శాస్త్ర సామాజిక రాజకీయ వేత్త- బెంజమిన్ ఫ్రాన్క్లిన్
శాస్త్ర వేత్త
కొద్దో గొప్పో సైన్స్ చదువు కొన్న వారికి విద్యుచ్చక్తి కని పెట్టింది బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని తెలుసు .ఆ పై సైన్స్ చదివిన వారికి లైటేనింగ్ కండక్టర్ ను కని పెట్టి నదీ ఆయనే అని తెలిసి ఉంటుంది .ఆయన శాస్త్ర వేత్త .ఒక ఇన్వెంటర్ .బైఫోకల్స్ ను ,ఉప్పునీటి నుండి ఉప్పు ను వేరు చేయటాన్ని ,స్టవ్ ను ,కాపీయింగ్ మెషీన్ ,మడిచి పడుకునే వీలున్న చైర్ ను ,ఇంటి దర్వాజా వద్ద ఎవరు వస్తున్నారో తెలియ జేసే అద్దాన్ని ఆయనే కానీ పెట్టాడని చాలా మందికి తెలీదు .ఆయన తన కాలం కంటే ముందున్న వాడు .ఆలోచనలు అంత దూరం గా ఆలోచించే వాడు .టేస్ట్ ట్యూబ్ అంచులను కాని ,పలుచని గాజు గ్లాస్ ను కాని శిలకు తోనో ,ఫ్లానేల్ తో నో రుద్దితే విద్యుత్ పుడుతుందని మొదట కానీ పెట్టింది ఆయనే .దాన్నినే శతావర విద్యుత్తు -స్టాటిక్ కరెంట్ అన్నారు
.ఎత్తైన భవనాలను పిడుగుల నుండి కాపాడటానికి మొన దేలిన ఇనుప రాడ్లను అమరిస్తే మెరుపు లోని విద్యుత్తు దాని ద్వారా భూమి లోకి ప్రవేశించి ప్రమాదాన్ని తప్పిస్తుందని సూచింది ఫ్రాన్క్లినే .దాన్ని పేటెంట్ చేయ కుండా వదిలేసినఉదారుడు .గాజు ను సిల్క్ తో రుద్దితే కరెంట్ వస్తుందని చెబితే ఇంగ్లాండ్ దేశం లో ఎవరు నమ్మక ఒక పిచ్చాది కింద జమ కట్టారు .అమెరికా వాడు ఇంత పని చేయగలడా అని ఏమీ చదువుకొని వాడా దీన్ని కనీ పెట్టేది అనిఅవన్ని ”ఫీల దేల్ఫియా ప్రయోగాలు ”అని తేలిగ్గా తీసుకొన్నారు . నిరసించారు .తరువాత చెంప లేసుకొని ఆ యన ప్రతిభ ను గుర్తించారు .మెరుపు లో విద్యుత్తు ఉందని ప్రయోగ పూర్వకం గా రుజువు చేశాడు .హార్వర్డ్ ,ఎల్ వర్సిటీలు ఆనరారి దిగ్రీలిచ్చాయి .చివరికి లండన్ లోని రాయల్ సొసైటీ 1753లో బంగారు పతకాన్నిచ్చి గౌర వించింది .1756లో రాయల్ సొసైటీ మెంబర్ ను చేసింది .ఆయన వాతావరణం లోని గాలి కదలికల వల్ల తుఫాన్లు ఎలా వస్తాయో చెప్పాడు .కొండలు ఏర్పడే విధానం ,సముద్రం లోని ఫాస్జిల్స్ ఏర్పడే వైనం గురించి పరిశోధించాడు .సముద్రపు గుల్లల మీద ఆలోచన చేశాడు .మందుల గురించి క్షున్నం గా తెలుసు కొన్నాడు .శరీరం లోని ద్రవాన్ని బయటకు తీసి పరీక్షించే ట్యూబ్ తయారు చేశాడు .చర్మం లోని సూక్ష్మ రంధ్రాలు చేసే పని ,రక్తం ఎలా శరీరం లో ప్రవహించేది తెలియ జేశాడు .చీమలు తమ లో తాము మాట్లాడు కొంటాయని తెలియ జేశాడు .పావురాలను పెంచే విధానం సూచించాడు .వ్యవసాయాన్ని గార్డె నింగ్ ను స్కూల్ సబ్జెక్టు లలో బోధించాలని సూచించాడు .ఆయన ప్రింటింగ్ ప్రెస్ నడిపాడు .అందులో ఎన్నో ప్రయోగాలు చేశాడు కాలెండర్ తయారు చేసిpoor richard’s almanaak అని పేరు పెట్టాడు . .ఇవన్నీ ఆయన లోని శాస్త్ర వేత్త ను ఆవిష్కరించే విషయాలే .విద్యుత్తు కు సంబంధించిన ఎన్నో పదాలను ఫ్రాన్క్లినే సృష్టించాడు వాటినే ఇప్పటికి మనం వాడుతున్నాం . battery ,armature ,charge ,condense ,conductor ,discharge ,shock ,leyden botttle ,negative charge ,positive charge మొదలైన వన్నీఆయన మొదట గా వాడినవే .ఇలా సైన్సు కు ఆయన ఎంతో సేవ చేశాడు .ప్రీస్త్లీ మొదలైన శాస్త్ర వేత్త లతో ప్రత్యక్ష పరిచయం ఉంది .లండన్ లో ఐజాక్ న్యూటన్ ను కలుద్దా మను కొన్నాడు కాని కలవ లేక పోయాడు .
సామాజిక వేత్త
ఫ్రాంక్లిన్ మాసా చూసట్స్ లో పుట్టినా జీవితం లో ఎక్కువ భాగం ఫిలడెల్ఫియా లో గడిపాడు .ఆయన ను ఉత్తర అమెరికా డిప్యూటీ పోస్ట్ మాస్టర్ జెనెరల్ గా నియమించారు .ఆ సమయం లో వర్జీనియా నుండి న్యూ ఇంగ్లాండ్ వరకు ఉన్న అన్ని పోస్టాఫీసులను సందర్శించి వాటి పని తీరును వృద్ధి చేశాడు .ఆయన కాలం లోనే మొట్ట మొదటి సారిగా రాత్రి ,పగలు ఉత్తరాల రవాణా ఫిలడెల్ఫియా న్యూయార్క్ బోస్టన్ లకు జరిగింది .లేజిస్లాచ్ర్ లో గుమాస్తా గా పని చేశాడు ..ఫిలడెల్ఫియా నగరాన్ని పరి శుభ్రం గా ఉంచాడు .కాపలాదారును నియమించ టానికి ఫండ్స్ లేక పోతే తేలిక పాటి పన్నులు వధించి ,ఆ డబ్బు తో వాచ్ మాన్ ను ఏర్పరచాడు .అగ్ని ప్రమాదాలనుండి రక్షించ టానికి ఫైర్ ఫైటర్స్ ను తయారు చేశాడు fire engenes vaatiki కావలసిన పరికరాలను కొని పించాడు .జార్జి విత్ఫీల్ద్ అనే మత ప్రచారకుని సాయం తో ”అనాదాశ్రమం ”ఏర్పరచాడు .వయోజన విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించాడు .లాటరి విధానం ప్రవేశ పెట్టి, జూదాన్ని తగ్గించే ఆలోచన చేశాడు . పౌర సైన్యాన్ని తయారు చేసి సమాజాన్ని రక్షించుకొనే శిక్షణ ఇచ్చాడు .గదులకు వెచ్చదనాన్ని కల్గించే హీటింగ్ స్టవ్ తయారు చేశాడు .ఆయన -ఫసిఫిక్ అట్లాంటిక్ సముద్రాల మధ్య నార్త్ వెస్ట్ రహదారి నిర్మించాలని ,బానిసత్వాన్ని నిర్మూలించాలని ,జిల్లాను ఆధునీ కరించాలని తలచాడు .,అమెరికా లో మొదటి బాత్ టబ్ ఏర్పరచాడు . ,ఫైర్ డిపార్ట్మెంట్ ఏర్పడాలని ,వార్తా పత్రిక లలో కార్టూన్లకు ప్రాధాన్యం ఉండాలని కోరాడు .ఆయన బైబుల్ ను సాధారణ ఇంగ్లీష భాష లోకి తర్జుమా చేశాడు .పేపర్లకు సంపాదకీయాలు రాసే వాడు .ఆస్పత్రుల సంఖ్య పేర గాలాని మెడికల్ స్కూల్ అవసరమని భావించాడు .ఇవన్నీ కాలం కంటే ముందున్న ఆలోచనలు .బిల్డింగ్ లోని సెకండ్ స్టోరికి టాయిలెట్ సౌకర్యం కల్గించాడు . మొదటి లైబ్రరి ని ఏర్పాటు చేశాడు
.ఆయన మొదటి” విండ్ సర్ఫర్ ”. అమెరికన్ నావికా దళం ఎర్పరచటానికి కృషి చేశాడు .పారా ట్రూపర్ల గురించి ,సబ మేరీన్ల గురించి ,ఆలోచించి యుద్ధం లో వాటి సాయం చాలా ఉంటుందని తెలియ జేశాడు .ఇతర గ్రహాలలో జీవం ఉందని చెప్పాడు .సోప్ ఒపేరా రాశాడు .ఒక సారి ఆయన ఒక వైన్ గ్లాస్ లో పడి మునిగిన ఈగలు బతికి బయట పడటం చూశాడు .అప్పుడు తనను కూడాచని పోయిన తర్వాత ” వైన్ కాస్క్” లో భద్ర పరిస్తే శతాబ్దాల తరువాత బతుకు తానని సరదాగా అన్నాడు .
రాజకీయ వేత్త ,
the pensilvena gazette అనే వార్తా పత్రికను నడిపాడు .పెన్సిల్వేనియా లెజిస్లేచర్ లో ముఖ్య సభ్యుదయాడు .అక్కడి నేటివ్ అమెరికన్ల తో ఒప్పందం కుదర్చు కోవటానికి నియమించ బడ్డాడు . సరిహద్దు రక్షణ కోసం ఆయన్ను నియమించారు .కోటలను కట్టే ఏర్పాటు బాధ్యత అప్ప గించారు .సైన్యాన్ని తయారు చేసే బాధ్యతా ఆయనదే .వారికి ట్రైనింగ్ ఇచ్చాడు .వాలంటీర్ ఆర్మి బాగా పని చేసింది అతని ఆధ్వర్యం లో . 1757 లో పెన్సిల్వేనియా ప్రతి నిది గా లండన్ వెళ్లాడు .అక్కడి రాజును కలిశాడు .కాలనీ లకు బ్రిటీష సభలో సభ్యత్వం ఉండాలని వివ రించాడు స్టాంప్ ఆక్టు వ్యతి రేకించాడు .అయినా అది పాస్ అయింది ,మళ్ళీ తీవ్రం గా వ్యతి రేకిన్చిచేప్పి దాన్ని రద్దు చేయించాడు .బ్రిటీష ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్ఫిల దేల్ఫియా లోని ఇల్లు తగల బెడ తామని బెదిరించారు .లొంగ లేదు .అప్పటికే డెబ్భై ఏళ్ళు వచ్చాయి .అమెరికా స్వాతంత్ర పోరాటం తీవ్రం గా ఉంది .రెండవ కాంటి నేన్తల్ కాంగ్రెస్ కు ప్రతి నిది అయాడు .అప్పటికే ఆయన కొడుకు విలియమ్స్ న్యు జేర్సికి బ్రిటీష గవర్నర్ గా ఉన్నాడు .బ్రిటీష ప్రభుత్వం ఫ్రాంక్లిన్ ను పోస్టల్ ఉద్యోగం లో నుంచి పీకేసింది .కాని కాంగ్రెస్ మళ్ళీ నియమించింది .పెన్సిల్వేనియా ను రక్షించే రక్షణ కమిటీ చైర్మన్ అయాడు .యుద్ధ పరికరాలు తయారు చేయటం మందు గుండు సామాను తయారు చేసే బాధ్యత తీసుకొని సమర్ధం గా చేశాడు ..article of confederation and perpetual union రాసి కాలనీ లన్నిటికి పంపాడు .కాంగ్రేస్ ఇతన్ని మీసా చూసేత్స్ కు జార్జి వాషింగ్ టన్ తో మాట్లాడ టానికి పంపింది . .కాంటి నేన్తల్ ఆర్మితయారు చేయాలనే ఆలోచన లో పాలు పంచుకొన్నాడు .కెనడా ను కూడా ఒప్పించటానికి ఫ్రాంక్లిన్ ను పంపారు .కాని వాళ్ళు అంగీకరించ లేదు . 1776 july 4 న అమెరికన్ కాలనీలన్నీ స్వాతంత్రాన్ని ప్రకటించి డిక్ల రేషన్ తయారు చేసి విడుదల చేసింది .దానిలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు .
అమెరికా స్వాతంత్రానికి మద్దతు ఇవ్వమై ఫ్రాన్స్ ను కోరే పని మీద ప్రాభుత్వం ఫ్రాంక్లిన్ ను పారిస్ పంపింది .వారిని ఒప్పించాడు .ఇక్కడ అమెరికా బ్రిటన్ సైన్యం తో యుద్ధం చేస్తోంది .యుద్ధానికి మద్దతు కూడా గట్టె ప్రయత్నం చేయాల్సి వచ్చింది .అక్కడ అమెరికా బ్రిటీష సైన్యాన్ని వాషింగ్ న్ నాయకత్వం లో చిత్తూ గా ఓడించింది .ఇది విని ఆశ్చర్య పోయాడు .శాంతి సాధన ప్రక్రియ దివిజం గా ముగించాడు .1785లో అమెరికా తిరిగి వచ్చాడు .ఫ్రాన్స్ రాజు 408 వజ్రాలు పొదిగిన తన ఫోటో ను కానుక గా ఇచ్చాడు .ఈయన రాజుకు బంగారు నశ్యం డబ్బా కానుక గా ఇచ్చాడు .1785లో పెన్సిల్వేనియా ప్రెసిడెంట్ గా ఎన్నికయాడు .చాలా అలసి పోయాడు రాజకీయం లో .ఇల్లు వదిలి దాదాపు పదేళ్లు బయటే ఉన్నాడు .రాగి తో చేయబడ్డ బూటు ఆకారపు వేడి నీటి తొట్టె లో స్నానం చేసి ఆరోగ్యాన్ని పొందే వాడు . american consti tutional convention రాశాడు కాని దాన్ని పూర్తీ గా ఆమోదించలేదు కాంగ్రెస్ .తన స్వీయ చరిత్ర ను రాసుకొన్నాడు .ఒక కాపీ ని జెఫర్సన్ కు ఇచ్చాడు .జార్జి వాషింగ్ ట న్ అమెరికా మొదటి అధ్యక్షుడయాడు .అవిశ్రాంతం గా దేశానికి సేవ చేసి ఫౌండర్ ఫాదర్స్ లో ఒక్కడు అని పించుకొన్న బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1706 జనవరి పది హేడు న బోస్టన్ లో జన్మించి, 84ఏళ్ళు జీవించి 1790 ఏప్రిల్ పది హేడు న ఫిల డేల్ఫియా లో మరణించాడు .
ఫ్రాంక్లిన్ సుభాషితాలు
there are no gains without pains -eat to live not live to eat –he that can not obey ,can not command ,–never leave that till tomorrow which you can do today .-early to bed and early to rise makes a man healthy wealthy and wise –
ఫ్రాంక్లిన్ అవలంబించిన విధానాలు
temperence -silence -order -resolution -frugality -industry -sincerity -justice -moderation -cleanliness -tranquility -chastity -and -humility –ఇవే ఫ్రాంక్లిన్ విజయాలకు సోపానాలైనాయి .ఇవి అందరికి ఆదర్శాలే .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –26-7-12-కాంప్–అమెరికా