అమెరికా ఊసులు –18
” ఫర్ ”వ్యా పారం
పది హేడవ శతాబ్దం నుంచి ఇతర దేశస్తులకు అమెరికా మీద వ్యామోహం ఎందుకు కలిగింది అంటే ఇక్కడ ఫర్ చర్మాలు విపరీతం గా లభిస్తాయని ,వాటిని వ్యాపారం చేసి కోట్లు సంపాదించ వచ్చు అనే ఆశ .ఇంతకీ ఫర్అంటే ఏమిటి ?అదొక జంతువు చర్మం .ఆ జంతువు పేరు ”బీవర్ ”.ఫ్రెంచి ,డచ్ వాళ్ళు క్యూబెక్ ,మాన్ హట్టన్ లకు కొద్ది సంఖ్యలో1606-1626కాలం లో . వచ్చారు .అప్పటికి వారికీ వాణిజ్య పంటలేమీ కనీ పించ లేదు .వారి ద్రుష్టి” ఫర్” ల మీద పడింది. దీనితో వ్యాపారం చేసి ,లాభాలు గడించ వచ్చుననుకొన్నారు .డచ్ వాళ్ళు వాటి చర్మాలతో టోపీలు ,కోట్లు తయారు చేసి యూరప్ లో అమ్మితే ”డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ”అని గ్రహించారు .నెమ్మదిగా అందరు చేరారు .ఫ్రెంచి వారు ఇక్కడి ఉన్నత కుటుంబాలమగ వారు ఫర్ కాప్ లను , ,ఆడవారు ఫర్ కోటు ను ధరించే సదుపాయం చేశారు .అంటే వారు దీన్ని స్థానికం గా నేవినియోగించాలని భావించారు .1640లో అధికం గా శిఖరాగ్రానికి ఫర్ వ్యాపారం చేరింది .అప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వం న్యు ఇంగ్లాండ్ అనే అమెరికా నుంచి ఫర్ లను దిగుమతికి అనుమతించింది .దీనితో బీవర్ల సంఖ్య క్రమం గా తగ్గి పోయి వ్యాపారం మందగించింది .ఈ జంతువులూ ఎక్కువ గా కెనడియన్ కాలనీల దగ్గర సెయింట్ లూయీస్ నది సమీపం లో ఉండేవి .అక్కడే వాటిని వల పన్ని పట్టుకొనే వారు .ఎప్పుడైతే ఇక్కడ బీవర్ ల సంఖ్య తగ్గిందో అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు ఒంటారియా సరస్సు వైపుకు ,ఆ తర్వాతా సుపీరియర్ సరస్సు వైపుకు కదిలి వెళ్లారు .డచ్ వాళ్ళు మాత్రం మాన్ హట్టన్ ,అల్బని లలో ఉండి పోయారు .మాన్ హట్టన్ ను వాళ్ళు” న్యూ ఆమ్ స్టర్ డాం ”అనీ ,ఆల్బని ని” ఫోర్ట్ ఆరంజి” అని పిలిచారు .1680లో బీవర్ మార్కెట్ దెబ్బతింది .1700నాటికి గ్రేట్ లేక్స్ వద్ద ఉన్న బీవర్ లన్ని పట్టు బడి ,ఖాళీ అయి పోయాయి .వ్యాపారం మందగించింది .మళ్ళీ ఈ వ్యాపారం 18 వ శతాబ్దం వచ్చే సరికి ఊపు అందుకోంది .వీటిని పట్టుకోవటానికి నేటివ్ అమెరికన్లు సాయం చేసే వారు .ఒకప్పుడు 60 మిలియన్లు ఉండే బీవార్లు ఇప్పుడు కేవలం 15 మిలియన్లు మాత్రమె ఉన్నాయి అంటే సిగ్గు పడాలి .
ఉత్తర అమెరికా స్వాతంత్రాన్ని పొంది బ్రిటన్ నుండి వేరు పడి పోయింది .అప్పుడు అమెరికన్లు మళ్ళీ బీవర్ల వేట కోన సాగించారు .రాకీ పర్వతాల దాకా వెళ్లి వీటిని పట్టుకోవటం ప్రారంభించారు .దానితో 1850నాటికి మళ్ళీ బీవర్ల సంఖ్య తగ్గి వ్యాపారం కుదేలయింది .ఇది శాస్త్ర వేత్తల దృష్టి లో పడింది .బీవర్ జంతువులను సంరక్షించు కోవాలనే తలంపు బలీన మైంది .అదృష్ట వశాత్తు బీవర్ జంతువులూ ఇరవై వ శతాబ్దం నాటికి గణనీయం గా అభి వృద్ధి చెందాయి .కెనడా ,అమెరికా లలో వీటి రక్షించే మార్గాలను విస్తృతం గా అమలు చేశారు .దీనితో పదిహేడవ శతాబ్దం నాటికి యూరోపియన్లు అమెరికా కు రాక ముందు ఎంత బీవర్ సంతతి ఉందొ ,ఇప్పుడు కూడా అంత కంటే ఎక్కువ సంఖ్య లో బీవర్లు ఉండటం ప్రకృతి లో ఒక గొప్ప ప్రయోగాత్మక ఫలితం ”.లాంగ్ లివ్ బీవర్ ”.
