అమెరికా ఊసులు –17 జనాభా విస్ఫోటనం

  అమెరికా ఊసులు –17
                                         జనాభా విస్ఫోటనం 

అణు బాంబు పేలితే ఎంత అనర్ధం జరుగుతుందో ,జనాభా పెరిగినా అంతే అనర్ధం జరుగునది కనుక జనాభా పెరుగుదలను ”జనాభా విస్ఫోటనం అన్నారు .ఇప్పటికే విపరీత జనాభా తో ప్రపంచం కలత చెందు తోని .ఆహారధాన్యాలు చాలటం లేడు .శక్తి వనరులు కుంచించుకు పోతున్నాయి .తాగునీటికీ ,సాగునీటికీ కరువోచ్చేసింది .జనాభా కు నిలవటానికి నీడ కూడా దొరకని స్థితి .ఇంకో ముప్ఫై ఏళ్లలో జనాబా బాంబు బద్దలైతే తట్టుకొనే పరిస్తితి లేదని గనాక శాస్త్ర వేత్తలు గగ్గోలు పెడుతున్నారు .ఒక్క సారి ఈ బాంబు దాడి ఎలా ఉంటుందో చూద్దాం .
శీతోష్ణ స్తితి లో మార్పులు, ఖనిజ నూనెలు వాయువుల విపరీత మైన వాడకం వల్ల కలుగుతున్నాయి .భూమి మీద నీరు కలుషిత మై పోతోంది .అడవుల నరుకు లాట పర్యావరణానికి హాని కల్గిస్తోంది .దీనితో జనం భవిష్యత్తు ఎలా ఉంటుందో నని భయం పట్టుకోంది .ఎక్కువ ఆహారం పండించాలంటే చాలా ఖర్చవుతోంది .ఒక్క శాతం ఆహారం పెంచటానికి నాలుగున్నర రెట్ల ఖర్చు ఎక్కువ అవుతుంది .ఉన్న వనరులు అందరికి సమానం గా పంచటం సాధ్యం కావటం లేదు. ప్రజల జీవన ప్రమాణం అంతటా సమానం గా లేదు  .జింబాబ్వే లో చదరపు కిలో మీటర్ కు ముప్ఫై మూడు మంది మాత్రమె ఉన్నారు .అందుకని ఎంతో ఆహారాన్ని ఇతర దేశాలకు పంప గలిగేది .అందుకే దాన్ని” బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ సదరన్ ఆఫ్రికా” అన్నారు ..అయితే 2007 లెక్కల ప్రకారం ఆరు మిలియన్ల మంది అక్కడ కరువు ,ఆహార కొరత తో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది .ఆస్ట్రేలియా లో చదరపు కిలో మీటర్ కు 2.7మంది మాత్రమె జనం ఉన్నారు .అక్కడ అన్ని రకాల సౌకర్యాలు బాగా ఎక్కువే .అందుకని ఆస్ట్రేలియా బాగు పడాలంటే అక్కడి జనాభా జీవన ప్రమాణాన్ని తగ్గించాలి అంటున్నారు ”డేమోగ్రాఫార్లు” .ఇదో వింత .
2050కి ఇథియోపియా  జనాభా170 మిలియన్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు .ఇప్పటికే ఆకలి చావులు ఎక్కువ .అక్కడ జన సాంద్రత తక్కువే .పండే పొలమూ ఎక్కువే .అయినా తట్టుకోలేక పోతోంది .ఒక వ్యక్తికీ అవసర మైన దాన్ని అందించటానికి కావలసిన భూమి ని” ecological foot print” అంటారు .ఇది ఇరవై అయిదు ఎకరాలు కావాలి .కాని మనకున్న వనరు ఏడున్నర ఎకరాలు మాత్రమె .భూమి మీద దొరికే నీటిలో రెండున్నర శాతం మాత్రమె మంచి ఆరోగ్యకర మైన నీరు .ఇది హిమానీ జలాల లోనే లభ్యమవుతోంది .మిగిలిన నీరంతా దాదాపు ఉప్పు నీరే .చైనా లోని ningxia ప్రాంతం అసలు నీటి వనరులు లేని ప్రాంతం .అక్కడ పంట మొక్కలదగ్గర బొక్కలు చేసి ప్లాస్టిక్ కవర్లలో నీరు నిలవ చేసి బతికించాలి నీరు లేక పోతే పంట లేనే లేదు  . సముద్రాల లోని జలాన్ని” డీ సాలినేషన్”  పద్ధతి లో శుద్ధి చేసి మంచి నీరుగా మార్చుకొంటున్నారు .దీని వల్ల రైతులు పంటనీరు పొందే అవకాశామేర్పడింది .అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకొన్న పద్ధతి .
ప్రపంచ భూమిలో26 శాతం భూమినే మనం పంటలు పందిన్చుకోవటానికి ఉప యోగించ గలుగు తున్నాం .జనాభా పెరిగితే అధిక పంట కావాలంటే భూ విస్తీర్ణాన్ని పెంచుకోక తప్పదు .అలాగే శక్తి వనరుల వాడకం పెరిగి పోతుంది. కనుక ఆల్టర్నేట్ ఎనెర్జీ ని తయారు చేసుకోవాలి .అందుకే సూర్య కాంతిని ,విండ్ మిల్స్ను సముద్ర విద్యుత్ ను ,బయో డీసెల్ ను తయారు చేసుకొంటున్నాము .ఇప్పుడు శాస్త్ర వేత్తల దృష్టి కృత్రిమ జీవ పదార్ధంను” సింత టిక్  d.N.A.”  నుంచి తయారు చేసే ఆలోచన చేస్తున్నారు . d.n.a ను బాక్టీరియా కు కలిపి ,వాటి ద్వారా ప్రోగ్రామింగ్ చేసి ,బయో ఇంధనాన్ని అంటే మిథేన్ లేక హైడ్రోజెన్ గాస్ ను తయారు చేస్తున్నారు .ఇవి ఫాజిల్ ఇంధనాలకు బదులుకృత్రిమ ఇంధనాలుగా ఉప యోగ పడుతున్నాయి .ఈ బాక్టీరియా ను ఆహార పదార్ధాల నుండి సేల్ల్యులోజు ,వ్యర్ధ పదార్ధాల నుండి ,పనికి రాని  కారు టైర్ల నుండి తయారు చేసి సెభాష్ అని పించారు. శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నారు కదా ..ఇవి భవిష్యత్తు లో తరగని ఇంధనం గా మనకు పని చేస్తుంది .అదీ శాస్త్రజ్ఞుల నిరంతర పరిశోధనా ఫలితం .
u.n.సంస్థ  అధ్యయన  లెక్కల ప్రకారం 2050నాటికి వలసప్రజల జనాభా 98మిలియన్లకు చేరుతుంది .మరణాలు పెరిగినా వలస వల్ల  జనాభా పెరుగుతుందని తేల్చారు . 1950లెక్కల ప్రకారం ఒక మిలియన్ కన్నా ఎక్కువ జనాభా ఉన్న సిటీలు 83 మాత్రమే ఉంటె , 2007 కు వీటి సంఖ్య468 కి పెరిగి ముక్కు మీద వేలు వేసుకోనేట్లు చేశాయి .u.n.లెక్కల ప్రకారం ప్రపంచం లో మొత్తం మీద 850 మిలియన్ల జనం సరైన పోషకాహారం లేక ,ఆకలితో ,అలమటిస్తున్నారు .ఒక మిలియన్ జనాభాకు తాగు నీటి సౌకర్యమే లేదు . .అయితే కొంత మంది మాత్రం జనాభా చాలా తక్కువ గా ఉన్న కాలం లోనూ ఆకలి చావులు ,బీదరికం ఉన్నాయి అంటున్నారు .పారిశ్రామిక అభి వృద్ధి చెందిన సమాజాలలో ”పిల్లల అవసరం తక్కువ ”అనే భావం బలీయం గా వ్యాపించి ఉంది .
అమెరికా లోని అరిజోనా రాష్ట్రం లోని ”ఫోనిక్స్ ”లో ముసలి వారి శాతం బాగా పెరిగి పోయి ,పని చేసే యువకుల శాతం బాగా పడి పోయి దారుణం గా ఉందని గగ్గోలు పడుతున్నారు .దీని వల్ల  నైపుణ్యం ఉన్న పని వారు తగ్గి పోయి ,ముసలి ముఠా ను పోషించాల్సిన బాధ్యతా ,ఖర్చులు పెరిగి పోతున్నాయని ఆందోళన చెందు తున్నారు .2006 లో సేకరించిన లెక్కల ప్రకారం ఇంగ్లాండు లో ఒక పిల్ల లేక పిల్లాడిని 18 ఏళ్ళు వచ్చే వరకు పెంచటానికి సగటున 86,000 డాలర్లు ఖర్చు అవుతుందట .దీనిలో కాలేజి చదువు ,ఇల్లు ,ఆహారం ఖర్చు కలిసి ఉన్నాయి .అందిన మరో సమాచారం ప్రకారం ప్రపంచం లో 350 మిలియన్ల ఆడ వారికి తమ కుటుంబాన్ని తీర్చి దిద్దుకొన టానికి ,వసతి కల్పించుకోవటానికి తగిన సాధారణ సమాచారం కూడా అందు బాటులో లేనే లేదట .ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప రీతం గా పెరిగి పోయిందని జబ్బలు చరచుకొనే మనం ఇంకా సిగ్గు పడాల్సిన విషయం కాదా ఇదీ .
”తక్కువతో ఎక్కువ ” సాధించాల్సిన సమయం ఆసన్నం అయింది .రేపు రావాల్సిన విప్లవం ఆహార ఉత్పత్తి లోనే .దీనికి ” genetically modified”(g.m.) ఆహారం పండించటం ఒక్కటే శరణ్యం .వీటిని కూడా బాగా సార వంత మైన భూముల్లో కాకుండా ,ఊసర క్షేత్రాలలో ,ఉప్పు ఉరిసిన భూముల్లో పండించే ఆలోచన చేయాలి .అప్పుడే తిండికి కరువు ఉండదు .ఇప్పటికే అడవు లన్ని నరికి భూసారాన్ని నిలవ నీ కుండా చేశాం .భూమి సారమూ తగ్గి పోయింది .ఎడారులుగా భూముల్ని మనమే మార్చి, పాపం ఒడి గట్టుకొంటున్నాం .ఆధునికవ్యవ సాయ పద్ధతులను అమలు జేసి జన పోషణ కు అందరు నడుం కట్టాలి .అప్పుడే జనాభా విస్ఫో ట నాన్ని తట్టుకో గలం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –4-8-12.–కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

1 Response to అమెరికా ఊసులు –17 జనాభా విస్ఫోటనం

  1. రాజేంధర్ పల్లికొండ అంటున్నారు:

    అమెరికా జనాభా కేవలం 30 కోట్లు మాత్రమే కానీ అభివృధ్ధి లో ముందు …………………..అదే మన భారతదేశ జనాభా 120కోట్లు కానీ అభివృధ్ధిలో శున్యం ఎందుకు ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.