తిక్కన భారతం –29
ఆశ్రమ వాస మౌసల మహా ప్రస్తాన స్వర్గా రోహణ పర్వాలలో ఆంతర్య ప్రయోజనాలు -3-
- శ్రీ కృష్ణుడు అన్న బాల రాముడున్న చోటికి వచ్చాడు .బలరాముడు యోగబలం తో తనువు చాలించాడు .మహా భుజం గా మారి ఆకాశం లోకి చేరాడు .అనంతుడైన ఆది శేషుడు దాన్ని తన పరమ మూర్తి లో కలుపు కొన్నాడు .ఇదంతా కృష్ణుడు చూస్తుండ గానే జరిగింది .తాను భూమి మీదకు వచ్చిన అవతారం పని పూర్తీ అయిందని భావిం చాడు వాసు దేవుడు .ఇక తన విముక్తి మార్గం చూసు కొన్నాడు ..దూర్వాస మహర్షి ఒకప్పుడు తన శరీరంలోని అన్ని అవయవాలకు పాయసం పూసి, అరికాలు కు పూయటం మర్చి పోయి వదిలేసిన విషయం జ్ఞాపకం చేసుకొన్నాడు .పాయసం పూసిన శరీర భాగాలను యే శస్త్రాస్త్రాలు బాధించవు .అదీ అందులోని అంత రార్ధం .విధి అనుల్లంఘనీయం పరమాత్మకైనా .కృష్ణుడికి అపాయం అరికాలి వల్లనే వస్తుందని మహర్షి హెచ్చరించిన విషయం గుర్తుకొచ్చింది .మనసును అధీనం చేసుకొన్నాడు .భూమి పై ఒక మహా సమాధి స్తితి ని పొందాడు .”జర” తనను మాయ చే ఆవహించిన ఒక బోయ వాడు ,శ్రీ కృష్ణుని కృష్ణ సారంగం గా (నల్ల జింక )గా భావించి భ్రాంతి తో బాణం విడిచాడు .అది సరాసరి వచ్చి హరి అరికాలి లో గుచ్చు కొన్నది .అంతే .ఆ నిమిత్త మాత్రం గా ,మానుష దేహాన్ని పరిత్య జించాడు శ్రీ కృష్ణ పరబ్రహ్మ .తన నిజ పదం అయిన వైకుమ్తానికి చేరు కొన్నాడు .దేవేంద్రుడు దేవతా గానం తో ఎదురొచ్చి ,భక్తీ తో నమస్కరించి ”శ్రీ హరీ !దయావిదేయ మైన ఆట భూమి మీద ఆడావు బంధువులైనా .కంసాదులను,కౌరవులను నిర్జించి ,నీ ధర్మాన్ని నేర వేర్చి మళ్ళీ నీ స్వ రూప సన్నిధానానికి చేరావు .లోక హితం కోసం నీవు అవతారం దాల్చి ,ఆ పని పూర్తీ కాగానే మళ్ళీ ఇక్కడికి చేరావు ”అని ప్రస్తుతించాడు .
గుజరాత్ లోని ద్వారకా పట్టణాన్ని చూసి ఆనాటి శ్రీ కృష్ణ వైభవాన్ని అనుభూతి గా పొంద వచ్చు . .సముద్రం లో స్టీమర్ లో వెళ్లి చూడాలి .అక్కడి శ్రీ కృష్ణ మదేవాలయం పరమ వైభవం గా అందులోని శ్రీ కృష్ణ విగ్రహం పరమ మనోహరం గా దర్శన మిస్తాయి .ఆ తర్వాత సోమనాద్ వెళ్లి అక్కడి సోమనాధ దేవాయాన్ని దర్శించాలి. అది జ్యోతిర్లింగం .మహమ్మ దీయ దండయాత్రలలో పడి హేను సార్లు విధ్వంసానికి గురైంది .అరేబియా సముద్రం వొడ్డుననే దేవాలయం ఉంది .దాన్ని దర్శిస్తుంటే కైలాసం లో ఉన్నట్లై పిస్తుంది .ఆలయానికి దగ్గర గా కొద్ది దూరం లో నడిచి వెడితే శ్రీ కృష్ణుడు బోయ వాని దెబ్బకు నిర్యాణం చెందిన ప్రదేశం కూడా కనీ పిస్తుంది .ఆ ప్రాంతాలకు వెళ్ళిన వారందరూ వీటిని సందర్శించి గత వైభవాన్ని గుర్తుకు తెచ్చు కొంటారు .2002 మా రెండో అబ్బాయి శర్మ అహమ్మదా బాద్ లో పని చేస్తుండగా, మేము వెళ్లి అందరం కలిసి అన్నీ చూసి, అనుభూతిని పొందాము . దసరాపండగల్లో వెళ్ళాం .అప్పుడు రాత్రిళ్ళు గుజరాతీలు వాళ్ళ ప్రత్యెక మైన నృత్యాన్ని అందరు కలిసి సామూహికం గా చేస్తారు .అందరు రాదా కృష్ణులుగా గోపికల్లా అలంకరించుకొని కోలాటం ఆడుతూ చేస్తారు కనుల పండువు గా ఉంటుంది .అక్కడ ఆరు బయలు సినెమా ఉంటుంది .యెట్టిన చోట స్క్రీన్ పెట్టి సినిమా వేస్తారు .హాయిగా మన కారులో కూర్చుని సినిమా చూడచ్చు .తింది తింటూ ఇంట్లో చూసి అంట్లు చూడచ్చు .గాంధీ నగరం దగ్గర స్వామి నారాయణ దేవాలయం శబర్మతి ఆశ్రమం కూడా చూదాల్సినవే .అవకాశం ఉన్న వారందరూ వెళ్లి చూసి ఆనందం పొందాల్సిన దివ్య క్షేత్రాలు ద్వారకా ,సోమనాద్ లు .
వసుదేవుడికి చాలా బాధ కలిగింది .శ్రీ కృష్ణుని ఉపేక్ష వల్లే ,యాదవ నాశనం అయిందని అనుకొన్నాడు.శ్రీ కృష్ణుడు తలచు కొంటె ఎంత పని అయినా అవలీల గా చేయ గలడు .పరీక్షితుని బ్రతికించాడు అశ్వత్థామ బాణం నుంచి .మరి ఎందుకింత ఉపేక్ష ?అని బాధ పడ్డాడు –”వలసిన యట్టి కార్యమును ,వావిరి నేట్టుగ నైన జేయగా — వలతి .మృతుం బరీక్షితుని ,వత్చల తన్ బ్రతికించే శౌరి ,మొ–గ్గలమున ,యాదవుల్ పెనగాగా ,గని ,మాన్పడుపెక్ష సేసె, నీ –పొలియుటవశ్య భావ్యమని బుద్ధి దలంచుట గాన నయ్యెడున్ ”అని కృష్ణుడు కావాలనే ఇదంతా ఇలా జరగాలనే భావించి చేశాడని గ్రహించాడు .తనపుత్రుడైన శ్రీ కృష్ణ నిర్యాణానికి దుఃఖించాడు .ఆయన్ను ఓదారుస్తూ వేద వ్యాస మహర్షి ”హరి ఎరుంగు మున్న యా సంక్షయం ”అని స్పష్టం గా అన్నీ శ్రీ హరి యైన కృష్ణునికి తెలిసే జరిగాయని స్పష్టం చేశాడు .అర్జునుడు ఇంకా అమాయకం గా ”మూడు లోకాలకు అన్యదాత్వాన్నిచ్చే పరంత్మ ముని శాపాన్ని బాప లేడా?”అని ప్రశ్నించాడు .అప్పుడు మహర్షి అర్జునునికి శ్రీ కృష్ణ జనం రహస్యాన్ని బోధించి జ్ఞానం కల్గించాడు .-”-ధరణి భారంబు వాప ,నవతారము నొందిన విష్ణు డత్తేరం –గరుడుగా ,నిర్వ హించి ,యజరామర ,నిష్కల ,నిర్వికార భా –స్వర ,నిజ సత్సదనంబు నుప శాంతి పరుం డయి ,పొందే ,దానికిన్ –గురుకుల వర్య ,శోకమున గుందుదురే ,మిము బోటి బోధనుల్ ”భూ భారాన్ని తీర్చటానికి అవతరించాడు కృష్ణుడు .ఆ పని సక్రమంగా నిర్వహించి ,వచ్చియా పని అయి పోగానే స్వస్థలానికి వెళ్లి పోయాడు .జ్ఞాన ధనులైన నీ వంటి వారు దీనికి దుఃఖించటం భావ్యం కాదన్నాడు .
”అవనీ భారము వాపి ,తా హరికి దోడై ,భీమ సాహాయ్య గౌ –రవ ,దుర్దాంత పరాక్రమంబున ,గ్రుతార్ధత్వంబునం జేసే, య-స్త్ర వితానంబును నిన్ను బాసి చనియెన్ దైవ ప్రకారాజ్న ,నీ–దు వరిష్టా చరణంబున న్ సురలు సంతోషించి రప్పోరులన్ ”- కృష్ణుడు నీసహాయం భీముని సాయం తో కౌరవ వినాశన చేయించి ,మిగిలిన ధర్మ కార్యాలు మీతో చేయించటానికి మిమ్మల్ని ఉంచి వెళ్లి పోయాడు .మీరు చేసిన యుద్ధాలను దేవతలంతా మెచ్చారు .అని చెప్పాడు –”బలమును ,బుద్ధియు ,జేవయు ,-నలఘు మతియు ,నుల్ల శిల్లు నగు కాలము నన్ –బోలియుం ,గాల విపర్యయ –కలనంబున బుధులకుబ్బు గలకయు గలవే ”–”నర నారాయణులైన పురాణ మునులు లోక కళ్యాణార్ధం ,పార్ధ ,పార్ధ సారధు లుగా జన్మించి ధర్మ సంస్తాపనం చేశారు ” అని గుర్తు చేశాడు .–”నరుడు ,నారాయణుండు ననంబరాగు –నిత్య పురుషులు నీవును ,నేను జుమ్ము ,–భువన హిత మాచరిమ్పగా ,బూని వేడ్క ,–వచ్చి ,ఇమ్మహి ,బుట్టిన వార మనఘ ”అని జ్ఞాపకాల దొంతర పెర్చాడు .శ్రీ కృష్ణుడు కూడా పార్దునికి –”నానా రూపంబులని -నిట్లేను బ్రవర్తింతు జగము లన్నింటను ,నీ –శానుడు ,నభవుడు నమృతుడు –నైన శివుని నీవు గొలువు మర్జున యెపుడున్ ”అని అర్జునుడు నిమిత్త మాత్రమె నని ,తానే మహా భారత యుద్ధాన్ని అంతటినీ నిర్వహిస్తా నని ,బావ మరది అర్జునిడికి ఇది వరకేప్పుదోనే బావ కృష్ణుడు బోధించాడు .మరపు మానవ సహజం కనుక మళ్ళీ గుత్రు చేయాల్సి వచ్చింది అంతే .–”ఏను రక్షింప ,జయము నీ కేసక,మేసగ–సమరమున ,శూల పాణి యై ,శత్రు కోటి నీదు ,మునుమున వధి యించు నిరుప మాన –తేజు రుద్రుగా ,నేరుగుము ధీర చిత్త ”బావా కిరీఎటీ ! .నేను రక్షకుడిగా ఉండి నీకు యుద్ధం లో జయం చేకూరుస్తాను .నువ్వు బాణాలు వేసే నిమిత్తమే యుద్ధం లో నీ పని .సర్వ సంహారకుడు అయిన త్రిశూల పాణి శివుడే అసలు సంహారకుడు నువ్వు బాణం వేస్తె ,ఆయన ప్రాణాలు తీస్తాడు అంతే .అని ఎప్పుడో విస్పష్టం గా చెప్పే షాడు అసలు రహస్యాన్ని .ఈ విషయాలనే ఇప్పుడు వ్యాస మహర్షి మళ్ళీ చెప్పి గుర్తు చేశాడు .శ్రీ కృష్ణుని దివ్యత్వం తెలిసిన భక్తుడు అర్జునుడు .అతడు చేసిన ప్రతి పని వెనక శ్రీ కృష్ణ ప్రోత్సాహం ఉంది .శ్రీ కృష్ణ సంకల్పాన్ని నిర్వ హించే భౌతిక శక్తి మాత్రమె అర్జునుడు .వీరిది మనో దేహ సంబంధం .ఇంతకీ బాదరాయణుడైన వ్యాసుడేమి చెప్పాడు –”నీవని సేయ ,నీ వలని ,నేయ్యమునం ,గృప నన్య సైన్యమున్ –దా వధియించుశూల ధరతాస్ఫురణం బెసగంగ , ,ముందర ,ర–ద్దేవు డు ,దాని గాంచు ,భవదీయ సమంచిత ద్రుష్టియున్ –నినున్ –గావడ,యా ,మురాన్తకుడు గాల విపర్యయమావహిల్లు ట న్ ”అని కృష్ణుడు అర్జునికి ఇది వరకు చెప్పిందే మళ్ళీ గుర్తు చేశాడు నీ మీద స్నేహం బాంధవ్యం ధర్మం తో శూల పాణి యైన శివుని ప్రేరేపించి నీవు నిమిత్తమాత్రుని గా యుద్ధం చేసి విజయాన్ని నీకు అందించి నిన్ను ”విజయుడు ”అని పించాడు అని అంటే యుద్ధాన్ని గేలి పించాడు .ఎంత చిన్న మాటలో ఎంత అర్ధ వంత మైనవో ?చదివితే , అర్ధమైతే ఎంత లోతైన భావనలో తెలుస్తుంది వ్యాసుని వారసుని గా తిక్కన మరో వ్యాస రూపం గా మన ముందు సాక్షాత్కరిస్తాడు .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –7-8-12-కాంప్–అమెరికా