మరిన్ని అమెరికా ఊసులు
రాబర్ట్ డిల సాల్వే అనే అనే అన్వేషకుడు ఫ్రాన్సు నుండి కెనడా కు గ్రేట్ లేక్స్ ను అన్వేషించాలని వచ్చాడు .ఇక్కడి ఇండియన్ అమెరికన్లతో స్నేహం చేశాడు .వారున్న చోట్ల చాలా ఫ్రెంచి కోటలను నిర్మించాడు .అయితే ఆయన్ను మిసిసిపి నది ని చూసిన వాది గానే భావిస్తారు కాని అతని ఉద్దేశ్యం మిసిసిపి నది ఒడ్డున ఫ్రెంచి కాలని ఎర్పరచాలన్నదే ఆయన ధ్యేయం .ఒంటారియా సరస్సును కు ఇండియన్లు ”అందమైన సరస్సుఅని వాళ్ళ భాష లో అర్ధం చెబుతారు . ఆ రోజుల్లో ఇక్కడి ఇండియన్ అమెరికన్లకు అయిదు రాజ్యాలున్నాయి .అవి mohawk ,oneida ,onandaga ,cayuga.వీరందరి సంస్కృతి ఒకటే .ఒకే భాష మాట్లాడుతారు .వీరు విపరీత మైన పోరాట పటిమ కల వారు .వీరేప్పుడూ యుద్ధాలలో జయం పొందిన వాళ్ళే .ఈ అయిదు రాజ్యాలు డచ్ వారితో చేతులు కలిపారు .వీరికి ఫ్రెంచ్,కెనడా వారంటే విపరీత మైన ద్వేషం .దీనికి కారణం 1690లో సామ్యుఎల్ డీ చామ్ప్లాన్ తమతో యుద్ధం చేసి” న్యు ఫ్రాన్స్” ఎర్పరచాడని కోపం. .1660నాటికి ఫ్రెంచి వారికి వీరే దిక్కు అయారు .బ్రిటీష వారిని ఎదిరించటానికి వీరు వారికి తోడ్పడ్డారు .
మిసిసిపి నదిని ఇండియన్లు ”ఫాదర్ ఆఫ్ వాటర్స్ ”అంటారు వారి భాష లో .ఫ్రెంచి వారు మిస్సోరి నది లోని ఒండ్రు నీటి ని మొదటి సారిగా చూశారట .అలాగే ఒహాయో నది లోని నీటిలో ఒంద్రుమన్ను ఉండటం గమనించారు .జోలిఎట్ అనే యాత్రికుడు ఒంటారియా సరస్సును అన్వేషించే పనిలో ఉండగా మాంట్రియల్ మరియు గ్రేట్ లేక్స్ ల మధ్య గమ్యానికి ఎనిమిది మైళ్ళ దూరం లో ఓడ తలక్రిందులై అతను అప్పటిదాకా రాసి పెట్టుకొన్న విలువైన సమాచారం అంతా సెయింట్ లారెంసు నది నీటి లో కలిసి పోయింది పాపం .మిసిసిపి నది మీదుగా ప్రయాణించిన మొదటి యాత్రికుడు లా సాల్.అయితే అతని అహంభావత్వం మోసం చూసి తోటి నావికులు భరించలేక 1687 లో ఈనాటి టెక్సాస్ లోని నవ సోటా వద్ద హత్య చేసి శరీరాన్ని నక్కల పాలు చేశారు .1697-99మధ్య కాలం లో పద్నాలుగవ లూయీ అనే ఫ్రాన్సు రాజు ఫ్రెంచ్ సోల్జర్ ”pierre le moyne d’iberville” ని కమాండర్ గా చేసి మిసిసిపి నది ముఖ ద్వారం లో ఒక ఫ్రెంచ్ కాలని ని ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించాడు .అతను బిక్సౌలి వద్ద లూసియానా లో మొదటి ఫ్రెంచి కాలని ని ఏర్పాటు చేసి రాజు గారి కోరిక తీర్చి ప్రభు భక్తీ చాటుకొన్నాడు .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –5-8-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 926,901 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం
- సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
- గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-19
- గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక
- భారతీ నిరుక్తి .25వ భాగం8.8.22
- శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.22వ భాగం.7.8.22
- గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-17
- భారతీ నిరుక్తి 24వ భాగం.
- గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-16
- 19వ శతాబ్ది ఇంగ్లాండ్ సాంఘిక సంస్కర్త ,రచయిత్రి –కరోలిన్ నార్టన్( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -ఆగస్ట్
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (37)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,782)
- సమీక్ష (1,142)
- ప్రవచనం (8)
- ఫేస్బుక్ (61)
- మహానుభావులు (292)
- ముళ్ళపూడి & బాపు (59)
- రచనలు (965)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (329)
- సమయం – సందర్భం (815)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (490)
- సినిమా (322)
- సేకరణలు (313)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు