సరసభారతి 1000 పోస్ట్స్ – మైలు రాయి
సరభారతి 1000 పోస్ట్స్ – మైలు రాయి దాటింది. దీనికి మీ ఆదరాభిమానాలే కారణం.
వీక్షకులు : 68,321
ప్రపంచం లోని తెలుగు వారి అందరికి పరిచయమయ్యింది. బ్లాగ్ ప్రారంభం అయ్యిన తరువాత గ్రామీణ ప్రాంతం నుంచి తెలుగు లో ఉసూల గూడు (బ్లాగ్స్) కూడా రాస్తారు అని ప్రపంచానికి తెలిసింది.
అమెరికా ప్రయాణం లో పరిచయం లేని వాళ్ళు కూడా గుర్తు పట్టి బ్లాగ్ గురించి గొప్పగా చెప్పటం విశేష అనుభూతి.
73 ఏళ్ళ వయసులో కంప్యూటర్ నేర్చుకొనటం, తెలుగు లో టైపు చేయటం, నోట్స్ తయారు చెయ్యటం ఈమెయిలు రాయటం. సమాధానాలు రాయటం నేను నేర్చుకోన్నవి.
టైపింగ్ లో కొన్ని తప్పులు దొర్లినా మంచి మనసుతో దానిని అర్ధం చేసుకొని బ్లాగ్ కి సహకరించిన వారి అందరికి ధన్య వాదాలు.
పేరు పేరు నా రాయక పోయినా, అందరికి ఇవే నా ధన్య వాదాలు మరొకసారి
మీకు అభినందనలు.
మీరు మరెన్నో చక్కటి టపాలను అందించాలని కోరుకుంటున్నానండి.
అభినందనలు.
సరస భారతి blog నాకు చాలా ఇష్టమైన నేను పదే పదే చూసేటువంటి blog
ప్రతి post లో ఏదో ఒక అంశం నేర్చుకోవచ్చు.
ఎంతో ఉన్నతమైన stuff ని పొందుపరిచారు ఇందులో
సహస్ర చంద్ర దర్శనం లాగా so happy 1000 posts is not a joke
ఎంతో నిబద్ధత శ్రద్ధ అవసరం.
మీకు ఉన్న ఆసక్తి ఒకెత్తయితే, మీకు లభిస్తున్న ప్రేరణకు కూడా అంతే priority ఇవ్వవలసి వుంటుంది మీ ఈ 1000 వ post మీలు రాయిలో
వీక్షకులు : 68,321 అని ఇచ్చారు ఇందులో చిన్న సవరణ చేయాల్సి ఉంటుందేమో అనిపిస్తుంది,
ఎంచేతనంటే, మీ ఈ blog కి subscribe చేసుకున్న వారలకు అంతా మీ ప్రతి post mail రూపాన పూర్తిగా వస్తుంది.
so comment చేసేందుకు మటుకే blog post పై క్లిక్ పడుతుంది
ఆ విధంగా చూస్తే, పై సంఖ్య చాలా తక్కువని వేరే చెప్పనక్కర్లేదు.
telugu లో ఒక ఉన్నతమైన అంశాలు నిండియున్న బ్లాగుల్లో మీ blog ముందువరుసలో ఉంటుంది.
మీ blog post ల regular వీక్షకునిగా నా అభినందనలు, సంబరాలు, నమస్సులు
– Jai sairam
?!
“73 ఏళ్ళ వయసులో కంప్యూటర్ నేర్చుకొనటం, తెలుగు లో టైపు చేయటం, నోట్స్ తయారు చెయ్యటం ఈమెయిలు రాయటం. సమాధానాలు రాయటం , బ్లాగ్ నిర్వహించడం చాలా చాలా గ్రేట్ గురువు గారు .
మీ నుంచి మరిన్ని టపాలు రావాలని కోరుకుంటున్నా……KNMURTHY
సరస భారతి బ్లాగుకూ , వేయి టపాలు ప్రచురించినందుకూ , అభినందనలు గురువు గారూ !
మీ వయసులో , ఇంత చక్కని బ్లాగును తెలుగులో తెలుగు వారికి అందిస్తున్నారు,
మనసుకూ , మెదడుకూ వయసు తో సంబంధం లేదని ఋజువు చేశారు , చేస్తున్నారు కూడా !
ఇది ( తెలుగు ) యువత కు ఎంతో స్ఫూర్తి దాయకం !
మీరు శత సహస్ర టపాలతో , సరస భారతి నీ , తెలుగు భాషనూ , పరిపూర్ణం చేస్తారని ఆశిస్తున్నాను.
మీ ఆసక్తి ప్రస్తుత యువతకు ఉంటె ఈ దేశం చాలా మారి ఉండేది.ఈ వయసులో మీరు ఇన్ని పోస్ట్ లు వ్రాసి ఎందరికో స్పూర్తి నింపారు.మీరు ఆరోగ్యంగా ఉండి మరో వెయ్యి పోస్ట్ లు వ్రాస్తారని ఆశిస్తూ .