జన వేమన –16 అందరికి తెలిసిన కధ —
తన వల్ల ఇల్లంతా దివాలా తీసింది అని వేమన తెలుసుకొన్నాడు .ఒది నే మెడ బోసిగా ఉండటం భరించ లేక పోయాడు .బంగారం తయారు చేసి ,ఒదిన న ఒళ్లంతా బంగారం తో నింపాలనే గాఢ మైన ఆలోచన ఆయన మనసును నిద్ర పోనీ యటం లేదు .వేమన స్నేహితుడు అభిరామయ్య స్వర్ణ కారుడు .అతనితో కలిసి ఆలోచిస్తుండే వాడు .అభిరాముడు దూరం గా ఒక కొండ గుహ లో ఉంటున్న ”లంబికా శివ యోగి ”కి రోజూ ,చెంబుతో పాలు ఇచ్చి వస్తు శిష్యరికం చేసే వాడు .దీన్ని వేమన రహస్యం గా గమనించాడు .ఒక రోజు అభిరామా చారి జ్వరం తో బాధ పడుతు పాలను యోగికి ఇవ్వమని స్నేహితుడు వేమన్న ను పంపాడు .వచ్చిన వాడు అభి రామే అను కొని యోగి అతడు రోజు పాలు తెస్తున్నందుకు అతనికి ఆ రోజే ”అమృత దానం ”చేస్తానన్నాడు .తాను అభి రాముడిని కాదు అని వేమన చెప్పలేదు .యోగి కనులు మూసుకొని ,ఆత్మ సాక్షాత్కారం చేసుకొని వేమన కు మోక్ష వివరాలు తెల్పాడు .పరోప కార కార్యాలలో జన్మ సాఫల్యం చేసుకోమని హితవు చెప్పాడు .జనానికి జ్ఞాన బోధ చేయమని ,మానవ సేవ చేయమని బోధించాడు .అప్పటికి స్పృహ లోకి వచ్చిన వేమన తాను అభి రాముడిని కాదు అని నిజం చెప్పాడు .”నేను అనేది ఆత్మ కాని శరీరం కాదు .ఆత్మ కు బాంధవ్యాలు లేవు .సర్వం శివ మయం .రేపు రావద్దు .నేనిప్పుడే వెళ్లి పోతున్నాను ”అని శివ యోగి వేమన కు చెప్పి ,అభిరామునికి తన ఆశీస్సు లందజేయమని ”.అజ్ఞాని తిరిగితే నష్టం ,జ్ఞాని తిరక్క పోతే నష్టం అని విజ్ఞాన కాంతుల్ని ప్రసరింప జేస్తూ చీకట్లను చీలుస్తూ ,సంచారం చేస్తూనే ఉండమని”వేమన కు చెప్పి వెళ్లి పోయాడు లంబికా శివ యోగి .
ఆ కొండ మీడే ఒక చెట్టు కింద కూర్చుండి పోయాడు వేమన .అభి రామయ్య వచ్చి అసలు విషయం తెలుసు కొన్నాడు .ఆశ్చర్య పడ్డాడు .”కామి గాని వాడు ,కవి కాడు,రవి కాడు -కామి గాక మోక్ష గామి కాడు ” – అని అభిరామునికి తత్వోపదేశం చేశాడు వేమన .వేమన మారిన విషయం పై ప్రశ్నించాడు అభి రామి .తాను చేసిన తప్పుకు దిద్దు బాటు గా నాలుగు చరణాల ఆటవెలది పద్యానికి మకుటం గా ”విశ్వ దాభి రామ వినుర వేమ ” అని తాను అభిరామునిగాకృతజ్ఞత తో వేమన ప్రకటించుకొన్నాడు .మూడవ పాదం గా ”కామి యైన వాడు కవియౌ ను ,,రవి యౌను ” అని అద్భుతం గా భావం తో సాంద్రం చేశాడు .ఇక ఇంటికి వెళ్ళ లేదు .ధ్యానం ,మౌనం అంతే .అవసర మైతే పద్యం తో పలకరింపులు .దేశాటనం చేశాడు .తమ్ముడు వేమన్న సంగతి విన్న అన్న బాధ పడి ,ఉనికి తెలుసుకొని ,రమ్మని బ్రతిమి లాడాడు .పిచ్చి నవ్వే వేమన్న సమాధానం .అన్న నిరాశ తో తిరిగి వెళ్లి పోయాడు ..ధ్యానం లో లీనమయాడు వేమన .దేశ సంచారం లో శిష్య పరంపర పెరిగింది .సందర్భాను సారం గా పద్యాలు చెప్పాడు .చివరికి గుహ లోకి వెళ్లి జీవ సమాధి చెందాడు .
వేమన సినిమా వచ్చింది .చిత్తూరు వి.నాగయ్య గారు వేమన గా చిరస్మరణీయ మైన నటనను ప్రదర్శించారు .దర్శకుడు కే.వి.రెడ్డి అద్భుతం గా చిత్రీకరించారు .ఆ సినిమా కధ కూడా ఇలానే ఉండి .వేమన కధను ”మలయ శ్రీ ”అనే రచయిత నాటకం గా మలిచి తానే వేమన్న పాత్ర ధరించి దర్శకత్వమూ చేస్తూ అనేక ప్రదర్శనలిచ్చారు .ఆయనదీ ఇదే కధ .కరీం నగర లోని కల భారతి జూనియర్ లెక్చర ర్ల సంఘం రాష్ట్ర సదస్సు లో ఈ నాటకాన్నిమొదటి సారిగా ప్రదర్శించి ప్రశంశలు పొందారు .
వేమన కధ లో కొంత మార్పు చేసిన శ్రీ చిల్లర భావనారాయణ గారు ”యోగి వేమన ”పేరుతో క చారిత్రాత్మక మైన నాటకాన్ని రాశారు .వేమన గా నటించిన పద్మశ్రీ నాగయ్య గారి ప్రసంశలండుకొన్నారు .నాటక ప్రయోక్త శ్రీ సుంకర కనకా రావు గారు రంగ స్తలం పై దీన్ని ప్రదర్శించ తనికి ప్రోత్సహించారు .నటుడు శ్రీ వి.సత్యనారాయణ రాజు గారు వేమన పాత్ర ధరించి సేహబాస్ అని పించుకొన్నారు .”భారతీయ నాట్య మండలి ”ఈ నాటకాన్ని అనేక ప్రదర్శనలిచ్చింది .కధలో జరిగిన మార్పులు గమనించండి .దేవ దాసీ పేరు మదాలస .విలాసయ్య అనే విలన్ వేమన పతనానికి కారకుడు .వేమన ఓదిన పేరు సీతాంబ .అన్న అన వేమా రెడ్డి. బంగారం చేస్తాను అంటే,మదాలస ఒప్పు కోలేదు .అఆమే అతన్ని ఆరాధించింది .వేమన కూడా ఆమెనే శృంగార రస రూపిణి గా ,తనకావ్యాదిష్టాన దేవత గా భావించాడు .మదాలస తాను శారదను అని ,వేమన జగతికి స్రష్ట అని ,ఆయన ”తమ్మి కంటి (శివుడు ) అనీ ,తాను గిరిజ (పార్వతి )అని ఆయన కాల కన్ధరుడు అనీ చెప్పింది .వేమన ”వాల్లభ్య సౌభాగ్యాన్ని ”ఆశించాను కాని రాచరిక భోగ భాగ్యాలను కాదని ప్రాధేయ పడింది .తమ వ్రుత్తి పవిత్ర మైన కళా తపసు అని ,జగదేక సుందరి కళామతల్లి తమ ఇలా వేలుపు అనిన్యాయాధి కారియినా రాజుకు వివరించింది .వేశ్యలు ఎందుకు వివాహం చేసుకో రాదో తెలపమని ప్రశ్నించింది .సాని వాళ్ళ తెగను నిర్ణ యించి నట్లు పరదారాగమనం ఉన్న విటులకూ , ఒక తెగను ఎందుకు నిర్ణయించే లేదు..? అని నిల దీసింది .వేమన్న ను జైలు పాలు చేస్తే ఆయన శిక్ష ను రద్దు చేయమని రాజు ను ప్రాధేయ పడింది . రాజు కు ఇచ్చిన మాట ప్రకారం మదాలస దేశం విడిచి వెళ్లి పోయింది .అనవేమా రెడ్డి చకితుడై ”దేవదాశి కులం లో మదాలస తప్ప బుట్టినది ”అని మెచ్చాడు .వేమన ఆ తర్వాత శివ బ్రహ్మం అనే వాడిని బంగారం చేసే రహస్యం చెప్పమని కోరుతాడు .”పసి పిల్ల వాడి చేతికి పదునైన కత్తి ఇవ్వటం లాంటిది ”అని చెప్పి ,ఒక బంగారు హారం ఇచ్చి పంపించేస్తాడు .
ఆ తర్వాత ఎప్పుడో వేమన్న ను మదాలస కలిసి ”ఈ లోకపు దుస్తంత్రాన్ని ,దురాచారాలను అందరికి తెలిసేలా చాటి చెబుతూ ”ఆట వెలది ”అయిన తనను కావ్య ప్రతిభ తో చిరంజీవిని చెయ్య మని కోరుతుంది .తన నాలుక మీద నిత్యం ”ఆటవెలది” నాట్యం చేస్తుందని వేమన ఆమెకు తెలియ జేశాడు .పై రెండు నాటకాలు అర్ధ వంత మైన సంభాషణ లతో వేమన జీవితాన్ని ,కవితా తత్వాన్ని ఆవిష్కరించాయి .రస సిద్ధి కలిగించాయి .మనో విజ్ఞానాన్ని పెంచాయి .అంతకు చాలా కాలం క్రితమే ”పంచ నాదం ”గారువేమన నాటకం వ్రాసి బాగా ప్రశస్తి పొంది నట్లు తెలుస్తోంది .ఇదంతా అసలు వేమన కధ .దీని తర్వాత ”డూప్లి కేటు ”వేమన గురించి తెలుసుకొందాం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –2-9-12-కాంప్–శార్లేట్ -అమెరికా