వా యు రాణి- ఎమీలియా ఎర్హార్ట్
ఆమె అట్లాంటిక్ ,ఫసిఫిక్ మహా సముద్రాలమీదుగా విమానాన్ని నడిపిన మొదటి మహిళా ,అమెరికా దేశం అంతా స్వంత విమానం లో చుట్టి వచ్చిన మొదటి మహిళా పైలట్ ,ఆకాశం లో అధిక ఎత్తు లో రికార్డు స్తాయి లో విమానాన్ని నడిపిన మొదటి మహిళ ,ఇన్ని రికార్డులను నెలకొల్పి ,ప్రపంచం అంతా చుట్టి వచ్చిన మొదటి మహిళా కావాలనే ధ్యేయం తో బయల్దేరి గమ్యానికి కేవలం వంద మైళ్ళ దూరం లో ఉండగా .ఆమె విమానం కనిపించకుండా పోయి మిస్టరీ గా మారి,అమెరికా వాయు రాణి అని పించుకొన్నమహిళా పైలట్ అమీలియా ఎర్హార్ట్ హిస్టరీ ఇది .
అమీలియామేరీ ఎర్హార్ట్24-7-1897 న అమెరికా లోని కాన్సాస్ రాష్ట్రం లో ఆచిన్సన్ లో జన్మించింది .ఆమె పుట్టి నప్పుడు పెద్ద తుఫాను వచ్చి వెలిసింది .తల్లి అమీ ఓటిస్14,110 అడుగుల ఎత్తున్నరాకీ పర్వతాలలోని పైకేస్ పీక్ ను అధిరోహించి రికార్డు నేల కొల్పిన మొద టి మహిళ .తండ్రి ఎడ్విన్ స్టాన్తాన్.చిన్నప్పుడే తాత అమ్మమ్మల ఇంటికి వెళ్లి అక్కడి గుర్రాలను ఎక్కి స్వారీ చేయటం ,కొండ గుహల్లో తిరగటం అలవాటు చేసుకోండి .అయితే ఆమెను రూల్లెర్ కాస్టర్ ఎక్కి తిరగటాన్ని ఒప్పుకోలేదు .బాస్కెట్ బాల్ ఆడేది .స్లెడ్జి ల పై చక్కగా నడిచేది గుర్రపు కాళ్ళ మధ్య నేర్పుగా స్లెడ్జి పై జారటం నేర్చింది .
తండ్రి రైల్ కంపెని లో ఉద్యోగి .అందుకని ఫ్రీ గా వీలైన ప్పుడ ల్లా కుటుంబం తో ప్రదేశాలు తిరిగి చూసే అవకాశం వచ్చింది .ఆయనకు ఉన్న కార్ లో కిచెన్ ,భోజనాల గది ,వంట వాడు ఉండే వారు .తండ్రి బాగా తాగుబో తు .అందువల్ల ఉద్యోగ భద్రత ఉండేది కాదు .ఈమె అమ్మమ్మ తాత చని పోవటం తో తల్లికి ఆస్తి బానే సంక్రమించింది .తండ్రి మిన్న సోట లో రైల్ క్లెర్క్ గా పని చేయాల్సి వచ్చింది .కుటుంబం మిస్సోరి లోని మిన్నే సోటా కు మార్చాడు .అక్కడి నుంచి చికాగో వెళ్లి ఉన్నాడు .అక్కడ ఎమీలియా బేస్ బాల్ టీం లో చేరి ఆడింది .కుటుంబం పెనిసిల్వేనియా కు చేరింది .అక్కడ రైడాల్ లోని ogantz school లో చేరి చదివింది .ఇట్లా ఊళ్లు తిరగటమే సరి పోయింది చిన్న తనం అంతా .అక్కడ హాకీ నేర్చింది అక్కడి alpha phi టీం ఈమెను తమ టీం లోకి ఆహ్వానించి ఆడమన్నారు .ఈమెకు మొదటి నుంచి సంప్రదాయ విధానాలు నచ్చేవి కావు .స్థానిక రెడ్ క్రాస్ కు సెక్రెటరి గా పని చేసింది .
