జన వేమన –23
వేద దీక్ష
మంచి గురువు తన శక్తి సామర్ధ్యాలతో అ థ యోగ సాధన చేసి శిష్యుడి కష్టాన్ని చూసి దయతో ,స్వ శక్తి తో ఒక్క నిమిషం లో అసంప్రజ్నత సమాధి కల్గించి ,బ్రహ్మ సాక్షాత్కారం చేయించ గలడుఅని ”సద్గురు నాద ప్రసాదంబున క్షణమున రాజ యోగమున మనసు నాశము తోడనే ,నాశము గాలియు ”అని శివ తత్వ సారం తెలుపు తోంది .దీనినే తాంత్రికులు ”వేధ దీక్ష ”అంటారు .శిష్యుని దేహం లో ఉన్న షట్ చక్రాలను గమనించి ,మంత్ర బీజాక్షర న్యాసం చేసి ,మోకాళ్ళు మొదలు ,నాభి ,హృదయం ,కంథం ,దవడ వరకు గురువు వేదిస్తాడు .వెంటనే శిష్యుడి పాపాలన్నీ నశించి ,బయటి వ్యాపారాలన్నీ నిలిచి పోతాయి .ఇంత బాధ పడటం వేమన కూ ఇష్టం లేడు .ఎవరికి వారు స్వయం గా నే సాధించాలనే కోరాడు .అందుకే ”వెర్రి గాను జూడ వేలుగేల్ల బారురా ”అన్నాడు .దీనికి ఆధారం గా ”బ్రహ్మ జంపి ,విష్ణు భాగంబులో గల్పి –విష్ణు జంపి ,శివుని వీరు గలిపి -శివుని జంపి తాను శివ యోగి గావలె ”అని త్రిమూర్తులకు అతీత మైన బ్రహ్మ జ్ఞానం పొందాలని చెప్పాడు .ఇవన్నీ తాను సాధించానని తెలియ జేయటానికి ”బ్రహ్మ వ్రాత కెదురు బల్కిన వాడును –ఆది విష్ణు సూత్ర మడచు వాడు –మూడు కనుల వాని మొనసి నిల్పిన వాడు -కాన బడరు నీవు కాని వేమా ”అని తన సామర్ధ్యాన్ని తెలుపు కొన్నాడు వేమన .
తాంత్రికులు
తంత్రం అంటే పరబ్రహ్మ సాక్షాత్కారం కోసం చేసే సాధన .మంత్రం ,బీజాక్షరాలు ,యంత్రాలు ,ముద్రలు పూజలు ,షట్ చక్ర భేదనం ,కుండలిని ,యోగం ఇవన్నీ కలిస్తే తంత్రం .ఇవన్ని బహి రంగం గా నే చేస్తారు .తంత్ర సాధన లో కొంత మంది మద్యం ,మాంసం ,మొదలైన ”పంచ మకారాలకు ”ప్రాధాన్యత నిచ్చి ,రహస్యం గా సాధన చేసే వారిని ”తాంత్రికులు ”అంటారు .వీళ్ళూ అద్వైతులే .శక్తిని ముందు పూజిస్తారు .కనుక ”శాక్తేయులు ”అని అంటారు .శ్మశానం లో ఇలాంటి పూజ చేసే వారిని ”వామాచారులు ”అంటారు .వీరికి ”కులార్ణ వితంత్రం ”,”మహా నిర్వాణ తంత్రం ”అనే రెండు గ్రంధాలు పూజ నీయాలు .వాటి లోని తత్వాన్ని ఆచరిస్తారు .వేమన ”వేద విద్య లెల్ల వేశ్యల వంటివి –భ్రమల బెట్టి తేది పడగ నీవు –గుప్త విద్య ఒకటి కుల కాంత వంటిది ”అన్నాడు .వేమన తాంత్రికుడు అని కొందరు అంటే కాదు పొమ్మన్నారు మరి కొందరు .
వేమన భావ తీవ్రత
విద్వాంశు లైన వారిని లక్శ్యం చేయ కుండా తన భావ తీవ్రత తో తేలిక పదాలతో హృదయాలకు హత్తు కోనేట్లు చెప్పాడు వేమన .ఎవరేమను కొంటారో నాన్న భయం లేని వాడు .ఒకరి మెచ్చు కోరని అచ్చ మైన కవి .అందుకే ”ఆదిమ కవుల వలె అల్పుండు ,తా నెరిగి -చెప్ప లేదు తప్పు బట్టు –త్రోయ నేర్చు కుక్క దొంతులు బెట్టునా ”అని ఎద్దేవా చేస్తాడు .తాను చెప్పిన మాటల్ని ఎప్పటికైనా పండితులు అర్ధం చేసుకొంటారని ,పద్ధతి మార్చు కొంటారని ఆయనకు తెలుసు .”వేముడిట్లు చెప్పు వివరపు వాక్యముల్ –వేము డిట్లు పోవు వెర్రి పోక –పామరులకు నెల్ల ప్రతి పక్షమై యుండు -పండితులకు నెల్ల పరము వేమా ”అని వాళ్ళు తన దారి లోకి రావాల్సిందే ,కాలం వాళ్లనే దారికి తెస్తుంది అని నమ్మాడు .ఇంతకీ వేమన పద్యాలకు కవితా గుణం ఉందా ?ఉంటె ఎలాంటి గుణాలున్నాయి ?
” ఒక వస్తువు గురించి తనకున్న భావాల్ని భాషతో ఇతరుల మనసుకు పట్టే టట్లు తెలియ జేయటమే కవిత్వం ”అన్నారు రాళ్ళ పల్లి వారు .ఈ కోణం లో ఆలోచించారు .కవిత్వం లో ముఖ్య జీవ ధర్మం ”ఇతరుల మనసుకేక్కటం ”.కవి ,,భాష ,వినే వాడు ఒక సహృదయ చక్రం .కవితన భావాలకు తగ్గ భాషను ఎన్ను కొంటాడు. ఆ భావం సంగ్రహం గా ,స్పష్టం గా సరళం గా ఉండాలి ,చెప్పాలి .వినే వాడికి సహృదయ గుణం ఉండాలి .యే భావాన్నైనా అనుభవించే సహజ సహ్రుదయత్వం ఉన్న వారిని సహృదయులు అంటారు .వారే ,తమ హృదయాలను మరచి కవి హృదయం తో చూడ గలరు .అంటే అహంకారంపనికి రాదు .అహంకారం అంటే నా సిద్ధాంతం ,నేను ,నాది అనే భావం .కనుక కవితో ఏకీభ వించి వింటే ,అనిర్వచనీయ మైన ఆనందం కల్గుతుంది .ఆది ప్రత్యక్ష సిద్ధం .ఇలాగే మమతను త్యాగం చేసి న సాయుజ్యమే మోక్షానందం .అని అనంత కృష్ణ శర్మ గారు అభి ప్రాయ పడ్డారు .అప్పుడే వేమన మనకు అర్ధమవుతాడన్నారు .ఆరాధనీయుడౌతాడు .అలాంటి సాయుజ్యానికి ఛందస్సు బాగా ఉపయోగిస్తుంది .ఛందస్సు కు లయ ప్రాధాన్యం .లయ అంటే క్లుప్తం గా ఉన్న వివిధ శబ్దాల నడక.దీనికి మండించే గుణం ఉంటుంది .లయకు తీవ్ర భావం ,వెలువరించే భాషా తోడైతే త్రివేణీ సంగమమే .
