ఆయనా -ఈయనా
” ఈయన” వచ్చే సరికి ”ఆయన” దాదాపు బట్టలు ఏమీ లేకుండా ఒక్క గోచీ గుడ్డ తో ఆసనం పై సుఖాసీను లయి ఉన్నారు .శరీరం కొంచెం రాగి రంగు లో ఉంది .వయస్సు యాభై ఉండి ఉంటాయి .జుట్టు గడ్డం మీసం తెల్ల బడ్డాయి .ఆయన విశాల ఫాల భాగం విజ్ఞాన ప్రభ లను వెద జల్లు తోంది .ఆయన మూర్తి మత్వం అపురూపం గా గోచరించింది .ఆయన చుట్టూ శిష్యులు పర్య వేష్టించి ఉన్నారు .అంతా నిశ్శబ్దం తాండ వీస్తోంది .ఆయన కళ్ళ లో అతీద్రియ తేజస్సు గోచరం అవుతోంది .ఆ కళ్ళు విప్పారి ఏదో లోకోత్తర శక్తిని దర్శింప జేస్తున్నాయి .ఆయన కాయం అతీన్ద్రియత్వానికి ప్రతీక గా కన్పిస్తోంది .ప్రశాంత చిత్తం గా ఆయన కన్పిస్తున్నారు .ఎవరు వచ్చారో ,ఎవరు వెళ్తున్నారో ఆయన గమనించే స్తితి లో ఉన్నారు .మనిషి ఉనికి గురించిన ఎరుక ఆ కళ్ళ లో గోచరించింది .ఈయన ఇంతకు ముందు ఎందరి నో చూశాడు .వారెవరి లో లేని ఏదో మహత్తర ఆకర్షణ ,తేజస్సు ఆయన లో కనీ పించింది ఈయనకు నోట మాటే రావటం లేడు .ఎన్నో సందేహాలను తీర్చు కొందామని ఈయన, ఆయన దగ్గరకు వచ్చాడు .ప్రశ్నలన్నీ ఏమై పోయాయో తెలీటం లేడు .ఆయన ఒక మహా సమాధి స్తితి లో ఉన్నట్లు గోచరించింది .అంతా శూన్యం లో విహరిస్తున్నట్లుంది .ఆయన లో ఏదో ఉంది .అదేమిటో తెలీటం లేదు.ఈయన కూడా రెప్ప వాల్చ కుండా ఆయన నె చూస్తూ కూర్చున్నాడు .అంతే -కాలం గడిచి పోతోంది .మనసు లోని సందేహాలు గంటలు గడిచిన కొద్దీ పటా పంచలయి పోతున్నాయి.ఒక పుష్పానికి సువాసన లా ఆయన సమక్షం లో మనోనైర్మల్యం అంతటా వ్యాపించి ఉంది .ఆయన నుండి రేడియో ఆక్టివ్ తరంగాలు వ్యాపించి నట్లు ,తనను శక్తి మంతం ,కాంతి మంతం చేస్తున్నట్లు ఈయన భావించి ,ఆ ప్రభావానికి ముగ్ధుడై పోతున్నాడు .మనసంతా ప్రశ్నల మయం గా వచ్చిన ఈయనకు ఇప్పుడు మనసంతా సర్వ శూన్యం అయి పోయింది .గుండె గొంతుక లో కొట్లాడు తోంది .మాట మాత్రం పెదవి దాటి రావటం లేదు .అగాధ సముద్రాలను అవలీల గా దాటిన ఆనందాన్ని పొందిన తీరు లో ఉన్నాడీయన . చివరికి అదృష్టం తలుపు తట్ట్టింది .మౌన ఘోష విడి పోయింది .ఆయన దృష్టి ఈయన వైపు ప్రసరించింది కొన్ని గంటల మౌనం తర్వాత.అంతకాలం తాను అనుభ వించిన ప్రశాంత త కు ఈయన ముగ్దుడయాడు .శాంతి ,అశాంతిని జయించి ,విజయం సాధించింది .ఇప్పటికే ప్రక్కనున్న గైడు”ఏమైనా ప్రశ్నిస్తారా ??”అని రెండు మూడు సార్లు ఈయనను అడిగాడు .ఇప్పుడు ఈయన ”లేదు .ఇప్పుడు కాదు తరువాత ”అని నెమ్మదిగా చెప్పాడు .అప్పటికే చాలా మంది భక్తులు వెళ్లి పోయారు .ఈయన మౌనం గా ఆయన కు నమస్కరించి నెమ్మదిగా ఆశ్రమం లోని తన గదికి చేరాడు ఆ రాత్రి పొద్దు పోయిన చాలా సేపటికి .ఇంతకీ ఎవరు ఆ ”ఆయన ?”-ఎవరు ఈ”ఈ యన ?”ఆయన అంటే అరుణాచలం లోని రమణ మహర్షి .ఈయన అంటే -భారత దేశం లో మహర్షుల ,యోగుల దర్శనం చేసుకొని ,వారి ఆత్మ శక్తులను తెలుసు కోవటానికి ఇంగ్లాండు దేశాన్నించి వచ్చిన జర్నలిస్టు డాక్టర్ పాల్ బ్రంటన్ .”A search in secret India” పుస్తకాన్ని రాసి పాశ్చాత్యులకు భారతీయ యోగుల ,మహాత్ముల ప్రభావాలను తెలియ జెప్పిన వాడు .
మర్నాడు మహర్షి శ్రీ రమణుల ను దర్శించాడు పాల్ బ్రంటన్ .ఇప్పుడు తన ప్రశ్నా పరంపరను సంధించటం ప్రారంభించాడు పాల్ .”మానవులకు అతీతం గా ఏదైనా ఉన్నదా ?దాన్ని నేను ఎలా కను క్కో గలనో వివరించండి ”అని అడిగాడు .లోపల ఈయన చెప్పా గలదా ,సరైన వాడినే ప్రశ్నించానా అనే సందేహం పట్టి పీడించింది పాల్ ను .మహర్షి కొద్ది సేపు మౌనమే పాటించారు .ఏదో ఆలోచన లో ఉన్నట్లు కనీ పించింది .మళ్ళీ పాల్ ”మా పాశ్చాత్య దేశం వారు దీనికి సరైన వివరణ ఇవ్వ లేక పోతున్నారు .నాకు మీరు పరి పూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించా గలరా లేక ఇదంతా ఒత్తి శ్రమ ఏనా”?అని అడిగాడు .అప్పుడు మహర్షి నెమ్మదిగా మొదలు పెట్టారు ”నువ్వు -”నేను ”అన్నావు .నేను తెలుసుకోవాలి అని ,నేనెవరినో చెప్పమని అడిగావు నిజమేనా ?అని ప్రశ్నించారు .తడబడ్డాడు బ్రంటన్ .ప్రశ్న కు ప్రశ్న సమాధానమా?.మళ్ళీ మహర్షి ”నేను అడిగింది స్పష్టం గా లేదా ? మళ్ళీ ఆలోచించు ”అన్నారు .అప్పుడు బ్రంటన్ ఒక వేలు తనకు తాకించు కొని తన పేరు చెప్పాడు .రమణులు ”అతను నీకు తెలుసా ?”అని ప్రశ్న వేశారు .”ఆ తెలుసు .నేనే ”అన్నాడు పాల్ .”ఆది నీ శరీరం మాత్రమె .మళ్ళీ ఆలోచించి చెప్పు నీవేవరివి ?”అన్నారు ఇదేమి వింత ప్రశ్న అని పించింది పాల్ కు .అప్పుడు మహర్షి ”ముందుగా” నేను” ను తెలుసుకో .అప్పుడు సత్యం బోధ పడుతుంది ”.అన్నారు ప్రశాంతం గా .పాల్ కేమీ బోధ పడ లేడు .అయో మాయం గా అయి పోయాడు .అప్పుడు ప్రక్కన ఉన్న దుబాసీ వివరించి చెప్పాడు .””నీలోకి నువ్వు చూసుకో .అదీ సరైన మార్గం లో .అప్పుడే నీకు సమస్యలు ,ప్రశ్నలు వాటికి సమాధానాలు కనీ పిస్తాయి ”.యే పద్ధతి నేను అవలంబించాలి “‘అని మరలా ప్రశ్న .
”లోతైన భావన తో నిన్ను నువ్వు వెతుక్కో .దానికి నిరంతర ధ్యానం అవసరం .అప్పుడే ఆ కాంతి నీకు దర్శన మిస్తుంది .”అని అరుణా చాల ముని సమాధానం .”నేను సాధించానా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది ?గురువు అవసరం ఉందా ?””ప్రశ్న .”అవసరం కావచ్చు ”ముని జవాబు .”సరైన గురువు దారి చూప గలడా ?”పాల్ .”గురువు కు శిష్యుడికి ఏమి కావాలో తెలుస్తుంది .దాన్ని తీర్చ గల సమర్ధుడు .”అని మహర్షి .”జ్ఞాన జ్యోతి ని గురువు చూపించ గలడా ?”సందేహం ”సాధకుని పరిణతి మీద ఆది ఆధార పడి ఉంటుంది .గన్ పౌడర్ వెంటనే అంటుకొని మండు తుంది. కాని దాన్ని మండించే బొగ్గు నిప్పుగా మారటానికి ఎక్కువ కాలం పడుతుంది .”.
