తిక్కన భారతం –14 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –2

  తిక్కన భారతం –14
                            యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –2

ప్రకట బలాధ్యులోక్కత దిరంబాయి ,పల్వురు వీక ,భూమి పా– లునకు నడ్డ  మైన దవులంబడి ,హుమ్మని నోరి కంద ,నా–చి గోన మ్రోగు బెబ్బులి విశేషము దోపగ ,బార్ధు పట్టి ,సా –యకముల నొంచి నం దెరలి రందరూ లేళులపిండు నాకృతిన్ ”
                                                పద్మ వ్యూహం 
పద్మ వ్యూహం లో అర్జున పుత్రుని విశ్రుమ్ఖాల వీర విహారానికి ఈ విధం గా నే పద్య రచన జరిగింది .ద్రోణునికి ఏమీ పాలు బోవటం లేదు .కర్ణ ,శకుని ,శల్య ,ఆశ్వతామ లను అస్త్ర గురుడైన ద్రోనాచార్యునికి  అధర్మానికి ప్రోత్స హించ క తప్ప లేదు .తీవ్ర మైన లోక నిండా కూడా భారించాల్సింది ఈ అవి వేక చర్య వల్ల .అందరు చేరి ఒకన్ని చేసి శస్త్రాస్త్రాలతో కొట్టి చిక్కుల్లో పడేశారు .అయినా ”వాలును ,బలకయు ను ,గొని ,య- బ్బాలుడు రాయ మార గణన భాగంబు న,కు –న్మీలిత ధృతి సారుండై–లీల నెగసి పోయే మండలీ భూత గతిన్ ”—”తన విద్య కలిమి వినతా –తనయుని భంగిం జరిం ప దామ తమపై డిమ–పూనా నూరుకు నను తలంపున -మన యోధులు భయము గొనిరి మనుజా ధీశా ”౧అని సంజయుడు అభి మన్యుని పరాక్రమాని వివ రించాడు .ఈ విధం గా ద్రోనాదులు ఊహించని అద్భుత విధానం లో అభి పరాక్రమం తో వీర విహారం చేశాడు .ఓర్వలేని గురుదే అతని ఖడ్గాన్ని ఖండించే శాడు .అయినారాధా చక్రం తీసుకొని ఉపెంద్రుడి లా మీద పడ్డాడు .–”కుంభ సంభావుడున్న దిక్కునకు గవిసి –యడ్డు పడు సేన జించి చెందాడు నక్కు –మార వరుని మేని యొప్పును మగతనంబు –జలము ,బలము గీర్తించే నిర్జరా గణము ”


అపకారం చేసిన వారిని కాటేసి చంపటం కృష్ణ సర్పానికి సహజ లక్షణం .అలాగే మీద పడ్డాడు అభి .వీరాధి వీరు లందర్నీ చీకాకు పెట్టాడు .ఒంటరి పోరు తో అలసి పోయాడు .చివరికి దుశ్శాసన కుమారుడిని చంపి ,తానూస్వర్గం చేరి చరిత్ర సృష్టించాడు అర్జున సుతుడు అభి మన్యుడు .యువకులకు ఆదర్శ మీనాడు .విధి వంచితు దాయాదు .కమలా కారాన్ని కల్లోలం చేసే వన గజాన్ని దయ లేకుండా ముట్ట డించిబోయ వారు చంపినా విధం గా అందరి అధర్మ ప్రవర్తన తో మహా వీరాధి వీరుడు అభిమన్యు కుమారుడు నెల కోరిగాడు .ఈ విషయాన్ని సంజయుడు ద్రుత రాష్ట్రునికి అద్భుతం గా వర్ణించి వీనుల విందు చేశాడు ముసలి రాజుకు .సంజయునికి మాత్రం తీవ్ర మనో వేదస్న కలిగించింది అభి మరణం -”జగము లన్ని యు తేజమున వెలిగించి -యపరాద్రి సేరిన ,తపను మాడ్కి –దార చైనా కాన్లు దరి కొని నివురు గా –జేసి ,యారిన ,దవ శిఖి విధమున –గగనంబు తో రాయు కరడులు గల జాలం –బివు ర బారిన మహార్ణవము కరణి -యున్నత గతి సెడి యుర్వి పై గడు విన్న –నైపది యున్న సుధాంశు భంగి –బీరమున దన వారికి బెమ్పోనర్చి -యరుల సమయించి వస మరి ,యనువు దప్పి ,లెగియు జూడ్కి కి జాల వ్రేగ గుచు బొలిచె –మహిత మూర్తి శోభితుడు ధన్యుడదిప ”తిక్కన సంజయుని నోటి తో పలికించిన ఉపమానాలన్ని ఉత్తమోత్తమం గా ఉంది అభి పటిమ ను మహోన్నతం గా  పెంచాయి .మూడు లోకాలను వెలిగించిన సూర్యుడు అస్తమించాదట .అరణ్యాన్ని బూడిద చేసిన దావాగ్ని ఆరి పోయిందట .మహా సముద్రం ఇంకి పోయిందట .లోకాలను వెలిగించే చంద్ర బింబం భూమి పై వాలి పోయిందట .ఇదంతా కాల వైప రీత్యం -విధి విలాసం .శుదాంషుడు అనటం లో మహా పరాక్రమం మనోహరం గా ఉందని భావం .హృదయ రంజకం గా యుద్ధం చేశాడని అర్ధం .అతి లోక యుద్ధ విహార స్వరూపం చూపించటం ,మహత్తర మైన ఉపమానాలు వాడి ,మన మనస్సు లను లాగి వేశాడు తిక్కన .అయ్యో పాపం అని పించేట్లు చేయ గలిగాడు అదీ సహృదయ స్పందన .లోకోత్తర పరాక్రమానికి లోకోత్తర ఉపమానాలు .ఔచిత్యానికిది పరా కాష్ట .