వేమన కవిత్వం లో చాలా ముఖ్య మైనది భావ తీవ్రత .దీనికి కారణం భావాలన్నీ ఆయన స్వంతాలు కావటం .భావాలు స్వంతం ,సహజం అవటం వాళ్ళ భాషకు బిగువు ,బలం వస్తాయి .”భావం నీళ్ళు నిండిన పాత్ర .భాష ,దాన్ని పైకి లాగే త్రాడు ”అని చక్కని విశ్లేషణ చేశారు శర్మ గారు .వేమన కవిత్వం లో భావం భాష జమిలి గా పెన వేసుకొని పోయాయి .వేమన కవిత్వం లో అర్ధం కాని ఇంకో విషయం ఆటవెలది .”ఇంత చిన్న వృత్తం లో అంత గొప్ప భావాలను ,యతి స్తానాలను వదల కుండా ,వెనుక ,ముందు అతుకులు ,తిరుగుడులు లేకుండా కత్తి రించి నట్లు ఉన్న శబ్దాలతో ఎలా అచ్చు గుద్దాడో ?”‘అని మహా ఆశ్చర్యం కలిగిస్తుందని వేమన కవితా శైలికి జోహార్లు అర్పించారు రాళ్ళ పల్లి మహా నీయులు .తెలుగు ఛందస్సు లో ఆట వెలది చిన్నది .మిగిలిన ఛందాలలో రాసినా ”ఈ ముద్దు ,ఈ చెక్కిన చిక్కదనం ,ఈ బిగువు ,ఈ లగువు లేదు ”అని మురిసి పోయారు సహృదయ పండిత కవి విమర్శక సార్వ భౌములైన అనంత కృష్ణ శర్మాజీ .యతి స్తానానికి ”ఒక యతికి ఇచ్చిన గౌరవం ,మర్యాదా వేమన ఇచ్చాడు ”అని పొంగిపోతారు .తక్కిన యతి విషయం లో యతి కనుక్కోవటం కష్టం ,వేమన్న యతి విషయం లో పట్టు బట్టాడు .దాని స్తానం ,గౌరవం దానికి చ్చాడు .ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచాడు .అభిప్రాయం కూడా అక్కడే ఆగి నిలుస్తుంది ,అదీ వేమన ప్రత్యేకత .ఇంతకీ యతి అంటే?-లయాను సారం గా పాదం మధ్యలో ఒక చోట పదాన్ని ఉంచటమే యతి .
హాస్యం ,వ్యంగ్యం మేళ వించటం లో కవిత్వం హృదయ రంజకం ఆయి నది .”పాల సాగరమున పవ్వ ళించిన వాడు –గొల్ల ఇండ్ల పాలు కోర నేల ?”అని ప్రశ్నిస్తూ ”ఎదుటి వారి సొమ్ము ఎల్ల వారికి తీపి ”అని ఆ దేవున్నె వాయిన్చేశాడు .కృష్ణుడిని ఏదో అన్నాడని ఎవరికీ కోపమే రాదు .దాన్ని అద్భుతం గా సమర్ధించాడు .ఆది మనకు ఆనందం ,నవ్వు తెప్పిస్తాయి .ఇదే వేమన కవి ప్రత్యేకత .ఇలాంటిదే ఇంకో పద్య చమత్కారం -”గుహల లోన జొచ్చి గురువుల వెదకంగా –క్రూర మృగ మొకండు తారసిలిన –ముక్తి మనియ ముందు గా జూపురా ”అని మనకు ముసి ముసి నవ్వులు కురిపిస్తాడు .వేమన సంగీత రాగాలలో ”తోడి రాగ మేల ”?అని ప్రశ్నించి దాని స్వారస్యాన్ని వివరించి చెప్పాడు .వేమన గురువు శివయోగి స్వర్ణ కార వ్రుత్తి వాడని అందరు భావించారు. వీళ్ళకు ”పశ్యతోహరులు ”అని కవితా పరం గా పేరుంది .అంటే మనం చూస్తూండగానే మన బంగారాన్ని హరిస్తారని భావం .పెద్దన గారే ఈ మాటకు సృష్టి కర్త .వేమన కూడా ”కంసలికిమించు కడజాతి లేదయా ”అని తీక్ష్ఞానం గా నే దూషించాడు .ఆ జాతి వారు అందరు అలాంటి వారు కాదు ,కొందరి చెడు వ్రుత్తి అందరికి ఇబ్బంది కలిగిస్తుందని చెప్పటమే ఇందులో వేమన ఉద్దేశ్యం .వేమన్న ను కూడా ఎవరో ఇలానే మోసం చేసి ఉంటారు .ఆది మనసు లో పడి బయట పెట్టి ఉంటాడు . .వాడి మూలం గా కులం అంతా నింద పడాల్సి వచ్చింది .అంతటి భావ తీవ్రత వేమన్నది .అందులో మంచి వారినీ మెచ్చు కొన్నాడు ”మొదట బ్రహ్మ ,మనువు మొనయ రెండు యముడు -మూడు త్వష్ట శిల్పి మొనయ నాల్గు –విశ్వ కర్మ నెగడె విశ్వజ్ను డైదింట ”అని విశ్వానికే బ్రహ్మలు గా విశ్వ బ్రాహ్మణులను కీర్తించాడు .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –10-9-12-కాంప్–అమెరికా