దైవ వనం

  దైవ వనం 
మా చిన్నతనం లో సిరా కావాలంటే దయాల్బాగ్ సిరానే వాడే వాళ్ళం .లేక పోతే కృష్ణ వేణి సిరా .ఆ తర్వాత చాలా వచ్చాయి .అందులో బ్రిల్ లాంటివి ఉన్నాయి .పెన్ను అంటే రత్నం పెన్నే ప్రసిద్ధం .దానికి ఇరిడియం టిప్ ప్ర త్యేకం .కాలం తో పాటు అన్నీ మారాయి .ఇవాళ బాల్ పెన్నులయుగం .అన్నిటిని దూసుకు వెళ్ళింది .చేతుల కు సిరా మరకలు ,వాటిని తుడుచు కోవటానికి పాత గుడ్డ ముక్కలు .ఇంకు పోసుకోవటానికి ఇంకు ఫిల్లర్ .చొక్కా ,లాగూలకు  సిరా మరకలు అంటని వాళ్ళుండే వారు కాదు .పెన్ను కక్కుతూ ఉండేది .జేబు పెన్ను పెట్టిన మేరా సిరా తో పెద్ద మరక తో కనీ పించటం సర్వ సాధారణం .పెన్ను రాయక పోతే విది లించి విదిలించి చేతులు పడి పోయేవి .బెంచీలు ,చాపలు సంచీలు అన్నీ సిరా చిందులతో తమాషా గా కనీ పించేవి .ఈ సిరా లకు ముందు ”కరక్కాయ సిరా ”అనె దాన్ని వాడే వాళ్ళం .దానికి పొడవైన పాళీ తో కలాలున్దేవి .సిరా లో ముంచి రాసే వాళ్ళు .గచ్చకాయ సిరా కూడా ఉన్నట్లు జ్ఞాపకం .వీటన్నిటి నుంచి విముక్తి నిచ్చింది బాల్ పాయింట్ పెన్ .ఇవన్నీ” దయాల్బాగ్ ”అనే మాట రాగానే గుర్తు కొచ్చిన విషయాలు .దయాళ్ బాగ్ అంటే ”దైవ వనం ”అని అర్ధం .దాని విశేషాలే ఇప్పుడు మనం తెలుసు కో బోతున్నాం .
ఉత్తర ప్రదేశ్ లో ఆగ్రా నగర సమీపాన దయాళ్ బాగ్ అనే ఒక చిన్న ఊరు లాంటి కాలని ఉంది .అడదిచక్కనిచెట్ల తో ,తోటలతో కళ కళ లాడుతూ ఉంటుంది  అక్కడే మనం చెప్పు కొన్న ”ఫౌంటెన్ పెన్ వర్క్ షాప్  ”ఉంది .అదే భారత దేశం మొత్తం మీద మొట్ట మొదటి సిరా పరిశ్రమ .బంగారు పాళీ లకు ఇర్డియం టిప్ పెట్టటం వీరి ప్రత్యేకత .దీన్ని స్వయం గా అమర్చ టానికి ముందు యూరప్ కు పంపి ఆ విధానాన్ని చేయించే వారు .ఆ తర్వాత ఆ పధ్ధతి తెలుసు కొని తామే అమర్చటం నేర్చుకొన్నారు .ఎక్కడ చేసినా ,చేయించినా నాణ్యత కు ప్రాధాన్యం .తరువాత ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు అక్కడ .ఆనితో సాహిత్య, వ్యాపార విషయాలన్నీ ముద్రించే వారు .హిందీ ఉర్దూ ఇంగ్లీష భాషల్లో ప్రచురించటం వీరి ప్రత్యేకత .”ప్రేమ్ ప్రచారక్ ”అనే వార పత్రిక ను కూడా నడి పారు .ఇంతకీ వీటన్నిటికి స్పూర్తి ఎవరు ?”రాదా స్వామి ”మత సంస్థ .ఈ కార్య కర్తలను ”రాదా సోమిష్టులు అంటారు .
ఈ కాలని ప్రత్యేకత ఏమిటో తెలుసు కొందాం .వీరందరూ పాజిటివ్ ఆలోచన కల కార్య కర్తలు .ఇక్కడ ట్రేడ్ యూనియన్ లేదు .ప్రతి వాడు పని చేస్తాడు .ఆది చిన్న పని ,పెద్ద పని అనే తేడా లేకుండా చేయటం వీరి ఆచారం .ఈ కాలనీ లాంటి నగరానికి విద్యుత్ శక్తి కేంద్రం ఉంది .వీరి యంత్రాలకు ,ఫాక్టరీ లకు ,గృహ సముదాయానికి అంతా దీని నుంచే పవర్ సప్ప్లై అవుతుంది .ప్రతి ఇంటికి విద్యుత్తు సమాజం అంతా భరిస్తుంది అందుకని మీటర్ల ప్రసక్తి దానిపై  ఖర్చు లేదన్న మాట .వ్యవ సాయ క్షేత్రాన్ని వీరందరూ నిర్వహిస్తున్నారు .దీన్ని ఒక మోడల్ ఫారం  గా చేయటమే ధ్యేయం . .స్టీం ట్రాక్టర్ ను ,స్టీం నాగలి ని ఉపయోగిస్తారు .పాలు ,తాజా కూర గాయాలు పండించి అందరికి అందు బాటు లో తెస్తారు .వీరి పాల డైరీ కేంద్రం చాలా వ్యూహాత్మకం గా ఉంది .అప్పటి వరకు ఇండియా లో అలాంటి డైరీ ఎక్కడా లేడు .ఇదే మొదటిది .ఇది కూడా మోడల్ గా నిర్వ హిస్తున్నారు .వీరు తీసుకొనే చర్య లవల్ల  ఉత్పత్తి గణనీయం గా ఉంటుంది .పాల శుద్ధి ,శీతలీ కరణ అనే వాటి పై వీరి శ్రద్ధ అమోఘం .క్రిములు లేని పాలను ఆగ్రా ,దయాళ్ బాగ్ పట్ట ణాలకు వీరు సరఫరా చేసి అభి నందనలు పొందారు . దీని కంతటి ప్రశస్తి తెచ్చిన వారు సోహాబ్జీ మహా రాజ గారి కుమారుడు .ఇతను దీనికోసం హాలాండ్,డెన్మార్క్ అమెరికా లలో పర్య టించి అక్కడి పాల ఉత్పత్తి కేంద్రాలను చూసి ,ఇక్కడ అమలు చేశాడు .
మంచి నీటి వ్యవహారం లోను అత్యంత శ్రద్ధ వహించారు .కాలువలు త్రవ్వి మొదట్లో నీటి వ్యవస్థ కల్పించారు .ఆ తర్వాత ఆది చాలక  ,ప్రభుత్వాన్ని సాయం కోరి వారి ఇంజినీర్ల సాయం తో బోరు బావులు త్రవ్వించి నీటికి ఆటంకం కలుగ కుండా చేశారు .దయాళ్ బాగ్ కు స్వంత బ్యాంకు వ్యవస్థ ఉంది .”రాదా స్వామి జెనెరల్ అండ్ అస్స్యూరెంస్ బాంక్ లిమిటెడ్ ”అనే బాంకు ద్వారా కాలనీ వాసుల కు ఆర్ధికం గా ఎన్నో సేవ లందించారు .అప్పటికే ఇరవై లక్షల మూల ధనం ఉంది .నగర బాన్కింగు ను కూడా వీరు తీర్చి దిద్దు తున్నారు .
రాదా స్వామి విద్యా సంస్థ కు దయాళ్ బాగ్ కేంద్రం .అన్ని వసతుల తో బిల్డింగులు నిర్మించారు .కను విందు చేసే తోటలను పెంచారు .వీరి ఆధ్వర్యం లో నడిచే ”మోడ ల్హై స్కూల్ ”లో వందలాది విద్యార్ధులు విద్యాభ్యాసం చేస్తున్నారు .ప్రిన్సిపాల్, ముప్ఫై రెండు మంది ఉపాధ్యాయులతో విద్యా సేవ చేస్తోంది .దీని నిర్వహణ సోహాబ్జీ మహా రాజ్ చూస్తారు .గొప్ప స్తాయి గల విద్య ఇక్కడ ఉంటుంది .మామూలు మత బోధ ఉండదు .మనిషి ని తీర్చి దిద్దే విద్య నేర్పిస్తారు .ఆయన మంచి పర్య వేక్షణ చేస్తూ దీని అభ్యుదయానికి కారకులవు తున్నారు .అవసర మైన పుస్తకాలతో గ్రంధాలయం ఉంది .మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు .అలాగే బాలికల కు ప్రత్యెక విద్యా లయాన్ని నడుపు తున్నారు .దీనికి తోడు టెక్నికల్ కాలేజి ఉంది .ఇందులో మెకానికల్ ,ఎలేట్రికల్ ,ఆటో మొబైల్ మొదలైన ఇంజీ నీరింగ్ విద్యలు బోధిస్తారు .ఫాక్టరీ లకు పంపి అక్కడ జరిగే విషయాల పై అవగాహన కల్పిస్తారు .
మంచి హాస్టళ్ళను నిర్వ హిస్తు విద్యార్ధుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు .దయాళ్ బాగ్ నివాసుల మంచి చెడ్డలను చూడ టానికి ”దయాళ్ బాగ్ బిల్డింగ్ డిపార్ట్ మెంట్ ”ఉంది .నాలుగు రకాలైన నివాస భవనాలున్నాయిక్కడ .ఇంతటి బృహత్తర కార్య క్రమాలను లాభా పేక్ష లేకుండా నిర్వహించటం అసామాన్య విషయం .దీని కి రాదా స్వామి సభ్యులే ధనాన్ని సమ కూరుస్తారు .ఆది తమ మత కార్యం అనే పవిత్ర భావన తో చేస్తారు .స్వయం సమృద్ధి ,స్వయం పోషణ వీరి ధ్యేయం .వీరంతా ధన వంతులేమో నని అను మానం వస్తుంది మనకు .ఎంత మాత్రం కాదు .అందరు సామాన్యులే .మధ్య తరగతి ప్రజలే .దీని ప్రగతికి వీరందరి నిస్వార్ధ సేవా శక్తులే కారణం .ఆపాటికే చాలా లక్షల రూపాయలు ఖర్చు చేశారు .ఇంకా ఎంతో చేయాలి .
ఆ నాటికి వీరి మెంబర్ల సంఖ్యా 1,10,000.అందులో కొన్ని వేల మంది మాత్రమె కాలనీ లో నివాసం ఉంటున్నారు .అప్పటికి ఆ సంస్థ పెట్టి 75 ఏళ్ళు అయింది .వారిది;; ”సెమి సి క్రేట్ ఆర్గ నైజేషన్” .వీరి మెంబర్లు దేశం అంతా వ్యాపించి ఉన్నారు .దయాళ్ బాగ్ వీ రందరికీ కేంద్రం .వేలాది ఎకరాల భూమిని ఇప్పటికి కొన్నారు .ఒక రకం గా ”ప్లాటో ”గారి ఆదర్శ సామ్రాజ్యం లాగా ఉంటుంది .ఆధునికతను సనాతనం తో మేళ వించి ప్రగతి సాధిస్తున్నారు .మెంబర్లు సేవలను స్వచ్చందం గా నిర్వ హిస్తారు .సౌకర్యాలతో బాటు ఆధ్యాత్మిక ప్రగతినీ సాధిస్తారు .ప్రతి సభ్యుడు ఒక వెయ్యి రూపాయలు సభ్యత్వం గా సమర్పిస్తాడు .దీని పై సంవత్స రానికి అయిదు శాతం వడ్డీ ని అంద జేస్తారు .అతను చని పోతే ,వారసునికి కూడా అంతే డబ్బు వస్తుంది .మూడవ తరం లో ఆ పెట్టు బడి సొసైటీ కి చెందుతుంది .ఒక వేల సభ్యుడికి అత్యవసరం గా డబ్బు కావలసి వస్తే కొంత డబ్బు అందజేస్తారు .ప్రతి ఆది వారం సమా వేశం ఉంటుంది .చే బట్ట వలసిన విషయాలపై చర్చిస్తారు .ఆమోద యోగ్య మైన విధానాలను నిర్ణయించి ,అమలు చేస్తారు .గాంధి మహాత్ముడు ఇక్కడికి వచ్చి ,ఈ ఆదర్శ వ్యవ్యవస్థ ను చూసి ,ముచ్చటపడ్డాడు .అమెరికా ,జపాన్ ల ను చూసి సాంకేతిక త ను అమలు పరిచి తమ రాదా స్వామి మత వ్యాప్తికి సేవా పూర్వ విధానం లో .ప్రేమ పూర్వకం గా సేవ లందించటం వీరి ప్రత్యేకత్ .దీని కంతటికీ స్పూర్తి శ్రీ సోహాబ్జీ మహా రాజ్.
ఇక్కడ కార్య క్రమాలు ఉదయం ఆరు గంటలకే ప్రారంభం అవుతాయి .సోహాబ్జీ ఎత్తైన ఆసనం పై కూర్చుంటారు .వందలాది భక్త కార్య కర్తలు కూర్చుంటారు .వారికి చెప్పవలసింది సూటిగా ,స్పష్టం గా క్లుప్తం గా చెప్పిస్పూర్తి .ప్రేరణ కల్గించి   కార్యోన్ముఖులను చేస్తారు .ఆయన మాట వేద వాక్కే .ఆయనకు ఇంగ్లీష ధారాళం గా మాట్లాడటం వచ్చు .హిందీ సంస్కృతాలు  కరతలా మలకాలు .

ప్రస్తుత అద్యఖులు

ప్రస్తుత అద్యఖులు

ఇదీ పాల్ బ్రంటన్ 1950 ప్రాంతం లో దయాళ్ బాగ్ ను చూసి ముచ్చట పడిన తీరు .ఇప్పుడు ఇంకా మారి పోయి ఎంతో అభి వృద్ధి సాధించింది అని తెలుస్తోంది .పూనిక ,పట్టు దళ ,కృషి నిస్వార్ధ సేవ ,అంకిత భావం ఉంటె దయాళ్ బాగ్ వంటి దైవ వనాలెన్నో ఏర్పడి భువి పై నందన వనాలే అవుతాయి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-8-12- కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు, సమయం - సందర్భం and tagged , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.