అరవై అయిదేళ్ళ స్వాతంత్ర ఫలం
అందరికి భారత స్వాతంత్ర దినోత్సవ శుభా కాంక్షలు .అధికారం తెచ్చుకొని అరవై అయిదేళ్ళు దాటింది .కాని స్వతంత్ర ఫలాలు అందరికి దక్కు తున్నాయా అని ఆలోచిస్తే సమాధానం మిశ్రమం గా ఉంటుంది .బాగా ముందుకు వెళ్లామా ?అని ప్రశ్నించుకొంటే లేదనే అందరు చెప్పే సమాధానమే .పాపం అబ్దుల్ కలాం గారు దీని మీద స్పందించి ధనాత్మక దృక్పధాన్ని అలవాటు చేసుకో మన్నారు.కడుపు కాలే వాడికి ఋణం తప్ప ధనం ఎక్కడిది ?సంపాదన అంతా తిండికే ఖర్చవు తుంటే అభి వృద్ధి ఎక్కడ?.అవినీతి ఎక్కడ లేదు ? అని ప్రశ్నించే వారికి ఆది టెంట కిల్స్లాలా వ్యాపించి మూలాలను ధ్వంసం చేస్తోందని తెలిసే లోపల, జరగాల్సిన అనర్ధం జరిగి పోతూనే ఉంది .స్వతంత్ర దినో త్సవానికి ఒక రోజు ముందే మన రాష్ట్ర మంత్రి రాజీ నామా చేయటానికి కారణం అందరికి తెలిసిందే .ఇంకో ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు .సర్వ సమర్ధుడు అని పించుకొన్న వాడిని రాష్ట్ర పతి పదవి వరించింది అన్న సంతోషమే ఈ రోజు మనకు మిగిలింది .కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కాళ్ళ కింద గడ కర్రలు పెట్టుకొని ,ఎత్తుగా ఉన్నట్లు నటిస్తున్నాయి .ఈ ముఖ్య మంత్రి సమర్ధుడు అని అనిపించుకొంటే ,ఆయన మీద పాత కేసుల తిరుగ మోత .ఆదర్శం గా పాలిస్తున్న ముఖ్య మంత్రికి దేశం వత్తాసు పలకదు .ఎంత వెనకేస్తే అంత సమర్ధతే కోల మానం అయింది .అటవీ సంపద ను దోచే వాడొక దైతే ,సముద్రాన్ని మింగే వాడు ఇంకోడు .బందుజనాన్ని అందలం ఎక్కించే వాడొక డైతే ,పల్లకీలు మోసే వారు కొందరు .ఉన్న వ్యవస్థ తీరు తెన్నులను సరైన మార్గం లో మళ్లించే వారు కరువై పోతున్నారు .వారెవ రైనా ముందుకొస్తే ,వారిపై బురద చల్లుడు .ఇన్నేళ్ళ స్వాతంత్రం ఇచ్చిన విష ఫలాలు ఇవి .వీటినుంచి యువతను బయట పడెయ్యాలి .వారిని తీర్చి దిద్దక పోతే భవిష్యత్తు శూన్యమే .
గాంధీ ,నేతాజీలు చిత్ర పటాలుగా గోడలకు వ్రేలాడుతున్నారు .పాపం వారి స్పూర్తి ని కోన సాగించే వారు లేకపోవటం మన దుర దృష్టం .ఒక సారి విజయనగరం మహా రాజా ఆనంద గజ పతి గారు మద్రాస్ లో సైకిళ్ళు అమ్మే దుకాకానికి మారు వేషం లో, మామూలు దుస్తుల తో వెళ్లారు .అవేమిటో ఆయనకు తెలీదు .అక్కడి గుమాస్తాను అవేమిటి అని అడిగితే ”బైసికిల్”అని చెప్పాడట .”ఖరీదెంత ?”అని రాజా ప్రశ్నిస్తే ”నువ్వు కొనేది కాదులే ఫో ”అన్నాడు .”మీ దగ్గర ఎన్ని సైకిల్లున్నాయి “‘? రాజా ప్రశ్న .”రెండు వందలు ”అని జవాబు .మొత్తం బిల్లు చేసి మా సంస్థానం కు వెంటనే రవాణా చేసి పంపండి ”అన్నారు .వాడు బిత్తర పోయాడు .అక్కడున్న మేనేజర్ కు అప్పుడు అర్ధ మయింది .వచ్చింది విజయనగరం మహా రాజా వారు అని .వెంటనే సైకిళ్ళు విజయ నగరం చేరాయి .రాజా వారు పండుగ కానుక గా ఆస్థాన ఉద్యోగులకు వాటిని పంచి పెట్టారు .అయితే మన వాళ్ళూ ఇప్పుడు ఎన్నికల వాగ్దానాలలో టి.వి.లు ఫ్రిజ్ లు ఇస్తామని మొహమాట పెడుతున్నారు .దానికీ దీనికీ ఎంత తేడా నో గమనించండి .వాళ్ళు ధర్మ ప్రభువులు .వీళ్ళు ”మన ఖర్మ ప్రభువులు ”అదీ తేడా .
శ్రీ కృష్ణ దేవ రాయలు అష్ట దిగ్గజ కవులను పోషించి సాహిత్య సేవ చేశాడు .అమరా వతి ప్రభువు రాజా వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు గారు దసరాల్లో ఏనుగు అంబారీ మీద ”వేదాలు ,ఉపనిషత్తులు,దర్శనాలు పురాణాలు ములుగు పాపయా రాధ్యుల వారు రచించిన దేవీ భాగవతాలను ”ఊరే గించే వారు .వాటికి అంత గౌరవం కల్పించారు .మన కు సాహిత్యానికి ,భాషకు మంత్రే లేడు.అకాడెమి లేదు .భాషా సంఘం లేదు .”అన్నిటిని ఊరేగించి మంగళం పాడేశాం ఎప్పుడో” .ముది గొండ వారన్నట్లు ”స్వాతంత్రానికి ముందు దేశం కోసం మరణించటం త్యాగం ,ఇవాళ్ళ దేశం కోసం జీవించటం త్యాగం ”త్యాగం ప్రజలది ,భోగం పాలకులది ఇదీ తేడా .మరి మనమేం చేయాలి ?తిట్టుకుంటూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావు .మంచి ఎక్క డ ఉంటె టే దాన్ని స్వీకరించాలి .అమెరికా బాగుంది సంతోషం .సింగపూర్ శుచికీ శుభ్రతకు నంబర్ వన్ .మరీ గొప్ప.బాగుంది .కలాం గారు అన్నట్లు అక్కడ ఉన్న మంచి వాటిని అక్కడున్నప్పుడు ఆచరించటం కాదు .మన దేశం లో నూ ఆ మంచిని ప్రతి బిమ్బింప జేయాలి .అప్పుడే సార్ధకత .అప్పుడు దేన్నీ మనం తిట్టనక్కర లేదు దేన్నీ పొగడక్కర లేదు .ఆదర్శం ఆచరణం కావాలి అది ఇక్కడైనా ,ఎక్కడైనా .ఈ స్ఫూర్తి తో ఈ స్వాతంత్ర దినోత్స వాన్ని జరుపు కుందాం .చీకటిని పాతి పెట్టి, వెలుగు లోకి ప్రస్తావన సాగిద్దాం .మన కోసం త్యాగాలు చేసి మన చేతుల్లో ఉంచిన స్వాతంత్ర ఫలానికి విషం ఎక్క కుండా ,పుచ్చి పురుగులు కారకుండా ,పరి శుభ్రం గా ఉంచి కాపాడి నాణ్యంగా, తాజాగాదాని పోషక విలు వలను సహజం గా పెంచి , తర్వాత తరాలకు అందిద్దాం .జై హింద్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-8-12–కాంప్–అమెరికా
వీక్షకులు
- 650,625 hits
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మహా భక్త శిఖామణులు 17- రవి దాసు
- సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం
- మహా భక్త శిఖామణులు16-నాగ మహాశయుడు -2(చివరిభాగం
- సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం
- శ్రీ రమణీయ రామాయణం
- మహా భక్త శిఖామణులు 16-నాగ మహాశయుడు -1
- డిసెంబర్ తెలుగు వెలుగు లో దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 పై సమీక్ష
- మహా భక్త శిఖామణులు14-అర్జున మిశ్రస్వామి
- మహా భక్త శిఖామణులు 12-దీపా౦కుర స్వామి
- మహా భక్త శిఖామణులు 9-పవుహరీ(పవన్ ఆహారీ =పవుహరీ =గాలి భో౦ చేసే )బాబా (స్వామి)
భాండాగారం
- డిసెంబర్ 2019 (16)
- నవంబర్ 2019 (53)
- అక్టోబర్ 2019 (36)
- సెప్టెంబర్ 2019 (44)
- ఆగస్ట్ 2019 (66)
- జూలై 2019 (54)
- జూన్ 2019 (68)
- మే 2019 (60)
- ఏప్రిల్ 2019 (36)
- మార్చి 2019 (47)
- ఫిబ్రవరి 2019 (68)
- జనవరి 2019 (61)
- డిసెంబర్ 2018 (46)
- నవంబర్ 2018 (47)
- అక్టోబర్ 2018 (53)
- సెప్టెంబర్ 2018 (50)
- ఆగస్ట్ 2018 (51)
- జూలై 2018 (58)
- జూన్ 2018 (30)
- మే 2018 (29)
- ఏప్రిల్ 2018 (28)
- మార్చి 2018 (33)
- ఫిబ్రవరి 2018 (37)
- జనవరి 2018 (63)
- డిసెంబర్ 2017 (33)
- నవంబర్ 2017 (22)
- అక్టోబర్ 2017 (28)
- సెప్టెంబర్ 2017 (17)
- ఆగస్ట్ 2017 (69)
- జూలై 2017 (52)
- జూన్ 2017 (65)
- మే 2017 (68)
- ఏప్రిల్ 2017 (55)
- మార్చి 2017 (40)
- ఫిబ్రవరి 2017 (46)
- జనవరి 2017 (81)
- డిసెంబర్ 2016 (51)
- నవంబర్ 2016 (54)
- అక్టోబర్ 2016 (35)
- సెప్టెంబర్ 2016 (24)
- ఆగస్ట్ 2016 (54)
- జూలై 2016 (78)
- జూన్ 2016 (44)
- మే 2016 (42)
- ఏప్రిల్ 2016 (61)
- మార్చి 2016 (44)
- ఫిబ్రవరి 2016 (36)
- జనవరి 2016 (96)
- డిసెంబర్ 2015 (120)
- నవంబర్ 2015 (133)
- అక్టోబర్ 2015 (150)
- సెప్టెంబర్ 2015 (135)
- ఆగస్ట్ 2015 (135)
- జూలై 2015 (129)
- జూన్ 2015 (185)
- మే 2015 (186)
- ఏప్రిల్ 2015 (184)
- మార్చి 2015 (130)
- ఫిబ్రవరి 2015 (158)
- జనవరి 2015 (147)
- డిసెంబర్ 2014 (209)
- నవంబర్ 2014 (135)
- అక్టోబర్ 2014 (152)
- సెప్టెంబర్ 2014 (170)
- ఆగస్ట్ 2014 (129)
- జూలై 2014 (110)
- జూన్ 2014 (84)
- మే 2014 (79)
- ఏప్రిల్ 2014 (81)
- మార్చి 2014 (76)
- ఫిబ్రవరి 2014 (74)
- జనవరి 2014 (92)
- డిసెంబర్ 2013 (112)
- నవంబర్ 2013 (102)
- అక్టోబర్ 2013 (101)
- సెప్టెంబర్ 2013 (104)
- ఆగస్ట్ 2013 (53)
- జూలై 2013 (70)
- జూన్ 2013 (55)
- మే 2013 (27)
- ఏప్రిల్ 2013 (98)
- మార్చి 2013 (95)
- ఫిబ్రవరి 2013 (62)
- జనవరి 2013 (101)
- డిసెంబర్ 2012 (110)
- నవంబర్ 2012 (95)
- అక్టోబర్ 2012 (55)
- సెప్టెంబర్ 2012 (75)
- ఆగస్ట్ 2012 (63)
- జూలై 2012 (55)
- జూన్ 2012 (54)
- మే 2012 (60)
- ఏప్రిల్ 2012 (50)
- మార్చి 2012 (61)
- ఫిబ్రవరి 2012 (93)
- జనవరి 2012 (85)
- డిసెంబర్ 2011 (68)
- నవంబర్ 2011 (77)
- అక్టోబర్ 2011 (51)
- సెప్టెంబర్ 2011 (15)
- ఆగస్ట్ 2011 (26)
- జూలై 2011 (45)
- జూన్ 2011 (68)
- మే 2011 (55)
- ఏప్రిల్ 2011 (37)
- మార్చి 2011 (37)
- ఫిబ్రవరి 2011 (15)
- జనవరి 2011 (2)
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (25)
- అమెరికా లో (201)
- అవర్గీకృతం (109)
- ఆరోగ్యం (5)
- ఊసుల్లో ఉయ్యూరు (72)
- కవితలు (137)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (8)
- నా డైరీ (8)
- నా దారి తీరు (127)
- నేను చూసినవ ప్రదేశాలు (97)
- పుస్తకాలు (1,903)
- సమీక్ష (280)
- మహానుభావులు (264)
- ముళ్ళపూడి & బాపు (58)
- రచనలు (850)
- రాజకీయం (59)
- రేడియో లో (52)
- వార్తా పత్రికలో (2,133)
- సభలు సమావేశాలు (304)
- సమయం – సందర్భం (684)
- సమీక్ష (8)
- సరసభారతి (8)
- సరసభారతి ఉయ్యూరు (421)
- సినిమా (48)
- సేకరణలు (298)
- సైన్స్ (44)
- English (6)
ఊసుల గూడు
Sarasabharati
https://www.youtube.com/watch?v=vLPfYIme-os