జన వేమన –17
డూప్లి కేట్ వేమన
”బాల చక్ర వేమ భవ్య నామ ” అనే మకుటం తో వందకు పైగా పద్యాలు రాసిన ”తుంగ వేమన ”ను మన వేమన గా కొందరు భ్రమించారు .ఆయనే ,ఈయన అనే ప్రచారం సాగింది కొంత కాలం .కొన్ని పద్యాలు ”విశ్వదాభి రామ ”మకుటం తో అందులో చేరాయట ఇతడు శార్వరి నామ సంవత్సర చైత్ర శుక్ల నవమి రోజున చని పోయాడట .ఇద్దరి జనన ,మరణ కాలాలు ఒక్కటే అవటం భ్రాంతికి కారణమైంది .తుంగ వేమన తన గురించి పద్యం చెప్పుకొన్న కధ తనదే అని అభిప్రాయం .తుంగ వేమన 1869 చని పోయి నట్లుంది .ఇలా సందట్లో సడే మియా లా తుంగ వేమన ,మన వేమన సరసన ”డూప్లికేట్ వేమన ”గా తుంగ చాప పై కూర్చున్నాడు .
రస వాదం
ఎవరు వేమన గురించి యే కధ చెప్పినా ,అందులో వస్తువులని బంగారం గా మార్చే ”పరుస వేది ” గురించి చెబుతూనే ఉన్నారు .దీన్ని రస వాదం అంటారు .”హేమ కార విద్య ”అనే పేరూ ఉంది .రస వాదశాస్త్రజ్ఞులు బంగారాన్ని చేసే కొన్ని ప్రక్రియలు చెప్పారు .అసలు బంగారం గా కాక పోయినా ,దానితో సమానం గా ఉంటుందట .అందులో ఒక పద్ధతి — 800 గ్రాముల రాగి ,28గ్రాముల ప్లాటినం , 20 గ్రాముల అసలు బంగారం తో కలపాలి .అప్పుడు బంగారం తయారవుతుందట .రెండో పద్ధతి –వెండి2.48 భాగాలు ,ప్లాటినం 32.02 భాగాలు రాగి 65.50భాగాలు కలిపి కరగిస్తే బంగారం తయారవు తుందట .మూడో పద్ధతి –16భాగాల రాగి ,7భాగాల ప్లాటినం ,1భాగం జింకు కలిపి కరిగిస్తే 16కేరట్ల బంగారం అంటే” పదారు వన్నెల బంగారం” ఏర్పడు తుందట .సాధారణ నైట్రిక్ ఆసిడ్ కూడా దీన్ని ఏమీ చేయ లేదట .ఆధునిక కాలం లో పరమాణు రహస్యం తెలిసిన తర్వాతఒక మూలకం పరమాణు చివరి ఆర్బిట్ లో ఉన్న ఎలేక్త్రాన్ల సంఖ్యను మారిస్తే ,ఆది ఇంకో మూలకం గా మారి పోతుంది అని కనీ పెట్టారు .ఇలా వచ్చే బంగారం చాలా ఖరీదు గా ఉంటుంది .
అయితే వేమన కాలం లో ను ,అంతకు ముందు కూడా బంగారాన్ని తయారు చేయటాన్ని గురించిన శాస్త్రాలు ఉన్నాయి .అందులో మొదటిది ”మందాన భైరం ”,రెండోది ”రసేంద్ర చింతా మణి ”,మూడవది ”రస రత్న సముచ్చయం ”గ్రంధాలు చాలా ప్రసిద్ధి చెందాయి .
ఇవన్నీ విన్నా ,కన్నా వేమన్న కు బంగారం చేయా లానే కాంక్ష తీవ్రం గా ఉండేది .ఆ విషయం లో ఆయన కొన్ని పద్యాలు కూడా చెప్పాడు .”నిమ్మ పండు పుట్టే ,నిజమైన రసముండే -హేమమునకుయేడ్తు రేల ప్రజలు -సొత్తు పొత్తు చేసి సాధింప రేలకో ”అని బంగారం చేసేతేలిక విధానాన్ని చెప్పాడు .ఇంకో పద్యం లో -”ఇంగిలీక మహిమ హేమింప నేరక -చిత్ర పటమువ్రాసి చేరచి నారు -బొంత జెముడు పాలు పొంగించ నేరరు ”అన్నాడు .ఇలా ఆయన చెప్పిన వాటిని బట్టి బంగారం సాధించాలని చాలా మంది యోగులు ప్రయత్నించి విఫలు రయ్యారు .చింత నిప్పుల బూడిదే తో బంగారం తయారు చేయ వచ్చునని తాలకం
,రంగు ,పాదరసం, రాగి లకు హేమాక్షి మొదలైనవి కలిపి బంగారం చేయ వచ్చును అనే వాదమూ ప్రచారం లో ఉందని ,ఇలాంటి
వివరాలనేన్నిటినో నేదు నూరి గంగాధరం గారు పొందు పరచారు.
ఆచార్య నాగార్జునుడు ”రస వాద సిద్ధాంత కర్త ”అని మనందరికి తెలిసిన విషయమే .మహా భారతం లో దుర్యోధనుడికి
పరుస వేది విద్య తెలుసునని ,అదే అతని బలం అనీ చెబుతారు .భట్టి విక్రమార్క చరిత్రకధల లోను దీని ప్రస్తావన ఉంది .కాకతి
ప్రతాప రుద్రునికీ పరుసవేది ని అంటించింది ఐతిహ్యం .రవీంద్ర నాధ టాగూర్ తండ్రి దేవేంద్ర నాధ టాగూర్ కూడా బంగారం
తయారు చేయటానికి చాలా ప్రయాస పడ్డారు అని చెప్పుకొంటారు .కాంతమీద వ్యామోహం కంటే ,కనకం మీది వ్యామోహం
ఎక్కువని అర్ధం అవుతోంది .ఇంత కధా ,కమా మీషు ఉంది” స్వర్ణ కార విద్య” మీద .దీన్ని ఇంతటి తో ఆపేసి ,ఆ తర్వాత”కొండ
వీటి వైభవం” దర్శిద్దాం ”.
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –3-9-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 978,572 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్న ఆలయ ధర్మకర్త బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, ప్రభావతి దంపతులు
- ‘’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-2’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.20 28.01.2023
- అరుణ మంత్రార్థం. 5వ భాగం.28.1.23
- (no title)
- ’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -11(చివరి భాగం )
- అరుణ మంత్రార్ధం.4వ భాగం.27.1.23
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.19
- ’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -10
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,919)
- సమీక్ష (1,274)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (298)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (835)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (357)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు