ఎమిలి బ్రాంట్
1847లో ఇంగ్లాండు దేశం లో వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల సంప్రాదాయ జీవన విధానం దెబ్బతిన్న తీరును ,సాంఘిక వర్గ భేదాలను ,భూమి పై యాజ మాన్యం పోవటాన్ని దానివల్ల అప్పటి దాకా వచ్చిన సాంఘిక హోదా మారి పోయి ధనిక సంపన్న వర్గాలకే హోదా రావటాన్ని వారే” జెంటిల్ మెన్ ” గా చేలా మణీ అవటాన్ని ఎమిలీ బ్రాంట్ అనేఇంగ్లాండ్ రచయిత్రి ”wuthering heights ”అనే తన నవల లో అద్భుతం గా ఆవిష్కరించింది .
ఆమె జీవిత విశేషాలను తెలుసు కొందాం .
1818 లో ఎమిలి బ్రాంట్ట్ జూలై 30న లండన్ దగ్గర thornton -yarkshire లో జన్మించింది .తండ్రి పాట్రిక్ బ్రాంట్ ,తల్లి మెరియా .ఆరుగురు సంతానం లో అయిదవ పిల్ల ఎమిలి .మూడేళ్లకే తల్లిని కోల్పోయిన అభాగిని .ఆతల్లి సోదరి ఎలిజ బెత్ వీరందర్నీ సాకి ,పెద్ద వాళ్ళను చేసింది .ఏడేళ్ళ తర్వాతా స్కూల్ లో చదువుతున్న అక్కలు మెరియా ఎలిజే బెత్ లు అంట వ్యాధి తో మరణించారు .ఎమిలీ ని వేరు గాహావర్త్ లో ఉంచారు .ఇక్కడ ఆమె పదేళ్లు ఉంది .తండ్రి పిల్లల కోసం కొయ్య సైనికుల బొమ్మలు కొని ఇచ్చాడు .వీటితో ఈమె ఆడుకొంటూ వాటి గురించి ఊహ తో కధలు రాసింది .అవే ”గొందాల్ ”కధలు గా ప్రసిద్ధి చెందాయి అవి ఆమె భావోద్వేగాలే అంటారు విశ్లేషకులు . చార్లెట్అనే సోదరి టీచర్ గా చేరి ఏమిలిని తన శిష్యురాలిగా చేసుకోంది.తర్వాతా ఎమిలీ కూడా అసిస్టంట్ టీచేర్ అయింది .ఆమెకున్న సిగ్గు ,బిడియం కలిసి పోనీ తనం, ఆమె ను టీచేర్ గా రాణించ టానికి ఉపయోగ పడ లేదు .
ఇరవై ఏళ్ళ వయసు లో ఎమిలి ”హావర్త్ ”కు తిరిగి వెళ్ళింది .సోదరి లంతా కలిసి ఒక స్కూల్ పెడదామని అనుకొన్నారు కాని .డబ్బు లేక ఆగి పోయారు .తండ్రి పైన్టింగ్ చేస్తూ కొంత సంపాదిస్తున్నాడు .ఇతర భాషలు నేరిస్తే కాని బడి పెట్టటం కుదరదని తెలిసి ఎమిలి ,చార్లేట్లు బ్రసేల్సు కు వెళ్లారు .అక్కడ ఫ్రెంచ్ ,జర్మన్ భాషలు నేర్చారు .వీరిని పెంచిన పేద తల్లి చని పోయింది .ఆమె వీరికి కొంత ధనం ఇచ్చి చని పోయింది .దాన్ని ఎలా బాగా ఉపయోగించాలా అని ఆలోచిస్తూ తండ్రి దగ్గరే ఉంది ఎమిలి .తాను ఇది వరకు రాసిన కవితలన్నీ కాపీ చేసి ”గోదాన్ పోయెమ్స్ ”గా పేరు పెట్టింది .వీళ్ళ సోదరుడు బ్రాన్వేల్ సరిగ్గా పని చేయక పోవటం ఉద్యోగం పోగొట్టుకొని నెత్తిన కుంపటి లాగా ఉన్నాడు .
చార్లేట్ బ్రాంట్ రాసిన” jane eyre ;”నవలా ఎమిలీ రాసిన” wuthering heights ”నవల ఒకే సారి ప్రచురితం అయాయి .చార్లేట్ నవల బాగా ఆకట్టు కొంది కాని ఎమిలి నవల ఆశ్చర్యాన్ని కల్గించింది .ఈమె రాసిందా అనుకొన్నారు అందరు .సోదరుడు బ్రాన్వేల్ చని పోయాడు .మిగిలిన ముగ్గురు సోదరిలు చాలా ఆందోళన కు గురై నారు .తండ్రి కూడా అంతకు ముందే పోయాడు .చివరికి ఎమిలీ కూడా క్షయ వ్యాధి తో1948 december 19 న మరణించింది .ఆమెను హోవార్త్ స్మశాన వాటిక లో సమాధి చేశారు .32ఏళ్ళ కే ఆమె తనువు చాలించింది .సోదరి చార్లేట్ shirley అనే పుస్తకాన్ని ఎమిలీ అన్నే లకు అన్కితమిచ్చింది .1850లో ఎమిలీ రాసిన wuthering heights ;;నవలను పునర్ముద్రణ చేస్తూఎడిట్ చేసి ఉపోద్ఘాతం రాసింది చార్లేట్ . .ఈ నవలను సినీమా గా కూడా అదే పేరుతో తీశారు .చార్లేట్ ,ఎమిలీ లు ఇద్దరు అక్కచెల్లెళ్ళు నవలా సాహిత్య రచన లో నవలా మణులని పించుకొన్నారు .
ఈ నవలలో ఎమిలీ తాను చూసిన పల్లె ప్రాంతాలను ,జనుల్ని కధలో చేర్చింది .తన ఊహా శక్తిని జోడించింది .ఆమె లోని బిడియాన్ని పాత్రలలో ప్రవేశ పెట్టింది .అందులోని eath cliff పాత్రకు ఆమె ప్రేరణ .సోదరుడు బ్రాన్వేల్ పాత్రను అందులో చొప్పించి చెడుకు సమాజం లో స్తానం లేదని తేల్చింది .ఈ నవలలో వర్గ పోరాటం ఉంది .దాని ప్రతిభా వంతం గా చిత్రించింది .ఇంగ్లాండు లోని పారిశ్రామీకరణ విప్లవం వల్ల సమాజం లో వచ్చిన కొత్త సామాజిక అధికారాలను,హోదా లను .పారిశ్రామీ కరణ తో మధ్య తరగతి కుటుంబాలు పొందిన ఆటు పోట్లను తెలియ జెప్పింది . వర్గ శత్రుత్వాలను వివరించింది .సమాజం పై దీని ప్రభావం ఎలా ఉందొ ,దాని వల్ల వచ్చిన కొత్త విదానాలేమితో తెలుస్తాయి.సహజ విలువలకు సామాజిక విలువలకు మధ్య ఉన్న విభేదాలు తెలుసుకొనే లా చేసింది .ఒక రకం గా సమాజ ఐక్యతను బో ధించిందని చెప్ప వచ్చు .
కాపిటలిజం పెరుగుతున్న తీరును చూపించింది .వర్గ పోరాటం తప్పదన్న మార్కిస్టు భావనా కనిపిస్తుంది .మనుష్యులు అప్పటి దాకా అనుభ వీస్తున్న స్వాతంత్రం పోతోంది అనే భావన కల్పించింది నవలలో .కొందరు విశ్లేషకుల భావన లో డార్విన్ సిద్ధాంతానికి ఈ నవల ఒక వ్యాఖ్యానం .వారసత్వ అధికార కేంద్రీకరణ ను నిరసించింది .బీద వారు బ్రతకటానికి సమర్ధ వంతులు అని చాటి చెప్పిన్దిఎమిలీ అన్నారు .మనషి ఈ విశ్వానికి కేంద్రం కాదని చెప్పింది అన్నారు ఒకరు .సంపద ను కేంద్రీక రించే వారిని ఎదిరించి నిలవాలనేది సిద్ధాంతం గా కనిపిస్తుంది .అనేక సాంఘిక సమస్యలను ఈ నవలలో చర్చించి తన భావనా బలాన్నిరచనా శక్తిని అధ్యన స్వభావాన్ని జోడించి ఎమిలీ బ్రాంట్ట్ రాసిన ఈ నవల ఇప్పటికీ అందర్నీ చదివిన్చేట్లు చేస్తూనే ఉంది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —6-8-12- కాంప్–అమెరికా