పద్మ వ్యూహం లో అభిమన్యుడు ప్రవేశించ టానికి ముందే తిక్కన పలికించిన వాక్యాలు అనర్ధాన్ని సూచించేవి గా కానీ పిస్తాయి .”నీకు యుద్దానుభావం లేదు .సాహసం చెయ్య వద్దు ”అని అభి సారధి ముందే హెచ్చ రించాడు .దానికి అభి –”అనవుడు నల్ల నవ్వి ,దతతనికి ట్లను దేవ యుక్తుడై -యనికి బలారి వచ్చిన ,బురారి గానంబుళు ,దాను బన్నినం –గినిసి కడంగి ,క్రీడియు కృష్ణుడు డాకిన  నే ,జయింతు ,మా–ర్కొని ,యను చుండుడున్ ,సరకు గొందునె ద్రోణుని తోడి యోదులన్ ”  ఇవి ఒక వీరుని ఉత్సాహ వాక్యాలే కావు .విధి ప్రేరితం గ మృత్యు ముఖం లోకి ప్రవేశించే వాడి నోటి నుండి వచ్చిన అతి సాహస వాక్యాలు .అతి ఆవేశం తో ,అహంకారం తో అన్న మాటలు .ఆరి పోయే దీపం ఒక్క సారి మినుకు మన్నట్లు వెలిగింది అంతే .ఇలా అభి మన్యు యుద్ధం లో విషాదం గర్భితం గా ఉంది .మర్నాడు అర్జునుడు వీర విహారం చేశాడు .సైంధవ రక్షణ కోసం ద్రోణుడు విశ్వ ప్రయత్నం చేసినా దాన్ని విఫలం చేయ టానికి అర్జుండు ప్రదర్శించిన అస్త్ర విద్యా నైపుణ్యం ,భీమ ,సాత్యకి ల శౌర్యాలను అద్భుతం గా వర్ణించి ప్రత్యక్ష దర్శనం చేయించాడు తిక్కన .
సైంధవ వధ కోసం అర్జునుడు ఏకాకి గా పద్మ వ్యూహం లోకి ప్రవేశించాడు .అతనికి సహాయం చేయ టానికి భీముడు వచ్చాడు .ద్రోణుడు అడ్డు పడ్డాడు అంతకు ముందే సాత్యకి ద్రోనుడిని తప్పించు కొని లోనికి ప్రవేశించాడు .సాత్యకిని పోనివ్వటం లో ద్రోణుడికి మనసు లో ఆంతర్యం ఉంది .సైంధవ వధ తో పాటు సాత్యకి రక్షణ కూడా అర్జునుని పై ఉంటుందను కొన్నాడు .ఈ పరిస్తితి లో భీముడు కూడా లోపలి చేరితే తమ పని ఖాళీ .నిజం గానే ,యుద్ధం లో అలసి పోయిన సాత్యకిని అర్జునుడు కాచు కొన్నాడు .శత విధాల భీమున్ని లోపలి పోకుండా అడ్డు కున్నాడు ఆచార్యుడు .ఇక్కడ భీమ పాత్ర ను చాలా గొప్పగా పోషించాడు ”నీ తమ్ముడు నా అనుమతి తో లోనికి ప్రవేశించాడు .నువ్వు మాత్రం నన్ను గెల్చి లోపలి వెళ్లాల్సిందే ”అని చెప్పాడు .భీముడికి కోపం వచ్చింది –”నరుదొక రది కుని యను మతి జొర దలచునే -మనుజ సేన ,సుర బాల మీనన్ -దెరలి కొని విచ్చల విడి నరుగున్ దన వలచిన ఎదకు -నది యట్లుండెన్ ”అని తమ్ముడి శక్తి సామర్ధ్యాలను ఏకరువు పెట్టాడు అర్జునుడు లోపలి వెల్ల టానికి ఎవరి అనుమతీ అక్కర్లేదు పొమ్మన్నాడు .అయితే తాను అర్జునుని లాంటి వాణ్ని కానని తన మగటిమి ని తెలిపాడు –”ప్రియమున వల్కి ,నిన్నను సరిమ్పగా ,పార్ధుడు కాదు సుమ్ము ,దు –ర్జయ భుజ శక్తి ,నిర్మదిత శత్రుడు భీముడు గాని ,నీవు ,డం –డ్రియు ,గురుండు బ్రియుమ్డు నని ,ప్రీతీ యొనర్చెద బూని వైరికిన్ –జయ మొన రింతు గాక,యని సేతునే దర్పము సూప కుండునే ”అని తన గద ను విసిరాడు .దాని కాంతులు అన్ని వైపులకు ప్రసరిచాయి .గురువు గారి రధం ముక్కలై పోయింది .ఆయన వేరొక రధం ఎక్కి వచ్చాడు .ఆయన్ను గెల్చి లోపలి వెళ్లటం సులభం కాదని గ్రహించాడు .ద్రోనుడిని విముఖుడిని చేసి ,ఆ వ్యవధి లో ల్పలికి ప్రవేశించాలని నిర్ణ యించాడు .ఆ ప్రయత్నాన్ని తిక్కన పరమ రమణీయ మైన పద్యం లో పోదిగాడు —  ”అరదము డిగ్గి ,యప్పటు శరా’వలికోర్చి ,మొగంబు వాచీ ,స -త్వరుడాయి ,వాన పై గురియ వంచిన మస్తకమొప్ప బోవు ,సుమ –దార వృష భంబు లీల జానీ ,,దర్ప మేలర్పగా నొక్కచే ,నొగల్ –వెరవున బుట్టి ,తేరు ప్రజా విస్మయ మందగా వీచి వైచి నన్ ;;–వర్షం పడుతుంటే -అతి ఉత్సాహం తో చేల రేగి ,తల వంచి ఎత్తైన ప్రదేశాన్ని ,కొమ్ముల తో ధీ కొనే కోడే గిత్త లాగ ఉన్నాడట భీముడు .ఎంతో సహజ మైన వర్ణన .అతని మాటల్లో క్షాత్రం ,రాజసం ఉట్టి పడ్డాయి .గురువు కనుక పితృ సమానం గా ఆరాధిస్తాను కాని ,శత్రువుకి జయం చేయాలని ప్రయత్నిస్తే -శౌర్యం చూప కుండా ఉంటానా -అని అతని మాటలకు అర్ధం .చేతల్లో చూపించాడు .ఇందులో పరాక్రమ ఉద్ధతి ,వినయం ,వివేకం ఉన్నాయి .ఇంతటి భీకర యుద్ధం లో కూడా ఇంత మనోహర వర్ణన .
భీష్ముడు ,అర్జునుడు తేవ్రం గా పోరాడుతున్నారు .కృష్ణుడు ఆగ లేక పోయాడు .రధం దూకి ,భీషుని పై కుప్పించి ,ఎగసే ఘట్టాన్ని పోతన్న గారు భాగవతం లో వర్ణించిన పద్యం మనకందరికీ వచ్చు .ఇక్కడ అదే దృశ్యాన్ని తిక్కన ఎలా వర్ణించాడో చూద్దాం –”ధరణీ చక్రము గ్రక్కునం గదల ,దిగ్దంతా వలి శ్రేణి ,కం –ధరముల్ ,మ్రోగగా బదన్ ,దిశా వలయముత్కంపంబు గా ,నీ బలం –బురులం బారాగా భీష్ము పై గమిసే రౌద్రోద్రేకము జూచి ,ఖే –చార లోకంబులు సంచరింప  హరి చంచాద్బాహు ఘోరాక్రుతిన్ ”అని వర్ణించి వెంటనే దృశ్యాన్ని మార్చేస్తాడు తిక్కన .–”లలిత పీనామ్బరంబు విలాస మొప్ప –సింహ ,నాదోద్భాతం బరగు చెలువు తోడ –మెరుగు వెలుగును ,గర్జయు మెరయ వచ్చు –కారు మొగిలన కృష్ణు నాకార మొప్పె ”.నిమిషాల మీద పద్యాలు దృశ్యాలు మార్చి భావ శుద్ధి తీసుకు రావటం తిక్కన చాతుర్యం .ఆతన లో భక్తీ ,ఇక్కడ శ్రీ కృష్ణుని వీర విలాసం .అంతే తేడా .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-7-12.–కాంప్ -అమెరికా .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.