తెలుసు .భోజనం చేసే ముందు భగవద్గీత శ్లోకాలు చదువుతూ అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం గా భావిస్తూ స్తోత్రం చేస్తారు .
సత్య సాయి భజనలు ఎ దేశం లో నైనా ఒకే రకం గా చేస్తారు .అవి చక్కగా బాణీలు కట్టి కే రకం గా పాడు కొనే తట్లు ఉంటాయి .అన్ని గ్రంధస్తం అయి ఉంటాయి . .ఎవ రైనా అలానే పాడ తారు .ముందు మామూలు స్తాయి, తర్వాత వేగ వంతం, తర్వాత తారా స్తాయి, మళ్ళీ మామూలు కు వస్తారు .భజనలు అన్ని చాల మంచి భావం తో శ్రీ రామ ,శ్రీ కృష్ణ శివ ,షిర్డీ ఆయీ బాబా జొరాస్టర్ ,క్రీస్తు మహమ్మద్ ,అల్లా పార్వతి లక్ష్మీదేవి ,సరస్వతి కాళిక ల పేర భజనలుంటాయి . .ఎ దేవుణ్ణి ,మత ప్రవక్త ను వదలరు .గణపతి ,సుబ్రహ్మణ్యం బుద్ధ ,జైనులనూ స్మరించే భజనలున్డటం విశేషం .  .సర్వ మత సహనం ఇక్కడ స్పష్టం గా కనీ పిస్తుంది .చివర్లో ప్రతి భజనలో షిర్డీ సాయి ,సత్య సాయి పేర్లు వుంటాయి .అదే ప్రత్యేకం .ప్రపంచం అంతా ఒకే పధ్ధతి లో భజన చేయటం గొప్ప విషయం .ఆదర్శం .సత్య సాయి మీద నమ్మకం ఉన్నా లేక పోయినా ఈ విధానం నాకు నచ్చింది .
సరే –అసలు విషయానికి వస్తే -మేము అమెరికా వచ్చి మూడు నెలలు దాటి పది రోజుల పైనే అయింది .అంటే వంద రోజులు అయిందిఅన్న మాట .అంటే ”శత దినోత్సవ వారం ”అయింది ఈ వారం మాకు …
ఈ వారం లో ఒకే ఒక పుస్తకం paul brunton రాసిన  in search of secret india ”  ను చాలా ఆసక్తి గా చదివాను .దీన్ని నాకు కానుక గా ఇచ్చారు మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు .దానిని ఆధారం గా ఇప్పటికి మూడు  ఆర్టికల్స్ -పరమాచార్య సందర్శనం తో పులకింత ,మేహేర్బాణి,పరమా చార్య పధం  రాశాను .ఇంకా భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి గురించి, ఇంకా మరో రెండు ఆర్టికల్స్ రాయాలి .ఇది గాక లైబ్రరి నుండి తెచ్చిన ‘Albert Eistein ”క్షున్నం గా చదివి నోట్సు రాసుకోన్నాను .అవీ ఎప్పుడో వరుసగా రాయాలి .అంతకు మించి ఏమీ చదవ లేక పోయాను .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –23-7-12-కాంప్–అమెరికా
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.