”ప్రపంచ భవిష్యత్తు గురించి చెప్పండి ?”‘అని పాల్ ప్రశ్న .”నీ సమీప భవిష్యత్తే నీకు తెలీదు .ముందు నీ వర్తమాన పరిస్తితి తెలుసుకో .అప్పుడు భవిష్యత్తు దాని సంగతి ఆది చూసు కొంటుంది ”అన్నారు మహర్షి .”ప్రపంచం అస్తవ్యస్త పరిస్తితులకు లోను అవుతుందేమో ,స్నేహానికి విలువ ఉండదేమో ఒకరికొకరు శత్రువులు అవుతారేమో ”అని ప్రశ్నా వర్షం.. .నవ్వుతూ చిదానందం గా శ్రీ రమణులు ”ఈ విశ్వాన్ని పాలించేది ఒక్కడే .ప్రపంచాన్ని సరిదిద్దాల్సినదీ ఆయనే .ప్రపంచానికి జీవాన్ని ప్రసాదించిన వాడు ,దాని పరి రక్షణ ,నిర్మూలనా బాధ్యత లన్నీ ఆయనవే .ఈ ప్రపంచ భారాన్ని మోసేది ఆ పరమాత్మ .నువ్వు కాదు”.అని సమాధానం .”ఈ విశ్వాసం తో జనం ఉండగలరా ”?బ్రంటన్ సమాధానం పొందక, వేసిన ప్రశ్న .”నువ్వు ఎలా ఉంటె ,ప్త్రపంచం అలా కనీ పిస్తుంది .నిన్ను నువ్వు అర్ధం చేసుకో కుండా ,ప్రపంచాన్ని యెట్లా అర్ధం చేసుకో గలవు ?సత్యాన్ని తెలుసు కొన్న వారు ఈ విషయాలేమీ గమనించరు .ప్రజలు ప్రశ్నల బరువు తో కుదించుకు పోతున్నారు .ముందు నీ వెనుక ఉన్నదేదో తెలుసుకో .అప్పుడు నీ వెనుక ఉన్న ప్రపంచం బాగా అర్ధం చేసుకో గలవు . .అందులో నువ్వూ ఉన్నావు అన్న సంగతి మర్చి పోవద్దు ”అని మహర్షి శ్రీ రమణుల స్పష్ట మైన సమాధానం .ఇదీ -కావ్యకంథగణ పతి మునిని ”నాయన గారూ ”అని ఆప్యాయం గా పిలుచుకొని, ఆయన చేత ”శ్రీ రమణ మహర్షి ”అని సార్ధక నామాన్ని పొందిన అరుణాచల మహా యోగి భగవాన్ శ్రీ రమణ మహర్షుల ప్రధమ దర్శనం లో, ద్వితీయ దర్శనం తో పాల్ బ్రంటన్ పొందిన అనుభూతి .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –28-8-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 820,984 hits
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- సంగీత సద్గురుత్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం
- మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి
- నీలాచలేశ్వర స్తవం
- సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కవితా స్రవంతి
- ఆంధ్రా జాకీర్‌హుస్సేన్- డా.హుస్సేన్ అహ్మద్
- సంక్రాంతి శుభా కాంక్షలు
- కవితా ‘’త్రయి’’
- కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి సాహిత్య ,శ్రీమతి చర్ల సుశీలగారి సేవాపురస్కార ప్రదాన సభ విశేషాలు
- మహా భక్త శిఖామణులు 23-భద్రాద్రి ‘’అన్నపూర్ణ సత్ర’’ నిర్వాహకుడు -వెంకట రమణ బ్రహ్మ చారి
- మహా భక్త శిఖామణులు 22-కూర్మ దాసు -2(చివరి భాగం )
భాండాగారం
- జనవరి 2021 (20)
- డిసెంబర్ 2020 (49)
- నవంబర్ 2020 (38)
- అక్టోబర్ 2020 (72)
- సెప్టెంబర్ 2020 (48)
- ఆగస్ట్ 2020 (78)
- జూలై 2020 (87)
- జూన్ 2020 (72)
- మే 2020 (80)
- ఏప్రిల్ 2020 (61)
- మార్చి 2020 (48)
- ఫిబ్రవరి 2020 (45)
- జనవరి 2020 (60)
- డిసెంబర్ 2019 (50)
- నవంబర్ 2019 (53)
- అక్టోబర్ 2019 (36)
- సెప్టెంబర్ 2019 (44)
- ఆగస్ట్ 2019 (66)
- జూలై 2019 (54)
- జూన్ 2019 (68)
- మే 2019 (60)
- ఏప్రిల్ 2019 (36)
- మార్చి 2019 (47)
- ఫిబ్రవరి 2019 (68)
- జనవరి 2019 (61)
- డిసెంబర్ 2018 (46)
- నవంబర్ 2018 (47)
- అక్టోబర్ 2018 (53)
- సెప్టెంబర్ 2018 (50)
- ఆగస్ట్ 2018 (51)
- జూలై 2018 (58)
- జూన్ 2018 (30)
- మే 2018 (29)
- ఏప్రిల్ 2018 (28)
- మార్చి 2018 (33)
- ఫిబ్రవరి 2018 (37)
- జనవరి 2018 (63)
- డిసెంబర్ 2017 (33)
- నవంబర్ 2017 (22)
- అక్టోబర్ 2017 (28)
- సెప్టెంబర్ 2017 (17)
- ఆగస్ట్ 2017 (69)
- జూలై 2017 (52)
- జూన్ 2017 (65)
- మే 2017 (68)
- ఏప్రిల్ 2017 (55)
- మార్చి 2017 (40)
- ఫిబ్రవరి 2017 (46)
- జనవరి 2017 (81)
- డిసెంబర్ 2016 (51)
- నవంబర్ 2016 (54)
- అక్టోబర్ 2016 (35)
- సెప్టెంబర్ 2016 (24)
- ఆగస్ట్ 2016 (54)
- జూలై 2016 (78)
- జూన్ 2016 (44)
- మే 2016 (42)
- ఏప్రిల్ 2016 (61)
- మార్చి 2016 (44)
- ఫిబ్రవరి 2016 (36)
- జనవరి 2016 (96)
- డిసెంబర్ 2015 (120)
- నవంబర్ 2015 (133)
- అక్టోబర్ 2015 (150)
- సెప్టెంబర్ 2015 (135)
- ఆగస్ట్ 2015 (135)
- జూలై 2015 (129)
- జూన్ 2015 (185)
- మే 2015 (186)
- ఏప్రిల్ 2015 (184)
- మార్చి 2015 (130)
- ఫిబ్రవరి 2015 (158)
- జనవరి 2015 (147)
- డిసెంబర్ 2014 (209)
- నవంబర్ 2014 (135)
- అక్టోబర్ 2014 (152)
- సెప్టెంబర్ 2014 (170)
- ఆగస్ట్ 2014 (129)
- జూలై 2014 (110)
- జూన్ 2014 (84)
- మే 2014 (79)
- ఏప్రిల్ 2014 (81)
- మార్చి 2014 (76)
- ఫిబ్రవరి 2014 (74)
- జనవరి 2014 (92)
- డిసెంబర్ 2013 (112)
- నవంబర్ 2013 (102)
- అక్టోబర్ 2013 (101)
- సెప్టెంబర్ 2013 (104)
- ఆగస్ట్ 2013 (53)
- జూలై 2013 (70)
- జూన్ 2013 (55)
- మే 2013 (27)
- ఏప్రిల్ 2013 (98)
- మార్చి 2013 (95)
- ఫిబ్రవరి 2013 (62)
- జనవరి 2013 (101)
- డిసెంబర్ 2012 (110)
- నవంబర్ 2012 (95)
- అక్టోబర్ 2012 (55)
- సెప్టెంబర్ 2012 (75)
- ఆగస్ట్ 2012 (63)
- జూలై 2012 (55)
- జూన్ 2012 (54)
- మే 2012 (60)
- ఏప్రిల్ 2012 (50)
- మార్చి 2012 (61)
- ఫిబ్రవరి 2012 (93)
- జనవరి 2012 (85)
- డిసెంబర్ 2011 (68)
- నవంబర్ 2011 (77)
- అక్టోబర్ 2011 (51)
- సెప్టెంబర్ 2011 (15)
- ఆగస్ట్ 2011 (26)
- జూలై 2011 (45)
- జూన్ 2011 (68)
- మే 2011 (55)
- ఏప్రిల్ 2011 (37)
- మార్చి 2011 (37)
- ఫిబ్రవరి 2011 (15)
- జనవరి 2011 (2)
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (25)
- అమెరికా లో (203)
- అవర్గీకృతం (154)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (5)
- ఊసుల్లో ఉయ్యూరు (75)
- కవితలు (146)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (26)
- నా డైరీ (8)
- నా దారి తీరు (129)
- నేను చూసినవ ప్రదేశాలు (105)
- పుస్తకాలు (2,410)
- సమీక్ష (777)
- మహానుభావులు (272)
- ముళ్ళపూడి & బాపు (59)
- రచనలు (904)
- రాజకీయం (59)
- రేడియో లో (53)
- వార్తా పత్రికలో (2,143)
- సభలు సమావేశాలు (316)
- సమయం – సందర్భం (764)
- సమీక్ష (10)
- సరసభారతి (8)
- సరసభారతి ఉయ్యూరు (446)
- సినిమా (48)
- సేకరణలు (302)
- సైన్స్ (44)
- English (6)
ఊసుల గూడు
Sarasabharati
https://www.youtube.com/watch?v=vLPfYIme-os