భగవాన్ శ్రీ కృష్ణఉవాచ
ఇవాళ కూడా అస్టమి తిధి ఉంది -శ్రీ రిష్ణాష్టమి గానే భావిస్తారు .కనుక శ్రీ కృష్ణుడిని తలచుకొంటూ భగవద్గీత లో ఆయన చెప్పిన మాటలను ‘భగవాన్ శ్రీ కృష్ణ ఉవాచ ”ద్వారా తెలుసు కొందాం –
”యద్భావం తద్భవతి ”మనం ఎలా కోరుకొంటే ,అలా జరుగు తుంది .ఇదే positive attitude అంటే .దీన్ని అలవరచు కొని పనులను కౌశల్యం తో నైపుణ్యం గా శక్తి వంచన లేకుండా ఫలా పేక్ష రహితం గా చేయాలి .తాను అవతార పురుషుడిని అని ధర్మానికి హాని కల్గి నప్పుడు అవతరించి అధర్మాన్ని నాశనం చేసి ,ధర్మాన్ని ప్రతిష్టిస్తానని చెప్పాడు .ఈ పనిని నేను చేయటం లేదు .కర్మేంద్రియాలు సహజ సిద్ధం గా వాటి పని అవి చేసుకొని పోతున్నాయి .అందులో నా ప్రమేయం లేదు అను కోవటమే ”కర్మ సన్యాసం ”.కర్మ యోగం అనుస రించ కుండా ,కర్మ సన్యాస యోగం ఆచరింప లేరు .మరి కర్మను త్యజించటం అంటే ?ఎవడు ఎవరినీ ద్వేషించడో ,దేన్నీ కోరుకోడో అలాంటి కర్మ యోగి నిత్య సన్యాసి గానే భావింప బడుతాడు .సకల ప్రాణుల్లో ఆత్మ స్వరూప్లుగా భగ వంతుడే ఉన్నాడని భావించే వాడికి కర్మలు బంధనాలు కావు .సత్కర్మ లను నిష్కామ బుద్ధి తో చేస్తే లోక కల్యాణం జరుగుతుంది .వ్యక్తీ అభ్యున్నతి వల్ల సమాజం లో సచ్చీలురైన జనం తయారవు తారు .అప్పుడు సమాజం ధర్మ బద్ధం గా ఉంది ,లోక కళ్యాణ కారకమవుతుంది .వ్యక్తీ వికాసమే అభ్యుదయానికి మూలం .
కోర్కెలు గుర్రాల వంటివి .అవి యధేచ్చగా అటూ ,ఇటూ పరి గెత్తు తూ ఉంటాయి .వాటిని కళ్ళెం అనే మనసు తో బుద్ధి అనే ఆశ్వారూధుడు బంధించి జాగ్రత్త గా నడ పాళీ .బుద్ధి చేత మనసును నిగ్ర హించు కొని కోర్కెలను అదుపు లో ఉంచుకోవాలి .ధ్యానం వల్ల మనో నిగ్రహం లభిస్తుంది .దానిద్వారా ఇంద్రియ నిగ్రహం లభిస్తుంది .అప్పుడు మనస్సు ప్రశాంతి పొంది ,ఆత్మోన్నతి కలుగు తుంది . చేసే సాధన ఎప్పుడూ వృధా కాదు .దాని ఫలితం తప్పక లభిస్తుంది .ఈ జగత్తు అంతా దారం తో కూర్చ బడిన మణులు లాగా పరమాత్మ ధరించాడు .నీటి లోని రసం ,చంద్రుని లో ని కాంతి ,నాలుగు వేదాలలోని ఓంకారం ,ఆకాశం లోని శబ్దం ,పురుషులలో పురుషత్వం అన్నీ ఆయనే .భూమి లోని గంధం ( substance),జాలం లోని రసం (fluid ),అగ్ని లోని తేజస్సు (heat and light ),వాయువు లోని ప్రాణ వాయువు(oxygen ),ఆకాశం లోని శబ్దం (sound ),పురుషుని లోని పురుషత్వం (manliness ) ,తపోధనుల లోని తపశ్శక్తి అంత తానే నని చెప్పాడు .”ప్రయాణ కాలే ఆపి చ మం తె విడుర్యుక్త చేతసః ”-ఎవరు మరణ కాలం లో కూడా భాగ వంతుని ధ్యానిస్తారో వారు ఆయన సన్నీ దానానికే చేరుతారు .మరణకాలం లో పుట్టే భావాలే మరో జన్మ కు కారనభూతాలవుతాయి .జడ భరతుడు అనే ముని తపో నిష్ఠ లో ఉంది కూడా ,తాను ప్రేమించి ,పెంచిన జింక మీద మరణ సమయం లో కూడా దానినే ఆలోచిస్తూ ప్రాణాలు విడి చాడు .మళ్ళీ జన్మ లో జింక గా పుట్టి ,జన్మ బంధం నుండి విముక్తి పొంది ,ఆ తర్వాత జన్మ లో ఉత్తమ గతి ని పొందుతాడని భారత భాగవతాలు చెప్పాయి .
భక్తులు నాలుగు రకాలు .ఆర్తుడు అంటే కష్టాల్లో ఉన్న వాడు .అర్దార్ది అంటే ధనం ,సుఖం వంటివి కోరుకొనే వాడు .జిజ్ఞాసి అనగా తత్వ రహస్యాలను తెలుసుకోవాలి అనుకునే వాడు .నాల్గవ వాడు -జ్ఞాని అంటే -పరమాత్మ తత్వాన్ని పూర్తిగా తెలుసు కొన్న వాడు .బ్రహ్మం అంటే వినాశ రహితమైనది .ఆధ్యాత్మం అంటే చేతనం కల జీవాత్మ .కర్మ అంటే త్యాగం తో చేసే పని .అది భూతం అంటే నశించే పదార్ధం .ఆది దైవం అంటే విరాట్పురుషుడు .అధి యజ్ఞం అంటే -దేహం లోని పరమాత్మ .మరణ కాలం లో స్పృహ ఉంటుందో లేదో ,భాగ వంతున్ని స్మరించ గలమో లేదో -కనుక జీవించి నంత కాలం భగవంతున్ని స్మరిస్తూనే ఉండాలి .తన భక్తులేవరు దుర్గతి చెందరు అని శ్రీ కృష్ణుడు చెప్పాడు .చెడ్డ వారైనా ,మనసు పరి వార్తన తో తనను శ్రద్ధా స క్తులతో సేవిస్తే తప్పక సద్గతిని పొందుతారని అభయమిచ్చాడు .
ఒక సారి గోపికల తో రాధ యమునా నదీ తీరాన కూర్చుని ఉంది .ఆమె మనసంతా శ్రీ కృష్ణ ధ్యాన మగ్నమై ఉంది .నారద మహర్షి అక్కడికి వచ్చాడు .ఆయన తన వీణ అయిన మహతి పై భగవన్నామం పలికిస్తున్నాడు .రాధను చూసి ”అమ్మా !కృష్ణుడు లేదని బాధ పడుతున్నావా ?”అని అడిగాడు .అప్పుడు రాధ ”కృష్ణుడు నా హృదయం లోనే ఉన్నాడు కదా ఆయన లేనిది ఎక్కడ ?ఆయన లేడని బాధ పడితే,నా హృదయం లోని దేవుడికి ఆ బాధ కలిగించి నట్లే కదా “”?అన్నది .నారదుడు రాధ లోని అనన్య భక్తికి పొంగి పోయాడు.రాధ తన హృదయ దేవాలయం లో శ్రీ కృష్ణ పరమాత్మ ను ప్రతిష్టించి ,అను క్షణం ధ్యానిస్తూ తపో సిద్ధి పొందిన ధన్యు రాలు .అదీ నిరంతర ధ్యానం అంటే .కుచేలుడు శ్రీ కృష్ణుని స్నేహితుడు ,ఆయన దరిద్రం తో బాధ పడుతూ భార్య మాట మీద ద్వారక కు వెళ్లి పిడికెడు అటుకులు సమర్పిస్తే అష్టైశ్వర్యాలు స్నేహితునికిచ్చిన మహాత్ముడు కృష్ణుడు .అంతే కాదు తన అష్ట భార్య లతో కలిసి కుచేలునికి సపర్యలుచేసి , ,తాను పడుకొనే మంచం మీద ఆయన్ను పడుకో బెట్టి ,కాళ్ళను ఒత్తిన కారుణ్య మూర్తి .స్నేహానికి నిలు వెత్తుఅద్దం గా భాసించాడు . గురువు సాందీపుని పుత్రుడు మరణిస్తే వేది కి అతన్ని పునర్జీవితున్ని చేసి తీసుకొని గురువుకు అప్పగించి గురు దక్షిణ సమర్పించిన ఉత్తమ శిష్యుడు .తనను నమ్మిన గోప గోపికలకు సమస్తమూ తానే అయి కాచి కాపాడిన రక్షకుడు .చెలికాడు .అధర్మ పరుడైన మెన మామ కంసుడినిసంహరించి ధర్మాన్ని రక్షించిన వాడు .సంపూర్ణ విశ్వాసం తో ఆయనను ధ్యానించిన వారి యోగ క్షేమాలను ఆయనే చూసుకొంటాడు .ఈ విశ్వం లో ఎక్కడెక్కడ గొప్పతనం ఉంటుందో అదంతా ఆయన విభూతియే .అర్జునుడికి తన విశ్వ రూపాన్ని చూపించి విభ్రాంతికి గురి చేశాడు .దాన్ని ఉప సంహరించి అతని భ్రాంతిని తొలగించాడు .చరాచర ప్రపంచం అంతా పరమేశ్వరుని లీలా వినోదమే నని గ్రహించాలి .
సత్యాన్వేషణ తో జీవించటమే ,ప్రేమ ,కలిగి ఉండటమే భక్తినే ప్రమిద చేసి ,ఆర్తి ని నేయ్యిగా మనస్సునేవత్తి గా ,అజ్ఞానం అనే చీకటిని పోగోత్తే ,పరా భక్తీ అనే ఉజ్వల దీపాన్ని వెలిగించి భగవంతునికి మన హృదయాన్ని సమర్పణ చేయాలి .ఇదీ భక్తీ లోని పరమార్ధం .జీవుడు పరమాత్మ అంశ ,పరమాణువు ,కాంతి పుంజం .”తత్వమసి ”అంటే నువ్వే నేను అనే బావం తో పరమాత్మను చేరాలి.ప్రకృతే తల్లి .పరమాత్మ తండ్రి .త్రిగునా లను దాటి పరమాత్మను చేర వచ్చు .సంసారం అనేతిరుగ బడిన అశ్వత్థ వృక్షానికి మూలము పరమాత్మ .కొమ్మలు కోరికలు .చిగుళ్ళు మొదలైనవి ఫలితాలు .వివేకం ,వైరాగ్యం అనే ఖడ్గం తో సంసార బంధనాన్ని చేదించి ,కోర్కెల నుండి విముక్తి పొంది ఆత్మ తత్త్వం తో స్తిర పడాలి ఈ వైరాగ్యమే మోక్షం .మంచి గుణాలు కలిగి దైవ చింతన చేసే వారికే ఉన్నతి కలుగుతుంది .పూజ .పునస్కారాదులు భగవంతుని చేర్చలేవు .దయా ,సానుభూతి ,అహింస ,సత్యం ,అన్నిటిలో భగవంతుని చూసే చూపు ,సాత్విక గుణాల వల్లే భగవద్దర్శనం సాధ్యం .ఎవరూ చెప్పని గొప్ప సిద్ధాంతాన్ని కృష్ణుడు చెప్పాడు ”సర్వ ధర్మాన్ పరిత్యజ్వా ”అన్నాడు .అన్నిటిని వదిలేసి తనను శరణు వెడితే తానే అన్నిటినీ చూసుకొంటాను అన్నాడు .అదే భగవద్గీత పర మార్ధం .ఏక్కడ ధర్మార్ది అయిన అర్జునుడు ఉంటాడో ,అంటే ధర్మం చేయాలను కొనే వారు ఉంటారో అక్కడ సంపద , ,విజయం ఐశ్వర్యం స్తిర మైన నీతి ఉంటాయి .శ్రీ కృష్ణడుగొప్ప రాజ కీయ దురంధరుడు .గొప్ప డిప్లోమాట్ .అందరి కళ్ళకు ఆనందాన్ని ,జ్ఞానాన్ని కల్గించే వాడు .విధి విధి నిర్వహణ కోసమే నని చాటిన వాడు . ”The lord of Autumn moon ”శరశ్చంద్ర ప్రభువు శ్రీ కృష్ణ పరమాత్మకు ఈ కృష్ణాష్టమి సందర్భం గా నమస్కరిద్దాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-8-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 978,883 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.22 వ భాగం.31.1.23.
- అరుణ మంత్రార్థం. 7వ భాగం.31.1.23.
- పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం
- బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-3(చివరి భాగం )
- ముదు నూరులో డా.ఎన్.భాస్కర రావు గారింట్లో జీవిత చరిత్రల గ్రంధాలయ వార్షికోత్సవ 0లో 29.01.2023
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్న ఆలయ ధర్మకర్త బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, ప్రభావతి దంపతులు
- ‘’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-2’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.20 28.01.2023
- అరుణ మంత్రార్థం. 5వ భాగం.28.1.23
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,920)
- సమీక్ష (1,275)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (300)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (357)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు