మౌన యోగి మరియు బ్రామ మౌన యోగి(the sage who never speaks )

 మౌన యోగి మరియు బ్రామ
                                         మౌన యోగి(the sage who never speaks )

ఒక చిన్నతాళాలు వేసిన  గది లో ఆయన ఒక్కరే పద్మాసనం లో కూర్చుని ఉన్నారు .గీచీ గుడ్డ తప్ప యే వస్త్ర ధారణా లేదు .అప్పటికే సమాధి స్తితి లో ఉన్నారు .భౌతిక విషయాలేమీ ఆయన కు తెలీవు .ఆయన చిరు నవ్వు ,లో ప్రపంచాన్ని జయిన్చానన్న భావం గోచరిస్తోంది .కళ్ళు తీక్షణం గా దేనినో వెతుకు తున్నాయన్నట్లుంది .ఆది ఐర్వచనీయ సమాధి .ఆయనకే అనుభావై క వేద్యం  .కళ్ళు ఆర్పటం లేడు .కను రెప్ప కూడా కదలటం లేడు .అలా రెండు గంటల నుండి ఉండి పోయారు .ఆయన మనసు ఇతే ,ఇహ లోక జ్ఞానం ఉండదు .శరీర భాగా లన్ని నిద్ర పోతాయి .వాటికి చలం ఉండనే ఉండదు .అప్పుడప్పుడు కను కోణాల నుండి ,ఒక నీటి బిందువు రాలు తోంది .దృష్టి ని కేంద్రీకరించటం వాళ్ళ కన్నీటి గ్రంధుల పని ఆగి పోయింది .ఒక కాంశ్య విగ్రాహం లా గా అని పిస్తున్నారు మౌన యోగి .
ఆయన శ్వాస జరుగు తూనే ఉంది .అదీ చాలా నిదానం గా .ఆది ఎవ్వరికీ వినపడ నంత గా ఉంది కాని చాలా క్రమ బద్ధం గా ,లయ గా శ్వాశిస్తున్నట్లు కన బడు తోంది .ఆయన ఈ శరీరాన్ని వదల లేదు అని చెప్పటానికి శ్వాస ఒక్కటే ఆధారం అని పిస్తుంది .ఆయన గురించి బర్టన్ చాలా విన్నాడు ,తెలుసు కొన్నాడు అయినా అన్నీ సందేహాలే .మౌన యోగి వివరాలు ఆయన దగ్గర నిరంతరం ఉన్న అతన్ని అడిగాడు .అతను చెప్పటం ప్రారంభించాడు .స్వామి ఎప్పుడు వచ్చాడో ,ఎక్కడి నుండి వచ్చాడో తెలీదు .ఇంతవరకు ఎవ్వరి తోను మాట్లాడి నట్లు గమనించలేదు .ఎవరి  గురించీ ఆయనకు తెలీదు .ఎవరి గురించీ అడ గరు  .ఇక్కడికి వచ్చి ఎనిమిదేళ్ళు అయింది .అప్పుడప్పుడు కొబ్బరి చిప్పలో అన్నాన్ని అడిగి వేసింది తినే వాడు .రోడ్డు మీద ఒక చెట్టు కింద ఎత్తైన రాతి మీదే ఆయన జీవితం .ఎండా, వాన, చలి అంతా అక్కడే .ఆయన కూర్చునే విధానం ఎప్పుడూ మారలేదు . యువకులు ఆయన్ని హేళన చేస్తున్నా ,వారినేమీ అనే వాడు కాదు .ఒక సారి మద్రాస్ వెళ్తున్న  ఒక పెద్ద మనిషి ఈ దృశ్యం చూశాడు .వెంటనే మద్రాస్ నుండి ఇక్కడి పోలీసులతో చెప్పి ఆ మౌన యోగికి రక్షణ కల్పించే ఏర్పాటు చేశాడు .పోలీసు వచ్చి ఆయన్ను ఎంతో అడిగితే కాని తన గురించి చెప్పలేదు .
”నేను మారకాయర్ అనే గురువు శిష్యుడిని .ఆయన నన్ను దక్షిణ మద్రాస్ కు వెళ్ళ మని  ఆదేశించారు .ఇక్కడ ఉండటానికి అనువు గా ఉందని చేరాను .నాకు ఇహ భోగాల మీద ఆసక్తేమీ లేడు .సత్య దర్శనం కోసమే జీవిస్తున్నాను” అని యోగి చెప్పాడు . .మరకార్ అంటే ఆ మధ్యనే చని పోయిన మహమ్మదీయ గురువు అని పోలీసాఫీసరు గ్రహించాడు .మద్రాస్ లో ఆయన చాలా మంది కి తెలుసు .ఒక బంగ్లా లో బస ఏర్పాటు చేస్త్తానంటే వద్దన్నాడు .అప్పుడు ఇప్పుడున్న గది  లో ఉంచి తనను సేవకుని గా నియ మించారని మౌన యోగి దగ్గరుండే సేవకుడు చెప్పాడు .యోగి కి ఒక్క డంటేటే ఒక్క శిష్యుడు కూడా లేడు .ఏకాంతం గా ఆత్మ ముక్తి కోసమే ఆయన ఉంటున్నారని చెప్పాడు ‘
సంచార యోగి మరిన్ని వివరాలు చెప్పాడు .ఇక్కడికి రవా టానికి ముందు మౌన యోగి సైన్యం లో సిపాయి గా పని చేశాడు .తర్వాత  మారకాయర్ శిష్యుడైనాడు .మౌన యోగి నుండి తనకు ఏదో ”టేలి పతిక్ ”కరెంటు  తనను ఆవేశించి నట్లు గా పాల్ బ్రంటన్ అభి ప్రాయ పడ్డాడు .ఆయన తన దృష్టిని .ఆలోచన ల కన్నాలోతుగా కేంద్రీక రించటం వల్ల  ఆయన చేతన అంతా విశ్రాంతి స్తితి లోకి వెళ్ళింది .ఇదే ప్రపంచం కంటే ప్రేమ గా మారి పోయింది .ఆ ఆత్మా నందం లో రమిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకొంటున్నారు మౌన యోగి ”అని పాల్ అభి ప్రాయ పడ్డాడు .అంతటి తాదాత్మ్య స్తితిని పొందిన ఒక మహా యోగి ని దర్శించి నందుకు  తన జన్మ ధన్యం అయిందను కొన్నాడు బ్రంటన్ .
                     బ్రామా -(the yoga which conquers death )
బ్రామా నిరంతర సాధకుడు .అడయార్ దగ్గర ఉండే వాడు .బ్రంటన్ ఈయనను సందర్శించి ,ఆయన అనుభూతులను తెలుసు కొన్నాడు .ఈయన చక్క గా మాట్లాడి వివరించాడు .యోగా విద్య లన్ని పూర్తిగా గురు ముఖం గా బ్రామా నేర్చుకొన్నాడు .ఆయన చూపే అద్భుతాలు మనల్ని వివశుల్ని చేస్తాయి .ఒక సారి పాల్ వెళ్లి నప్పుడు బ్రామా శిలా విగ్రహం లా గా కూర్చుండి  పోయాడు .కదలిక లేనే లేదు .ఆయన గుండె చప్పుడు క్రమంగా క్షీణిస్తోంది .చివరికి గుండె కొట్టు కోవటం మానేసింది .అలా యేడు సెకన్లు గడిచింది .చని పోయాడను కొన్నాడు .రక్షించాలి అనే ప్రయత్నం లో పాల్ ఉన్నాడు .క్రమం గా శరీర అవయవాలు కదలటం ప్రారంభించాయి .హమ్మయ్య అనుకొన్నాడు .మళ్ళీ గుండె కొట్టు కోవటం ప్రారంభించింది .మామూలు మనిషి అయాడు బ్రామా .”గుండె ఆగి పోవటం గమనించావా ? అని బ్రామా అడిగాడు .”స్పష్టం గా .ఆది విభ్రాంతి కాదు ”అని స్పష్టం చేశాడు బ్రంటన్ .ఇదేమీ గొప్ప విషయం కాదని తన గురువు రక్త ప్రసరణ ను కూడా ఆపి వెయ గల సమర్దులని తెలిపాడు .బ్రామా ను ఆ విధానం చూపించ మని అర్ధించాడు పాల్ .
బ్రామ బ్రంటన్ ను తన మణి కట్టు వద్ద నాడిని పట్టు కో మన్నాడు .అప్పుడు రక్త ప్రసరణ స్పష్టం గా కనీ పించింది పాల్ కు .రెండు లేక మూడు నిమిషాల తర్వాతా క్రమంగా రక్త ప్రసరణ  తగ్గు తున్నట్లు గమనించాడు .నాడి స్పందన తగ్గుతోంది .మరి కొద్ది సేపటికి నాడి  కొట్టు కోవటం ఆగి పోవటం స్పష్టం గా గమనించాడు బ్రంటన్ .పల్సు ను ఆపేశాడు బ్రామా .తర్వాత మూడో నిమిషం వరకు అలాగే నాడీ  స్పందన ఆగి పోయింది .నాలుగో నిమిషానికి నెమ్మది గా స్పందన ప్రారభం అయి నట్లు గమ నించాడు .చివరకు మామూలు గానే నాడి కొట్ట్టు కుంది . .పాల్ ఆశ్చర్య పోయాడు .”ఇదేమీ ఆశ్చర్య పడాల్సిన విషయం కాదు ”అన్నాడు బ్రామా తాపీగా .”కావాలంటే శ్వాస కూడా ఆపేస్తాను చూస్తావా ”అన్నాడు .సరే నన్నాడు పాల్ .
బ్రామా కళ్ళు మూసుకొన్నాడు .తన ఉచ్చ్వాస ,నిస్శ్వశాలను గమనించమని ముందే చెప్పాడు .అలాగే చూస్తున్నాడు పాల్ .బ్రామా ఒక రాయి లాగా మారి పోయాడు కాసేపటిలో .ఒక రక మైన సమాధి స్తితి లోకి వెళ్లి పోయాడు .ఆయన ముక్కు దగ్గర వేళ్ళు పెట్టి చూశాడు పాల్ .ఎక్కడా ప్రాణ స్పందన కనీ పించలేదు .శ్వాస పూర్తిగా స్తంభించి పోయింది .ఆయన నాసా పుటాలను , ,భుజాలను , ,పెదిమలను ,చాతీ ని అన్నీ తట్టి చూశాడు .కాని ,ఎక్కడా ప్రాణం కనీ పించలేదు .ఒక పాలిష్ చేసిన అద్దం తెచ్చి ముక్కు పుటాల దగ్గర పెట్టాడు .శ్వాస జరిగితే దాని పై నీటి బిందువులు ఏర్పడాలి .అదీ లేదు .పెదిమల దగ్గర పాలిష్ చేసిన ఇత్తడి పళ్ళెం పెట్టాడు .ఎక్కడా నీటి బిందువుల జాడే లేడు .అంటే ఖచ్చితం గా శ్వాస ఆగి పోయిందని నిర్ణయానికి వచ్చాడు బ్రంటన్ .తాను ఊహించని విషయాలు బ్రామా చేసి చూపించటం తో ”మైండు బ్లాక్ ” యిపోయింది పాల్ కు .యోగా అంటే పనికి మాలింది అని ఇప్పటి దాకా అనుకొన్నందుకు సిగ్గు పడ్డాడు .బ్రామా క్రమం గా స్పృహ లోకి వచ్చాడు .”ఎంతో గొప్ప గా ఉంది ”అని పొగిడాడు దాని విధానం వివరించమని బ్రామా ను కోరాడు .అలా చెప్పలేమని ఇదంతా” అడ్వాన్సుడు యోగా” కు చెందినక్రియలు అని  తెలిపాడు .
”  వీటి లో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి ”అని అడిగాడు పాల్ .”కొన్ని జంతువులను గమనిస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి .ఏనుగు చాలా నెమ్మది గా శ్వాసిస్తుంది .అందుకే ఎక్కువ కాలం బతుకు తుంది .పెద్ద సర్పాలు ఇంకా నెమ్మదిగా శ్వాసిస్తాయి .కనుక ఎక్కువ కాలం జీవిస్తాయి .హిమాలయాల్లో శీతా కాలం లో చాలా జంతువులూ ”వింటర్ స్లీప్ ”లోహిమాలయ గుహల్లో ఉంటాయి .అక్కడ ఒక్క సారి కూడా శ్వాస పీల్చుకోవు కొన్ని వారాల తరబడి .హిమాలయ ఎలుగు బంట్లు ధృవపు ఎలుగు బంట్లు ఇలానే చలికాలం గడుపు తాయి .కొన్ని నెలలు ఇలా ఉండగలవు .శ్వాస ను నిలిపి వేసుకొంటా యి . ప్రాణం నిరంతర కొనసాగుతుంది .చావు శరీరానికి ఒక అలవాటు మాత్రమె .”
రాజా రంజిత్ సింగ్ హరిదాస్ అనే ఒక ఫకీరు నులాహోరు లో  ఒక సమాధిలో బంధించాడు ..ఆ తర్వాత బ్రిటీష సైన్యం,రంజిత సింగు  సమక్షం లో ఆ సమాధి ని తవ్వి చూశారు .ఆరు వారాల తర్వాత కూడా ఆ ఫకీరు జీవించే ఉండి హాయిగా నవ్వు కొంటూ బయటికి వచ్చాడు .ఇది ప్రభుత్వ రికార్డు లలో నమోదై ఉంది .ఆత్మ బలం తో శ్వాస ను నిరోధించుకొని ఆ యోగి చావు నుండి తప్పించుకొన్నాడు .ఇవన్నీ యోగ రహస్యాలే .వీటిని గురువు సమక్షం లో అభ్యాసం చేయాలి .వీటిని ప్రదర్శన గా చేయ రాదు .అయితే వాటి పై నమ్మకం కలిగించటానికి అప్పుడప్పుడు తప్పదు .
  మనవి —          మా మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు  (అలబామా ) నాకు పాల్ బ్రంటన్ పుస్తకం ”  in search of secret india ”     హన్త్స్ విల్ లో ఉన్న వారింటికి వెళ్లి నపుడు చదవ మని  ఇచ్చారు .ఈ పుస్తకం గురించి ఎన్నో ఏళ్ళు గా విన్నానే కాని ఇప్పటి వరకు చదవ లేదు  .చదివి ఆశ్చర్యాను భూతి కి లోనైనాను .అందులో నాకు నచ్చిన విషయాలను ఇ ప్పటికి  ఆరు ఆర్తికల్స్ గా రాశాను .నేను పొందిన ఆనందం మీకూ అందించాలనే నా తపన  మాత్రమె ఇది. దీనికి కారకులైన మైనేని వారికి కృతజ్ఞతలు .
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ — 30-8-12-  కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.