తాత్విక రచయిత జె.డి.శాలింజేర్

    తాత్విక రచయిత జె.డి.శాలింజేర్  

”the catcher in the rye ” నవల తో ప్రఖ్యాతి చెందిన రచయిత శాలింజేర్  .అసలు పేరు” జేరోం డేవిడ్ శాలింజేర్  ”(j.d.salinger ).పేరు ,ప్రఖ్యాతులకు దూరం గా జీవించాడు .న్యూ ఆంప్ షైర్ లోఏకాంత జీవనం సాగిస్తున్నాడు అదే ఆయన కోరుకొనేది .వ్యక్తిత్వానికి ,శక్తి వంత మైన అభి భాషణకు ఆయన ప్రసిద్ధి .అమెరికా లోని మాన్ హట్టన్ లో 1-1-1919 న జన్మించాడు .తండ్రి సోల్ .తల్లి మేరీ జిల్లీచ్ .మాన్హట్టన్ లో రెండేళ్లు చదివాడు .1936లో valley forge military academy -నుంచి గ్రాడ్యుయేట్ అయాడు .ఇది పెన్సిల్వేనియా లోని వెన్ లో ఉంది .అక్కడే crossed sabers పత్రిక కు సంపాదకుడి గా చేశాడు .ఆయన చదివిన అకాడెమి జీవితం లో నుంచే ఆయన రాసిన నవల కధ కు విషయం గా ఎంచుకొన్నాడు .
1937 లో ఆస్ట్రియా లోని వియన్నా వెళ్లాడు .ఆ తర్వాత,పోలాండ్ కూడా చూశాడు .అక్కడే దిగుమతి వ్యాపార రహస్యాలను తండ్రితో పాటు తెలుసుకొన్నాడు .తిరిగి వచ్చి పెన్సిల్వేనియా లోని ”అర్సినాస్ ”కాలేజి లో చేరాడు .అప్పుడే ”skipped diploma ”ను కాలేజి మేగజైన్ కు రాసి  మంచి పేరు తెచ్చుకొన్నాడు .కొలంబియా వర్సిటి లో చిన్న కధలు రాసే కోర్సు చేశాడు .క్లాసులకు వెళ్ళ కుండా ,వెళ్ళినా చివరి బెంచీల్లో చేరి కాలక్షేపం చేసే వాడు .ఆయన మొదట ప్రచురిత మైన  కధ ”దియంగ్ ఫోక్స్”.ఇది ”స్టోరి ”అనే పత్రికలో 1940 లో వచ్చింది .దానికి పాతిక డాలర్ల పారితోషికం అందుకొన్నాడు .ఆ తర్వాత”the hang of it ”,the heart of a broken story ”  మొదలైన కధలు ప్రముఖ పత్రికల లో వచ్చాయి .రెండో ప్రపంచ యుద్ధం లో ఆయనకు  సైన్యం నుంచి పిలుపు వచ్చింది .సెలెక్టివ్ సర్విస్ లో చేరి M.S.kung sholm లో వినోద నిర్వహణ డైరెక్టర్ గా పని చేశాడు .
1942లో అమెరికా ఆర్మీ లో కి ఆయన్ను తీసుకొన్నారు .ఆయన ఆఫీసర్ల మొదటి సార్జేంట్లు మరియు ఇంస్త్రక్తర్ల స్కూల్ లో చేరాడు .తర్వాత army counter intelligence corps కు బదిలీ అయాడు .అప్పుడే ”స్టోరి ”అనే పత్రిక లో ఆయన రచన” the long debut of lois taggett ”అచ్చయింది .అలాగే ”colliers”పత్రిక లో”personal notes of an infantryman ”వచ్చింది .ఈ కాలం లోనే చార్లీ చాప్లిన్ భార్య ,ప్రఖ్యాత నాటక రచయిత యూజీన్  వో.నీల్ కుమార్తె ఊనా తో పరిచయమయింది .తర్వాతా టేన్నీసీలోని నాష్ విల్ లో ఉన్నప్పుడు” the varioni brothers ”ను సాటర్డే ఈవెనింగ్ పోస్ట్ పత్రికలో రాశాడు .తర్వాతా ఆర్మీ కొంటర్ ఇంటలిజెన్స్ కార్పస్ కు బదిలీ అయి ఇంగ్లాండ్ లో tiveton in Devonshire లో శిక్షణ పొందాడు .6-6-1944 న నార్మండీ మీద యుద్ధానికి వెళ్లాడు .ఈ రోజునే” D -Day ”అని చరిత్ర కారులు పిలిచారు .ఆ తర్వాతా utah beach లో నాల్గవ డివిజన్ కు పని చేశాడు .యుద్ధ కాలం లో అంతా ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాడు .యూరప్ లో సెక్యురిటి ఏ జేంట్ గా పన్నెండవ ఇన్ ఫాన్ట్రీడివిజేన్  కు పని చేశాడు .దీని లో వసతులు లేని ,నడకకు అసాధ్యం గా ఉన్న రోడ్ల మీద నడవాల్సి వచ్చేది .అలాగే పారిస్ చేరాడు .అక్కడే ఉన్న అమెరికా ప్రఖ్యాత రచయిత ఎర్నెస్ట్ హెమింగ్ వే ను కలుసుకొన్నాడు .ఆయనా యుద్ధ వార్తలను రాయటానికి అక్కడికి వచ్చాడు .హెమింగ్వే సాలింజేర్ రాసిన the last day of the last furlough ”కధనుహృదయ పూర్వకం గా  మెచ్చుకొన్నాడు .
