మ్యూజిక్ మెజీషియన్- మొజార్ట్ -2

 మ్యూజిక్ మెజీషియన్- మొజార్ట్ -2
                                                      అన్వేషణ  

ఎందుకో తన పుట్టిన ఊరు సాల్జ్ బర్గ్ పై మోజు లేదు మొజార్ట్ కు .తండ్రి లాగే ఆ కొలువు లో ఉంటె ఏదుగు బొదుగు ఉండదని తలచాడు .తన సత్తా నిరూపించు కోవాలనే ధృఢ సంకల్పం కలిగింది కొన్ని నెలలలో డజను కు పైగా సిమ్ఫనీలు రాశాడు .ఇతర చోట్ల అదృష్టాన్ని పరీక్షించు కోవాలను కొన్నాడు .తండ్రి తో కలిసి మ్యూనిచ్ చేరాడు .అక్కడ ”the pretend gardener ”అనే ఒపేరా రాశాడు .ఆ తరువాత నాలుగు కాన్సర్తోలుపియానో కోసం , అయిదు వయోలిన్ కోసం రాశాడు .వాయిద్యాల తో సోలో నిర్వహించే దాన్ని కాన్సర్తో అంటారు .1777ముందే కొలువు చాలించాడు .ఆనాటి రోజుల్లో ఆర్చి బిషప్పులు ,ధనికులు ,సంపన్న వర్గాల వారు సంగీత కారుల్ని తమ దగ్గర ఉంచుకొని పోషించే వారు .యూరప్ వెళ్లాలని వోల్ఫాంగ్ అనుకొన్నాడు .తండ్రికి కూడా వెంట వెళ్లాలని ఉంది .పర్మిషన్ అడిగాడు ఇక కొలువు లోకి రానక్కర లేదనుకొంటే వెల్ల మన్నాడుఅర్చిబిషప్ .తల్లిని తీసుకొని యాత్ర కు బయల్దేరాడు .
తల్లి కొడుకు మ్యూనిచ్ చేరారు .అక్కడ తల్లిని ఒక ఇంట్లో ఉంచి ప్రయత్నాలు చేశాడు .ప్రేమ లోను పడ్డాడు .పారిస్ వెళ్లాడు .తల్లి కూడా వెంట ఉంది .ఆమె ఒంటరిగా కిటికీ లేని ఇంట్లో ఉండటం తో జబ్బు చేసి చని పోయింది .చేతిలో డబ్బు అయి పోతోంది .కొత్త అవకాశాలేవీ రావటం లేదు .అక్కడ చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు .తిరిగి తండ్రిని చేరాడు .మళ్ళీ బిషప్ గారి కొలువు తప్ప లేదు .అయిష్టం గానే చేరాడు .దర్బారు ఆర్గానిస్ట్ గా చేరాడు .కాన్సేర్ట్ మాస్టర్ గా సంపాదించిన దానికంటే మూడు రెట్లు సంపాదన వస్తోంది .అక్కడ పని చేస్తూనే ,దృష్టిని ఇతరాల వైపు కు మరల్చాడు .సింఫనీ లకు రాయటం ప్రారంభించాడు .అక్కతో కలిసి ఆడాడు .మ్యూనిచ్ కార్నివాల్ కు” idomeneo ”రాశాడు .అది అతని మొదటి గొప్ప ఒపేరా అని అందరు మెచ్చారు .
బిషప్ కొలువు నరకం అని పించింది .వియన్నా రమ్మని బిషప్ ఆజ్న జారీ చేశాడు .అక్కడ జోసఫ్ గారి కోసం రాత్రి ,పగలు కష్టపడి కచేరీలు చేశాడు .చాకిరి ఎక్కువ, రాబడి తక్కువ .అతన్ని చాలా నీచం గా చూశాడు .సేవకుల తో పాటు కూర్చో పెట్టి తిండి పెట్టటం సహించ లేక పోయాడు .వండే వారి సరసన కాకుండా కొంచెం ఎక్కువ స్తాయి వారి తో కూచో బెట్టారని జోకు చేశాడు .ఆర్చి బిషప్ కొలరేడో ఇతన్ని” స్కౌంద్రేల్ అని రోగ్” అనీ తిట్టే వాడు .భరించ లేక ఉద్యోగం వదిలేశాడు .
అలోశియా అనే అమ్మాయిని ప్రేమించి ,ఆమెకిష్టం లేక పోతే చెల్లెలు కాం స్టాన్ జే ను పెళ్ళాడాడు .1782 లో వోల్ఫాంగ్ కామిక్ ఒపేరా ను జోసెఫ్ చూసి ”ఇందులో చాలా గమకాలున్నాయి ”అన్నాడు .కాని ప్రజలు మెచ్చారు .ఏదో అడపా దడపా కచేరీలే తప్ప స్తిర ఆదాయం లేకుండా పోయింది .తన కలలు సాకారం అయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నాడు .అన్వేషణ అనంతం గా సాగుతోంది
                  విషాదం  తో విషాదాంతం
1791 లో 36వ ఏట భార్య తో కలిసి ప్రేగ్ వెళ్లాలని భావించాడు .అప్పటికే the marriage of figaro ,don giovani అనే రెండు అద్భుత ఒపెరాలు రాసి  ప్రదర్శించాడు .అవి అంత వరకు చరిత్ర లో ఎవరూ రాయనంత గొప్పవి అని విశ్లేషకులు మెచ్చారు .అయితే వాటి వల్ల డబ్బులు రాలలేదు .సరస్వతీ ప్రసన్నమే కాని, లక్ష్మీ ప్రసన్నం కాలేదు .చాలా నిరాశ పడ్డాడు పూట గడవని పరిస్తితి లో సంగీత శిఖరారోహకుడు ఉన్నాడు .విధి బలీయం .వియన్నా లో సంగీత క్లాసులు చెప్పుకుంటూ పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవలసి వచ్చింది పాపం ఆ సంగీత సరస్వతికి .చివరికి నియన్నా దర్బారు లో చేంబర్ కంపోసర్ గా ఉద్యోగం లభించింది .అది చాలా  ఉన్నత మైన గౌరవ పదవే, కాని డబ్బు రాలేది కాదు .
1791లో కొత్తఅ వకాశాలు వచ్చాయి .”the magic flute ”అనే కామిక్ ఒపేరా కు రాశాడు అందులో మాట్లాడే మాటల తో పాటు పాటలు కూడా ఉండేట్లు రాశాడు .అది మోజానిక్ ఉత్స వాళ రహస్యాలను తెలియ జేసేది .అందులోని సిద్ధాంతం ప్రకారం చావు తో శిక్ష పడుతుంది .అందుకని మాజన్లు మొజార్టు కు విష ప్రయోగం చేశారని భావించారు .దీనితో ఆయన చాలా నెలలు జబ్బు పడ్డాడు .కాళ్ళు ఉబ్బాయి .వోల్ఫాంగు ను ఒక ”శవ యాత్ర ”(ఫనేరాల్ )లో చేసే మాస్ ప్రదర్శన కు,రాయమని అడిగారు . దానికి ఇచ్చే ప్రతిఫలం చాలా ఎక్కువ. అత్యధిక పారితోషికం  ఇస్తామని వాగ్దానం చేశారు .వియన్నా నోబుల్ అధికారి భార్య చని పోయింది .ఆమే కోసమే ఇది .దానికోసం ,ఇతర కార్యక్రమాల కోసం ఇరవై నాలుగు గంటలూ కష్టపడి సంగీతం సమకూర్చాడు .ప్రేగ్ లో రాజు గారి పట్టాభి షెకానికి వెళ్లి వచ్చిన తరువాత రాస్తాను అని . requiem రాయమని అడిగిన వారికి చెప్పాడు .సెప్టెంబర్ లోవియన్నా లో the magic flute ప్రీమియర్ షో వేశారు .  కొన్ని వారాల తర్వాతాతీవ్రం గా జబ్బు చేసింది .100 ప్రదర్శనలు పొంది వియన్నా లో రికార్డు సృష్టించింది .అయితే వందో ప్రదర్శన చూసే భాగ్యం మన సంగీత మహారాజుకు లభించ లేదు .” requiem ” ను అనుకొన్న సమయం లో పూర్తీ చేయటానికి శక్తి యుక్తులన్నీ ధార పోశాడు .”చని పోయిన వారి కోసం సంగీత విభావరి చేయటం మోజార్టు చావుకు వచ్చింది ”.
అందులోని ఎనిమిది భాగాలకు సంగీతాన్ని సమ కూర్చాడు .డిసెంబర్ నాలుగు న ఆయన చేతులు రెండు  వాచీ పోయి ,నీరు పట్టి కలం పట్టుకో లేక పొయాయి .తన శిష్యుడు ఫ్రాంజ్ సుష్మీర్ సాయంతో ఆ మహత్తర విషాదాంత సంగీత స్వర సమ్మేళనాన్ని పూర్తీ చేశాడు ఆ స్వర బ్రహ్మ .ఆ రాత్రి ఒంటి గంటకు ఆ సంగీత స్రష్ట ఊపిరి అనంత వాయువుల్లో కలిసి పోయింది .అప్పటికి మోజార్టు వయస్సు 35 ఏళ్ళు.మాత్రమె .అప్పటికే ఆయన సంగీత స్వరాలతో అలరించిన రచనలు 600  పైనే ఉన్నాయి .కాని సరైన  గౌరవ ప్రద మైన అంత్యక్రియలు చేయ టానికి ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేక పోవటం అత్యంత విషాదకరం .ఆ మహా సంగీత విద్వాంసుడి శరీరాన్ని సామాన్య జనాన్ని సమాధి చేసే చోటే భూస్తాపితం చేశారు .ఇది అత్యంత దుర ద్రుష్టకర మైన సంఘటన .
కొంత మంది కి బ్రతికి ఉన్నంత వరకు కీర్తి రాదు .చని పోయిన తరువాతే కీర్తి వచ్చి మీద పడుతుంది అదే జరిగింది ఈయనకు .ఆయన మరణ దినాన్ని ఈ నాడు ప్రపంచం అంతటా మిలియన్ల మంది భక్తీ తో శ్రద్ధ తో జరుపుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు .హాలీవుడ్ ,పాప్ సంగీత కారులు మోజార్టు ను విపరీతం గా గౌరవిస్తున్నారు .” amadeus ”..పేరా హాలీ వుడ్ లో సినిమా తీశారు .అందులో ఆయనకు ,సలేరీ కి ఉన్న సంగీత స్పర్ధను హైలైట్ చేశారు .అంతటి సంగీత ప్రతిభా వంతునికి భగ వంతుడు అన్యాయం చేశాడని వాపోతారు సంగీతాభి మానులు .ఆ సినీమాఉత్తమ చిత్రం గా  ఆస్కార్ అవార్డు పొందింది .sallieri యే మోజార్టు ను పాశవికం గా విష ప్రయోగం చేసి చంపించాడని అంటారు .2002 september 11న న్యూయార్కు నగరం మీద తీవ్ర వాదులు దాడి చేసి చేసి నపుడు ప్రపంచ ప్రజలంతా మ్యూజిక్ మజీషియన్ మోజార్టు ను జ్ఞప్తికి తెచ్చు కొన్నారు .వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఆర్కెస్ట్రా తో లక్షలాది మంది వింటూ చూస్తుండగా మోజార్ట్ట్ట్ స్వర పరచిన  ”rolling requiem ”ఒక రోజంతా ఆలపించి శ్రద్ధాంజలి ఘటించారు .
                    మొజార్ట్ ప్రతిభా సమాలోచనం
” మిరకిల్ చైల్డ్” అని ప్రశంసలు పొంది ,ఇవాల్టి” పాప్ స్టార్” లకు ఆదర్శమై ,వయోలిన్ లోని అన్ని టేక్నిక్కులను ప్రయోగించి ,స్వయం గా అన్నీ సాధించి, యే గురువు దగ్గరా శిష్యరికం చేయకుండా ,మేధావి ,జీనియస్ అని పించుకొన్న వాడు మొజార్ట్.ఆధునిక డిస్క్ జాకీ లా ,చిన్న తనం లోనే ఇతర విద్వాంసుల రచన లన్ని తన రచనలో మేళ వించాడు .పన్నెండు ఎల్లప్పుడే  స్వయం గా ఒపేరా రాశాడు .ఆ రోజుల్లో వాడుక లో ఉన్న సర్వ వాయిద్యాలను వాయించి అన్నిట్లోనూ ”మాస్టర్” అని పించుకొన్నాడు .హార్ప్సి కార్డ్ ,పియానో ,వయోలిన్ తో పాటు స్వంత స్వరం తో అద్భుత సంగీతాన్ని విని పించాడు .తన కంటే వయసు లో పెద్ద వారైన సంగీత కారుల కంటేవిద్వత్తు లో  ముందున్నాడు ,అంతా స్వయం గా సాధించిందే .డబ్బు ఎంత ఎక్కువ గా సంపాదించాడో అంత విచ్చల విడి గా ఖర్చు చేసి దెబ్బ తిన్నాడు .అతని ప్రాభవం అంతా ఆయనకు ఇరవై ఏళ్ళు వచ్చే వరకే .ఆ తర్వాత ఆ సంగీత ధార కుంటు పడింది .ఆరేళ్ళ వయసు లోనే యూరప్ లో ఆరాధనీయ్డైనాడు .ఇరవై ఆరేళ్ళ వయసు లో దాన్ని నిలుపు కోలేక పోయాడు .అతని లోని సంగీత జ్వాల కొద్దికాలమే భగ భాగ మండి,క్రమంగా వెలుగు తగ్గింది .ఆ కాలమే ఆయనకు శిఖరారోహణ కాలం .ముప్ఫై అయిదేల్లకే తనువు చాలించిన దురదృష్ట వంతుడు .బాల్యం లో కీర్తి ,ప్రతిభ చూపిన ఆయన్ను ,వయసు లో ఎవరూ పట్టించు కోలేదు .”భగవంతునికి ప్రియమైన వాడు” –”Amadeus ”అని పిలిపించుకొన్న వోల్ఫాంగ్ మో జార్ట్ అమర సంగీతం- రసజ్న లోకాన్ని ప్రభావితం చేసింది . మహనీయ సంగీత విద్వాంసుడుఅని పించుకొన్నాడు . .జర్మని కి చెందిన  బీథోవెన్ అనే సింఫనీ కారునికి కు రెండు వారాలువియన్నా లో సంగీతం నేర్పి ,ఆ తర్వాత ”ఈ కుర్రాడు కొద్ది రోజుల్లో ఉజ్వలం గా ప్రకాశిస్తాడు చూస్తూండండి ”  అనిబీథోవెన్ ప్రతిభ ను అంచనా వేసి  తన శిష్యులకు తెలియ బరచిన సంగీత మర్మజ్నుడు మొజార్ట్ .రెండు మూడు రకాల మాధుర్యాలను మేళ వించి కొత్త అందమైన రుచి మంత మైన అధిక మాదుర్య  విలసిత మైన భావాలను”-అంటే ”-కౌంటర్ పాయింట్ ”ను  సృష్టించిన సంగీత స్రష్ట మొజార్ట్ అమర రహే .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –12-8-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged , . Bookmark the permalink.

2 Responses to మ్యూజిక్ మెజీషియన్- మొజార్ట్ -2

  1. GN Murari says:

    అయ్యా దుర్గా ప్రసాద్ గారు నమస్కారాలు,

    మీరు కూడలి బ్లాగ్ లో మోత్సార్ట్ గురించి రాసిన వ్యాసాలు చదివి ఒక విధంగా చాల ఆనందించాను. కాని వాటిలో ఉన్న ఎన్నో అంశాలు పాశ్చాత్య సంగీత చరిత్రతో అంతగా పరిచయం లేని వాళ్ళకు తికమకలుగా ఉండవచ్చునని నా భావన. మరొక విషయమేమిటంటే మన తెలుగు లిపితో జర్మన్ భాషలో ఉండే కొన్ని శబ్దాలను సరిగ్గా అనుకరణ చేయలేక పోవడం, దానికి ముఖ్య కారణం మనం ఇంగ్లీషు ఉచ్చారణ మాత్రమే ఆధారంగా తీసుకోవడం. ఏది ఏమైనా సరే, ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా సంగీతం పై ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ మంచి అవకాశాలు ఉన్నవి, దానికి మనం సంతోషించాలి. శాస్త్రీయ సంగీతం అంటే మన సంస్కృతిలో చాల మందికి ఒకవిధంగా అర్ధమవుతుంది, అదే పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంపై అవగాహన ఉండాలంటే ఆ సంగీతంతో పరిచయం చాలా లోతుగా ఉండాలి.

    ఏమైనాసరే మీరు చేసే కృషి కి మిమ్మల్ని అభినందిస్తూ
    GN Murari

    • gdurgaprasad says:

      మురారి గారికినమస్తే – ధన్య వాదాలు మీ స్పందనకు .ఇంకా లోతుకు వెళ్లి తెలుసుకొనే వారికి ఒక చిన్న ఇరుకు తోవ చూపాను అంతే .అదో అగాధం .దాన్ని ఈదే శక్తి ఓపిక లేవు .మీ మంచి మాటలు నాకు ప్రేరణ నిచ్చాయి –దుర్గా ప్రసాద్

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.