తిక్కన భారతం –27
ఆశ్రమ వాస ,మౌసల మహాప్రస్థాన స్వర్గా రోహణ పర్వాల ఆంతర్య,ప్రయోజనాలు -1
సద్గురుని ఉప దేశం తో విశిష్ట జ్ఞానం పొంది న ధర్మ రాజు ,ధర్మ సింహాసనం అధిష్టించి ,రాజ్య పరి పాలన చేసిన విధానం అంతా ఆశ్రమ వాస పర్వ పూర్వ భాగం లో వర్ణింప బడింది .రాజు లందర్నీ ధర్మ బద్ధులను గా మార్చి ,ప్రజా రంజకం గా 35ఏళ్ళు మాత్రమె రాజ్య పాలన చేశాడు .ఆయన పాలన లో సత్య న్యాయ ధర్మాలు బాగా పోషింప బడ్డాయి .గాంధారి ద్రుత రాష్ట్రుల జీవిత విధానం ,వారి యెడ పాండవుల ప్రవర్తన ఇందులోనే వర్ణించ బడ్డాయి .ఉత్తర భాగం లో ద్రుత రాష్ట్రాదులు ఆశ్రమ వాసం చేయటం ,నిర్యాణం పొందటం తో నాయకు డైన ధర్మ రాజు ఇతి వృత్తం చివరి దశకు చేరు తుంది .ధర్మ రాజాదులకు ఇది వరకే ఇహ లోక కాంక్ష నశించింది .యుద్ధం వల్ల శోక ,నిర్వేదాలు హృదయం లో ఇంకా అంత ర్వాహిని గా ప్రవహిస్తూనే ఉన్నాయి .అవి ,తరువాతి జీవితం లో మాటి మాటికి ప్రత్యక్ష మావు తూనే ఉన్నాయి .ఆశ్రమ వాస కధ దీనికే ప్రాధాన్య మైంది .
వ్యాస భగ వానుని తో పాండవు లందరూ కలిసి ద్రుత రాష్ట్రుని ఆశ్రమానికి వచ్చారు .అక్కడే ఉండి పోవాలనే నిశ్చయానికి వచ్చి ,ఇంటికి వెల్ల టానికి విముఖత చూపించారు .కాని ,ధర్మాన్ని ఆచరించాల్సిన బాధ్యత వారి పైనే ఉందని ఆ వృద్ధ మూర్తులు చెప్పారు .–”ఇట్లు మీరు నన్ను నెంతయు దరిమిన –విపిన భూమి మిమ్ము విడిచి పోవ –నియ్య కొనదు నాదుహృదయంబు మును వోలె –కలుగదిపుడు రాజ్య కాంక్ష నాకు ”అని ఇలాంటి స్తితి లో ముసలి వారందర్నీ అరణ్యాల పాలు చేసి, తాను మళ్ళీ సింహాసనం ఎక్కి రాజ్యం చేయటానికి మనసు ఒప్పటం లేదన్నాడు .–మళ్ళీ ఒక సారి ఫ్లాష్ బాక్ లోకి వెళ్లాడు –”విను పాంచాలురు మాత్చ్యులు ,–వనితా జన శేషు లైరి వారలు లేమిన్ –జననీ శూన్యం బై తో –చిన యది ,రాజ్యంబు నాడు చిత్తంబు నకున్ ”మత్చ ,పాంచాల రాజు లంతా యుద్ధం లో చని పోయి ఆడవారికి శోకం మిగిల్చి పోయారు .ఇప్పుడు రాజ్యం నాకు తల్లి లేనిది గా కనీ పిస్తోంది అని వాపోయాడు –”సమరము దీరిన కోలేను -శమ నిరతా ,నామనంబు సార తపమునన్ -రమి యింప గోరు యుష్మ-త్చమధిక తపమునకు నేను సందడి సేయన్ ”అని తల్లి కుంతీ దేవితో చెప్పుకొన్నాడు .యుద్ధం పూర్తీ అయిన దగ్గర నుండి తన మనస్సంతా తపస్సు చేయాలనే సంకల్పం తోనే నిండి పోయిందని వివ రించాడు .సహదేవుడూ అవే మాటలు పల్కాడు .ఇలా ,అందరి చిత్త వ్రుత్తి, ఆముష్మికానికి పరుగులు తీస్తోంది .వ్యాసుడు- చని పోయిన బంధువు లందర్నీ యోగ శక్తి తో చూపించాడు .ముసలి రాజు భార్య గాంధారి అగ్ని దగ్దులైనారు .ఇవన్నీ చూసి పానడవు లందరికి ఐహిక కాంక్ష పూర్తిగా నశించి పోయింది .ఈ పర్వం లో కుంతి మనస్తత్వం బాగా విశ్లేషింప బడింది .యుద్ధానికి ప్రోత్స హించింది ఒక రకం గా ఆమే .అయితే మానసికం గా మార్పు వచ్చేసింది .గాంధారి, ద్రుత రాష్ట్రుల తో పాటు తానూ అరణ్య వాసానికి వెళ్ళింది .వాళ్ళ తోనే మరణించింది .కర్ణుడి వృత్తాంతం ఆమెను క్షోభింప జేసింది .దాని వల్ల ఆమె కు హృదయ వేదనా ,అశాంతి, నిర్వేదం ముప్పిరి గోన్నాయి .తట్టు కో లేక పోయింది .–”కనీ ,ఏటిలో నిడితి, గల –గని ,నట్లయి యుండె ,దత్ప్రకారంబిది ,మీ–కనిన యది ,దివ్య బోధం –బున ,నత్తేరగంతరంగమున ,గోలు కాలున్ ”అని తన అశాంతిని చిత్త క్షోభను ,ఆస మర్ధతను చాపల్యాన్ని ఉపెక్షను వెల్లడించు కొంది.ఈ విధం గా కధ లోని ముఖ్య పాత్ర లన్నిటికి ఇహ లోకం పైన విరక్తి కల్గి ,దృష్టి అంతర్ముఖ మైంది .యాదవ నాశనం కూడా పాండవుల్లో నిరాశను పెంపొందించింది .
మౌసల పర్వం లో కరుణ రసం ఉత్కృష్ట స్తితికి చేరింది .యుద్ధ పర్వం లో అక్కడక్కడ కరుణ రసం సూచించ బడింది .స్త్రీ ,అనుశాసన పర్వాలలో కరుణ రస పోషణ జరిగింది .మౌసల పర్వం లో కరుణ రసం పరి పక్వం చెందింది .విరాటపర్వం వీర రస ప్రధానం, మోదాంతం .అంటే ఆనందం తో ముగిసింది .యుద్ధం తర్వాత మౌసలం కరుణ రస విషాదాంతం .దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది .శ్రీ కృష్ణుని జీవిత పరమార్దానికి ఈ పర్వం ప్రత్యక్ష వ్యాఖ్యానం .లోకం లో అన్యాయం పెరిగి ,పాపం విజ్రుమ్భిస్తే ,సత్య ధర్మాలకు హాని కలిగితే ,భగవంతుడు అవతరిస్తాడు .దశావతారాలన్ని ఈ ప్రయోజనం కోసమే .శ్రీ కృష్ణావతార ఫలితం కూడా ఇంతే .అధర్మ పరి ణామ ఫలితమే కురు క్షేత్ర యుద్ధం .శ్రీ కృష్ణుడు సూత్ర దారి .అర్జునుని చేత యుద్ధం చేయించాడు .అధర్మ పరిణామ ఫలితాన్ని లోకానికి ప్రత్యక్షాను భవం చేశాడు .వారికి ధర్మ ప్రవర్తన లో ఆసక్తి ని కల్గించాడు సత్య ధర్మాలను స్తాపించాడు .ఇదే ఆయన అవతార ప్రయోజనం .ఆయన రాజనీతి -దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ ..ఈ కార్య క్రమాలలో అవలంబించిన విధానాలు పై ప్రయోజనాలకు మూలమైనవి .పాపాన్ని ప్రతిఘటించే నైతిక ధైర్యం లేని వారి ,ప్రత్యక్షం గా ఘోరాలు జరుగుతున్నా ,ఉపేక్షించి ,పాపులకు బాసట గా చేరి ,.యుద్ధం చేసి ,అధర్మానికి దోహదం చేసిన భీష్మ ,ద్రోణుల విషయానికి ,శ్రీ కృష్ణుడు అవలంబించిన విధానానికి ఈ మహా ప్రయోజనమే కారణం .ఉదాహరణకు -కర్ణుడు శక్తి బాణ ప్రయోగం చేసి ఘటోత్కచుని చంపాడు .అప్పుడు కృష్ణుడు ”ప్రమోదనంబు నొంది ,సింహ నాదంబు సేసి ,శంఖంబు పారించి పగ్గంబుల నొగల ముడిచి ,మంద మారుతాన్దోలిత మందారంబు చందంబుదోప ,నర్తిన్చుచు ,నరదంబు నడిమి కరిగి ,కిరీటిం గౌగలించుకొని వీపప్పళించి ,వెండియు నార్చి ”కృష్ణుడు ఘటోత్కచుడు చావటాన్ని అంత ఆనందం గా అనుభవించాడు .పెద్ద సీనే సృష్టించాడు యుద్ధం మధ్య భాగం లో .అర్జునుని వీపు చరిచాడటఉత్సాహం గా . .అన్నభీముడి కొడుకు చస్తే ,తమ్ముడి వీపు చరచటం ఏమిటి / అని మనకు సందేహం కలుగు తుంది .కృష్ణుని సంతోషాతిశయానికి కారణం ఏమిటో ఈ దుఃఖ సమయం లో ఈ చిందు లాటలేమితో అర్ధం కాలేదు .ఆ విషయమే అమాయకం గా బావను అడిగాడు .”ఇంద్రదత్తమైన అమోఘ శక్తి సంపన్నమైన శక్తి అస్త్రం వల్ల నీకు ఇంక భయం పోయింది .అంతే కాదు ఘటోత్కచుడు కిమ్మీరుడు ,హిడింబి లతో కలిసి ఉన్నాదు .ధర్మ ద్వేషం ,రోషం లతో వారు ముగ్గురు ఎంత కైనా తెగించ గలరు . .ఆ రాక్షసులిద్దరి లాగా ఘటోత్కచుడు కూడా చని పోవటం నాకు చాలా ఇష్టం .వీడు రావణాసురుడు అంతటి వాడు . కర్న్డు వాడి మీద శక్తిని ప్రయోగించాడు ఇప్పటిదాకా దాచుకొని లేక పోతే నీ మీద ప్రయోగించే వాడు .ఇప్పుడు ఆ ప్రమాదం తప్పి పోయింది .ఇక విజం విజయునిదే .వాడిని కర్ణుడు చంపక పోతే నేనే స్వయం గా మన వాడైనా, చంప వలసి వచ్చేది .కనుక నాకిప్పుడు మహా సంతోషమే కాని దుఖం యే మాత్రమూ లేదు ”అని తన మనస్సు లో మాట చెప్పేశాడు .ధర్మ రక్షణ కోసం తన వారు ,పరాయి వారు అనే భేదం ఉండదుపరమాత్మకు అని తెలియ జేశాడు .ధర్మ ద్వేషులు ,ధర్మ విముఖులు ధర్మ యెడ ఉపేక్షా పరులు అందరు నశిన్చాల్సిందే .అందులో మొహమాటం లేదు .అప్పుడే ఆయన అవతారానికి ప్రయోజన సిద్ధి కలుగుతుంది .అందుకోసమే కురుక్షేత్ర సంగ్రామం లో అర్జునుని విషాదం పోగొట్టి ధర్మోపదేశం చేసి వ్యామోహం నుండి దూరం చేసి కర్తవ్య పాలన తో యుద్ధం చేయించాడు .అభి మన్యుడు ,ఉప పాండవులు ,విరాట ద్రుపదులు, నారాయణ సైన్యం అందరు నశించారు .ఇరా వంతుని చావుకు బాధ పడే అర్జునుడికి సృష్టి తత్వాన్ని తెలియ జెప్పాడు .పాండవులను రాజ్యాధి కారులను చేసి ,అశ్వమేధ యాగం చేయించి ,భారత యుద్ధం లో పాల్గొనని రాజుల్ని చంపించటమో ,లొంగ దీసు కోవటమో చేయించాడు .దానితో లోక ధర్మాన్ని ప్రతిష్టించాడు .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –5-8-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,009,801 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .5 వ భాగం.5.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.5 వ భాగం.5.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.8 వ భాగం.5.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.4 వ భాగం.4.6.23.
- గ్రంథాలయోగ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..ద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..
- మురారి అన ర్ఘ రాఘవం 7 వ భాగం.4.6.23.
- తొలి ముస్లిం మహిళా మంత్రి ,జాతీయ మహిళా సంస్థ అధ్యక్షురాలు,రెడ్ క్రాస్ సేవకురాలు శ్రీమతి మసూమా బేగం(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జూన్
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.3 వ భాగం.3.6.23
- అనేక మలుపులు తిరిగి గమ్యస్థానం చేరిన ‘’అనుకోని ప్రయాణం ‘’.
- గ్రంథాలయోద్యమ పితా మహ శ్రీ అయ్యంకీ వెంకట రమణయ్య గారు.3 వ భాగం.3.6.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (511)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,078)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు