అమెరికా డైరీ–స్కూళ్ళ రిఒపెనింగ్ వారం

       అమెరికా డైరీ–స్కూళ్ళ రిఒపెనింగ్ వారం 
                                    ఆగస్ట్ ఇరవై సోమ వారం నుండి ,ఇరవై ఆరు ఆదివారం దాకా విశేషాలు –
సోమ ,మంగళ వారాలలో విశేషాలేమీ పెద్ద గా లేవు . పుస్తకాలు చదవటం ,నోట్సు రాసుకోవటమే ఎక్కువ గా జరిగింది .మైనేని గారు మెయిల్ రాస్తూ బాపు గారి ఆరోగ్యం బానే ఉందని ,రెండు నెలల తర్వాత మళ్ళీ టేస్ట్ చేయించాలని చెప్పారు .
  అభిమానులు  అల్లుడు అవధానికి హడావిడి గా  చేసిన పుట్టిన రోజు వేడుక 
ఆగస్ట్ ఇరవై రెండు బుధ వారం మా అల్లుడు అవధాని గారి కి తెలుగు తిధుల ప్రకారం పుట్టిన రోజు .దీన్ని పసి గట్టిన ఆయన అభి మానుల కుటుంబం నాగ మణి దంపతులు గప్ చిప్ గా రాత్రి యేడు గంటలకు కేకు తెచ్చి ఆయన తో కోయించి ,వాళ్ళ ,వీళ్ళ పిల్లల తో సహా హేపీ బర్త్ డే పాటపాడించి హడా విడి చేశారు .అందరు ఇక్కడే భోజనాలు చేశారు .మా అమ్మాయి రసగుల్ల ,వెజిటబుల్ బిర్యానీ చేసింది .అంతా బానే లాగించారు .
ఈ ఇరవై మూడో తేది గురువారం నాటికి సరస భారతి ”వెయ్యి ఎపిసోడుల’‘ పండుగ పూర్తీ చేసుకొని అందరి అభి మానాన్ని పొందింది .ఇరవై నాలుగు శుక్ర వారం రాత్రి మా ఇంట్లో భజన జరిగింది .పాతిక మంది వచ్చారు .తొమ్మిది దాకా భజన .ఆ తర్వాతా విందు .పాయసం అన్నం ,సాంబారు ,వెజిటబుల్ బిర్యానీ ,పెరుగు ,దోసకాయ చెట్నీ చేసింది మా అమ్మాయి .వల్లం నరసింహా రావు  గారు, భార్యా ,అమ్మాయి రేణుక ,మనవడు కూడా రావటం బాగుంది .ఆ జంటే ఇక్కడ రెండు నెలల క్రితం యాభై వ పెళ్లి రోజు వేడుక చేసుకొన్నారు .ఆయన నాటక, సినీ నటుడు స్వర్గీయ వల్లం నరసింహా రావు గారికి స్వయానా అన్న గారి కుమారుడే .ఇద్దరి పేర్లు ఒకటే అవటం తమాషా గా ఉంది .ఈ నరసింహా రావు గారు  గొప్ప పైంటర్ .ఆయన వేసిన ”అష్ట లక్ష్మీ దేవి ”చిత్రాన్ని స్కాన్ చేసి ఫ్రెం కట్టించి ,వాళ్ళ పెళ్లి రోజు వేడుకల నాడు అందరికి కానుక గా మా అందరికి  ఇచ్చారన్న సంగతి ఇప్పుడే తెలిసింది .శని వారం రాత్రి జగదీశ్ ,లక్ష్మి దంపతుల ఇంట్లో భజన .ముప్ఫై మంది పైగా వచ్చారు .అందరికి రెండు స్వీట్లు రెండు హాట్లు ,అన్నం ,పులిహోర ,చపాతి కూర ,పెరుగు ల తో భోజనం .ఇంటికి వచ్చే సరికి రాత్రి తొమ్మిది అయింది .మా  అమ్మాయి వాళ్ళ ఇంటి కి దగ్గరే ఉన్న నీలిమా దంపతుల గృహ ప్రవేశ పార్టీ కి వెళ్లారు .మేమిద్దరం వెళ్ళ లేదు .కాని మా కోసం ఫ్రూట్ సాలిడ్ ,ఐస్ ఫ్రూట్ పంపారు .ఆ రోజు మధ్యాహ్నం ”గోదా వరి ”సినిమా యు ట్యూబు లో ఆసాంతం చూశాం .ఒక రకం గా దృశ్య కావ్యం .దర్శకుడు శేఖర్ కమ్ముల కు మెయిల్ రాయాలని అని పించింది .మెయిల్ అడ్రెస్ ను మా పెద్దబ్బాయి శాస్త్రి సంపాదించి ,పంపించాడు .తీరిగ్గా రాయాలి .
       వేసవి సెలవుల అనంతరం బడుల ప్రారంభం
అమెరికా లో పిల్లల వేసవి సెలవులు అయి పోయాయి .ఆగస్టు మధ్య నుంచి విద్యా లయాలు దాదాపు అన్ని చోట్లా ప్రారంభ మైనాయి . మా మనవళ్ళ స్కూళ్ళు ఈనెల ఇరవై యేడు సోమ వారం నుండి ప్రారంభం .సుమారు మన లాగానే ,రెండు నెలలు వీళ్ళకూ సెలవులు . మనకు బడులు ఏప్రిల్ ఇర వై  నాలుగు నుండి మూసేస్తారు .మళ్ళీ మనకు జూన్ పన్నెండు న తెరుస్తారు .ఇక్కడ జూన్ పది న మూసేస్తారు .ఆగస్టు రెండో వారం లో తెరుస్తారు .ఇక్కడ విద్యార్ధుల కోసం నోటు పుస్తకాలు ,తెల్ల కాగితాలు ,పెన్నులు ,పెన్సిల్లు ,మొదలైన స్కూల్ కు అవసర మైన వాటి నన్నిటిని చాలా తక్కువ రేట్లకే ఈ నెలంతా అమ్మటం విశేషం .తలి దండ్రులు ,పిల్లల తో వాల్ మార్టు ,టార్గెట్ ,శామ్సు,కే.మార్ట్ లాంటి మాల్సు లన్ని కళ కళ లాడాయి .చూడ ముచ్చటగా ఉంది .140పేజీల రూళ్ళ స్పైరల్ పుస్తకం కేవలం 17  సెంట్లు మాత్రమె .150 పేజీల రూళ్ళ కాగితాలు దస్త్రం కేవలం ఎనభై ఎనిమిది సెంట్లు .ఇంత కారు చవక గా దొరికే టట్లు చేయటం ఇక్కడి వారు తీసుకొనే ప్రత్యెక శ్రద్ధ .ఈరేట్లు మన కు నలభై పైసలే ,రెండోది రెండు రూపాయల లోపే .అదే మనకు బడులు తెరిచే సమయం లో పుస్తకాల రెక్కలు ఆకాశం అంటు తాయి .దొరకటం కష్టం కూడా .బ్లాక్ మార్కెట్ లో అవి నల్లగా  మెరుస్తుంటాయి .అదీ తేడా .ఇంకో విషయం .ఇక్కడ ప్రభుత్వ బడులలో విద్యార్దు లందరికి సెకండరి స్థాయి వరకు ఉచిత విద్య .పుస్తకాలు ఫ్రీ .బస్సు ఫ్రీ .ఇదీ ఇక్కడి వెసులు బాటు .కాలేజి లో చేరి నప్పుడే తలి దండ్రులకు ఖర్చు .అప్పుడు దాదాపు పిల్లలు స్వంత కాళ్ళ మీద నిల బడి సంపాదించు కొంటూ ,చదువు కోవటం విశేషం .
ఈ వారం లో lydia maria child అనేమహిళా  రచయిత, బానిసత్వ నిర్మూలన కోసం ముప్ఫై ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి, సాధించిన ఆమె జీవిత చరిత్ర చదివాను .గొప్ప గా ఉంది .స్పూర్తి దాయకం గానూ ఉంది . Al goreఅనే పర్యా వరణ ప్రేమికుడు ,అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంటు గురించి చదివాను .అలాగే” న్యూక్లియర్ ఫిషన్,”పై పరిశోధన చేసి తనతో పని చేసినశాస్త్రజ్ఞుడి మోసం వల్ల నోబెల్ బహు మతి ని కోల్పోయి ,ఆమె చేసిన భౌతిక శాస్త్ర పరిశోధనలకు అనేక బహు మతులను పొంది,మొదటి జర్మన్ ఫిజిక్స్ ప్రొఫెసర్ అయి ,నాజీ ఉద్యమం లో దేశాన్ని విడిచి వెళ్ళి, పీరియాడిక్ టేబుల్ లో 109 వ మూల కాన్నిఆమె గౌరవం గా ”Meitnerium ”అన్న పేరు తో  ఆమె సేవలకు ప్రతి ఫలం గా కానుక గా పొందిన” Lise Meitner”   అనే ఆమె చరిత్ర చదివి ఎంతో ఆనందాన్ని ,బాధను పొందాను . Gar field ,Madison ,Beeethoven ల పై పుస్తకాలు ఎంతో అనుభూతినిచ్చాయి .ఇవీ ఈ వారం విశేషాలు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –27-8-12-కాంప్–అమెరికా ,

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

1 Response to అమెరికా డైరీ–స్కూళ్ళ రిఒపెనింగ్ వారం

  1. oddula ravisekhar అంటున్నారు:

    మీ పుస్తక పఠనం మాకు స్పూర్తిదాయకం.109 మూలకం గురించి మాకు తెలియని విషయం చెప్పారు.మీకు ధన్యవాదాలు.

oddula ravisekharకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.