చారిత్రిక నవలా రచయిత్రి- ఈస్తర్ ఫోర్బ్స్

చారిత్రిక నవలా రచయిత్రి- ఈస్తర్ ఫోర్బ్స్ 

అమెరికా కాలనీ వాసుల కాలం లో జరిగిన అనేక సంఘటన ల పై స్పందించి ,ఆ చరిత్రను నేపధ్యం గా తీసుకొని గొప్ప నవలలు రాసిన రచయిత్రి ఈస్తర్ ఫోర్బ్స్ .ఆ నవలల్లో గొప్ప ఖ్యాతి పొందిన నవల ”జాని ట్రేమేన్ ”.ఆమె మాసా చూసేట్స్ రాష్ట్రం లో బోస్టన్ నగరానికి దగ్గర లో ఉన్న వెస్ట్ బోరో లో28-6-1891లో జన్మించింది .మాసా చూసేట్స్ ను ”న్యూ ఇంగ్లాండ్ ”అంటారు .చిన్నప్పటి నుండి అక్కడ యుద్ధ వాతా వరణమే .తలి దండ్రులు బాగానే విద్యా వంతులు .తండ్రి ఆమ్హేస్ట్ కాలేజి గ్రాడ్యుయేట్ .ఆయన కాన్ స్టాంటి నోపుల్ ,టర్కీ లకు వెళ్లి గణితం బోధించే వాడు ఆయన గ్రీకు నగరం ”ట్రాయ్ ”వెళ్లి అక్కడి త్రవ్వ కాలు చూసి ఆ విషయాలన్నీ వచ్చిన తర్వాత ఇంట్లో పిల్లలకు చెప్పాడు .ఆది వారి మీద పెద్ద ప్రభావమే కల్గిచింది .ఆయన ప్రోబేట్ కోర్టు లో జడ్జి అయాడు .తల్లి హారిఎట్ మెర్రి ఫీల్డ్ ఆనాటి మొదటి విద్యా సంస్థ అయిన” oread academy in worsester ”చదువు కొంది మంచి చరిత్ర కారిణి .రెండు మూడు పుస్తకాలు రాసి ప్రచురించి ,కూతురికి ప్రేరణ కల్గించింది .కాలనీ ల చరిత్ర రాయటం లో తల్లి కూతుళ్ళు కలిసి పని చేశారు .
తలిదండ్రులకు ఉన్న సంతానం లో అయిదవ అమ్మాయి ఈస్తర్ .పై వాళ్ళంతా బాగా చదువుకొన్నారు .చిన్నప్పటి నుండి ఈమెకు కధలు చెప్పి చెల్లెలు కతేరిన్ తో కాలక్షేపం చేసేది .ఎనిమిదేల్ల కే  పక్క పిల్లల తో కలిసి ఒక సామాజిక మేగజైన్ తయారు చేసింది .ఆమె రాసింది రెండవ సంచికలో వచ్చింది .తోమ్మిదేల్లప్పుడు డు కీళ్ళ జబ్బు తో బాధ పడింది .తల్లి ఈమెను చదవమని ,రాయమని, బొమ్మలు వేయ మని ప్రోత్స హించేది .,హై స్కూల్ చదువు అయినతర్వాత బోస్టన్ లోని worester art museum లోను బ్రాడ్ ఫోర్డ్ లోని జూనియర్ కాలేజి లోను చది వింది .తన రచన కోన సాగిస్తూనే ఉంది .1912లో బ్రాడ్ ఫర్డ్ నుండి గ్రాడ్యుయేట్ అయింది .మళ్ళీ బోస్టన్ లో రచయిత ల ట్రెయినింగ్ లో చేరింది .చెల్లెలు కేథరిన్ విస్కాన్సిస్ వర్సిటి లో టీచింగ్ లో చేరితే ఈమె  కూడా వెళ్ళింది .గుర్రపుస్వారీ చేసేది .ఆమె కధకు బహుమతి వచ్చింది .విస్కాన్సిన్ లిటరరీ మేగజైన్ లో ఆమె కధ పడింది .దాన్ని వో.హెన్రీ అవార్డు కు పంపారు .
1917 లో మొదటి ప్రపంచ యుద్ధం లో వాలంటీర్ గా పని చేసింది .వెస్ట్ వర్జీనియా లోని ఒక వ్యవ సాయ క్షేత్రానికి ఈస్తర్ ను పంపారు .అక్కడి రైతు ఈమె కున్న ఉత్సాహాన్ని గమనించి గుర్రాలను ఆమెకు అప్పగించాడు .వాటితో బాగా గడిపింది .విస్కాన్సిన్ లో చదువుతూ రచనకు మెరుగులు దిద్దు కొంది .విస్కాన్సిన్ లిటరరీ మెగ జైన ఎడిటోరియల్ బోర్డు లో పని చేసింది .అక్కడే రౌలింగ్ అనే మహా రచయిత తో పరిచయం ఏర్పడింది .ఆయన రాసిన” yearling ”పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది .తను విస్కాన్సిన్ రావటానికి కారణం గొప్ప నవల రాయటానికే అని చెప్పేది ఫోర్బ్స్ .1919లో ఇంటికి తిరిగి వెళ్ళింది .అక్కడ ఒక పబ్లిషింగ్ కంపెని లో అసిస్టెంట్ ఎడిటర్ అయింది .ఆమె స్పెల్లింగ్ మిస్టేకులు ఎక్కువ గా చేసేది .అందుకనే హోదా తగ్గింది .లేక పోతే చీఫ్ ఎడిటర్ అయి ఉండేది .అక్కడ ఆమె ఎంతో మంది రచయితలు పంపే రాత ప్రతుల్ని శ్రద్ధ గా చదివేది .అందులో పదార్ధం ఉంటె తప్పక ప్రచురించేది .ఫ్రెంచి విప్లవ నేపధ్యం లో వచ్చిన ఒక నవల ను అవసరం మేరకు తగ్గించి ఎడిట్ చేసి పత్రిక లో ప్రచురితం అఎట్లు చేసింది .ఆది ”rafael sebatini ”రాసిన” scaramouche ”.ఆ నవల చారిత్రిక నేపధ్యం తో రాయబడి ఉండటం తో బాగా పాప్యులర్ అయింది సినిమా గా కూడా తీశారు .ఇది ఈస్తర్ పుణ్యమే .
తాను పని చేస్తున్నా, నిరంతరం రాస్తూనే ఉంది .బోస్టన్ ఈవెనింగ్ ట్రాన్స్క్రిప్ట్ కు తరచురాసేది . అందులో మెసా చూ సెట్స్  లోని రచయితల జీవిత చరిత్ర ఆ రాష్ట్ర చరిత్ర రాసేది .అవి బాగా పేరు పొందాయి .కేంబ్రిడ్జి అపార్ట్మెంట్ లో మిగిలిన యువ స్నేహితులతో కలిసి ప్రతి వారం డిన్నర్ పార్టి ని చేసుకొంటూ కొత్త అతిధిని ఆహ్వానిస్తూ ఆయన చెప్పింది తెలుసుకొంటూ ఉండేది .అప్పుడే హార్వర్డ్ లా కాలేజి విద్యార్ధి ఆల్బర్ట్ హాస్కిన్స్ తో పరిచయమైంది అయితే అదేమీ ప్రేమ గా చిగురించి పూలు పూయలేక పోయింది కారణం ఆమె కు దీని గురించి ఆలో చించే సమయం తీరికా లేక పోవటమే .కాని 1926లో అతన్నే పెళ్లి చేసుకోంది.
పెళ్లి అయిన తర్వాతా కొన్ని నెలలకు ”o genteel lady ”అనే విక్టోరియా పాలన లోని ఒక స్త్రీ గురించి నవల రాసింది .దీనికి తనకు ప్రేరణ ”goodies lady’s books ”అని తెలియ జేసింది .ఎప్పుడో ఇంగ్లాండ్ లో జరిగిన చారిత్రిక విషయాల నేపధ్యం లో ఆమె అంత విషయ సేకరణ చేసి అద్భుతం గా రాసిందని మెచ్చారు .newyork time book review  ”miss forbes has caught and kept through out the charm of the by gone days she describes .she has captured the elusive lace and lavender element without its mustiness ”అని పొగిడింది .ఒక్క నెలలో ఈ పుస్తకం అమ్మకాలు విపరీతం గా పెరిగాయి .హనీ మూన్ కు దంపతులు యూరప్ వెళ్లి వచ్చారు .న్యూయార్క్ లో నివాసం .భర్త లా ఫారం లో పని చేస్తున్నాడు .ఈమె కొత్త నవల ”a mirror for witches ”పై ద్రుష్టి పెట్టింది .తన తల్లి కుటుంబం సేకరించిన ఎన్నో విషయాలను అధ్యయనం చేసింది .అందులో తల్లి చెప్పిన ఒక యదార్ధ గాధ ఆమెను బాగా కదిలించింది .rebeca chamberlain అనే ఆమెఒక దెయ్యం అని  జైల్లో విచారణ ఎదుర్కొంటుండ గానే  చని పోయిన కధ ఆది .దీని ప్రభావం ఈమె మీద బాగా ఉంది .కేంబ్రిడ్జి లో ఉండగా కూడా దేయ్యపు కధలు చాలా విన్నది .
ఒక అభాగ్యురాలిన యువతీ మాంత్రికు రాలు అని నింద మోసిన  ఏడవ శతాబ్ది లో ”సేలం ”లో జరిగిన కధ ఆధారం గా1928 లో ”a mirror of witch craft ”నవల రాసి ప్రచురిస్తే అద్భుత మైన అప్ప్లాస్ వచ్చింది .విమర్శకులూ మెచ్చారు అందులో డాల్ బిల్లీ అనే ఇంగ్లీష్ అమ్మాయి ని హీరోయిన్ ను చేసింది .ఇది గొప్ప సృజనాత్మక నవల అన్నారు .ఇలా మంత్ర గత్తే లు ,దేయ్యాల  కధలు చివరిదాకా రాస్తూనే ఉంది .ఫోర్బ్స్ భర్తకు తన కంటే భార్యకు పేరు ఎక్కువగా రావటం అసూయ కలిగించింది .ఆమె ను రాయ వద్దు అని ఆంక్ష పెట్టాడు .అతను ఇంట్లో ఉన్నంత సేపు రాసేది కాదు .ఆ తర్వాతా రాసేది .చివరికి ఇద్దరు విడాకులు తీసుకొన్నారు .ఈమె మళ్ళీ స్వంత ఊరు వోర్సెస్టర్ చేరింది .తన ఇంటికి కొద్ది దూరం లోనే సోదరి కేథరిన్ ఉండేది .ఆమెకు అప్పుడు అర్ధమైంది రచయిత రాసుకోవటానికి ఏకాంతం అవసరం అని .అమ్మా చెల్లెలు సోదరి కర్నిల్లా ఉన్న ఇంట్లో మూడో ఫ్లోర్ లో ఏకాంతం గా రాసుకొనే ఏర్పాటు చేసుకోంది.
షార్ట్ హాండ్ రాసి నంత వేగం గా రాసేది ;మళ్ళీ తిరిగి చదువుకొని సాఫు చేయటం అలవాటు .మెసా చూసెట్స్ లోని కాలనీలజనాన్ని గురించి నవల రాయాలని సంకల్పించింది .ఈ లోపునే ”మిస్ మర్వేల్ ”అనే నవలను కేవలం పది రోజుల్లో రాసేసింది .ఇది వరకు అనుకొన్న ప్లాట్ ఆధారం గా ”paradise”పై ఆలోచన పెట్టి ఆరునెలల్లో పూర్తీ చేసి 1937లో పబ్లిష్ చేసింది .ఇదీ విపరీతం గా అభిమా నం సంపాదించింది .తర్వాతఏడాది    ”the genteel lady  ”విడుదలై విజం సాధించింది .ఇది ”బాత్ శీబా స్పూనేర్ ”అనేఆమె  తన భర్తను మరో ముగ్గురిని చంపిన నేరం కింద ఉరితీయబడిందిఅనే కధ .మంచి పాత్రలు ,నిర్వహణ ఆమె కు పేరు తెచ్చాయి . .ఉరితీయ బడ్డ ఆవిడకు బ్రిటీష ఆఫీసర్ తో అనైతిక సంబంధం ఉందనేది తరువాత తెలుస్తుంది .ఇందులోని చారిత్రకయదార్ధం అందర్ని ఆశ్చర్య పరచింది .ఆమె పరిశీలనా దృష్టికి జేజేలు పలికారు .పులిత్జేర్ బహుమతి పొందిన స్టీఫెన్ విన్సెంట్ బెనేట్ అనే ఆమె గొప్ప రివ్యు రాసింది .ఈ నవల విడుదల అయిన తర్వాత గొప్ప పార్టీ కూడా ఇచ్చింది ఫోర్బ్స్ .
” paul revere and the world he lived in  ” అనేది1943పులిద్జేర్ బహుమతి పొందింది .న్యాయం గా ఆ బహుమతి తన తల్లికి చెందాలని అంటుంది ఈస్తేర్ .మంచి విమర్శలతో ఈ పుస్తకం దూసుకు పోయింది .పులిద్జేర్ సాధించిన తర్వాతా మరో విజయ వంత మైన నవల రాసి చరిత్ర లో స్తిర స్తానం సంపాదించాలని మనస్పూర్తిగా కోరుకొన్నది .అప్పుడే అమెరికన్ రివల్యూషన్ నాటి యదార్ధ గాధ ”johney tremain ” జీవితాన్ని నవల గా రాయాలని పించింది .అంతే దీక్ష గా దానిపై పరిశోధన చేసి నవలను సర్వాంగ సుందరం గా తీర్చి దిద్దింది .1943 లో ప్రచురితమై గొప్ప విజయం సాధించింది దీనికి న్యు బేరి అవార్డు పొందింది .ఆ తర్వాతా నాలుగేళ్ళు నాన్ ఫిక్షన్ రాసింది .1948లో ”the running of the tide ”రాసింది దీనికి m.g.m.ప్రిఅజ్ వచ్చింది సినిమా గా తీశారు .దీనికి ఆమెకు ఒక లక్షా యాభై వేల డాలర్ల పారితోషికం లభించింది .వాల్ట్ డిస్నీ జానీ ట్రేమన్ ను సినిమా గా తీశాడు .దీని మూవీ హక్కుల కింద ఆమె కు దక్కింది కేవలం అయిదు వేల డాలర్లే .
1954 లో చివరి నవల”rain bow on the road ” రాసి విడుదల చేసింది .ఇది 1830కాలం నాటి జాన పద కళా కారుని యదార్ధ కధ .పడి హేడవ శతాబ్దం లోనిమాసా చూసేట్స్   ”విచ్ క్రాఫ్ట్ ”పై రాయాలని మొదలు పెట్టింది .కాని పూర్తీ చేయ లేక పోయింది . .”american Antiquarian Society in worester ”కు 1960లో ఎన్నిక అయిన మొదటి మహిళా రచయిత్రి ఫోర్బ్స్ .ఆ సంస్థ అరుదైన విషయాలను సేకరించి భద్ర పరచి ప్రజలకు అందు బాటు లోకి తెస్తుంది .డెబ్భై ఆరేళ్ళు జీవించి అమూల్య మైన చారిత్రాత్మక నవలలు రాసి న ఈస్తేర్ ఫోర్బ్స్ 12-8-1967లో మరణించింది .ఆమె నవల జానీ ట్రేమేన్ పదికి పైగా భాషల్లోకి అనువదించ బడింది .ఎన్నో సార్లు పునర్ముద్రణం పొంది లక్షలాది కాపీలు అమ్ముడు పోయాయి .ఆమెను గురించి new york time ”పత్రిక గొప్ప ప్రశంషను కురిపించింది ”Forbes is a novelist who wrote like a historian ,and a historian who wrote like a novelist ,achieved a reputation as one of the most exciting and knowledgeable authors on the revolutionary era ”.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-9-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.