గ్రీకుల స్వర్ణ యుగం
భారత దేశం లో గుప్తసామ్రాజ్య పాలన ను ”స్వర్ణ యుగం ”అని గొప్పగా చెప్పుకొంటాం .అలానే గ్రీకు దేశస్తులు ”అయిదవ శతాబ్దాన్ని” తమ ”స్వర్ణ యుగం ”గా భావిస్తారు .అప్పుడే విద్యా వైద్య కళా సాహిత్య శిల్ప రాజకీయ,సాంస్కృతిక వేదాంతాదివిషయాలలో ఏంతో అభి వృద్ధి సాదించిం దని ,ఆ కాలం లో జన్మించిన కవులు రచయితలు ,కళాకారులు ,శాస్త్ర వేత్తలు ఆదర్శ వంతులని ,అప్పుడే అద్భుత గ్రంధాలన్నీ వెలువడి భవిష్యత్తు తరాలకు కర దీపికలు గా నిలిచాయని వారి భావం .అంతే కాదు వారి వైద్య శాస్త్ర పితామహుడు హిపోక్రటీస్ ఆ కాలం లోనే జన్మించి వైద్య శాస్త్రానికి పునాదులు నిర్మించాడనీ గర్వ పడతారు .అందుకే వారు ఆ కాలాన్ని ఆయన పేరు మీద గౌరవం గా ‘హిపోక్రటీస్ యుగం ”అంటారు .
ఈ కాలం లోనే ప్రపంచమ్ లో మొట్ట మొదటి ప్రజా ప్రభుత్వం -డేమోక్రాసి ఏర్పడింది ఎతేన్సు లో .ప్లాటో ,అరిస్టాటిల్ మొదలైన తత్వ వేత్తలు సత్య దర్శనం చేసి ప్రపంచానికి చాటారు .ఆనాడు దేశాలకు సరి హద్దులనేవి లేవు .అంతా ఐక్య గ్రీకు రాజ్యమే .పోలిస్ అనే పౌర రాజ్యాలున్దేవి .తమ ప్రభుత్వాలను తామే పాలించుకొనే వారు .పోలిస్ అంటే ముఖ్య పట్టణం దాని చుట్టూ జనావాసాలు పొలాలు ,అడవులు చుట్టూ ప్రక్కల గ్రామాలు అన్నీ పోలిస్ కు చెంది ఉంటాయి .అక్కడ గ్రామీణ వికాసం బాగా జరిగేది .ఎన్నో మార్బుల్ ,వెండి గనులున్దేవి .ముఖ్య నగరానికి చుట్టూ ఎత్తైన గోడ ఉండేది .ఆ కాలం లో యుద్ధాలు ఎక్కువే .సాధారం గా గ్రీకు నగరాలు ఒక కొండ దగ్గరే నిర్మింప బడేవి .దేవాలయాలు ఎత్తైన కొండల మీద ఉండేవి .వీటిని ”ఆక్రోపోలిస్ ”అనే వారు .గ్రీకుల నగర మధ్యభాగం లో ఎంతో సందడి ఉండేది .దీన్ని ”అగోరా ”అంటారు .మన డౌన్ టౌన్ లాటివన్న మాట .ఇక్కడే ప్రభుత్వ ఆఫీసులు దుకాణాలు ,మార్కెట్లు దేవాలయాలు గ్రీకు పోలిస్ లుఈ నాటి ఉత్తర ఆఫ్రికా ,ఆసియా మైనర్ ,ఫ్రాన్సు ,ఇటాలి రష్యా ,సిరియా ల వరకు వ్యాపించి ఉండేవి .అన్నిటి మధ్య దృఢ మైన బంధం ఉండటం విశేషం .
హిపోక్రాటి క్ కాలపు రచయితలు ”కాస్”,మరియు” స్నిడాస్ ”అనే ప్రాంతాలకు చెందిన వాళ్ళు .కాస్అనేది ఏజియన్ సముద్రం లోని దీవి .ఏషియా మైనర్ కు సమీపం లో ఉండేది .ఇప్పుడు దాన్ని టర్కీ అంటారు .”స్నిదాస్ ”దానికి దగ్గరే ఉన్న తీర ప్రాంతం .హిపోక్రటీ ”కాస్ ”నివాసి .గ్రీకులు తమను తాము ఎతీనియన్లు ,కొన్సు ,క్నాడియన్లు అని గర్వం గా చెప్పుకొంటారు .అంటే ఒకే గ్రూప్ రక్తం కల వారని ఒకే భాష కల వారని ,ఒకే మతం కల వారని భావన .వీరందరి పూర్వీకులు గ్రీకులు అని అర్ధం .వారందరి భాషా గ్రీకు .గ్రీకు భాష మాట్లాడని వారిని ”బార్బెరియన్లు ”అంటారు .అంటే వీరికి మిగిలిన భాషా శబ్దాలు ”బర -బర”లాగా వినిపిస్తాయని భావం .మనం అరవ భాష మాట్లాడే వారిని ”డబ్బా లో రాళ్ళు పోసి వాయించి నట్లు ఉంది ”అనటం తెలిసే ఉంటుంది .అలానే వాళ్ళకూ .ఒకే మతం అంటే ఒకే ”దేవతా సమూహం ”ను అందరు పూజిస్తారు అని అర్ధం .గ్రీకు పురాణాలలో పన్నెండు మందిదేవుళ్ళు దేవతలు ఉన్నారు .వారంతా మానవ రూపాలతో సంక్లిష్ట వ్యక్తిత్వాలతో ఉంటారు .మానవ జీవితాలతో చెలగాటం ఆడతారు .ప్రతి దేవతకు నిర్దుష్ట శక్తి కార్యక్రమం ఉంటాయి .అందులో ”జియాస్ ”అధిక శక్తి వంతుడు .పోసిదాన్ సముద్రానికి అది పతి .ఆఫ్రోడైట్ ప్రేమ కు నిలయం .వీరు గాక కొందరు చిల్లర దేవుళ్ళు కూడా ఉన్నారు .సైన్స్ కు సంగీతానికి వేరే దేవతలుంటారు .మూడో వర్గం లో హీరో లు ఉంటారు .హీరోలు శక్తి సామర్ధ్యం ఉన్న వారే కాని మరణాన్ని తప్పించుకో లేరు .ఆస్లేపియాస్ అనే దేవుడు రోగ నివారణకు ప్రాతి నిధ్యం వహిస్తాడు .
గ్రీకు కాలెండర్ లో పండుగలకు ప్రాముఖ్యం ఉంది .దేవతలను ప్రసన్నం చేసుకొనే ప్రక్రియలు చేస్తారు .సంబరాలు ఉత్స వాలు పూజలు నిర్వ హిస్తారు .దేవతలకు విలువైన కానుకలు సమర్పిస్తారు జంతుబలి చేస్తారు .వారిని ప్రసన్నం చేసుకోవటానికి చాలా చేస్తారు అందమైన శిల్ప సౌందర్య విలసిత మైన దేవాలయాలను నిర్మించి అందులో వీరిని ఉంచి సేవిస్తారు .హిపోక్రటిస్ కాలానికి బాలుర బడులు బాగానే ఏర్పడ్డాయి .ఎడేల్లకే బడిలో చేరే వారు .ఆడ వారికి విద్య లేదు .ఇంటి పని ,పెనిమిటి పని తప్ప .బడులలో హోమర్ రాసిన ”ఒడిస్సీ ””ఇలియడ్ ”లను నేర్పే వారు సంగీత వాయిద్యాలతో వాటిని గానం చేసే వారు .”లైర్” అనే వాయిద్యం బాగా ప్రచారం లో ఉండేది .ఆటలను అబ్బాయిలు బానే ఆడే వారు .పరుగు పందెం ,డిస్కస్ త్రో ,జావెలిన్ ,కుస్తీ పోటీలు జరిగేవి .అన్నీ ప్రైవేటు బడులే .కొద్ది కాలమే బడి చదువు .ధన వంతుల పిల్లలు ఎక్కువ కాలం చదివే వారు .
గ్రీకు పురాణాలలో విజ్ఞాన ద్రుష్టి కనిపిస్తుంది .జియాస్ అనే దేవుడు మెరుపులు సృష్టిస్తాడని నమ్మకం .పాసిదాన్ భూకంపాలు.తుఫాన్లు ,గ్రహణాలు ఋతువులు ఎర్పరుస్తాడని నమ్మే వారు .ఈ కాలం లో ప్రకృతిని అధ్యయనం చేయటం పెరిగింది .వివేచనా తో కార్య కారణ దృష్టితో సమాదానాలకోసం ప్రయత్నించారు .తెలేస్ అనే ఆయన అన్ని వస్తువు లకు కారణ భూత మైన ఒక పదార్ధం ఉంటుందని అదే ”నీరు ”అని భావించాడు .భూమిలోని నీటి పొరల కదలిక వల్ల భూకంపం వస్తుందని చెప్పాడు .ఇలా పురాణాల నుండి కాక సహజ ప్రకృతి నుండి సమాధానాలను తెలుసుకోవటం ప్రారంభామైనదిఇ ప్పుడే .anaximander అనే అతను సూర్య చంద్ర నక్షత్రాలను అధ్యయనం చేశాడు .భూమి సిలిండర్ ఆకారం లో ఉంది అని చెప్పాడు. జంతువులూ ”తడి ”నుంచి ఉద్భవించాయి అన్నాడు మనిషి ఒక రక మైన చేప నుండి ఆవిర్భా విన్చాడని భావించాడు .మన మత్సా వతారానికి దగ్గర్లోనే ఉంది కదా .
ఈ కా లం లో మేదావులందరూ తరచూ గా కలుసు కొంటూ తాము సాధించింది మిగిలిన వారికి తెలియ జేస్తూ దాని పై తర్జన భర్జనలు చేస్తూ నిజాన్ని రాబట్టు కొనటం గొప్ప అలవాటు గా ఉండేది .అలా చేయటం వల్ల ఎవరు యే రంగం లో ఏమేమి సాధించారో తెలుసుకొనే ఆవ కాశం లభించింది .తరు వాతి తరాల వారికి మార్గ దర్శనం చేసి నట్లూ ఉండేది .హిపోక్రటిస్ కు ముప్ఫై ఏళ్ళ ముందు empedocles జన్మించాడు .ఆయన ప్రకృతి లో నాలుగే నాలుగు మూల కాలున్నాయని వాటి వల్లనే పదార్ధాలన్నీ ఏర్పడుతున్నాయని చెప్పాడు .అవే అగ్ని ,నీరు ,భూమి ,గాలి .వాటిని ఆయన మూలకాలు అన్నాడు కాని అవి సంయోగ పదార్ధాలు ,ఇవాళ మనకు117 మూలకాలున్నాయి .ఆయన భావన లో ఎముక అనేది నాలుగు భాగాల నిప్పు ,రెండు భాగాల నీరు ,రెండు భాగాల మట్టి కలిస్తే ఏర్పడుతుంది .ఈ నాలుగు మూలకాల భావన చాలా కాలం గ్రీకు శాస్త్ర వేత్తల దృష్టిలో ఉండి పోయింది .
ఈ యుగాన్నే హిపోక్రటిస్ యుగం అన్నాం కదా మరి ఆయన వైద్య శాస్త్రానికి చేసిన సేవ లేమిటో తెలుసు కొందాం .ఆయన కాస్ దేశ వాసి .460 b.c.లో జన్మించాడు .వైద్య శాస్త్ర పితామహుడు అనిపించుకొన్నాడు .వైద్యాన్ని ఒక శాస్త్రం గా నిర్వహించాడు .ఆరోగ్యం ప్రకృతి ఇచ్చే వరం అన్నాడు వ్యాధులను వర్గీకరణ చేసి ”the sacred diseases ”పేరా ఒక విభాగం రాశాడు .అలాగే హృదయం పైన విషయాలను క్రోడీకరించి చెప్పాడు .శరీరం లో blood ,yello bile ,black bile ,pelgm ”,అనే రసాలున్నాయన్నాడు .ఇవి నియంత్రణ ను కోల్పోతే శరీరాంకి జబ్బు చేస్తుందని అన్నాడు .on the nature of man లో వీటిని గురించి పూర్తిగా వివరించాడు .వైద్యాన్ని ”ఒక కళ”గా గుర్తించిన మహానుభావుడాయన .ఆయన పుస్తకం లో మొదటి వాక్యాన్ని మనకు ఆయన రాశాడని తెలీకుండానే ఉప యోగిస్తాం ఆది ”life is short and the art is long ;”
వైద్యులకు నీ తి సూత్రాలు చెప్పాడు .రోగిని బ్రతికించే అన్ని ప్రయత్నాలు చెయ్య మన్నాడు .మంచి” పధ్యం” గురించి చెప్పాడు .ఎముకలు విరిగితే, కీళ్ళు జారితే చేయాల్సిన ప్రక్రియ లన్ని హిపోక్రటిస్ యుగపు వై ద్యు లకు తెలుసు .వైద్యులు రోగం తగ్గించటానికి విశ్వ ప్రయత్నం చేయాలి ”the prime objective ofthe phy sician .in the whole art of medicine should be to cure that which is diseased and if this can be accomplished in various ways ,the least troublesome should be selected ”.అని డాక్టర్లకు జ్ఞాన బోధ చేశాడు .వైద్యు లందరూ వ్రుత్తి లో చేరే టప్పుడు ఒక ప్రమాణాన్ని చేయాలని శాసించాడు .అదే ” hipopocrates oath” అనే పేర పిలువ బడుతోంది .అందరు డాక్టర్లు ఆ ప్రమాణాన్ని చేస్తారు .ఆది నిలుపు కోవా టా నికి మంచి వైద్యులు అందరు ప్రయత్నిస్తారు .ఒక తరాన్ని తన పేరు మీద పిలి పించుకొనే ఘనత హిపోక్రటి స్ కు దక్కింది .ఆయన కాలం అందుకే స్వర్ణ యుగం అయింది .
మీ –గబ్బట దుర్గా ప్రసాద్ –5-9-12-కాంప్ –అమెరికా