జన వేమన–22
హథ(hatha) యోగం
ధ్యానం ,తపస్సు ,యోగం సాధన లో కైవల్యం సాధించాలి అంటే చాలా కాలం పడుతుంది ..వస్తుందో ,రాదో అని అనుమానం .తక్షణం ప్రయోజనం కలగాలని మనందరి భావం .దీనికోసం అవసర మైతే దేహాన్ని చాలా కష్ట పెట్టి .మనసు ను బాధించి లొంగ దీసుకొనే ప్రయత్నం చేస్తారు .”హ” అంటే పైకి నడిచే ప్రాణ వా యువు అని ,”థ”అంటే ,కిందికి దిగే లేక నడిచే అపాన వాయువు అని అర్ధం .ఈ రెండిటిని ఐక్యం చేసి సాధించేది ”హథ యోగం ”.కనుక వీళ్ళకు ఆసనం ,ప్రాణాయామం చాలా ముఖ్యం .శరీరం లో ఉన్న మలినాలను శుభ్రం చేసుకోవ టానికి అంటే శ్వాశ కోసం పొట్ట ,ముక్కు రంధ్రాలు మొద లైన వాటి లో ఉండే కఫం ,శ్లేష్మం వగైరాలను బయటకు తీసి శుభ్రం చేసుకోవ టానీకి ”ధౌలి ”,”,నౌలి ”అనే ప్రక్రియలు చేస్తారు బ్రహ్మ చర్యం నిలకడ గా,స్తిరంగా ఉండ టానికి ”వజ్రోలి ”యోగం చేస్తారు .మూలా దారం లో కుండలిని నిద్రించి ఉంటుంది .ఈ యోగ సాధన లో పైకి లేవటం ప్రారంభిస్తుంది .కుడి ,ఎడమ ల ముక్కుల్లోని ఇడా ,పింగళ నాడుల్లో సహజం గా సంచ రించే వాయువు .ఈ రెంటి మధ్య ఉన్న ”శుషుమ్న ”నాడి ద్వారా ప్రవహిస్తుంది .ఆరుచాక్రాలలో క్రమం గా ప్రయాణం చేసి ,సహస్రారం చేరి నప్పుడు అక్కడ బ్రహ్మ సాక్షాత్కారం పొందటం వల్ల ,”అసం ప్రజ్ఞాత సమాధి ”కలుగుతుంది .ఇదే జీవన్ముక్తి .కుండలిని కది లించక పోతే ,బ్రహ్మ స్థానం లభించదు .దీనికే ”రాజ యోగం ”అని కూడా పేరు ఉంది .
ప్రాణ వాయువు లోపల ఉంటె బ్రతుకు .బయటకు పోతే చావు .అందుకనే ”హథ యోగం ”.”యావద్బద్దో ,మరుద్దేహే ,యావచ్చిత్తం నిరాకులం -యావ ద్రుష్టిర్భువో ర్మధ్యే తావత్కల భయం కుతః ?అని శివ యోగా తత్త్వం చెబుతుంది .దీనిని ”కష్ట పడి యుండు నేన్దాక ,గాలి మేన -చిత్తమేన్దాక నెందును జెంద కుండు -కదల కందాక భ్రూమధ్య కలిత దృష్టి -యరయ నందాక ప్రాణ భయంబు లేదు ”అని తెలుగు అర్ధం .హత యోగానికి మంత్ర యోగం ,లయ యోగం అని రెండు ఉప యోగాలున్నాయి .మంత్రాలను జపిస్తూ ,తన్మయుడవటం మొదటిది .ప్రాణాయామ , ధ్యానాలతో దేహం పరి శుద్ధ మైనపుడు లోపల ”ఒక రక మైన నాదం ”అఖండం గా విన్పి స్తుందట .బయటి శబ్దం ”ఆహతం ”అంటే ,దెబ్బ కొడితే కలిగే శబ్దం .రెండోది ”అనాహతం ”అంటే యే పదార్ధాల స్పర్శ లేకుండా విన్పించేది .ఆ నాదాన్ని వింటూ ,మనసును ,ప్రాణాన్ని లయింప జేయటమే ”లయ యోగం .”చాలా లయలున్నాయి .కాని ”నాద లయ ”చాలా ముఖ్య మైనది అని హథయోగ ప్రవక్త ”శ్రీ ఆది నాధుడు ”చెప్పాడు .వేమన గురువు లంబికా శివ యోగి గొప్ప ”హథయోగి ”.
లంబికా యోగం
లంబిక అంటే దవడ .దాని పై శిరో రంధ్రం లో నాలుక ను ప్రవేశ పెట్టాలి .భ్రూ మధ్యమ ఎడమ వైపు దాన్ని ”చంద్ర స్తానం ”అంటారు .నాలుక చంద్ర స్తానాన్ని అందుకోవాలి .అప్పుడు అగ్ని పుడుతుంది .ఆ స్తితి లో చంద్ర స్తానం లో అమృతం కరిగి ప్రవహిస్తుంది .దాన్ని తాగితే యోగికి రోగం ,ఆకలిదప్పులు ఉండవు .చావు రాదు .దీన్ని సాధించాలి అంటే చాలా కష్ట ప డాలి .నాలుక అంత పొడవు సాగటం అసాధ్యం కాదు కాని అసాధారణమే .అందుకోసం నాలుక కింద ఉన్న నరాలను క్రమం గా కోసి ,వ్రేళ్ళతో నాలుకను ఇటు అటు తిరిగే ట్లు చేస్తారు .ఆ తర్వాత లంబికా రంధ్రం లోకి దూరెట్లు సాగ దీస్తారు .ఇదే లంబికా యోగంలేక ఖేచరి ముద్ర. .
కళ్ళు మూసుకొని ,దృష్టిని నాశికా గ్రంపై కేంద్రీక రిస్తే మండలాకారం గా జ్యోతి దర్శన మిస్తుంది .అందులో మనసు ,,ప్రాణం లీనం చేసి ,రెప్పలు కదల్చ కుండా ,చూసే వాడు ”జగద్గురువు ”.ఇదే నిజ మైన ఖేచరి విద్య అని శివ యోగ సారం చెబుతోంది .వేమన కు ఈ విద్య పై నమ్మకం బాగా ఉంది .తన గురువు లంబికా శివ యోగి దీన్ని సాధించాడు కదా .అందుకే ”ఖేచరీ లేరుంగ లేక లేక –వాదు లాడు నట్టి వారి నెల్ల -తొక్కి నాల్క బట్టి తుద గోయ వలయురా ”అని తన నమ్మకాన్ని చెబుతూ ,దీన్ని వ్యతిరేకించే వారికి మాటల వాతలు పెట్టాడు .తానూ సాధించి అనుభూతి చెందాడు .”నాద మలర జేసి ,నాదంబు జొన్గించి –ఖేద మింత లేక పెనిగి నపుడు –పారు కాల్వ వలెను పారురా ఈనాడు ”అని చెప్పాడు .”కనుల చూపు నిలిపి ,కాంతిని గమనించి –కాచ వలెను చిత్ర కళల దాటి ”అని రహస్యాన్ని వివ రించాడు .రాజ యోగం ద్వారా అద్వైతా నుభావం పొంది న వేమన ఆసనాలు ,ప్రాణాయామం వగైరా హథ విద్యల్ని తిరస్కరించి నట్లు ”ఆసనంబు పన్ని ,అంగంబు బిగి యించి -యొడలు విరిచి కొనేడు యాగ మెల్ల –జెట్టి సాము కన్నా చింతాకు తక్కువ ”అన్న పద్యం ద్వారా మనకు తెలుస్తోంది ..
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –.9-9-12-కాంప్–అమెరికా
.
వీక్షకులు
- 993,981 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
- శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం.
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.6వ భాగం.21.3.23.
- శ్రీ అనుభవానందస్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. వైశేషిక పూర్తి,న్యాయ దర్శనం ప్రారంభం.24వ భాగం.21.3.23
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.5వ భాగం.20.9.23
- శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.23వ భాగం.20.3.23
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,951)
- సమీక్ష (1,306)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (380)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు