జన వేమన -20 దేశీయుల పై వేమన ప్రభావం

 జన వేమన -20
దేశీయుల పై వేమన ప్రభావం

వేమన గారి శిష్యులు ఆయన పై ఒక ద్విపద కావ్యం రాసి భక్తిని ప్రకటించుకొన్నారు .వేమన శిష్యులకు ముఖ్య మైన యేడు సిద్ధాంతాలను బోధించాడు .అవి -దొంగతనం చేయరాదు ,భూత దయ కలిగి ఉండాలి ,ఇతరులను నొప్పించ రాదు, ,ఉన్నదానితో తృప్తి చెందాలి ,మాత్సర్యం కూడదు ,కోపాన్ని వదిలేయాలి ,సదా ఈశ్వర ఆరాధన చేయాలి .ఇవన్నీ సర్వ మతాల సారమే .
వేమన లాంటి వారెవ రైనా ఉన్నారా అని అనుమానం వస్తుంది .కొంత పరిశీలించి చూస్తె ,ఉన్నారనే తెలుస్తోంది .కన్నడ దేశం లో 1760 లో జన్మించిన ”సర్వజ్ఞుడు ”వేమనకు సరి సాటి గా తోస్తాడు .ఈయనకు తన శక్తి పై అపార నమ్మకం .”త్రిపద ”అనే గీతాలు రాశాడు .వీటి సంఖ్య అయిదు వేలు ట.పెద్దలఎడ వినయ విధేయతలు ,ఓర్పు ఉండాలని  బోధించాడు .”సర్వజ్ఞ  వేమన సంవాదం ”అనే సమానార్ధం గల పద్యాలు కన్నడం లో ఉన్నాయట . మహా రాష్ట్ర కు చెందిన ”సంత్ తుకారాం ”  వేమన వంటి వాడే .సమానత్వాన్ని బోధించాడు .శివాజీ కి సమకాలికుడు .1608 లో జన్మించాడు .  4600   ల పదాలున్న గ్రంధం రాశాడు .ఉపనిషత్ సారాన్ని బోధించాడు .తమిళ దేశానికి చెందిన ”అవ్వయ్యార్ ”చాలా ప్రసిద్ధి చెందిన బోధకు రాలు .”అత్తి సూడి ” అనే  108   సూత్రాలను, ”కొంరై వెండ్రాన్ ”అనే 91సూత్రా లను రచించిన యోగిని .సుమతీ శతకం లా గా పాఠ్య పుస్తకాలలో వాటిని చేర్చారు .”అవ్వై కూరల్ ”అనే వేదాంత గ్రంధాన్ని రాసింది .ఆమె పై సినిమా కూడా వచ్చింది .పండరి బాయి అవ్వయ్యార్ గా నటించింది ,
ద్రావిడ కవి ”అరుణ గిరి నాధుడు ”1465లో జన్మించాడు ..సహజ పాండిత్యం ఉన్న కవి .వేమన లాగా వేశ్యా లోలుడై ,చివరికి జ్ఞాని యై ”తిరుప్పుహళ్ ”అనే 16వేల పదాలు రాశాడు .”కందరనబూతి ”,,”కందరలంకారం ”అనే గ్రంధాలు కూడా వ్రాసి నట్లు ఉంది .ఈయన భాష కూడా వేమన భాష అంత మాధుర్యం గా ఉంటుంది .తమిళ దేశానికి చెందిన”తిరు వల్లువార్ ””కురలీ ”అనే 1330 పద్యాలున్న ప్రఖ్యాత గ్రంధం రాశాడు .సత్యాన్ని ,నీతిని పాటించాడు .చాలా అద్భుతాలు చూపించాడు .దీనినే కను పర్ వెంకట రామ శ్రీ విద్యా నందుల వారు ”త్రివర్గ దీపిక ”పేర తెలుగు లో అనువదించారు .భావాల్లో వేమన కు సమానం గా ఉన్నాయట .వీరంతా వేమన లాంటి ఇతర భాషా కవులు .
ఇప్పుడు మన వేమన ను ఎవరెవరు అనుసరించారు అనే విషయానికి వద్దాం .ఆయన శిష్యులు ,ప్రశిష్యులు చాలా మందే కన్పిస్తారు .విరాట్ పోతు లూరి వీర బ్రహ్మేంద్ర రుషి వేమన్న ను,ఆయన మతాన్ని  అనుసరించారు .యోగ సాధన చేశారు .విగ్రహారాధన నిరాకరించారు .దూదేకుల సిద్దయ్య ఆయన కు ముఖ్య శిష్యుడు .జాతి భేదం పాటించలేదు బ్రహ్మం గారు .”సిద్ధ బోధనం ”అనే గ్రంధాన్ని రాశారు బ్రహ్మం గారి ”కాలజ్ఞానం ”ప్రసిద్ధం ..కుమార్తె ఈశ్వరమ్మ బ్రహ్మ  చారిణి గా ఉండి ,తండ్రి కి తగ్గ వారసు రాలైంది .బ్రహ్మం గారి సమాధి ”కంది మల్లయ్య పాలెం ”లో ఉంది .సజీవ సమాధి పొందిన సిద్ధ పురుషుడు వీర బ్రహ్మం గారు .
1780లో పుట్టిన తుంగ వేమన శిష్యుడు .ఈయన్నే మనం ”డూప్లికేట్ వేమన్న” అని చెప్పుకొన్నాం .”ఏగంటి వచనాలు ”రాసిన ఏగంటి లక్ష్మయ్య వేమన శిష్యుడే .ఈయన వచనాలు బాగా ప్రచారం పొందాయి .”ముత్యాల నార సింహ యోగి ”వేమన గారి మీద భక్తీ తో ”వేమన జ్ఞాన మార్గ పద్యములు ”రాశాడు .దిగంబర యోగికి ఈయన శిష్యుడైనాడు .”జీవ తత్వ ప్రబోధక సుమాలి ” .అనే కంద పద్య గ్రంధం రాశాడు .రాజ మండ్రి నివాసి ”నిట్టల ప్రకాశ దాసు ”వేమన మార్గాన్ని అనుసరించిన సాధకుడు ,గొప్ప యోగి .యోగ మహిమ తో గోదావరి నీటి పై కూర్చుని అవతలి ఒడ్డుకు చేరిన శక్తి శాలి ..పాటలు ,తత్వాలు రాశాడు .
తూర్పు గోదావరి కి చెందినా వాడు కాకినాడ వాసి ”ఎడ్ల రామ దాసు” చాలా గ్రంధాలు రాశాడు .ఈయనకు శిష్యులు కూడా ఎక్కువే .పద్యాలు ,పాటలు ,తత్వాలు రాశాడు .వేమన లాగా కీర్తి సాధించాడు .వీటి నన్నిటిని శ్రీ నేదునూరి గంగాధరం గారు విపులంగా చర్చించారు .”యెడ పాటి ఎర్రా ప్రగడ ‘కవి ”మల్హణ చరిత్ర ”లో ,తురగా రామ కవి రాసిన ”నాగర ఖండం ‘లో పింగళి ఎల్లన్న రాసిన ”తోభ్య చరిత్ర ”లో వేమన గురించి ఉంది .వేమన 150పద్యాలను ఆంగ్లం లోకి అనువదించి ప్రచురించారు శ్రీ యే.ఎల్.యెన్ .మూర్తి .విద్వాన్ బండ్ల సుబ్రహ్మణ్య కవి ”వేమన -వేయి పద్యాలు ”పేరిట వేమన కవితా విశేషాలను ,వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ ”విశ్వ వినుత చర్య -వేమనార్య ”అనే మకుటం తో గొప్ప పద్యాల ముత్యాల పందిరి వేసి వేమన యోగిని ఊరేగించారు .మచ్చుకో పద్యం –”నీదు కవితా స్రవంతి లోనిశిత భావ -జీవ రత్నాల వెలుగులు చిందు లాడ -వెలుగు గన లేని చీకటి పులుగు లెల్ల -దొలగి పోయిన నీకేమి దొసగు పొసగు ?”ఈ విధం గా ఆనాడే కాదు400 సంవత్స రాలు దాటినా వేమన్న అంటే భక్తీ ,అనురక్తి ,ఆసక్తి వ్యాసక్తి తగ్గ లేదు .జనం నాలుక పై వేమన నిత్యం నర్తిస్తూనే ఉన్నాడు .అందుకే కట్టమంచి రామ చంద్రా రెడ్డి గారు ”తారకలలో ధ్రువ తార -వేమన ”అనటం సముచితం గా ఉంది .’శతక కవి రాజు ”అన్నారు రాజా ఏం .భుజంగ రావు .ఆంగ్లం లో పోపు రాసిన ”హీరియిక్ కప్లేట్ ” లకు ఎంత ప్రచారం ఉందొ వేమన ”ఆటవెలది ”అంత సర్వాంగ సుందరం గా ఉంది ”అన్నారు నార్ల వారు .
ఆంగ్లం లో ”రాబర్ట్ బర్న్స్ ”కవిలా వేమన గ్రామీణ కవి .స్వయం సమృద్ధ మైన ఉదాత్త సంప్రదాయాన్ని సృష్టించాడు .భావోద్వేగం పొంగి పొరలిన గడియల లో ఆవిర్భా వించిన కవిత ఆయనది .ఉపమానాలు వేమన కవిత లో సూక్తులు గా ఉండి ,నవ్యతా ,నాణ్యత పొందాయి .ఆట వెలది లోని మోడో పాదాలు తెలుగు సామెతలుగా చేలా మణి అయాయి .వ్యాజ స్తుతి ,వ్యంగ్య పరిహాసం వేమన సహజ ప్రకృతి .చురుక్కు మనే వాడి దనం నుండి ,మృదు వైన పరిహాసం గా సరళ మైన వ్యంగ్యం గా దశల వారీగా వేమన శైలి మారుతుంది ”అని కట్టమంచి ,కొట్టొచ్చి నట్లు గ మెచ్చి ,ఇచ్చిన కితాబుమతాబే. మంచి వెలుగులను కుమ్మరించింది .జర్మన్ కవి ”గోథే ”ను గురించి మాధ్యూ ఆర్నోల్డ్ ”బాధిత ప్రజానీకానికి పాటు పడ్డాడు .వారి ప్రతి గాయాన్ని ,ప్రతి బలహీనత ను పరిశీలించాడు ”అన్న మాటలు మన జన వేమన కూ వర్తిస్తాయి .”సహజ హాస్య చతురుడైన గ్రామీనుడు ,ప్రకృతి దార్శనికుల లో ఒకడు ”అన్న హూరెన్ అన్న మాటలు వేమనకూ చెందుతాయి .విశ్రుం ఖల మైన    ఆయన మేధస్సు ,ఆవేశ పూరిత స్వభావం ,స్వవచో ఘాతం చూస్తె అమెరికా జాతీయ కవి ”వాల్ట్ విట్మన్ ”తనను తాను చెప్పుకొన్న మాటలు ”నా వచనాలకే నేను వ్యాఘాతం కల్గిస్తున్నానా /అలా అయితే ,మంచిదే .నన్ను నేను వ్యతి రేకిస్తున్నాను .నేను విస్తార మైన వాడిని .నాలో సమస్తమూ నిండి ఉన్నాయి .”అనే మాటలు జ్ఞాపకం వచ్చి సాల్యూట్ చేయాలని పిస్తుంది .బెర్నార్డ్ షా కు ఉన్న చమత్కారం ,చాపల్యం ,స్పష్టతా ,టాల్ స్టాయ్ కున్న సార్వ కాలిక నైతిక అభినివేశం వేమన లో ఉన్నాయని పిస్తుంది .వేమన అసలైన చిత్రం వేయా లి అంటే ”ఆ కళ్ళ లోని కాంతిని ,పెదవుల పై వక్ర దరహాసాన్ని ,నడక లో చురుకు దనాన్ని ప్రతిబింబింప జేయ గలిగిన ”రఫెల్ రేమ్బ్రాన్దేంట్ ”వంటి చిత్ర కారునికే సాధ్యం ”అని నార్ల వెంకటేశ్వర రావు నానా విధ వేమన స్తుతి చేసి వేమన సాక్షాత్కారం కలిగిం చారు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –6-9-12-కాంప్–అమెరికా .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.