జన వేమన -6 సంసార యోగం —

 జన వేమన -6
                                                         సంసార యోగం —

సంసార విషయం లో వేమన తాను చెప్పిన దానికి ఎవరైనా భిన్నం గా ప్రవర్తిస్తే ఉతికి ఆరేశాడు .అక్కడ ఆడా ,మగా తేడా చూపించలేదు .తప్పు ఉంటె చాలు ఉప్పు పాతరే  వేశాడు .అంతటి క్రమ శిక్షణ జీవిత విధానం లో ఉండాలని వేమన కాన్క్షించాడు .”వెలయ భూమి తల్లి ,విత్త నంబు తండ్రి -పంట లరయ ,సుతులు ,పాడి పరము –ధర్మ మే తన పాలి దైవంబు తల పోయఅని సంసార సూత్రాన్ని ఆవిష్కరించాడు .దీనికి వ్యతి రేకం గా ప్రవర్తిస్తే సాహిస్తాడా ?స్త్రీ ల విషయం లో పురుషుల దాష్టీ కానని నిలదీశాడు .”భర్త వ.ర్త నమ్బే పడతికి గ్రాహ్యంబు -”అన్నాడు . ”ఆడది అంటే నరకం అనే భావన సరి కాదు అని చెప్పాడు .పురుషులు అంతా పుణ్యం చేత జన్మించారని ,పాపం అంత స్త్రీ రూపం అనీ భావించిన వారి కళ్ళు తెరిపించాడు .”కాంత నెల్లప్పుడు కావ లేని వాడు చావ వలయు ”అని ఆడదానికి రక్షణ నివ్వని మగాణ్ణి నిందించాడు .ఇల్లాలిని వదిలి ,పర స్త్రీ పొందు కోరే వ్యభి చారులపాటి యమ పాశమే అయ్యాడు .”పంట చేను విడిచి ,పరిగ ఏరి నట్లుంది ”అన్నాడు అలాంటి వారిని .వేశ్య డబ్బు గుంజి ,జబ్బు అంట కడుతుంది .”కొరక నేర్చిన గేదె చేపు తుందా ?”అని ప్రశ్నించాడు 
.వేశ్య మాతల దౌష్ట్యాన్ని కళ్ళకు కట్టించాడు .యవ్వనం లో ఉన్న స్త్రీ లను బజారు లో ఉంచి ,విటుల నుంచి డబ్బు గుంజి ,వారిని ”పాపర్లను ”చేసేసి ,వారితో బాటు ,వసి వాడిన తమ కూతుల్లనూ తరిమేస్తారు వేశ్య మాతలు .వాళ్లకు కావల సిందిడబ్బు ,నగా నట్రా మాత్రమె .కనుక ఇల్లాలి తోనే సుఖం పొందమని హితవు చెప్పాడు .వేశ్యల వలపు బూటకం .ఆడది అంటే అందరికీ అలుసే ,ఆశే .”వెర్రి వాని కైన ,వేష ధారి కి నైన –రోగి కైన బరమ యోగి కైన -స్త్రీ ల జూచి నపుడు చిత్తమ్ము రంజిల్లు ”అని మగ వాడి ”చిత్త కార్తే  తనాన్ని ”బయట పెట్టాడు .ఆలి వంక వారిని ఆత్మీయులు గా చూడటం ,తల్లి వంక వారిని దూరం చేయటం తండ్రి వంక వారు దాయాదులు అవటం లోక సహజ రీతి గా చెప్పాడు .మగడు ఉన్నప్పుడు ఆడది కష్ట పడితే ,కొడుకుల కాలం లో సుఖం అనుభ వీస్తుంది .కనుక ”కలిమి లేము లెందు గల వెంత వారికి –బలిమి ,పుత్ర బలమే బలిమి ”అండగా ఉంటె నిండుగా ఉన్నట్లే .”మాల పైన ప్రేమ మర్యాద కాదొకో ”అని మాత్రు ప్రేమ విలువ చెప్పాడు .”డబ్బున్నప్పుడే స్త్రీ,ధవుని మర్యాద గా చూస్తుంది .డబ్బు లేకుంటే దుబ్బు కు కొరగాని వాని గా చూడటం లోకం లో భార్య లక్షణం .”వెలయాలి వల్ల కూరిమి రాదు .వస్తే ,వదలదు .అందరు నడిచే దారిలో గడ్డి మొలవదు .”మొలిచే నేని పొదలడు ”.మొలిచినా పెరగదు .కాళ్ళ కింద నలిగి పోతుంది అని లోక సహజం గా చెప్పాడు .ఇలా ఎవ రైనా కుటుంబాన్ని వదిలి ,దారి తప్పితే .ఆ కుటుంబం అంతా అస్తవ్యస్తమై, కష్టాల పాలు అవుతుంది అని గట్టిగా అందరికి బుద్ధి చెప్పాడు వేమన తాత .
                          వేమన దృష్టి లో స్త్రీ 
స్త్రీ కి సమాజం లో ఉన్నత స్థానం ఉంది .దాన్ని ఆమె కాపాడు కోవాలి .మంచి నడవడిక ,సంస్కారం ,సంప్రదాయం ఉన్న స్త్రీ అంటే వేమన్న గారికి గౌరవమే .అయితే ,కొంత మంది పురాణ స్త్రీలు స్వార్ధం తో ప్రవర్తించిన సందర్భం లో ,ఆయన ,వారి ప్రవర్తనను ,పద్యా లలో బంధించి ,ఆలోచించి చూడమని చెప్పాడు .అంత మాత్రం చేత ఆయన్ను స్త్రీ ద్వేషి అన లేము .”ఔరా ఆడు దాని నా బ్రహ్మ సృష్టించే -పురుషు పాలిటి పెను భూత మట్లు”అన్నాడు .అంత మాత్రాన అయన స్త్రీ ద్వేషా?శ్రీ రామ కృష్ణ పరమ హంస ”కాంతా కనకాలకు దూరం గా ఉండమని ”పదే  పదే  చెప్పే వారు .ఒక ఉత్కృష్ట స్తితి ని పొంద టానికి అదొక మార్గం .అంతా సన్యాసులు కాలేరు కదా .లోక రీతి జరగాలి .సృష్టి కార్యం సాగాలి .దీనికేమీ వ్యతి రేకతలేదు .ఆ మొహాన్ని తగ్గించు కోమనే సలహా .స్త్రీ శరీరాన్ని ”చెలగి యగ్ని జూచు శలభంబు చాడ్పున ”ఆ మహాగ్ని లో దగ్ధం కావద్దు అనే ఆయన సలహా .వివాహం ,సంసారం వద్దన లేదే .చెప్పిన మాట వినే గృహిణి ఉంటె స్వర్గం ,లేకుంటే నరకం అన్నాడు .”ఆడ బుద్ధి కంటే అపర బుద్ధి ఏది ? ”అని ప్రశ్నించాడు .ఇది స్త్రీ ని అవమానించటం అని ,ఆడవారి మనసు వేమన తెలుసు కొ లేక పోయాడని రాయసం లక్ష్మి గారు అభి ప్రాయ పడ్డారు .ఇది సరైన అభి ప్రాయం కాదని వేమన తత్త్వం తెలిసిన వారు అభి ప్రాయం చెప్పారు .”మూడు కొప్పు లున్న చోట చుక్కలు పోడుచును ”ఆన్నాడు వేమన .ఇది లోక రీతి .ముగ్గురు స్త్రీలు ఒక చోట చేరితే వారి అభి ప్రాయాలు కలవక పోట్లాడు కొంటారని అర్ధం .”కైక బుట్టి చేర్చే -కౌసల్య తనయుని -సీత పుట్టి లంక జెరచే గాదే -కౌరవులను జెరచే ద్రౌపది యును గూడ ”.అని ,రామాయణ ,మహా భారత కధల్లో ఉన్న పాత్ర ల స్వభావాన్ని చెప్పాడు .ఒక్కొక్క అవతా రానికి ఒక్కొక్క పరమార్ధం ఉంటుంది .ఆది గూధం గా ఉంటుంది .అయితే సామాన్యుల భావన వేరుగా ఉంటుంది .దీన్ని ప్రతి బిమ్బించే పద్యమే ఆది .స్త్రీలు ఉంటె తగాదాలు ఉంటాయి .వాళ్ళు లేక పోతే శోభే లేదు .రెండూ నిజమే .సందర్భాన్ని బట్టి కవి చెబుతూ ఉంటాడు .ఏదో ఒక దానికి కొమ్ము కాశాడని కాదు
స్త్రీ కి ఉన్న శక్తి సామర్ధ్యాలు వేమన కు బాగానే తెలుసు .అందుకే కుటుంబం లో స్త్రీ స్తానాన్ని ఉన్నతం గా ముందే చెప్పాడు .ఆ మార్గాన్ని దాటిన వారినే ఆయన ఎత్తి చూపించాడు .ఆమె కున్న ఓర్పు భూదేవి ఓర్పు .”ఓడు శిధిల మైన నోరుపు గల సతి -గుణము  ,పేర్మి ,బట్టి కోటి సేయు -”  అన్నప్పుడు స్త్రీ కి ఉన్న వో ర్మీకి పట్టాభి షేకం చేసి నట్లు కాదా ?”అన్య పురుష వాంచ నాడు దానికి నుండు ”అన్నాడు .ఇది అందరి స్త్రీ లకు వర్తించదు .లక్ష్మణ రేఖ దాటినవారికే .శతక కర్త లందరూ ఇలా చెప్పిన వారే యే భాష లో చెప్పినా .ఇదంతా లోక రీతి వ్యాఖ్యానమే .అందర్ని ఒకే గాడిన కట్టటం కాదు .ఎక్కడ తప్పు ఉంటె ,అక్కడ మాటల తో చెళ్ళుమణి పిస్తాడు .ఎక్కడ మంచి ఉంటె అక్కడ ప్రశంసించాడు .ఆయన అన్నిటికి అతీ తం గా ఉండి చెప్పిన హితవులే ఇవి .మనకున్న పరిమిత పరిజ్ఞానం తో ఆయన్ను ఒక వర్గానికి ద్వేషి అని ముద్ర వేయటం వివేకం అని పించు కోదు.
”యోగి వేమన నిస్సంగం గా ఉన్నప్పుడు దార్శనికుడు గా కనీ పిస్తాడు .ఆ స్తాయి లో ఉన్నా ,పూర్వ భోగాశ్రమా గతులూ ,సంగతులు మెదలి నపుడు ,లోకులు తమ కష్టాలను ఆయనతో చెప్పుకోన్నప్పుడు ,ప్రజా కవి గా ,సంస్కర్త గా ,దర్శనమిస్తాడు .ఆ సందర్భం లో జన వ్యవ హారం లోని మాటలు వాడి నప్పుడు పెడసరి ,గడసరి ,తనం కనీ పిస్తుంది .భోగ స్త్రీ ల గురించి చెప్పినపుడు ,భర్తలు చాటుగా వ్యవహారం చేసిన స్త్రీల గురించి చెప్పినపుడు అవును -వేమన్న స్త్రీ ద్వేషి గా నే కన్పిస్తాడు ”.అని ఆచార్య కసి రెడ్డి వెంకట రెడ్డి చక్కగా తీర్మానం చేసి తీర్పు ప్రకటించారు .ఇలా అర్ధం చేసుకోవాలి .కువాదాలు చేసి  మనసుల్ని గాయ పరచ రాదు .ఆ మహా మహుని ఆంతర్యాన్ని శంకించటం తగని పని ”.భార్యా భర్తల బంధం -జీవాత్మ పరమాత్మ ల బంధం .ఇతరుల కోసం జీవిస్తూ ,వారి బాధలు తీర్చే వాడే వేదాంతి .తన భార్య తో మాత్రమె దాంపత్య ధర్మం నేర వేర్చె వాడు ”సంసార యోగి ”.విషయాలను నెగాటివు లు గా చెప్పి, పాజిటివులు గా మార్చటానికి వేమన ప్రయత్నించాడు .ఒక భోగినీ ,యోగిని ల మధ్య వేమన జీవాత్మ వికశించింది .అందుకే ”నడుమ బట్ట కట్ట నగు బాటు కాదొకో ”అన గలిగాడు” అని కసి రెడ్డి కమ్మగా విశ్లేషించి చెప్పారు  . .బుద్ధి చెప్పేటప్పుడు గుద్ది చెప్పాలి అన్న సత్యం ఒంట బట్టిన వాడు వేమన .మార్గ దర్శి ,మహిత తత్వ దర్శి .
అంతే కాదు -తమాషా ఏమిటంటే -యే పద్యం వేమనది / ఏది కాదు ?అని తీర్మా నిన్చటానికి వీలు లేని స్తితి లో ఆయన పద్యాలున్నాయి .అందులో ప్రక్షిప్తాలు ఎన్నో కలిసి పోయాయి .”ప్రపంచం లో ఏదైనా సామెత చెప్పాలంటే ,వేమన్న దగ్గరకే పోవాలి మనం ”.”ఆట వెలది వలచి అడుగంటే వేమన -ఆట వెలది వలచి ఆయే ఘనుడు -వెలది వెలది లోన కలదురా భేద మ్ము”అని ఆయనే తన నిజ స్వరూపాన్ని ,ఆయన భావాలంత దిగంబరం గా ఆవిష్కరించుకొన్నాడు .దేన్నీ దాచలేదు .మగ వాని ఉత్థానాని కైనా ,పతనాని కైనా ఆడదే కారణం అని పురాణాలు ,లోక రీతి ఘంటా పధం గా చెబుతున్నాయి .పైకి పాకితే ఆమె గొప్ప తనాన్ని కీర్తిస్తాం .దిగ జారితే ఆమె కారణం అని నిందిస్తాం ”ఎంత రాసినా ,ఎంత ఎదురు తిరిగినా వేమన మిత వాదే .తీవ్ర వాది కాదు .దిగంబరుడే కాని ,దిగంబర వాది కాదు .కొన్ని సాహిత్య మర్యాదలను పాటించాడు .ప్రాపంచిక విలువల వలువల్ని కాపాడటమే పరమ లక్శ్యం గా పెట్టు కొన్నాడు .”అని గన్ను కృష్ణ మూర్తి పెన్ను సాక్షి గా ”గన్  షాట్ ” గా చెప్పి కళ్ళు తెరి పించాడు .ఆ నాడే కాదు ఈ నాడూ నవ నాగర కత లో ఉన్నామని మురిసి పోతున్న మనం ఆడవాళ్ళ కు సమాన న్యాయం ఇస్తున్నామా ?సమాన హోదా వస్తోందా ?క్లబ్బులు, పబ్బులు ,రెడ్ ఏరియాలు ఎంత వద్దన్నా పెరిగి పోవటం లేదా ?స్త్రీ విశ్రుం ఖలంగా  ప్రవర్తించటం  టి.వి.లలో ,ప్రసార మాధ్య మాలలో జుగుప్స కల్గించటం లేదా ?దాన్ని ఖండిస్తూనే ఉన్నాం కదా .కల్పనా చావ్లా చేసిన సాహసాన్ని కీర్తిస్తున్నాం .సేరినీ విలియమ్సు వ్యోమ గానాన్ని స్వాగతిస్తూనే ఉన్నాం .ప్రపంచం మొత్తం మీద స్త్రీలు చేసే ప్రతి గొప్ప పనినీ శ్లాఘిస్తూనే ఉన్నాం .మహిళా ప్రధానులు మహిళా ముఖ్య మంత్రులు మహిళా రాష్ట్ర పతి ఉన్న దేశం మనది .మహిళాభ్యున్నతికి పాటు పడిన వారందరికీ జేజేలు చెబుతూనే ఉన్నాం .వారికి చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించ మని ఒత్టిడితెస్తూనే ఉన్నాం .వారిలో నైనా, మగ వారి లో నైనా లోపాలు కన్పిస్తే సవరించు కోమని చెబుతూనే ఉన్నాం .సమ సమాజ జన జీవనాన్ని అందరం కోరు కొంటూనే ఉన్నాం .మహిళామ తల్లుల్లారా వేమన్న స్త్రీ ద్వేషి కాదని మళ్ళీమళ్ళీ  విన్న విస్తున్నాం .
మ్సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-8-12- కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.