జన వేమన –5 విశ్వ కుటుంబి

జన వేమన –5 విశ్వ కుటుంబి 
తాను చూసిన ప్రతి విషయాన్ని ప్రజలకు అనుభవం లోకి తేవటం కవి చేసే పని .దీనికి మంచి భావనా శక్తి ,పదు నైన పదశక్తి తోడైతే ,రాసేదంతా బంగారమే .ఆ రెండు శక్తులు వేమన లోపుష్కలం .  విపరీత మైన లోక పరిశీలన తో లోకాన్ని కాచి వడ పోశాడు .అనుభవ సారం సామ్ద్రం గా ఉంది .తత్వ జిజ్ఞాస ఆయన లో వేళ్ళూను కొని ఉంది .దార్శనికత దారి చూపింది .ప్రతి దాన్ని విచారించి తెలుసు కొనే విచక్షణత ఉంది .విజ్ఞానం విపులం గా ఉండనే ఉంది .ఈ మూడు లక్షణాలు వేమన లో త్రివేణీ సంగమం లా చేరాయి .అందుకే ,ఆయన మాట్లాడిన ప్రతి మాటా పవిత్ర మైంది .చైతన్య వంత మైన ఆలోచన ఉంది .”దార్శనికులు ప్రపంచాన్ని వ్యాఖ్యా నిస్తారని ,ప్రవక్తలు మాత్రమె ప్రపంచాన్ని మార్చ టానికి ప్రయత్నిస్తారని ,వేమన అభ్యుదయ ప్రవక్త ”అని ఆరుద్ర కితాబిచ్చారు .
వేమన సిద్ధాంతం ”సంసార యోగం ”ఇది ఉంటె స్వర్గం కూడా అక్కర్లేదన్నాడు .ఆ యోగాన్ని బాగా ప్రచారం చేశాడు .ఇన్ని విషయాల పై సాధి కారం గా మాట్లాడిన వేమన, యే విద్య నేర్చాడు ? అని మనకు సందేహం వస్తుంది .వేమన కు పుస్తక జ్ఞానం లేదు అని కట్ట మంచి రామ లింగా రెడ్డి గారు అంటే ,వేమన రామాయణ ,భారతాలు ,బసవ పురాణం ,శివ పురాణం పుక్కిలి పట్టాడని మాన్యులు రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ గారు అన్నారు .శ్రుత పాండిత్యం ఎక్కువ ,ఉప నిషత్తులు చదివి ఉండచ్చు అన్నారు వావిళ్ళ రామ శాస్త్రి .ఆరుద్ర మాత్రం -యోగం ,తంత్రం ,ఉపనిషత్తులు గుప్త విద్యలు ,వేమన కు కరతలా మలకం అని స్పష్టం చేశారు .కవి చౌడప్ప ”వానకు తదియని వాడును -పూనిక వేమన్న చేత బోరయని వాడున్ –నానా దిక్కుల వెదకిన కానమురా –కుంద వరపు కవి చౌడప్పా ”అని మెచ్చాడు .
”విశ్వదాభి రామ వినుర వేమ ”అనే మకుటం చాలా ప్రాధాన్యత సంత రించు కొన్నది .విశ్వం అంటే సకల ప్రపంచం అని వేమన భావన .తాను చెప్పేది ,విప్పేది ,బోధించేది ,నీతులు నేర్పేది ”అభి రామం ”గా అంటే మనసుకు ఆహ్లాదాన్నిచ్చి మనోహరం గా ఉంటూ ,కర్ణ పెయమై ,”దా ”అంటే ఇచ్చేవాడిని గా తనను తాను వేమన్న భావించు కొన్నాడు .అంటే -”ప్రపంచ ప్రజలకు ,ఆదర్శ వంతం ,నీతి మంతం ,అయిన మాటలను మనోహరం గా హృదయాలను తాకే టట్లు ,విన టానికి ఇంపు గా అందించే కవి గా ,అనగా ”ప్రజా కవి ”గా తనను భావించు కొన్నాడు .అందుకే” జన వేమన” అయ్యాడు .అయితే ఎవరికి చెప్పినా ,ఆ చెవిన విని ఈ చెవిన వది లేయటం లోక సహజం .అందుకే ఎవరికో ఎందుకు -తనకు తానే చెప్పు కొంటున్నట్లు ”వినుర వేమా ”అను కొన్నాడు .తానే గురువు ,తానే శిష్యుడు .ఆత్మ బోధకం గా ,ముక్త కాలుగా చెప్పిన” పద్య మౌక్తికాలు” ఇవి .
”ఆట వెలది ”ఆయన్ను సన్యాసాశ్ర మం లోను వెంటాడుతూనే ఉంది .ఆ ప్రభావం గాధం అవటం తో పద్య ఛందస్సూ ”ఆటవెలది ”యే అయింది .మురిపించింది .జనాన్ని మరపించింది .స్వాధీన పతిక అయింది .తెలుగు వారికి ప్రీతీ పాత్రమూ అయింది .అందుకే వేమన గారిని ”విశ్వ కుటుంబి ”అని ఆరుద్ర అనటం సహజం, శోభస్కరం ,ఉచితం అయింది .వేమన తన జీవిత గతి నే మార్చు కొన్నాడు .సంస్కారం సాధించాడు .ఆత్మ సంస్కార శోభితుడూ అయాడు .అందుకే ఆయన మాట కు అంత పదును .భావానికి అంత నిగ్గు .ఆయన పద సంపద కు అంతటి ఆదరణ ,అభిమానం .”లోకాభి రామం వేమన పద్యాలు ”.
 వేమన గారి” సంసార యోగం” 
”తన దేశ కాల పరిస్తితుల వల్లా ,తన తనువు లో పుట్టిన తత్త్వం వల్లా ,వేమన గారు ఎన్నో ఆచారాలు వ్యవహారాలూ ,కర్మ కండలు ధర్మ శాస్త్రాలు చూసి ,కాచి వడ పోసి ఒక సిద్ధాంతానికి వచ్చారు .దాన్నే ”సంసార యోగం ”అన్నారు దానినే పని కట్టు కొని ప్రచారం చేశారు .ఇది ఉంటె స్వర్గం అక్కరలేదన్నారు వేమన ”అని ఆరుద్ర వేమన ను కాచి వడ పోసి చెప్పారు .ఆ వివరణ లోకి వెళ్లి చూద్దాం .”సుగుణ వంతు రాలు సుదతి యై యుండిన -బుద్ధి మంతు లగుచు పుత్రు లొప్ప” –అన్నాడు .”స్వర్గాదపి గరీయసి” అన్న మాట .సమాజం లోని వైరుధ్యాలను సమన్వయము చేసుకోవాలి .జ్ఞానం యొక్క పూర్వా పరాలను ఆకలింపు చేసుకోవాలి .ఆహార ,ఆచార వ్యవహార విషయాలల్ లోని మూల తత్వాలను తెలుసు కొని ,బ్రతికి నపుడే ”గృహస్తు ”అన్న పేరు సార్ధకమవుతుంది .”ఇంటికి దీపం ఇల్లాలే ”.ఆమె మాటల్లో మాధుర్యపు ఊటలుంటాయి .”పసిడి కన్నా మిగుల పడతి మాటలు తీపి ”అన్నాడు అందుకనే .తల్లి ,తండ్రి లతో అక్క ,అన్నా సమానం .వాళ్ళను ఎదిరించటం పాపం .తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలే .వారిని గౌరవిన్చాటమే ”దేవతార్చన ”.”తల్లి దండ్రి కంటే వేరు దైవంబు లేదయా ”అన్నాడు .కుటుంబం చల్లగా ,చక్కగా సాగాలి అంటే అందరు శ్రమించాలి .తలిదండ్రుల పై ఆధార పడటం మంచిది కాదు .”శ్రమ ఎవ జయతే ”అన్నది పాటించాలి .
”చెమట కారు నట్లు శ్రమ చేసి దేహంబు -గడన చేసి కూడు గుడువ వలయు -తల్లి దండ్రి సొమ్ము దా దింటగా రాదు ” అని సుతి మెత్త గా చెప్పాడు .”కులం లో ఒకడు గుణ వంతుడు ఉన్నా ,వాడి వల్ల కులం వెలిగి పోతుంది ”.”తల్లి దండ్రి మీద దయ లేని పుత్రుడు పుట్టినా ,గిట్టినా ఒకటే ”.అలాంటి వారు పుట్ట లో ఉన్న చెద పురుగుల వంటి వారు .సమాజం లో ఇలాంటి చెద పురుగులు చేరితే సమాజ వృక్షా నికే ప్రమాదం .వాటిని ఎదగ నీయ రాదు .”అమ్మనూ ,ఆలిని సమానం గా చూడాలి ”అలా చూసిన వాడే నేర్పరి .భార్యా భర్తలు పోర పోచ్చాలు లేకుండా ఒకే మాట తో జీవిస్తే సంసారం స్వర్గం అవుతుంది .ఆలు మగని మాటకు మాటి మాటికీ అడ్డం వస్తే ఆమె ”మారగాలు ”అవుతుందని ,అలాంటి దాన్ని వదిలించుకోవటం క్షేమం అనీ చెప్పాడు .సంసార రధానికి భార్యా భర్తలు రెండు చక్రాలు ,రెండు గుర్రాలు .ఒకరు ఏటి కీడిస్తే ఇంకోరు కోటికీడ్చ రాదు .అని గుర్తు చేశాడు .సంసారం కోసం కష్ట పడే యజ మానికి తోడు ఎవరు ఉండరు .బ్రహ్మ లోకమే తోడు .అలానే సతికి సుతుని వల్ల సౌఖ్యం కలుగు తున్దన్నాడు .తండ్రి కంటే కొడుకు గుణ వంతు డైతే చిన్న వాడైనా కొడుకు నే గౌర వించాలి .మత్సరం ,మదం ,మమకారాలు అనే వ్యసనాలను వదిలి ,పరోప కారం చేస్తే వాడే ”రాజ యోగి” .”అధిక సంతానం అనర్ధ దాయకం ”అని ఆ నాడే వేమన చెప్పాడు .”పందిలా పిల్లల్ని కన వద్దు ”అని హితవు చెప్పాడు .”ఏనుగు ఒక్క పిల్ల నే కంటుంది ”అదే ఆదర్శం అన్నాడు .ఇద్దరు కూడా ఒద్దు .ఒక్కరే ముద్దు అన్నాడు .
”పతి యొప్పిన ,సతి యొప్పును –పతి సతు లోక టైన పరమ పావన మందున్ –సతి పతి న్యాయమే మోక్షం –బతు లిత పరమాత్మ యైక్య మగురా వేమా ”అని సతీ ,పతి ఐక మత్యమే సంసారం సుఖ సారం అని ఆ మాధుర్యాన్ని విడమరచి చెప్పాడు .ఇంకొంచెం ముందుకు వెళ్లి ”సతి యందె పతి పుట్టే –పతియు సతి యందె పుట్టే పరమార్ధముగా –సతి పతు లనగా నెవ్వరు –మతి లో దల పోసి చూడు మహిలో వేమా ”అనే పరమ వేదాంత సత్యాన్ని వివ రించాడు .వేదాంత గురువు అయాడు .ఆడది చేసే తప్పు మగ వాడికి చెందు తుంది .పతి చేసే మంచి సతికి సగం చెందు తుంది .పతి చేసే తప్పు సతికి ఎందుకు రాదు అని ప్రశ్నిస్తాడు .ఈ రకం గా మంచి అవగాహన తో కుటుంబ సభ్యులు ఉంటె ఇల్లు స్వర్గమే .కాకుంటే నరకమే .అందరిదీ సమాన భాగస్వామ్యమే .యే ఒక్కరు గడిదాటినా సంసారం చిద్రమే .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22-8-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.