పారిస్ లో కొంత కాలం ఉండి బెర్లిన్ చేరాడు  .ఆయన రాసిన” a boy in france ”  సైనికుడి జీవాలను పోగొట్టే సుదీర్ఘ ప్రయాణం ను వివరిస్తుంది .మళ్ళీ జెర్మని చేరి ,గడ్డ కట్టే చలిలో ,ఎందరో మృత్యు వాత పడుతుండగా” ట్రెంచులలో ” నక్క బొక్కల్లో , గడపాల్సి వచ్చింది అతని భార్య అల్లిన సాక్సు వల్లనే అతను ఆ చలిని తట్టుకో గలిగా డట .1945 may 5న నూహాస్ లోని హీర్మాన్ గోరింగ్స్ సౌధం ను స్వాధీనం చేసుకొనే కార్యక్రమం లో పని చేశాడు .అక్కడ సెక్యురిటీ ని పర్య వేక్షించాడు .ఎందరో ఉద్యోగం లోంచి తొలగించ బడ్డ వారి మధ్య పని చేయాల్సి వచ్చింది .జూలై లో యుద్ధ అలసట వల్ల ఆస్పత్రి పాలైనాడు .తన పరిస్తితిని హెమింగ్వే కు ఉత్తరం ద్వారా తెలియ జేశాడు .ఆయన యుద్ధ అనుభూతులనన్నిటిని ”the catcher in the rye ”నవల లో అద్భుతం గా ఆవిష్కరించాడు .ఇదే సమయం లో ”elaine ”అనే కదా సంపుటిని ప్రచురించాడు .తర్వాతా  ”i am crazy ”,”no mayonnaise ”పుస్తకాలు వెలువరించాడు .
1945 సంవత్స రాం తానికి ఆర్మీ నుండి విముక్తి లభించింది .న్యూయార్క్ చేరాడు .”గ్రీన్ విచ్” విలేజి యొక్క రాత్రి సౌందర్యాన్ని చాలా కాలం అనుభవించాడు .తర్వాతా ఆసక్తి అంతా ”జెన్  బౌద్ధం ”మీదకు మళ్ళింది .తరచుగా the newyorker ”పత్రికకు రాస్తూనే ఉన్నాడు .1949లో” మై ఫూల్ హార్ట్ ”రాశాడు .1950లో ”for esme with love and squalor ”న్యూయార్కర్ కు రాశాడు .ఆయన రాసిన ”కాచేర్ ఇన్ రై” నవల న్యూయార్కర్ బెస్ట్ సెల్లర్ గా పేర్కొన్నది .పబ్లిసిటీ అంటే ఇష్టపడని సాలింజేర్ న్యు హంప్  షైర్ లోని కోర్నిష్ కు లో  ప్రశాంతం గా గడిపటానికి వెళ్లాడు . .కాని అ క్కడ నీటి వసతి, సౌకర్యాలు లేవు .కూతుళ్ళు బాధ పడ్డారు .తనకు హాయిగా అడవిలో ప్రశాంతం గా జీవించటానికి చిన్న షెడ్డు చాలు అని వారికి చెప్పాడు .ఇక్కడే ఆయన రోజుకు పద హారు గంటలు పని చేస్తూ ,రాసుకొంటూగడుపుతున్నాడు ..శాకా  హార భోజనం, ఎరువులు వెయ్య కుండా పండించిన కూరలు తింటాడు . ఆయన విధించుకొన్న ఏకాంత జీవితం ఇది హెన్రీ డేవిడ్ థోరో లాగా . ఆ తర్వాత అందులో అనేక రచనలు చేశాడు .ఆయన కధలన్నీ సంపుటాలుగా వచ్చాయి .1987 లో సాలింజేర్ జీవిత చరిత్ర ప్రచురిత మైంది .చివరి జీవితం అంతా తాత్విక భావనలతో గడుపుతున్నాడు .
సృజన ఉన్న రచయిత గా ,సాధించాలన్న తపన ఉన్న వాడిగా సాలింజేర్ కనిపిస్తాడు .ఆయన భావాలను rouseaustic అని ఈసడించిన వారూ ఉన్నారు .ఆయన న్యూ యార్క్ నగరాన్ని ”spiritual waste land of isaiah ”అని తీసి పారేశాడు .దాన్ని the city of wealth and dissipation ,the city of anti christ అంటాడు .సెక్స్ లో   ఎక్స్పెర్ట్ ను ”sexpert”అని అర్ధవంతం గా అంటాడు .తను పని చేసిన సైన్యాన్ని గురించి” the army was as practically as full of bastards as the nazis were ” అన్నాడు .యుద్ధానంతర కాలమంతా ఆయనకు నిరాశా జనకం గా కనిపించింది .అందుకే ఆయనకు ప్రాచ్య దేశాల భావన మీద గురి ఏర్పడింది .ముఖ్యం గా బౌద్ధం మీద మోజు కలిగింది .అందులోను అమెరికా లాంటి దేశాల లో పిలువ బడే ”జెన్ బుద్ధిజం ”మీద వ్యామోహం కలిగింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged , , . Bookmark the permalink.

1 Response to తాత్విక రచయిత జె.డి.శాలింజేర్

  1. Kumar N says:

    “న్యూ ఆంప్ షైర్ లోఏకాంత జీవనం సాగిస్తున్నాడు ”
    “ఇక్కడే ఆయన రోజుకు పద హారు గంటలు పని చేస్తూ ,రాసుకొంటూగడుపుతున్నాడు ”
    ??
    Salinger 2010 లోనే చనిపోయాడండీ. మీరు వికీలోంచి రాసినట్లున్నారు J D Salinger గురించి. అక్కడ కూడా ఉంటుంది కదా ఆయన జీవించిన కాలం!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.