ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ -ఓపెన్ హీమెర్
అవి రెండవ ప్రపంచ యుద్ధం భీకరం గా జరుగు తున్న రోజులు జెర్మనీ ని సమర్ధించే దేశాలోక వైపు ,అమెరికా బ్రిట న్లను సమర్ధించే దేశాలోక వైపు మోహ రించి భీషణ పోరాటం చేస్తున్నాయి .జర్మని నియంత అడాల్ఫ్ హిట్లర్ జాతి దురహంకారం తో పెచ్చు మీరి పోతున్నాడు .యూదు లందర్నీ ఊచ కొత్త కోయిస్తున్నాడు .జ్యూ శాస్త్ర వేత్తలను దేశం విడిచి పంపిస్తున్నాడు .మహా మేధావి అయిన్ స్టీన్ శాస్త్ర వేత్త అమెరికా ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రిన్స్ టన్ యూని వేర్సిటి లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు .ఏమైనా సరే అమెరికా ను ఓడించి తన ఆది పత్యాన్ని నిలుపు కోవటానికి హిట్లర్ శతధా సహస్ర ధా ప్రయత్నిస్తున్నాడు .సర్వ వినాశం చేసే బాంబు ను కనీ పెట్టమని జర్మని శాస్త్ర వేత్త లను ఆదేశించాడు .వారంతా తీవ్ర ప్రయత్నాలలో ఉన్నారు .తాను కనీ పెట్టిన ద్రవ్య రాశి శక్తికి సంబంధించిన సూత్రం మంచికి ,చేడుకూ కూడా పని చేయ వచ్చు అని ఆందోళన చెందు తున్నాడు ఐన్స్టీన్ .అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రూజ్వేల్టు కు ఉత్తరం రాస్తూ జెర్మని అణు బాంబు తయారు చేసే ఆలోచన లో ఉన్నట్లు తనకు సమాచారం అందినదని ,హిట్లర్ చేతి లో ఆ బాంబు ఉంటె సర్వ ప్రపంచ వినాశనం జరుగు తుందని వివరించాడు .అందువల్లయురేనియం ను జర్మనీ కి దక్క కుండా చేసే జాగ్రత్తలను తీసుకోమని హెచ్చరించాడు .కా ని హిట్లర్ దాన్ని సంపాదించి నిలావ చేసుకొని ఆటం బాంబు కోసం కలలు కంటున్నాడు .
అమెరికా లో ప్రెసిడెంట్ అయిన్ స్టీన్గారి ఉత్తరాన్ని చదివి వెంటనే కార్యా చరణలోకి దిగాడు .యుద్ధ అధికారు లతో సమావేశమై అతి త్వర లో ఆటం బాంబు ను తయారు చేయమని ఆదేశించాడు .1942 లో కల్నల్ లెస్లీ గ్రోవేస్ దీనికి పూనుకొన్నాడు .కాని ఆయనకు న్యూక్లియర్ ఫిజిక్స్ పెద్దగా తెలియదు .కాని దాన్ని తయారు చేయాల్సిందే .అదీ అత్యంత రహస్యం గా .దానికోసం యుద్ధ నిపుణులు శాస్త్ర వేత్తలు ,అందరి సహకారం కావాలి .అప్పుడు ఆయన దృష్టి లోకి ప్రఖ్యాత శాస్త్ర వేత్త ఒపెన్ హీమేర్ పడ్డాడు .ఆయన్ను పిలి పించి మాట్లాడాడు .ఈయన కూడా జ్యూ శాస్త్ర వేత్తయే .అందరి తో బాటు ఈయనకూ జెర్మని కంటే అమెరికా ముందే ఆటం బాంబు తయారు చేయాలి అనే అభి ప్రాయం వుంది .సరే నన్నాడు దానికి సరైన ప్రదేశం గా న్యూ మెక్సికో లోని” లాస్ ఆల్మోస్’ ను ఎన్ను కొన్నారు .ఒపెంహీమేర్ తనకు సలహా దారు మాత్రమె నని గ్రోవర్ ప్రకటించాడు .ఈ ఆటం బాంబు ప్రాజెక్ట్ ను 1942 లో ప్రారంభించి the Man hattan project గా పేరు పెట్టారు .అప్పటికే ఒపెంహీమేర్ ఫిలిప్స్ అనే మరో శాస్త్ర వేత్త తో కలిసి transmutation function of deutrons అనే పేపర్ ను మూడేళ్ళ క్రితమే ప్రకటించాడు .ఇది న్యూక్లియర్ ఫిజిక్స్ లో కొత్త ద్వారాలను తెరిచింది .దాంతో పాటు ఒపెంహీమేర్ ఒక్కడే on continued gravitational attraction అనే పేపర్ ను విడిగా సబ్మిట్ చేసి ఇరవయ్యవ శతాబ్దపు గొప్ప పేపర్లలో ఒకటి గా ప్రసిద్ధి చెంది ఉన్నాడు .
ఈ అనుభవం ఒపెంహీమేర్ కు బాగా కలిసి వచ్చింది .లాస్ ఆల్మోనాస్ చాలా సుదూరం గా ఎవరికి అందు బాటు లేని స్తలం గా ఉంది కనుక రహస్య ప్రయోగాలకు అనువైన ప్రదేశం అని భావిచాడు .అతను ప్రయోగాత్మక శాస్త్ర వేత్త .కనుక ఆయనకు సహాయం గా వంద లాది ప్లంబర్లు శాస్త్ర వేత్తలు అవసరం .అందుకని యూరప్ లోను ,ఇతర దేశాలలోను అమెరికా లోను ఉన్న శాస్త్ర వేత్తలందరికి కబురు వెళ్ళింది .అందరు అంగీకరించి వచ్చారు .యుద్ధ నిపుణులు శాస్త్ర వేత్తలు ,ప్రయోగం నిర్వహించే వారు టెక్నీషియన్లు ,ఇజినీర్లు అంతా కలిస్తే 3000 మంది అయారు .వీరినందర్నీ కలిపి ఉంచి అందరి మధ్య సహకారం పొంది బాంబు ను తయారు చేయాలి .మాన వ నాగరకత కోసం పని చేస్తున్నామనే అభి ప్రాయాన్ని వారందరి లో కలిగించాడు .రాబర్ట్ ఒపెంహీమేర్ ఆ సంస్థకు డైరెక్టర్ అయాడు .విషయాలనన్నిటిని తన బుర్రలోనే దాచుకొని పని చేయించాలి .ఎక్కడ లీకు అయినా ప్రమాదమే .ఎన్రికో ఫెర్మి శాస్త్ర వేత్త కూడా వచ్చి చేరి సహకరించాడు ఇంత చేస్తున్నా రష్యా గూధ చారి సంస్థ కొంత ఇబ్బంది కలిగించింది .దాన్ని అదిగ మించారు .ఆయనకు సెక్యూరిటి కూడా ఇబ్బంది కరమే అయింది .
1944నీల్స్ బోర్ శాస్త్ర వేత్త ఈ ప్రాజెక్టు కు వచ్చి ,జరుగుతున్న పరిశోధనా వివ రాలను తెలుసుకొని సంతృప్తి చెందాడు .ఆయన ఫిజిక్స్ లో ”క్వాంటం” విప్ల వాన్ని తెచ్చిన శాస్త్ర వేత్త .అయితే అనవసరం గా న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేస్తే అది మళ్ళీ యుద్ధానికి దారి తీస్తుంది అని భావిన్చాడాయన .అందుకని ప్రపంచ దేశాల శాస్త్ర వేత్తలందరూ కలిసి ఆలోచించాలి అని తన అభి ప్రాయం చెప్పాడు కూడా .ఈ భావాలకు ఒపెంహీమేర్ కొంత బాధ పడ్డాడు .రెండో దశ ప్రారంభ మైంది .జర్మని ఆటం బాంబు చేయటం లో విఫల మైందని తెలిసి పోయింది .అది లేక పోతే జర్మని గెలవదు అని అందరు నిశ్చ యానికివచ్చారు .బాంబు తయారు చేయటమా మానటమా అని సందేహం కల్గింది .కాని ఒపెంహీమేర్ పని ఆపటానికి వీలు లేదని ,కోన సాగించాలని చెప్పాడు .ఎట్లాగో జర్మని ఒడి పోతుంది కనుక బాంబు ను జెర్మని మీద ప్రయోగించరు అనే అభి ప్రాయానికి కొందరు .వచ్చారు .వీరితో ఈయన ఏకీభ వించ లేదు .ఒపెంహీమేర్ .ఆటం బాంబు యొక్క విధ్వంసక శక్తిని ప్రపంచానికి తెలియ జేయాల్సిందే అన్నాడు .దీని కి కొందరు అంగీకారం తెలుప లేదు.అప్పటికే యుద్ధం ముగిసి జెర్మని ఒడి పోయింది .
1945 june లో చికాగో వర్సిటి కి చెందినా కొందరు శాస్త్ర వేత్తలు అమెరికా బాంబు తయారు చేసినామొదటి సారి గా ఎవరి మీదా ప్రయోగించరాదు అని ఒక దాన్ని యుద్ధం కోసం ఉపయోగిస్తే విశ్వ వినాశనమే జరుగుతుందని,ఇప్పటి దాకా అమెరికా కు ఉన్న ప్రజా బలం క్షీణిస్తుందని ,న్యూక్లియర్ ఆయుధాల పోటీ తీవ్ర మావు తుందని ,భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరిక గా ఒక మెమొరాండం సమర్పించారు .ఒపెంహీమేర్ కూడా ఆలోచన లో పడ్డాడు .అందుకని జెర్మని మీద కాకుండా జపాన్ నగరం మీద ఆటం బాంబు వేయాలి అని సైన్యానికి సలహా నిచ్చాడు .వారూ అంగీకరించారు .1945 july 16న మొదటి ఆటం బాంబు ను ప్రయోగాత్మకం గా న్యూ మెక్సికో లోని అలమో గార్దో దగ్గర
ప్రయోగించారు .ఒపెంహీమేర్ స్వయం గా అక్కడే ఉండి ప్రత్యక్షం గా చూస్తూ పర్య వేక్షించాడు .అద్భుతం గా పని చేసి అనుకొన్న లక్శ్యం నేర వేరింది .అందరు ఆనందం లో మునిగి పోయారు .దీని ఫలితాన్ని చూసి ఒపెంహీమేర్ ”ఇక నుంచి ప్రపంచం ఇప్పటి లాగా ఉండదు .నాకు భగవద్గీత లో ”నేను ఇప్పుడు మృత్యువును .ప్రపంచాలను వినాశనం చేస్తాను .” అని చెప్ప బడిన వాక్యాలు గుర్తుకొస్తున్నాయి ”అన్నాడు .మిగిలిన వారంతా నిశ్శబ్దం గా విన్నారట .1945 august 6 న అమెరికన్ మిలిటరి మొదటి ఆటం బాంబు ను జపాన్ లోని హీరో షీమా పట్టణం పై ప్రయోగించింది .అక్కడే జపాను దేశపు డిఫెన్సు స్తావరం ఉంది . .కాని జపాను లొంగి పోలేదు .రెండో ఆటామిక్ బాంబు ను జపాను లోని నాగ సాకి పట్నం పై మూడు రోజుల తర్వాత అమెరికా వేసింది .ఇక్కడే జపానుకు చెందిన యుద్ధసన్నద్ధ స్థావరం ఉంది ..మొత్తం మీద రెండు బాంబుల వల్ల రెండు న్నర లక్షల మంది చని పోయారు .ఇంకో యాభై వేల మంది అణు దూలి కి బలి అయారు .సెప్టెంబర్ రెండు న జపాను లొంగి పోయింది .ఇలా జెర్మని ప్రపంచ వినాశనాన్ని కొని తెచ్చింది .
1945 అక్టోబర్ లో ఒపెంహీమేర్ 500 మంది శాస్త్ర వేత్త లను సమావేశ పరచి ఈ ప్రాజెక్ట్డైరెక్టర్ గా తనకు అదే చివరి రోజు అని చెప్పాడు .శాస్త్ర వేత్త లందరూ అంకిత భావం తో కృషి చేసి సహకరించి నందుకు కృతజ్ఞతలను చెప్పు కొన్నాడు .వారి పని తీరుకు గర్వ పడుతున్నానని చెప్పాడు .కొంత కాలం తర్వాత లాస్ అల్మోనాస్ అ మరియు హీరోషీమాలను మానవ జాతి శపిస్తుందిఅన్నాడు .ఈ ప్రాజెక్ట్ పని అవగానే ,కాలి ఫోర్నియా కు వెళ్లి ,మళ్ళీ పాత జీవితం ప్రారంభించాడు ..1947 లో institute for advaanced study in priceton కు డైరెక్టర్ అయాడు .అక్కడే అయిన స్టీన్ శాస్త్ర వేత్త 14సంవత్స రాల నుండి ఉన్నాడు.ఒపెంహీమేర్ ఈ విశ్వ విద్యాలయాన్ని శాస్త్ర వేత్తలు ,సాంఘిక శాస్త్రజ్ఞులు హూమనిష్టులు అందరు కలిసి పని చేసే కేంద్రం గా తయారు చేయాలని భావించాడు . 1946 లో అమెరికా atomic energy commission అనే పౌర సంస్థను దానికి general advisory committee ను ఏర్పరచి ఒపెంహీమేర్ ను దానికి చైర్మన్ ను చేసి గౌరవించింది .ఒపెంహీమేర్ సృష్టించిన ఆటం బాంబు ”న్యూక్లియర్ ఫిషన్” ఆధారం గా నిర్మించ బడింది .ఆ తర్వాత ”సూపర్ ”అనే బాంబు తయారయింది .అదే హైడ్రోజెన్ బాంబు .దీనిలో” న్యూక్లియర్ ఫూజన్” సూత్రాన్ని ఉప యోగిచారు .దీని పై ఒపెంహీమేర్ స్పందిస్తూ హైడ్రోజెన్ బాంబు నిర్మించటం తగని పని అన్నాడు .ఇది మానవాళికి మహోపద్రవాన్ని తెస్తున్దన్నాడు .ఆ నాటి అమెరికన్ అధ్యక్షుడు హారీ ట్రూమన్ దీన్ని పట్టించు కోకుండా ఆటం బాంబు తో పాటు హైడ్రోజెన్ బాంబు నూA,E.C. తయారు చేయాల్సిందే అని ఈ సంస్థకు విస్పష్టం గా తెలియజేశాడు .రష్యా తయారు చేస్తుందనే భయం కూడా ఉంది .అప్పుడు ప్రపంచం అంతా ద్వి ధ్రువ దేశాల మధ్య చీలి పోయాయి .
హంగేరి శాస్ర వేత్త ఎడ్వార్డ్ టేల్లార్ సూపర్ అన బడే హైడ్రోజెన్ బాంబు కు రూప కల్పన చేశాడు .దాన్ని ఉత్తర ఫసిఫిక్ సముద్రం లో1952 november 1 న ప్రయోగించారు .1952 లో అయిసన్ హోవర్ అమెరికా అధ్యక్షు డై నాడు .ఒపెంహీమేర్ మీద కమ్యూనిస్ట్ అభి మాని అని హైడ్రోజెన్ బాంబు అమెరికా తయారు చేయకుండా అడ్డగించాడని ఆరోపణలు వచ్చాయి అప్పుడు మేకార్దీఅనే రిపబ్లికన్ పార్టి సెనేటర్ కమ్యూనిస్టులపై విరుచుకు పడే వాడు .అతని విధానాలు క్రూరం గా ఉండేవి. వాటిని మేకార్దీ చర్యలని సభ్య సమాజం ఈస డించు కొంది ఆ తర్వాతా ఒపెంహీమేర్ మీద అభియోగం రుజువు కాలేదు .చివరికి మేకార్దీని సెనేట అభి శంసించింది .అయితే ఒపెంహీమేర్ ఇంకా యే ప్రభుత్వ పదవులు నిర్వహించ రాదనీ తీర్మానించింది ..1963 లో లిన్డన్ బి.జాన్సన్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఒపెంహీమేర్ కు అటామిక్ ఎనర్జీ యొక్క అత్యున్నత పురస్కారాన్ని తన చేతుల మీదు గా అంద జేశాడు .జీవితపు చివరి రోజుల్లో ఒపెంహీమేర్ ప్రపంచ శాంతి కోసం కృషి చేశాడు .మళ్ళీ institute of advanced study కి దాని పాలక వర్గం ఒపెంహీమేర్ ను డైరెక్టర్ చేసి గౌర వించింది .
రాబర్ట్ ఒపెంహీమేర్ 1904 april 22న ధన వంతులైన యూదు కుటుంబం లో జన్మించాడు .జెర్మని లో చదివాడు .హార్వర్డ్ విశ్వ విద్యాలయం లో పై చదువులు పూర్తీ చేశాడు .బెర్కిలీ లో experimental physicist అయాడు .1938లో న్యూట్రాన్ స్టార్స్ మీద ప్రయోగాలు చేశాడు .న్యూట్రాన్ స్టార్ అంటే -చాలా సాంద్రత ఉన్న నక్షత్రం సూపర్ నోవాలో కూలి పోయేది .దీనికి కారణం gravitational collapse .మిగిలిన విషయాలన్నీ పైన చెప్పుకోన్నవే .ఒపెంహీమేర్ ముఖ చిత్రం తో time mgazine 1948 november 8 సంచిక ను ప్రచురించి ఒపెంహీమేర్ కు అతున్నత స్థానాన్ని ,గౌరవాన్ని కల్పించింది .అణు బాంబు పిత ”(ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ )అయిన ఒపెంహీమేర్ 1967 ఫిబ్రవరి పద్దెనిమిది న మరణించాడు .ఆయన ఎప్పుడు ఒక మాట చెబుతూ
ఉండేవాడు ”science is not answer for every thing . .But science very beautiful ”.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-8-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 978,911 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.22 వ భాగం.31.1.23.
- అరుణ మంత్రార్థం. 7వ భాగం.31.1.23.
- పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం
- బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-3(చివరి భాగం )
- ముదు నూరులో డా.ఎన్.భాస్కర రావు గారింట్లో జీవిత చరిత్రల గ్రంధాలయ వార్షికోత్సవ 0లో 29.01.2023
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్న ఆలయ ధర్మకర్త బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, ప్రభావతి దంపతులు
- ‘’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-2’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.20 28.01.2023
- అరుణ మంత్రార్థం. 5వ భాగం.28.1.23
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,920)
- సమీక్ష (1,275)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (300)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (357)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Extremely well written article. Engaging until the end.
Mccarthy went after every one 🙂 including Oppenheimer huh :). I wonder how could people trust him those days. I guess the ‘mistrust and distrust’ in the air during coldwar was the culprit.
Anyway nicely written. Thanks
ఆపెన్ హైమర్ గురుంచి క్లుప్తంగా బాగా వ్రాశారు. థాంక్స్.