1917 లో టోరంటో లోని సోదరి దగ్గరకు వెళ్ళింది అప్పుడే యుద్ధ భీభత్సాన్ని కళ్ళారా చూసింది .రెడ్ క్రాస్ లో ఉన్న ఎమీలియా సైనికుల కోసం స్వెట్టర్లు అల్లి అంద జేసింది గాయ పడిన సైకులకు సాయం చేసింది .ఇదంతా మనసును కలచి వేసింది .అందుకని మళ్ళీ స్కూల్ లో చేరి చదవటానికి మనసు అంగీకా రించ లేదు .ఒక నర్సు దగ్గర సహాయకురాలిగా పని చేసింది .ఆమ్బులన్స్ బ్రిగేడియర్ లో వాలంటరీ చేసింది .తర్వాతా స్పాడినా మిలిటరి హాస్పిటల్ కు వచ్చి యుద్ధం లో అసహాయు లైన వారికి సేవ లందించింది .అందులో ”షెల్ షాక్ ”తో బాధ పడ్డ వాళ్ళు ,ఉండే వారు .వారి మానసిక పరిస్తితి వింత గా ఉండేది. రోజుకు పన్నెండు గంటలు పని చేసేది .ఉదయం యేడు నుండి రాత్రి యేడు వరకు ఆమె డ్యూటి .సోదరి తో ఖాళీ సమయాన్ని గడిపేది .అక్కడ గుర్రపు సవారీని ఇద్దరు బాగా చేసి ఆనందాన్ని పొందే వారు .అమీలియా గుర్రం పేరు ”డైన మైట్”.వీరున్న చోటికి దగ్గరే విమానాలు నడిపే ట్రైనింగ్ సెంటర్ ఉంది .అక్కడి ఆఫీసర్ ఈమె ఉత్సాహాన్ని చూసి విమానాలు ఎగరటం వచ్చి చూడమన్నాడు .అలా చూస్తూ విమాన యానం పై అభిమానం బాగా పెంచుకోంది .ఈమెకు సైన స్ బాధ ఉండేది .దానికి ఆపరేషన్ చేయించు కొంది
టోరంటో వదిలి మాసా చూసేట్స్ లోని నార్త్ ఆంప్ టన్ కు చేరింది .అక్కడ తల్లి సోదరి ఉన్నారు . ఆటో మోటివ్ మేషిన్ ట్రైనింగ్ పొందింది .డాక్టర్ కావాలన్న ఆలోచన కలిగింది .న్యూయార్క్ వెళ్లి కోంబియా వర్సిటి లో చేరింది .అక్కడి సంగీత కచేరీలకు వెళ్ళేది .గుర్రపు స్వారి చేసేది .యూని వేర్సిటి లోని ఎత్తైన బిల్డింగ్ టాప్ ఎక్కి అందర్ని ఆశ్చర్య పరిచింది .అకస్మాత్తు గా వర్సిటి చదువు మానేసి కాలి ఫోర్నియా లోని తలి దండ్రుల దగ్గరకు చేరింది .
విమాన యానం
కా ఫోర్నియా లో అప్పటికే విమాన యానం బాగా ప్రాచుర్యం పొందింది .అక్కడి లాంగ్ బీచ్ దగ్గరున్న daughert field లోని ఎయిర్ మీట్ కు హాజరైంది .అప్పుడే పైలట్ కావాలి అన్న ఆశయం మనసు లో మెదిలింది .అక్కడి అది కారులతో మాట్లాడి ఆమె తండ్రి ఈమెను విమానం ఎక్కించి చక్కర్లు కొట్టించే ఏర్పాటు చేశాడు .ఆది అద్భుతం అని పించిన్దామెకు .పైలట్ శిక్షణ తీసుకోవాలను కొంది .చాలా ఖర్చు తో కూడిన పని ఆది .ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నేర్చుకోవాలను కొంది .మహిళా పైలట్ అయితే బాగా నేర్పు తుందని భావించింది .అక్కడ ఇరవై నాలుగేళ్ల ”నేతా స్నూక్” అనే ఆమె నేర్పటానికి అంగీకరించింది .1920 decembar లో గ్లేన్దేల్ లోని కిన్నెర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకొంది .స్నూక్ దగ్గరుండి నేర్పాలి గాలిలో ఉన్న ప్రతి నిమిషానికి ఒక డాలరు ఆమె కు ఇవ్వాలి .అప్పటికే యుద్ధం లో దాచుకొన్న libertyబాండ్లను ఉపయోగించి ఆమె బిల్లు చెల్లించింది 1921 january 3న మొదటి లెసన్ ..ఐరో డైనమిక్స్ మీద పుస్తకాన్ని తన దగ్గర ఉంచు కొంది .ముందు భూమి మీడదే విషయాలన్నీ నేర్పింది .ఆరు నెలల శిక్షణ తర్వాతా స్వంత విమానాన్ని రెండు వేల డాలర్లు పెట్టి కొనుక్కోన్నది .అదే ఎల్లో కిన్నెర్ ఐర్స్తేర్ .దాన్ని ఆమె” ది కానేరి ”అని ముద్దుగా పిల్చుకోన్నది .ఒక టేలి ఫోన్ కంపెని లో కూడా పని చేసింది .లక్ష్య సాధనానికి ఎన్ని తంటాలు పడాలో అన్నీ పడింది .ఇంకా ఒంటరిగా విమానం నడపటం సాధ్యం కాలేదు .స్టంట్ ఫ్లైయింగ్ ,బ్యాంక్స్ ,బారెల్ రోల్ల్స్ ,లూపస్ లలో ప్రాధమిక విషయా లన్నీ నేర్చింది .అన్నీ నేర్చిన తర్వాతామొదటి సారిగా ఒంటరిగా విమానం నడిపి 5000అడుగుల ఎత్తుకు యెగిరి దిగింది .
మొదటి రికార్డు
ఎమీలియా కు నేర్పిన స్నూక్ వివాహం చేసుకొని ఉద్యోగం మానేసింది .ఇక బాధ్యత అంతా ఈమె మీదే పడింది .ఆమెను గురించి స్తానిక పత్రికలన్నీ పెద్ద పెద్ద ఫోటో లతో గొప్ప గా రాశాయి .1922 october 22 న తన ఐర్స్తేర్ విమానం ఎక్కి ఒంటరిగా ఆకాశం లో విహరించి వీలైనంత ఎత్తుకు ఎగిరింది .బారో గ్రాఫ్ ను సీల్ చేయించింది .చివరికి చూస్తె తాను 14000అడుగుల ఎత్తు న ఉన్నట్లు గమనించింది ఇది అంతవరకు యే మహిళా పైలట్ కూడా చేరని ఎత్తు .అంటే అమీలియా రికార్డు స్తాపించిందన్న మాట .వీరి కుటుంబం నవేడా లోని జిప్సం మైనింగ్‌లో పెట్టు బడి పెట్టిన డబ్బు కు ప్రతి ఫలం లభించలేదు .ఇదో నిరాశ .
సోషలిస్టు భావాలున్న industrial workers of the world కు మిత్రులతో హాజ రింది .అక్కడ అరవై ఏళ్ళు దాటినా వారందరికి పెన్షన్ ను ప్రభుత్వం ఇవ్వాలని తీర్మానం చేశారు .1923 may 16న ఎమీలియ కు ఫ్లయింగ్ సర్టిఫికేట్ చేతికి వచ్చింది .తన విమానాన్ని అమ్మేసి ఉద్యోగ ప్రయత్నాలు చేసింది .ఒక ఫోటోగ్రాఫ్ స్టూడియో లో ఉద్యోగం లో చేరింది .తర్వాతా తానే స్వంతం గా ఫోటోలు తీయటం అమ్మటం నేర్చింది .మళ్ళీ కొత్త విమానాని కొనుక్కోంది .మళ్ళీ సైన్స్ ఆపెరేషన్ చేయించు కోవాల్సి వచ్చింది పాపం .విమానాన్ని అమ్మేసి ఇంకోటి కొంది దీనికి కిజేల్ (ఎల్లో పెరిల్ )అని పేరు పెట్టింది .తల్లి తో 7000మైళ్ళు విమానం లో ప్రయాణం చేసి బోస్టన్ చేరింది .మళ్ళీ సర్జరీ అవసరమై చేయించింది .తర్వాత న్యూయార్క్ వగైరాలు తిరగటం తో చేతిలో డబ్బు ఖాళీ .బోస్టన్ చేరి హార్వర్డ్ సమ్మర్ స్కూల్ లో లెక్కల కోర్సు లో చేరింది . సాంఘిక సేవా కార్య క్రమాలు
విమానం నడిపే దానిలో ఎక్కడా ఉద్యోగాలు రాలేదు .పొట్ట గడవాలి .డేనిసాన్ హౌస్ లో సోషల్ వర్కర్ గా పని చేసింది .అక్కడే syrian mother’s club స్తాపించి ,సిరియా నుంచి వచ్చిన వలస దారుల పిల్లలకు చదువు కొనే వీలు కల్పించింది .చైనీస్ ఆడ పిల్లల తో బాస్కెట్ బాల్ ఆడించింది .ఆ హౌస్ కు డైరెక్టర్ అయింది .బోస్టన్ లో జరిగే జాతీయ బోస్టన్ సెటిల్ మెంట్స్ సమావేశానికి ఎమీలియా ప్రతినిధి గా ఆహ్వానాన్ని పొందింది .1927లో బోస్టన్ నగరం పై విమానం లో ఎగురుతూ మెమోరియల్ డే కు ఫ్రీ పాస్సేస్ ను వేద జల్లింది .
వెతుక్కొంటూ వచ్చిన అవకాశం
హరాల్డ్ దేన్నిసన్ అనే ఆయన కు మాసా చూసేట్స్ లో ఒక విమానాశ్రయాన్ని నెలకొల్పే ఆలోచన కలిగింది .అమీలియా ను సంప్రదించాడు .ఈమె బోస్తానియాన్ పత్రిక లో మహిళా పైలట్ల గురించి మంచి వ్యాసం రాసింది ఇంకా ఎక్కువ మంది విమానాలు నడపటానికి ముందుకు రావాలని కోరింది .చార్లెస్ లిన్డెర్ బెర్ఘ్ మొదటి సారి అట్లాంటిక్ ను దాటినప్పటి నుండి అమీలియా కు తానూ దాన్ని సాధించాలన్న కోరిక పెరిగింది .1928 april 7న ఆమెకో ఫోన్ వచ్చింది .అందులో ఆమె అట్లాంటిక్ సముద్రాన్ని దాటే విమానం నడ ప టానికి ఆహ్వానం వచ్చింది .వెంటనే న్యు యార్క్ వెళ్లి జార్జి పుత్నాం ,డేవిడ్ లెమన్ లను కలిసింది ఆ ప్రయాణానికి స్పాన్సర్ అయిన amy phipps guest కు బదులు ఈమె ప్రయాణం చేయాలి పుస్తక రూపం లో లెక్చర్ల రూపం లో వచ్చిన ధనాన్ని గెస్ట్ కు ఇచ్చేయాలి .అదీ ఒప్పందం .సరే నంది అమీలియా .ఫ్రెండ్ షిప్ అనే విమానాన్ని నడపాలి .జూన్ మూడు న బోస్టన్ నుంచి న్యు ఫౌంద్ లాండ్ ,కెనడా మీదుగా నోవా స్కాతియా లోని హాలిఫాక్స్ విమానాశ్రయం చేరింది .అక్కడి నుంచి వేల్స్ లోని బారీ పాయింట్ చేరి ప్రయాణాన్ని విజయ వంతం గా ముగించింది . పేపర్లన్నీ విజయ గీతికలు పాడాయి ఆమెను ”లేడీ లిన్దెర్ బెర్గ్ ”అని పొగిడారు .అట్లాంటిక్ ను దాటిన మొదటి మహిళా గా రికార్డు సాధించింది .వేల్స్ లో చాలా కాలం ఉన్న తర్వాతా ఇంగ్లాండ్ కు వెళ్ళింది .అందరు తనను పొగుడుతుంటే ”నేను ఒక ప్రయాణీకు రాలను మాత్రమె ”అని చెప్పింది .అమెరికా కు తిరిగి వచ్చి ఎంతో అభిమానాన్ని సంపాదించింది .ఆమె ను lady Lindy ” ”the queen of the air ”అని గౌరవం గా పిలిచారు .ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ ఆమె కు వీరోచిత స్వాగతం పలికాడు .న్యు యార్క్ సిటి తాళం చెవిని ఇచ్చి గౌరవించారు .ఆమె అమెరికన్ హీరోయిన్ అయి పోయింది .ఇది చారిత్రాత్మక సత్యం .అనేక సభలు సమావేశాలలో మాట్లాడి ఎందరికో స్పూర్తి కలిగించింది ..ఎంతో డబ్బు చేతికి వచ్చింది. అప్పులన్నీ తీర్చేసింది .
రికార్డులే రికార్డులు
పుట్నం ను వివాహమాడాలని నిర్ణ యించింది . .లేడీ హీత్ నుండి విమానాన్ని కొని న్యు యార్క్ నుంచి అతని తో తో బయల్దేరింది .కాని పిట్స్ బర్గ్ లో ఆది దొర్లి పోయింది .ఇంగ్లాండ్ నుంచి తగిన పరికరాలు తెప్పించి బాగు చేయించాడు పుత్నాం .1931లో పుత్నాం ను పెళ్లి చేసుకోంది .ఆ తర్వాతా 19000అడుగుల ఎత్తుకు విమానాన్ని నడిపి రికార్డు నేల కోల్పింది .తాను మొదటి సారి అట్లాంటిక్ ను దాటినా స్వంతం గా స్వంత విమానం లో దాట లేదనే బాధ ఆమెలో ఉంది .ఆ కోరిక 1932 లో తీరింది .ఒంటరిగా అట్లాంటిక్ ను నాన్ స్టాప్ గా దాటి రికార్డు సాధించింది అమెరికా కాంగ్రెస్ ఆమెకు అత్యంత విలువైన ”the distinguished flying cross ”ను ప్రదానం చేసి గౌరవించింది .1932 లో ఫసిఫిక్ మహా సముద్రాన్ని ఒంటరిగా దాటి రికార్డు నేల కోల్పింది .ఈ రెండు సముద్రాలను దాటిన వారిలో మొదటి స్థానం ఆమెదే .హనో లూలు నుండి కాలిఫోర్నియా లోని ఓకే లాండ్ కు చేరింది ఫసిఫిక్ మీదుగా .అంతకు ముందే అమెరికా అంతా తన విమానం లో చుట్టి వచ్చి మరో రికార్డు నెలకొల్పింది .మహిళా ల స్పీడ్ రికార్డు 2100మెయిల్లను సాధించింది .మెక్సికో నుండి వాషింగ్ టన్ కు 14గంటల్లో చేరి లిండ్ బెర్గ్ రికార్డును బద్దలు కొట్టింది .విమాన యన చరిత్రనే తిరగ రాసింది రికార్డులతో .అడిగిన చోటికల్లా వెళ్లి ఉపన్యాసాలు చేసి మొత్తం మీద సుమారు లక్ష మందిని ఆనందింప జేసింది .ఒక్కో సమావేశానికి మూడు వందల డాలర్లు వసూలు చేసింది .
ప్రపంచం చుట్టాలనే తీరని కోరిక .
