మహర్షి శ్రీ రమణుల అనుగ్రహ భాషణం
”ప్రాపంచిక కార్యాలను వదిలి పెట్ట రాదు .రోజుకు ఒకటి రెండు గంటలు ధ్యానం చేసి నీ విధ్యుక్త ధర్మా లన్ని యదా ప్రకారం నిర్వర్తిన్చాల్సిందే .సరైన విధానం లో నీ ధ్యానం ఉంటె ,నువ్వు చేస్తున్న ప్రతి క్రియ లోను దాని ప్రభావం ఉంటుంది .నువ్వు యే విధానాన్ని ధ్యానం కోసం ఎంచు కొంతావో ,అదే విధానం నీ సకల చర్యల్లోను ప్రతి ఫలిస్తుంది .అలా చేస్తూ పోతూంటే ,మనుష్యుల పై నీ కున్న భావాలన్నీ మారి పోతూ ఉంటాయి .నీవు చేసే పను లన్ని ,నీ ధ్యానాన్నే పూర్తిగా అనుసరించి నడుస్తాయి .మనిషి తనను ఈ ఐహిక ప్రపంచం తో బంధించే వాటిని అన్నిటిని త్యాగం చేయాలి .మాయ గా ఉన్న ”నాది ”ను పూర్తిగా వదులు కోవాలి .ప్రపంచం లో జీవిస్తూ ,నిస్వార్ధం గా ఉండటం కుదురు తుందా అని చాలా మంది సందేహిస్తారు .పనికి ,జ్ఞానానికి తగాదా కాని భేదం కాని లేదు .వ్యక్తీ అంతఃకరణ క్రమంగా ”ఆ దివ్యత్వం ”పైకి ఆకర్షింప బడుతుంది ”.ఆది” గా మారి పోతుంది .ముందుగా స్తిరత్వం కోసమే ఆసనం ,నిష్టా ,సమయం అవసరం .క్రమేపీ ఇవన్నీ నువ్వు చేసే పనుల్లోనే ఒదిగి పోతాయి .పని చేస్తున్నా ,చెయ్యక పోయినా ఆది ఒక నిరంతర చైతన్యమే అవుతుంది .మనమేమో విడి గా చేస్తున్నామనే భావన ఉండదు .మనిషి సంఘం లో ఉండిదాని పని చేస్తున్నా ,అతని మనస్సు బుద్ధి దీనికి అతీతం గా ప్రవర్తిస్తాయి .ప్రశాంతం గా నర్తిస్తాయి .,
యోగాను చేయాలి అంటే యోగి మనసును దాని లక్శ్యం వైపు లగ్నం చేయాలి .”నేనెవరు ”?అని ప్రశ్నించు కోవాలి .ఇలా అన్వేషణ సాగితే చివరికి నీలోనిది ఏమిటో నీకు ఆవిష్కారం అవుతుంది .ఆది బుద్ధికి అతీతం గా ఉండి,నీకు వింత అనుభూతినిస్తుంది .ఆ సమస్య ను నువ్వు పరిష్కరించు కొంటె ,మిగిలిన సమస్యలన్నీ వాటంతటికి అవే పరిష్కారం అవుతాయి .ప్రాణులన్నీ సుఖాన్ని ,ఆనందాన్ని కోరుతాయి .అప్పటి దాకా తాము అనుభవిస్తున్న అనంత దుఖాన్ని మర్చి పోవటానికే ఇవి .అయితే ఆనందం అనంతం గా పొందాలని వీరందరి కోరిక .ఆది సహజమే .ఒక దాని నుంచి ఇంకో దాని కోసమే ఆరాటం .వాళ్ళందరికీ తమ స్వార్ధమే కదా బాధిస్తోంది ?మనిషి నిజ వర్తనమే ఆనందం .ఆది పుట్ట్టుక తోనే వస్తుంది అతని సుఖానికి చేసే అన్వేషణ ,కూడా నిరంతరం సాగేదే .కానిదాన్ని పొంద గలుగు తున్నాడా? లేదే .కనుక అతను అనుకొనే ఆనందంశాశ్వతం కాదు . సుఖా లకు అంతు అనేది లేదు .మరి ప్రపంచం దుఃఖ భాజనం గా కన్పిస్తోంది కదా ?దీనికి కారణం మన ఆత్మ ను సరిగ్గా గుర్తించని అజ్ఞానమే ‘
మనిషి పాపం చేయ టానికి కారణం దాని వల్ల సుఖాన్నో ఆనందాన్నో పొందుదామనే ఆశ .ఇది సహజాత మైంది .అయితే వారికి నిజం గా సుఖం పొందటం లేదనే విషయం తెలియదు .అతని పాపపు పనులే అతన్ని దెబ్బ తీస్తాయి .కనుక ఆత్మానందాన్ని మించిన ఆనందం అనేది లేదు .తన గురించి సరి అయిన జ్ఞానం కలగాలి .ఆ తత్త్వం లో నుంచే ”నేను ”అనేది ఏర్పడు తోంది .మళ్ళీ ఇది అందులోకే చేరాలి .అదేజ్ఞానం . నేను అనే ఆలోచన ప్రారంభం అవుతుంది పుట్టుక తోనే .తర్వాత ”నువ్వు ” అనే దానితో ఆది కన్పిస్తుంది .నువ్వు మనస్సు లో ”నేను ”అనే ఆలోచనా దారాన్ని అనుసరిస్తూ పోతుంటే ,ఆది మళ్ళీ నిన్ను అక్కడికే చేరుస్తుంది .అప్పుడు ”నేను ”కనీ పించదు . .ఇది మాటల్లో వివరించి చెప్పలేనిది .ఎవరికి వారు స్వీయ అనుభవం తో పొందాల్సిందే .
ఇలాంటి అన్వేషణ సాధ్యమా ?అని పిస్తుంది .సాధ్యమే .సాధన కావాలి. అప్పుడు ”నేను ”అదృశ్యమై పోతుంది .అదే జ్ఞానం, ఆనందం, సత్యం, శివం, సుందరం .మనసు ,బుద్ధి లకు అతీతం గా ఒకటి ఉంది అని తెలిస్తే -అదే తెలుసుకోవటంఅంటారు . .దానినే స్వర్గం ,అంటారు అదే ఆత్మ అంటారు .నిర్వాణం అని కొందరంటారు .మనం దాన్ని ముక్తి అంటాం .యే పేరు పెట్టినా ,మనిషి తనను తాను కోల్పోతే ,అంటే తనను తాను తెలుసు కొంటె అదే ఆనందం, శాశ్వత మైన సుఖం .”ఎవరు తన జీవితాన్ని రక్షించాలి అనుకొంటారో వారు దాన్ని కోల్పోతారు .ఎవరు జీవితాన్ని కోల్పోతారో వారు దాన్ని భద్రం గా దాచుకోన్నట్లే” అని పాశ్చాత్య వేదాంత భావన .తానెవరో తెలుసుకో వాలనే తపన ఉన్న వాడికి అనుమానం అని శ్చ యత ఉండవు .మహా రాజులు ,చక్ర వర్తులు గొప్ప గా పరి పాలించి నట్లు కనీ పిస్తుంది ,కాని వారి హృదయాలలో ఇంతటి పని తాము చేయటం లేదని ,ఒక మహత్తర శక్తి తమను నడి పిస్తోందని నమ్ముతారు .మహా మేధావు లను కొన్న వారిని” మనిషి మిస్టరీ ని ఛేదిన్చారా”? అని అడిగితే సమాధానం లేక, తల వంచుకొంటారు .ఆది అసాధారణ మానవాతీత శక్తి అని అనుకో వచ్చు .కాని అదీ, ఎవరికి వారు అనుభవించి తెలుసు కోవలసిన సత్యమే .
సత్యాన్ని గురించి ఎరుక భారతీయుల కైనా ,పాశ్చాత్యు ల కైనా ఒక్కటే .ధ్యానం లో ఉత్పన్న మయ్యే శక్తి అన్ని కార్య క్రమాలకు సహాయం చేస్తూనే ఉంటుంది .కనుక ధ్యానానికి, బయట చేసే ఇతర కర్తవ్యాలకు తేడా అంటూ ఏమీ లేదు .సత్యాన్వేషణే ఎవరు చేసినా .నిజ మైన ఆత్మ ను తెలుసుకో .అప్పుడు సత్యం సూర్యోదయ కాంతి లాగా ప్రకాశిస్తుంది ప్రభావం చూపు తుంది .నీ మనస్సు కు యే బాధా, బందీ ఉండవు .అసలు ఆనందం వెల్లువై ప్రవహిస్తుంది .ఆనందం, ఆత్మ,వేరు కావు .రెండు ఒక్కటే నని తెలుస్తుంది .ఈ ఆత్మ జ్ఞానాన్ని పొంది తే ఇక సందేహాలకు తావే ఉండదు .సందేహం లేక పోతే ,అంతా సచ్చిదా నందమే .
ఇదీ మహర్షి శ్రీ రమణులు నిత్యాన్వేషి అయిన బ్రిటన్ రచయిత పాల్ బ్రంటన్ కు ఇచ్చిన ఇంటర్వ్యు లో దయ చేసిన ”అనుగ్రహ భాషణం ”.అందరికీ విజ్ఞాన సుధా మరందం.
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –29-8-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,008,563 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.8 వ భాగం.28.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.92 వ భాగం. శ్రీ శంకరా ద్వైత0. చివరి భాగం.28.5.23.
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.7వ భాగం.27.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 91 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.27.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.90 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.27.5.23.
- ప్రముఖ హిందీ కవి నిరా లా సూర్య కాంత త్రిపాఠి.4 వ భాగం.25.5.23. గబ్బిట దుర్గా ప్రసాద్
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు 5 వ భాగం.25.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.89v వ భాగం. శ్రీ l శంకరా ద్వైత0 .25.5.23।
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.4 వ భాగం.24.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.88 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.24.5.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,974)
- సమీక్ష (1,329)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (490)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,077)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (375)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు