తిక్కన భారతం –15
యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి -3
మేఘ ధర్మం కాంతి ,గర్జనలు .నలుపు రంగు ను వాచ్యం చెయ్య కుండానే వ్యంగ్యం తో చెప్పాడు తిక్కన .సహజ మనోహరాలైన ఉపమానా లతో ఉదాత్త మైన విశేషార్ధాలను ధ్వనింప జేయటం లో తిక్కన గడుసు వాడు .ఇదే ప్రౌఢ కవి లక్షణం .ఈ ధ్వనికే ”కావ్యాత్మ ”అని పేరు .
అర్జునుడు వేసిన బాణాలతో శరీరం అంతా గాయాలై రక్తం ఓడుతున్న కర్ణుడు ”గిరికా నిర్ఘర ప్రకార శోభితా చలం ”లా గా ఉన్నాడట .రక్తం తో తడిసిన శరీరం కమనీయ కాంతి తో ఉంది .మహాస్త్రాల కాంతి గొప్ప గా ప్రకాశిస్తోంది .రధం పై ఉన్న కర్ణుడు సంధ్యా కాల సూర్య బింబం లా శోభితం గా ఉన్నాడు .పశ్చిమ దిశ కు చేరే సూర్య బింబం లాగా ఉన్నాడు .”భాస్వర ”అనే శబ్దం ఇటు కర్ణుడికి ,సూర్యుడికి కూడా వర్తిస్తుంది .త్వర లోనే అర్జునుని చేత వధింప బడతాడు అనే ధ్వని .ఈ విషయాన్ని అస్తమించే సూర్యుడు అనటం లో ధ్వనింప జేశాడు .సూర్యుడు తన ప్రచండ ప్రతాపం తో లోకాన్ని తపింప జేసి ,తన కాలం తీర గానే అస్తాద్రికి చేరటం సహజం .సూర్యుని అంశ తో జన్మించిన కర్ణుడు కూడా నేలకు ఒరుగుతాడు అని ధ్వని .అందుకే తిక్కన -;;దారుణాస్త్ర జాలామ్షుల వైరి సైన్య –తాప మొనరించి యా సూత తనయ తరణి –పార్ధ దుస్తర కాలవైభవము గడవ -ననువు లేమి ,నవ్విధంబున నస్త మించే ”కర్ణుని ప్రతాపాస్తామయం ,సూర్య ప్రతాపాస్త మయం తో అభేద మైన రూపకం చేశాడు కవి .కర్ణుని ప్రతాపాన్ని వర్ణిస్తూ ,దావాగ్ని జ్వాల అన్ని వైపులా వ్యాపించినట్లు ,బాణ జ్వాలలు సర్వ దిశలా ప్రయోగించాడట కర్ణుడు .కాలే వృక్షాలు ,వెదుళ్ళు ,ఫెళ ఫెళ ఫెళ ధ్వనించి నట్లు కర్ణుని వింటి ధ్వని విని పిస్తోందట .
భీముడు గద తో గజ సమూహం పై దాడి చేయటం వల్ల ముఖం ప్రకాశించిందట సరైన జోడి దొరికి నందుకు .”ఏనుగు నెత్తుట గదయున్ ,దాను దడసి ,విలయ కాల దండ ధరుణి చందమున ”ఉన్నాడట భీ ముడు .అంతే కాక ”అడవి దరి కొనిన ,పావకు వడువున భీముడు ”కౌరవ వ్యూహాన్ని పొడి చేశాడు .పీనుగు పెంట చేయటం దండ ధరుడు అంటే యముని లక్షణం .అడవిని కాల్చటం అగ్ని పని .దహించిన కొద్దీ దావాగ్ని వ్యాప్తి విస్తారం అవటం సహజం .దాహక శక్తి కూడా వృద్ధి చెందు తుంది .అందుకే భీముని దేహం ఉప్పొంగి పోయింది .అతని శక్తి ,ఉత్సాహం ఇనుమడిస్తున్నాయి .సారధిని రధం లోనే ఉండమని ,దిగి ,గదతో వీర విహారం చేసిన తీరు అత్యద్భుతం ,దివ్య శక్తి స్పోరకం .అగ్ని కి తర తమ భేదాలుండవు .అలానే భీముడు అందర్ని స్వా హా చేస్తున్నాడు –ఆ వైభవం చూడండి —
”కవిసి యుగాంత దండ ధరుని కైవడి ,గోలు మసంగి ,కుంభముల్ –పవులగ ,దున్దముల్ దునియ ,బ్రక్కలు వ్రక్కలు గాగ ,దర్పమున్ –జవము బలంబు ,నొప్పగ,గజంబుల వ్రేసిన ,నెత్తు రోల్క గా –నవి ,వడె ,ధాతు నిర్జర మయాచల పంక్తుల బోలి మేదినిన్ ”.యుగాంతం లో ప్రాణులను చంపటం యముని ధర్మం .ఆ విలయం లో రౌద్రం ,భీభత్సం తప్పదు .అవి విలయ నృత్యామే చేస్తాయి .అలాగే కౌరవుల పాలిటి యముడు అయాడు భీముడు .సహజ సుందర వర్ణన .కింద పడిన గజ రాజులు ధాతు వులతో ,నిండిన పర్వతాల లాగాఎర్రగా ఉన్నాయట .పద్యం నడక మత్తేభం జి నడక లా ఉద్రేక ప్రధానం గా ఉండటం మరో విశేషం .
సైంధవ వధ నాడు అర్జున వీర విహారాన్ని కూడా అద్భుత రస పోషణ లో వర్ణించాడు .కవితా శిల్పానికి వన్నె తచ్చాడు .కిరీటి యెడ తెరిపి లేని యుద్ధమే చేశాడు .అర్జునుని అశ్వ శరీరాలు బాణ మయాలైనాయి .అవి కదల లేవు అన్నాడు కృష్ణుడు .రధం దిగాడుకిరీటి . .గాండీవ జ్యా రవం చేశాడు .కౌరవ సైన్యం ఒక్క సారి గావచ్చి మీద పడింది .ఆ సమయం లో అర్జునుడు ప్రదర్శించిన గాండీవ ,అస్త్ర విన్యాసం అనితర సాధ్యం అని పించింది .అసాధారణ మైన ఆత్మ విశ్వాసం తో ,గాంభీర్య శౌర్యాదు లతో ,పాండవ మధ్యముడు మహా యుద్ధం చేశాడు .దివ్యం గా ప్రవర్తించాడు .తిక్కన వర్ణించిన తీరు చూడండి —
”భీభత్స ,రౌద్ర మహాద్భ్తములు -మూర్తి మంతములుగా మన మొనలు రక్త -మాంస ,మేదో సతి మస్తిష్కమా యథా జూడ -ఘోర రూపంబులై పరిక్షోభమొందే ”-ఇలా భీభత్సం సృష్టిస్తున్న భీ భత్సుడినవ్వు ను చూసి బావ కృష్ణుడు –”పెరికిన బాగులు మేనులు -నేరి బడ నెల్లెదల గలయ ,నివిరితి ,ప రు లి -త్తరి నీళులు ద్రావకతె -ప్పిరి నెట్లొకో శత్రు సైన్య భీకర మూర్తీ “‘!మళ్ళీ నవ్వాడు గాండీవి .అందర్నీ నీళ్ళు కూడా తా గ కుండా చేస్తున్నావు అని మేళ మాడాడు బావ .ఇదిగో చూడమని బాణం తో నేల పగుల గొట్టాడు .బాణాలతో తొట్టె కట్టి ,అందులోకి భూగర్భ జలాలను చేర్పించి ,త్రాగించాడు బావ కృష్ణ మూర్తి కి .-”ధర దివ్యాస్త్ర హతిం బగిల్చి -కొలనుత్పాదించి ,వె,దానికిన్ –శర జాలంబుల నిల్లు గట్ట మన సైన్యంబులున్ వెరం బొందె ,న –చ్చెరు వందెన్ సుర సంఘముల్ ,హరి నుతించేమ్బొంగి ,యప్పార్దు ,భూ –వర ,మున్నిట్టివి ,సూడరు ,విననేవ్వారుం ద్రిలోకంబులన్ ”ఇలాంటి వింత ఇంత వరకు యుద్ధ రంగం లో ఎవరు చూడలేదు విన లేదు ఇక్కడే కాదు త్రిలోకాలలో కూడా అని ఆశ్చర్యం తో సంజయుడు ముసలి రాజుకు వర్ణించి చెప్పి పొంగి పోయాడు అర్జున ప్రతాప గరిమను చూసి .భీ భత్సం గా యుద్ధం జరుగు తోంది .అలంటి సమయం లో ఈ అద్భుతాలన్ని విలాసం గా ,ఆట విడుపు గా ,అలవోక గా చేశాడు అర్జునుడు .ఇక సైంధవుడు బ్రతకటం కల్ల అని తెలియ జేసి నట్లే .ఇదంతా అతని చావుకు నేపధ్యం -అర్జున మూర్తి మత్వాన్ని ప్రశంశ చేస్తూ చెప్పిన పద్య రాజాన్ని చూద్దాం –
”కురు సేన పై బడ్డ సరకు సేయక మంచు -విరియించు ,భానుని వెరవు మెరసి –ఇది నడుగ గల నని ఇంచుక గొంకక -తన ఘోటకంబుల దడవ బనిచి -కొలనక్కజంబుగా నలుగుల మొన ఘటి -ఇంచి యమ్ముల దాని కిల్లుగట్టి -సారధి లీల నశ్వముల కార్యము దీర్చు -నంతకు నవ్వుచు నవుల నిలిచి –గారవమున దాను గాని వాడును బోలె –నరద మెక్కె నింక నడ్డు పడగ –నలవియె ,పురారి కైన ను,వీనిచే -జచ్చు వాడు గాక సైంధవుండు ” .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-7-12–కాంప్–అమెరికా .