1935 లో purdue university మహిళా ల ఉద్యోగ విషయాల డిపార్ట్ మెంట్ లో లెక్చరర్ ఉద్యోగం పొందింది .సాలుకు రెండు వేల డాలర్లు. ఆమె కు ఎయిరో నాటిక్స్ లో రిసెర్చ్ చెయ్యాలనే సంకల్పం కలిగింది .దానికి విరాళాలు కావాలి. జనానికి తెలియ జేశింది .విరాల వెల్లువె వచ్చింది దానితో ఒక విమానాన్ని కొని ”flying laboratory ” గా మార్చాలనుకోంది .ఆమె”ameelia earhaart fund for aeronautical reserch ” అనే సంస్థను నేల కోల్పింది .” ఎలెక్ట్రా ”అనే రెండు ఇంజన్ల విమానాన్ని కొన్నది .దాని వేగం గంటకు 210మైళ్ళ అత్యంత వేగం .దాదాపు 27000అడుగుల ఎత్తు కు ఎగిరే సామర్ధ్యం దానిది .అప్పటికి అలాంటి విమానాలు ప్రపంచం లో ఇద్దరి వద్దనే ఉన్నాయి .ఒకటి అమీలియా దగ్గర రెండోది ఏవియేషన్ గురు అని పిలువా బడేhoward hughes దగ్గరా మాత్రమె ఉన్నాయి .ఈ విమానం తో ప్రపంచ యాత్ర చేస్తూ విమానం లోని విషయాలను తెలుసుకొంటూ ,దేశకాల పరిస్తితులకు ఆది ఎలా నిలబడుతుందో గ్రహిస్తూ పర్యటన చేయాలని ఆమె ఆశ .కాలి ఫోర్నియా లోని ఓక్లాండ్ లో1937 february 12 ప్రపంచ యాత్రకు శ్రీ కారం చుట్టింది .తూర్పు పడమర లను కాలి ఫోర్నియా నుండి హవాయి కి ప్రయాణించి రికార్డు నేల కోల్పింది .మియామి నుండి రెండో దశ ప్రారంభించింది .ఇండియా పాకిస్తాన్ ఐరోపా దేశాల్ని చుట్టింది .పసిఫిక్ సముద్రం లోని ”హౌలాండ్ ఐలాండ్ ”కు చేరితే ప్రపంచ యాత్ర సంపూర్ణం .అశేష జనం ఆమె కు స్వాగతం పలకటానికి ఆ ద్వీపం చేరారు .ప్రభుత్వం సర్వ సన్నాహాలు చేసింది .కాని దురదృష్ట వశాత్తు ఇంకా వంద మైళ్ళు గమ్య స్త్నానికి దూరం గా ఉన్న సమయం లో అప్పటి దాకా వచ్చిన రేడియో సంకేతాలు ఆగి పోయాయి .ఆమె విమానం ఎక్కడ ఉందొ తెలీ లేదు .అందరు కంగారు పడ్డారు .
ఎంత ప్రయత్నించినా విమానం జాడ లభించ లేదు .అమెరికా ప్రభుత్వం2,50 000 చదరపు మైళ్ళ విస్తీర్ణం అంతా వేదికించింది .65విమానాలు పర్య వేక్షణ జరిపి వెతికాయి .10నౌకలు 4000మంది జనం అడుగడుగు గాలించి జల్లెడ పట్టినా విమానం మిస్టరీ గా అదృశ్య మైంది .బ్రిటన్, జపాన్ దేశాలు కూడా సహక రించాయి . 1937 july 18న అన్వేషణ ను నిలిపి వేశారు .ఆమెను రష్యా వాళ్ళు హైజాక్ చేసి తీసుకొని వెళ్లారనే ఊహాగానాలున్నాయి .కాని ఏదీ నిర్ధారణ కాలేదు .ప్రపంచ యాత్ర చేయాలన్న అమీలియా ఎర్హార్ట్ సంకల్పం చివరి క్షణాల్లో విఫల మైనా ఆమె చరిత్ర సంకల్పానికి, ధైర్య సాహసాలకు పట్టు దలకు, సేవా నిరతికి ఆదర్శం గా నిలిచి పోయింది సమాజం లోని మౌధ్యాలను తిరస్కరించిన మహిళ ఆమె .”వాయు రాణి ”అని అందరి చేతా ఆప్యాయం గా పిలిపించుకొన్న గగన విహారిణి ప్రాణ వాయువు అనంత గగనం లో కలిసి పోవటం బాధా కరం.
”.though she may gone from this world ,the spirit of Amelia Earhart lives on in any a person who looks out to the horizon and dreams that ,despite their circumstances ,they can fly higher ”.
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –10-9-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 980,455 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.
- అరుణ మంత్రార్థం. 10వ భాగం.3.2.23.
- కళా తపస్వికి శ్రద్ధాంజలి
- సుప్రకాశ శతకం
- అక్షర ప్రభాకరుడు’’ కూర్చిన వినూత్న’’ అక్షర స్వరం ‘’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.24 వ భాగం.2.2.23.
- అరుణ మంత్రార్థం. 9వ భాగం.2.2.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,924)
- సమీక్ష (1,279)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (306)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (360)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు