అమెరికా ఊసులు –14 –ప్రెసిడెంట్ -గార్ ఫీల్డ్
అమెరికా 20 వ ప్రెసిడెంట్ గా ఎన్నికయిన జేమ్స్ అబ్రాం గార్ ఫీల్డ్ 1881 మార్చి 4 న పదవీ స్వీకార ప్రమాణం చేశాడు .కాని పదవిలోకి వచ్చిన నాలుగు నెలల లోపే న్యు జెర్సి లోని అల్బెరాన్ లో ”చార్లెస్ గుటయు ”అనే దుండగుడి కాల్పులకు గురైనాడు .సెప్టెంబర్ 19 న పాపం మరణించాడు .లింకన్ తర్వాత దుండగుడి కాల్పుల్లో వెంటనే చని పోయిన ప్రెసిడెంట్ ఈయనే .పదవిలో గట్టిగా ఆరు నెలల పదిహేను రోజులు మాత్రమె ఉన్నాడు .
గార్ఫీల్డ్ పదవీ స్వీకారం చేసే టప్పుడు ఎనభై ఏళ్ళ అతని తల్లి ఎలిజా కూడా వైట్ హౌస్ కు వచ్చి హాజరై స్వయం గా చూసింది .అలా యే ప్రెసిడెంట్ తల్లి అప్పటి వరకు తన కొడుకు ప్రమాణ స్వీకారాన్ని చూసి ఉండలేదట . అదో రికార్డు .
గార్ ఫీల్డ్ అధ్యక్ష భవనాల గేట్ల వద్ద సోల్జేర్లను కాపలా ఉంచటానికి వ్యతి రేకిన్చాడ ట . అధ్యక్ష భవనం లోఅతిధుల కోసం జరిగే విందులు ,వినోదాలు ఆయె ఖర్చు అంతా తనకు వచ్చే జీతం లోంచే ఖర్చు చేసే వాడట .
అమెరికా లో మొదటి సారిగారెడ్ క్రాస్ అంతర్జాతీయ సహాయక సంస్థ గా జెనీవా ఒప్పందాన్ని అమలు పరచ టా నికి అమెరికా లో దీనికోసం క్లారా బార్టన్ అనే ఆ సంస్థ ప్రతినిధి కోరితే వెంటనే రెడ్ క్రాస్ సంస్థను ఏర్పాటు చేసిన ఘనత గార్ఫీల్డు దే.గార్ ఫీల్డు నే దానికి నాయకత్వం వహించమని కోరితే ఆమె నే దానికి నాయకురాలిని చేశాడు .దీనికి అమెరికన్ కాంగ్రెస్ అంగీకారం కావాలి .దాన్ని కూడా చేశాడు .గార్ ఫీల్డ్ తన మంత్రి వర్గం లో అబ్రహాం లింకన్ కుమారుడు తాడ్ లింకన్ ను secretary of war ”ను చేశాడు .
గార్ఫీల్డు కు తాను చదివిన ప్రతి పుస్తకం వివ రాలు రాసుకోవటం అలవాటు .తన స్నేహితులకు సంవత్సరం చివరలో ఆ సంవత్సరం లో తన విజయాలు ,అపజయాలు ఉత్తరాల ద్వారా రాయటం కూడా అలవాటుగా ఉండేది .అధ్యక్షుడైన తర్వాతస్నేహితునికి జాబు రాస్తూ వైన్ లేకుండా డిన్నర్ చేసుకోన్నామని గర్వం గా రాసుకొన్నాడు (sine vino ).
కాల్పులు జరిగి వైట్ హౌస్ లో ఉన్న ప్పుడు వైస్ ప్రెసిడెంట్ చెస్టర్ యే.ఆర్ధర్ పరా మర్శించ టానికి వస్తే అనుమతించలేదు .అతను అక్కడున్న వారితో తన మనసు లోని కోర్కెను నర్మ గర్భం గా బయట పెట్టాడు ” god knows i donot want the place .i was never elected to ”అన్నాడు .
గార్ఫీల్డు కు బుల్లెట్ శరీరం లో ఉండి పోయి ఇన్ఫెక్షన్ వచ్చి ,కుడి వైపు పక్ష వాతం వచ్చి ,బరువు సగానికి సగం తగ్గి జ్వరం రక్తం చీము కారి చని పోయాడు .అతన్ని కాల్చిన’ గుటయు ”కు మతి స్తిమితం లేదని 160 మంది డాక్టర్లు ఒక పిటీషన్ ఇచ్చినా, దాన్ని వైస్ ప్రెసిడెంట్ ఆర్ధర్ తిరస్కరించాడు .అయినా వాడిని ఉరి తీసి చంపారు .ప్రెసిడెంట్ గార్ ఫీల్డు కాలేయం దగ్గర చేరిన తుపాకి గుండు ను పరీక్షించే టప్పుడు డాక్టర్లు స్టెరిలైజేషన్ పద్ధతులను, అంటి సెప్టిక్ పద్ధతులను పాటించ లేదనే అభి యోగం ఉంది .
గార్ ఫీల్డ్ జీవించిన 49 ఏళ్ళ కాలం లో సగం కాలం దేశానికి సేవ లందించాడు .ఈయన పదవి లోకి వచ్చిన పదిరోజుల్లో రష్యా లోని జార్ చక్ర వర్తి రెండవ అలెగ్జాండర్ హత్యకు గురైనాడు .ఇంకా కొంత మంది ఐరోపా నాయకులు హత్య గా వింప బడ్డారు .ఈ విషయాలన్నీ తెలిసినా ఆయన ”assasination can no more be guarded against than death ,by lightning -it is best not to worry about either ” అని తేలిగ్గా తీసుకొన్న వాడు .ఈయన అమెరికా సైన్యానికి జెనరల్ గా కూడా పని చేసిన ధైర్య శాలి .
రిపబ్లికన్ పార్టి ప్రెసిడెంట్ కాండి డేట్ నుసమా వేశం నిర్వ హిస్తుండగా హేమా హేమీలు పోటీ పడ్డారు .ఈయన సీన్ లో లేడు ”ఈయనను ”బ్లాక్ హార్స్”అన్నారు .కాని అందరు చివరికి ఈయన్నే సమర్ధించారు .కొద్ది మెజారిటి తో అధ్యక్షుని గా గెలిచాడు .1878 లో అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంట టివ్ లకు మైనారిటీ నాయకుడ యాడు
గార్ఫీల్డ్ 1831లో ohio రాష్ట్రం లో orange toun ship లో జన్మించాడు
.పది హేడు ఏళ్లకు ఈవెనింగ్ స్టార్ అనే నౌకకు కెనాల్ బాయ్ గా పని చేశాడు .geauga అకాడెమీ లో చదివాడు
.disciples of christ church లో మత బోధకుడు గా పని చేశాడు .హిరం కాలేజి లోని western reserve electic institute లోను ,ఆ తర్వాతా విలియమ్స్ కాలేజి లోను చదివాడు .విలియమ్స్ నుంచే గ్రాడ్యు ఎట్ అయాడు . ఎల్క్టిక్ కాలేజి ఫాకల్ టిసభ్యుడయాడు .ఆ సంస్థకు ప్రెసిడెంట్ అయాడు
గార్ ఫీల్డ్” లుక్రేషియా ”అనే ఆమె ను వివాహం చేసుకొన్నాడు 1959.లో అంటే ఇరవై ఎనిమిదేళ్ళకు ఒహాయో సెనేట సభ్యుడిగా ఎన్నికయాడు .స్వంతం గా, ”లా” పుస్తకాలు చదివి, పాసై లాయర్ అయాడు .యూనియన్ ఆర్మీ లో చేరి ,కెంటకి ,తెనిసీ లకు సేనను నడిపాడు .ముప్ఫై ఒకటవ ఏడాదిన అమెరికా హౌస్ ఆఫ్ రిప్రేసెంట టివ్ గా ఎన్నికయాడు .1863లో మేజర్ జెనరల్ గా పదోన్నతి పొందాడు .బాంకింగ్ అండ్ కామర్సు కు హౌస్ కమిటీ చైర్మన్ అయాడు .రెండేళ్ళ తర్వాతా అప్రాప్రిఎషన్ కమిటీ చైర్మన్ అయాడు .1877 ప్రెసిడెంట్ ఎన్నికలలో వివాదం వస్తే దాన్ని పరిష్కరించే electoral committee కి ప్రభుత్వం చె నియమింప బడి అన్నిటిని కూలం కషం గా అధ్యయనం చేసి రిపబ్లికన్ పార్టి అభ్యర్ధి hayes కే మెజార్టి ఉందని నివేదిక ఇచ్చాడు .ఈ వివాదం ఆమధ్య జార్జి wబుష్ కు ఆల్ గోరె(2000)కు మెజార్టి మీద వచ్చిన చిక్కు ముడి లాంటిదే .
గార్ ఫీల్డ్ మహా వక్త గా ప్రఖ్యాతి పొందాడు .అరగంట కు ఒక ఉపన్యాసం చొప్పున ఒకే రోజు ఇరవై ఉపన్యాసాలు ఇచ్చిన ఘనుడు .ఆయన కు లాటిన్, గ్రీక్ లభాష ల పై మహా భి నివేశం ఉంది .ఆ రెండు భాషల్లో రాయ గలడు మాట్లాడ గలడు.అసలు ఆయన ది ”పుర్ర చేతి వాటం ”.ఆతర్వాత కుడి చేత్తో కూడా రాయటం అల వాటు చేసుకొన్నాడు .ఒక చేతితో గ్రీకు భాషను ,ఇంకో చేత్తో లాటిన్ భాషను ఒకే సారి రాసే ”సవ్య సాచి” అయాడు .సాధనమున పనులు సమకూరు అనే దానికి నిదర్శనం గార్ఫీల్డ్.ఆయన మాట్లాడే శైలికి ముగ్దులయే వారు .జీవితాంతం ఒక ”చేతి రాత ప్రతి” గా జర్నల్ నడిపాడు .తన సామర్ధ్యం మీద నమ్మకం ఉంది .తాను క్లాస్ లో మొదటి స్థానాన్ని సంపాదించాలి అనుకొని ,కష్ట పడి సాధించాడు ” to stand at first or die .i believe i can do it .,if granted a fair trial ”అని రాసుకొన్నాడు .
ఫీల్డు- కెనాల్ బాయ్ గా ఉన్నప్పుడు 14సార్లు నదిలో పడి మునిగి పోయాడు చలి లో తానే ఏదో విధం గా బయట పడే వాడు .ఖాళీ దొరికితే ఏదో పని చేసి డబ్బు సంపాదించే వాడు .ఫారం హౌస్ లో పని చేసే వాడు .తల్లికి బాగా సాయం చేసే వాడు .చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు .అన్నిటికీ అమ్మే .బైబుల్ ను తానే స్వయం గా చదవటం నేర్చుకొన్నాడు ఎనిమిదేల్లకే ”బెస్ట్ రీడర్ ”అని పించుకొన్నాడు .రాబిన్సన్ క్రూసో నవలన్నా ,నెపోలియన్ సాహస గాధలన్నా మహా ఇష్ట పడే వాడు .డిబేటింగ్ లో ఎప్పుడూ ఇతనికే బహుమతి లభించేది .ఇళ్లకు కంచే వేసే వాడు .వంద అడుగులకు డెబ్భై అయిదు సెంట్లు సంపాదించే వాడు . ఆ కాలం లో బడులుఎలా ఉండేవో తెలుసా -వేసవి ,శీతా కాలాల లోనే పిల్లలు స్కూళ్లకు కు వెళ్ళే వారు .మిగిలిన సమయాల్లో పొలం పనులు .అందరికి ఒక టే గది .ఆడ పిల్లలు ఒక పక్కా మగ వాళ్ళు ఒక పక్క .అన్నీ బట్టీ పట్టించటమే .బడి లో ఒక స్టవ్ ,నీళ్ళ బకెట్ ,మాత్రమె ఉండేవి .కింద కూర్చునే చదువు .ఎనిమిదో క్లాస్ వరకే చదువు .క్లాసులో మగ పిల్లలు ”మహా ముదుళ్ళు” గా ఉండే వారు .మాష్టారిని చదువు చెప్ప నిచ్చే వారు కాదు .అన్నిటికీ అడ్డు కొనే వారు . .మాస్టారు రాక ముందే స్కూల్ గేటు మూసే సే వారు . ఆయన లోపలి రాగలిగితే ఆ రోజు బడి ఉన్నట్టు లేక పోతే బెల్ కొట్టి ఇంటికి చెక్కే యటమే .ఇదీ1840-50ప్రాంతం లో గ్రామీణ విద్యాలయాల స్థితి .మనం మాత్రం దీనికేమీ తీసి పోలేదేమో .వీటినే మన వాళ్ళు ”వానా కాలం చదువులు ”అన్నారు .
బానిసత్వాన్ని నిర్మూలించాలి అనే ధ్యేయం ఉన్న వాడు గార్ ఫీల్డ్ .1862లో ఇరవై వ బ్రిగేడ్ నాయకుడి గా ఉన్నప్పుడు ఒక బానిస -యజమాని నుంచి తప్పించుకొని పారి పోయి ఇతని ఆశ్రయం చేరాడు .ఇది తెలుసు కొన్న పై అధికారి అతన్ని యజమానికి అప్ప గించమని హుకుం జారీ చేశాడు .”నేను ఆ పని చేయలేను చేయను ”అని ఖచ్చితం గా చెప్పాడు ఫీల్డ్ .ఇది ఒక రకం గా ఆజ్ఞను ఉల్లంఘిన్చటమే .తీవ్ర నేరమే .కాని ఇతని సచ్చీలత ను చూసి ఎవరూ దాన్ని తీవ్రం గా తీసుకో లేదు . ఆ తర్వాతా ఒక సాధారణ సూచన జారీ అయింది .దా ని ప్రకారం సైన్యం చేతికి చిక్కిన బానిస లను యజ మానులకు ఇవ్వ రాదు .ఆ రోజుల్లోku klux klan అనే సంస్థ పూర్వపు బానిసలకు వారి హక్కు లను కోరే వీలు లేదు అని వాదించేది .
ఫీల్డు -హౌస్ లో అప్రాప్రిఎషన్ కమిటీ లో పని చేసి నపుడు రోజుకు 15 గంటలు పని చేసే వాడు .ఇలా మూడు నెలలు చేశాడు . చక్కని సంస్కరణలు సూచించాడు .నేటివ్ అమెరికన్ లకు కూడా పూర్తి పౌరసత్వం ఇవ్వాలని వాదించాడు .వాషింగటన్ లో సెనేటర్ గా ఉన్న ప్పుడు ఇంటికి ఉత్త రాలు రాసే వాడు .అందులో పిల్లలకు జాగ్రఫీ హిస్టరీ పాథాలు ,పజిల్సుపంపించే వాడు .
ఆ రోజుల్లో green backers అనే రాజ కీయ పార్టి ఉండేది .వీళ్ళు రైతు అనుకూలురు .ఇది కాక ”ప్రొహి బిషన్ పార్టి ”అనే ఇంకో పార్టి ఉండేది .వీళ్ళు దేశం లో ఆల్కహాల్ అమ్మ కుండా చేయాలి అని కోరే వారు .ఇదీ గార్ ఫీల్డుగారి నాటి ఒహాయో తదితర రాష్ట్రాలలో ఉన్న పరిస్తితి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-12-కాంప్–అమెరికా